Friday, May 6, 2022

Sing Praise to the Lord !

 

వారు పాడుటకును, స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదావారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, శేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. (2 దిన 20:22).

మన కష్టాల గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవడం కంటే పాటలు పాడి స్తుతించడం ఎంత మంచిది! సంగీత వాయిద్యాలుగా ఉపయోగించవలసిన ఎన్నో విషయాలను మనం కాళ్ళకి బంధాలు వేసే గొలుసులుగా చేసుకుంటున్నాము. వాటి ద్వారా స్తుతి పాటలు పాడడం ఎలాగో నేర్చుకోము.

కొందరైతే తమకీ ఆటంకాలు, అడ్డుబండలు పదేపదే వస్తున్నాయెందుకని తీవ్రంగా ఆలోచించి, జీవిత రంగాన్ని పరీక్షించి చూసి దేవుని చర్యల్ని వీక్షించి బుర్రబద్దలు కొట్టుకుంటూ ఉంటారు. తనలో తాను రంగుల రాట్నంగా తిరుగుతూ, లోలోపల తలపోసుకుంటూ ఉండే బదులు రోజురోజుకి తనకి సంభవించే అనుభవాలను ప్రార్థన జెండాలుగా పైకెత్తి దేవుణ్ణి ఘనపరిస్తే అది ఎంత మేలుకరం! 

మన శ్రమలను ఆలోచించడం ద్వారా మర్చిపోలేం గాని హల్లెలూయ కీర్తనలు పాడడం ద్వారా రూపుమాపవచ్చు. ఉదయాన్నే పాటలు పాడండి. పక్షులు మీతో శ్రుతి కలుపుతాయి. పక్షులు ఉన్నంత హాయిగా, ఏ దిగులూ లేకుండా, నాకు తెలిసినంత వరకు మరే జీవి ఉండదు. 

సాయం సమయాల్లో పాడండి. పిచ్చుకలు నిద్రపోయేముందు చేసే ఆఖరు పని అదే. వాటికి ఆ రోజు పని ముగిసింది. గూటికి చేరుకున్నాయి. తినవలసిన ఆ చిన్న ఆహారపు కణికను తిన్నాయి. ఇక చిటారు కొమ్మపై చతికిలబడి గొంతెత్తి దేవుణ్ణి కీర్తిస్తాయవి.

మనం కూడా ఉదయం, సాయంత్రం స్తుతి పాటలు పాడ గలిగితే అది ఎంత క్షేమకరం! మన పాట మరొకరిలో పాటను వెలిగించి అంతా గొంతులు కలిపి దేవుణ్ణి స్తుతించాలి.

*జీవన రాగాన్ని శ్రుతి తప్పనియ్యకు*

*తగ్గుముఖం పడితే పట్టవచ్చు*

*అదే అందుకుంటుంది.*

*నీకలవడిన రాగమై ప్రవహిస్తుంది.


*భ్రాంతులెన్నో చెలరేగి, ఆకాశాన్ని కప్పి*

*సూర్యకాంతిని అడ్డగించవచ్చు*

*నీ పాట కుంటుపడకుంటే*

*నీ నీడలు దొలగి సూర్యుడు వస్తాడు.*


*జీవన రాగాల్ని శ్రుతి తప్పనియ్యకు*

*గొంతు తడబడితే తడబడవచ్చు.*

*స్వరానికి గ్రహణంపట్టి అదుపు తప్పవచ్చు*

*ఆత్మలో నీ పాట సాగిపోనీ*


*జీవన రాగాన్ని శ్రుతి తప్పనియ్యకు*

*ఇక్కడుండగా ఆత్మలో మోగనీ*

*అక్కడికి చేరినప్పుడు వెంటాడుతుందది*

*మరో ప్రపంచంలో నీతో ఉంటుంది*

-----------------------------------------------------------------------------------------------------------------------------

*When they began to sing and praise, the Lord set ambushments...and they were smitten* (2 Chr - 20:22)

Oh, that we could reason less about our troubles, and sing and praise more! There are thousands of things that we wear as shackles which we might use as instruments with music in them if we only knew how.

Those men that ponder, and meditate, and weigh the affairs of life, and study the mysterious developments of God’s providence, and wonder why they should be burdened and thwarted and hampered—how different and how much more joyful would be their lives, if, instead of forever indulging in self-revolving and inward thinking, they would take their experiences, day by day, and lift them up, and praise God for them.

We can sing our cares away easier than we can reason them away. Sing in the morning. The birds are the earliest to sing, and birds are more without care than anything else that I know of.

Sign in the evening. Singing is the last thing that robins do. When they have done their daily work; when they have flown their last flight, and picked up their last morsel of food, then on a topmost twig, they sing one song of praise.

Oh, that we might sing morning and evening, and let song touch song all the way through. —Selected

“Don’t let the song go out of your life  

Though it chance sometimes flow  

In a minor strain; it will blend again  

With the major tone, you know.  


“What though shadows rise to obscure life’s skies,  

And hide for a time in the sun,  

The sooner they’ll lift and reveal the rift,  

If you let the melody run.  


“Don’t let the song go out of your life;  

Though the voice may have lost its trill,  

Though the tremulous note may die in your throat,  

Let it sing in your spirit still.  


“Don’t let the song go out of your life;  

Let it ring in the soul while here;  

And when you go hence, ’twill follow you thence,  

And live on in another sphere.”

No comments:

Post a Comment