దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే సున్నతి చేసెను. (ఆది 17:23).
వెంటనే కనపరచే విధేయతే విధేయత. ఆలస్యమైన విధేయత అవిధేయత క్రిందే లెక్క. దేవుడు మనల్నొక పనికి పిలుస్తున్నప్పుడు మనతో ఒక నిబంధన చెయ్యబోతున్నాడన్న మాట. ఆ పిలుపుకి లొంగడమే మన కర్తవ్యం. ఆ నిబంధన మేరకు మనకు రాబోయే ప్రత్యేకమైన ఆశీర్వాదాలివ్వడం దేవుని వంతు.
విధేయత చూపించే ఒకే ఒక పద్దతి ఏమిటంటే అబ్రాహాములాగా “ఆ దిన మందే” విధేయత చూపించడం. చాలాసార్లు మనం చెయ్యవలసిన పనిని వాయిదా వేసి తరువాతెప్పుడో చేస్తుంటాము. అసలు బొత్తిగా చెయ్యకపోవడంకంటే ఇది నయమే. కాని ఇలా చేసిన పని ఆలోచించి చూస్తే ‘చెయ్యాలి కాబట్టి ఉసూరు మంటూ చేసిన పని’. ఈ పని అవిటిది, అందం చందం లేనిది. వాయిదా పడిన నెరవేర్పు దేవునినుండి పూర్తి పూర్తి ఆశీర్వాదాలనెప్పుడూ తీసుకురాలేదు. వెంటనే నెరవేర్చిన బాధ్యత అయితే దేవుడు ఇవ్వడానికి సంకల్పించిన ఆశీర్వాదాలను సంపూర్ణంగా తీసుకువస్తుంది.
ఆలస్యం చేసి మనల్ని మనం నష్టపరచుకుంటూ, దేవుణ్ణి, మనతోటి వాళ్ళని కూడా నష్ట పరచడం ఎంత దుస్థితి! “ఆ దినమందే” అన్నది అబ్రహాము పనులు చేసే పధ్ధతి. ఇప్పుడు మీరు చెయ్యాల్సిన వాటిని నెరవేర్చండి.
మార్టిన్ లూథర్ అంటాడు, “నిజమైన విశ్వాసి - ఎందుకు?” అనే ప్రశ్నని శిలువ వెయ్యాలి. ప్రశ్నలకి తావు లేకుండా కట్టుబడాలి. నా మట్టుకు నేనైతే ఏదో ఒక సూచన, అద్భుతం కనిపిస్తే తప్ప నమ్మని వారిలో చేరను. సందేహానికి తావులేకుండా నేను నమ్మకం ఉంచుతాను.”
*ఎదురు చెప్పడం మన పనికాదు*
*బదులుగా తర్కించడం తగదు*
*దాటరాదు మన అవధి*
*చావుకైనా తెగించి చెయ్యడమే మన విధి.*
విధేయత విశ్వాస ఫలం, సహనం ఆ చెట్టుకి పూసిన పూలగుత్తి.
-----------------------------------------------------------------------------------------------------------------------------
In the selfsame day, as God had said unto him. (Gen - 17:23)
Instant obedience is the only kind of obedience there is; delayed obedience is disobedience. Every time God calls us to any duty, He offers to make a covenant with us; doing the duty is our part, and He will do His part in special blessing.
The only way we can obey is to obey “in the selfsame day,” as Abraham did. We often postpone a duty and then, later on, do it as fully as we can. It is better to do this than not to do it at all. But it is then, at the best, only a crippled, disfigured, halfway sort of duty-doing; and a postponed duty never can bring the full blessing that God intended, and that it would have brought if done at the earliest possible moment.
It is a pity to rob ourselves, along with robbing God and others, by procrastination. “In the selfsame day” is the Genesis way of saying, “Do it now.” —Messages for the Morning Watch
Luther says that “a true believer will crucify the question, ‘Why?’ He will obey without questioning.” I will not be one of those who, except they see signs and wonders, will in no wise belief. I will obey without questioning.
“Ours not to make reply,
Ours not to reason why,
Ours but to do and die.”
Obedience is the fruit of faith; patience is the bloom on the fruit. —Christina Rossetti
No comments:
Post a Comment