Sunday, May 8, 2022

Beginning Without Finishing

 

వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. (లూకా 18:1) 

విసుగు పుట్టి ప్రార్థన చెయ్యడం మానుకోవడం అనేది క్రైస్తవ జీవితంలో అన్నింటి కంటే అతి భయంకరమైన శోధన. మనం ఒక విషయం గురించి ప్రార్థన చెయ్యడం మొదలు పెడతాము. ఒక రోజు, ఒక వారం, మహా అయితే ఒక నెల రోజులు దేవుడికి విన్నవించుకుంటాము. ఏదీ ఖచ్చితమైన సమాధానం రాకపోతే విసుగెత్తి ఇక బొత్తిగా ప్రార్థించడమే మానుకుంటాము.

ఇది చాలా ప్రమాదకరమైన పొరపాటు. ఇది ఆరంభ శూరత్వం. కనిపించిన ప్రతి పనీ మొదలు పెట్టి ఏది పూర్తి చెయ్యలేని పరిస్థితి. ఇది జీవితం నాశనం కావడానికి హేతువు. 

కార్యాన్ని మొదలుపెట్టి పూర్తిచెయ్యకుండా వదిలేసే పద్ధతిని అలవాటు చేసుకున్న వ్యక్తి పరాజయాలను అలవాటు చేసుకుంటున్నాడన్నమాట. ఒక ప్రయోజనం కోసం ప్రార్థించడం మొదలు పెట్టి సరైన జవాబు దొరికే దాకా ప్రార్థించని ప్రతి వ్యక్తీ ఇదే అలవాటు పడుతున్నాడు.

ప్రార్థనలో విసుగు చెందడం అంటే ఓడిపోవడం. ఈ ఓటమి ప్రార్థన అంటే ఆసక్తి, విశ్వాసం లేకుండా చేస్తుంది. జయ జీవితానికి ఇది ప్రక్కలో బల్లెం లాంటిది.

అయితే కొందరడుగుతారు, “ఎంత కాలం ప్రార్థన చెయ్యాలి? కొంత కాలం చేసాక ఇక దేవుడి చేతిలో ఆ విషయాన్ని వదిలి ఆయనకి మొరపెట్టడం మానెయ్యాలి కదా?”

దీనికి ఒకటే సమాధానం - మీరు అడిగిన విషయం మీకు దొరికే దాకా ప్రార్థించాలి. లేక అది దొరుకుతుంది అన్న నిశ్చయత మీ హృదయంలో కలిగే దాకా ప్రార్థించాలి.

మనం దేవుని సన్నిధిలో గోజాడడాన్ని ఈ రెంటిలో ఏదో ఒకటి జరిగే దాకా ఆపకూడదు. ఎందుకంటే ప్రార్ధన అంటే కేవలం దేవుణ్ణి అడగడం మాత్రమే కాదు. అది సైతానుతో పోరాటం కూడా. ఎందుకంటే ఈ పోరాటంలో దేవుడు మన ప్రార్ధనలను సైతానుకి వ్యతిరేకమైన ఆయుధంగా వాడుతున్నాడు. కాబట్టి ఎప్పుడు ప్రార్ధన చెయ్యడం ఆపాలో నిర్ణయించవలసింది దేవుడే. మనకి ఆ హక్కు లేదు. జవాబు వచ్చే దాకా లేక జవాబు వస్తుందన్న నిశ్చయత కలిగే దాకా మన ప్రార్థనలను ఆపే అధికారం మనది కాదు. 

మొదటి సందర్భంలో అయితే సమాధానం మన కంటికి కనిపించింది గనుక ప్రార్థించడం మానేస్తాము. రెండో సందర్భంలో అయితే సమాధానం వస్తుందని నమ్ముతాము గనుక మానేస్తాము. ఎందుకంటే మన హృదయంలోని నమ్మకం మన కంటికి కనిపించే దృశ్యాల వంటిదే. ఎందుకంటే ఈ నమ్మకం దేవునినుండి, దేవుని వలన కలిగిన నమ్మకం.

మనం ప్రార్థనా జీవితంలో అనుభవజ్ఞులమౌతున్న కొద్దీ దేవుడిచ్చే నిశ్చయత ఎలాటిది అనే విషయాన్ని మరింతగా గుర్తుపడుతుంటాము. ఆ నిశ్చయతను ఆధారం చేసుకుని ఎప్పుడూ నిశ్చింతగా ఉండవచ్చు. లేక ఎలాంటి పరిస్థితిలో మన ప్రార్థనని కొనసాగించాలి అనే సంగతి మనకర్థం అవుతుంది.

దేవుని వాగ్దానాల మజిలీలో వేచి ఉండండి. దేవుడొచ్చి మిమ్మల్ని అక్కడ కలుస్తాడు. తన వాగ్దానాల బాట మీదుగానే నడిచివస్తాడాయన.

----------------------------------------------------------------------------------------------------------------------------

He spoke a parable unto them...that men ought always to pray, and not to faint. (Luke - 18:1)

No temptation in the life of intercession is more common than this failure to persevere. We begin to pray for a certain thing; we put up our petitions for a day, a week, a month; and then, receiving as yet no definite answer, straightway we faint and cease altogether from prayer concerning it.

This is a deadly fault. It is simply the snare of many beginnings with no completions. It is ruinous in all spheres of life.

The man who forms the habit of beginning without finishing has simply formed the habit of failure. The man who begins to pray about a thing and does not pray it through to a successful issue of the answer has formed the same habit in prayer.

To faint is to fail; then defeat begets disheartenment, and unfaith in the reality of prayer, which is fatal to all success.

But someone says, “How long shall we pray? Do we not come to a place where we may cease from our petitions and rest the matter in God’s hands?”

There is but one answer. Pray until the thing you pray for has actually been granted, or until you have the assurance in your heart that it will be.

Only at one of these two places dare we stay our importunity, for prayer is not only a calling upon God but also a conflict with Satan. And since God is using our intercession as a mighty factor of victory in that conflict, He alone, and not we, must decide when we dare cease our petitioning. So we dare not stay in our prayer until the answer itself has come, or until we receive the assurance that it will come.

In the first case, we stop because we see. On the other, we stop because we believe, and the faith of our heart is just as sure as the sight of our eyes; for it is faith from, yes, the faith of God, within us.

More and more, as we live the prayer life, shall we come to experience and recognize this God-given assurance, and know when to rest quietly in it, or when to continue our petitioning until we receive it. —The Practice of Prayer

Tarry at the promise till God meets you there. He always returns by way of His promises. 

No comments:

Post a Comment