నమ్మువానికి సమస్తమును సాధ్యమే. (మార్కు 9:23).
ఈ 'సమస్తమును' అనేది ఊరికే లభించదు. ఎందుకంటే విశ్వాసం అనే మార్గాన్ని మనకి బోధించాలని దేవుడెప్పుడూ సిద్ధంగా ఉంటాడు. మనం ఇలా విశ్వాసం అనే బడిలో చదువుకునేటప్పుడు విశ్వాసానికి పరీక్షలు కూడా ఉంటాయి. విశ్వాసంలో క్రమశిక్షణ, విశ్వాసంలో సహనం, విశ్వాసంలో ధైర్యం, ఇలా ఎన్నెన్నో మెట్లెక్కితేనే గాని విశ్వాసపు తుదిమెట్టుకి రాము. ఈ తుదిమెట్టు విశ్వాసంలో జయం.
నైతికమైన సారం విశ్వాస మూలంగానే వస్తుంది. దేవుణ్ణి నువ్వు అర్ధించావు. కాని జవాబు లేదు. ఏం చెయ్యాలి? దేవుడి మాటల్ని నమ్మడం మానుకోగూడదు. నీకు కనిపించే వాటినీ, అనిపించేవాటినీ ఆధారంగా చేసికొని దైవ వాగ్దానాల నుండి తొలగి పోకూడదు. ఇలా స్థిరంగా నిలిచి ఉంటే విస్తారమైన శక్తి అనుభవాలు నీలో పోగవుతాయి. దేవుని మాటకి వ్యతిరేకంగా జరుగుతున్న సంఘటనలను చూస్తూ కూడా విశ్వాస పీఠం మీద చలించకుండా ఉన్నప్పుడు నువ్వు బలపడతావు.
ఒక్కోసారి దేవుడు కావాలనే ఆలస్యం చేస్తాడు. ఈ ఆలస్యం అన్నది కూడా నీ ప్రార్ధనకి జవాబు లాటిదే. నీ విన్నపం నెరవేరడం ఎలాంటిదో, ఆలస్యం కావడమూ ఆలాటిదే.
బైబిల్లోని భక్త శిఖామణులందరి జీవితాల్లోనూ దేవుడు ఇలానే పనిచేసాడు. అబ్రాహాము, మోషే, ఏలీయా మొదలైన వాళ్ళు ప్రారంభంలో గొప్పవారేమీ కాదు. కాని విశ్వాస శౌర్యంవల్ల గొప్పవాళ్ళయ్యారు. ఈ మార్గం ద్వారానే దేవుడు వాళ్ళకి నియమించిన మహత్తర కార్యాలను పూర్తి చేయగలిగారు.
ఉదాహరణకి దేవుడు యోసేపును ఐగుప్తు సింహాసనం ఎక్కించడానికి సిద్దపరుస్తూ ఉన్నప్పుడూ, దేవుడతన్ని పరీక్షించాడు. అతన్ని పరిశోధించినవి కారాగారంలోని కటికనేల మీద నిద్ర, చాలీ చాలని తిండీ కావు. దేవుడే ప్రారంభంలో అతనికి దక్కబోయే అధికారం ప్రతిష్టల గురించి, అతని అన్నలకంటే తాను ఘనుడౌతాడనీ అతనికి చెప్పాడు. ఈ వాగ్దానమే అన్ని సంవత్సరాలూ అతని మనసులో ఉంది. అయితే అతను ముందుకు వెళ్తున్న కొద్దీ అడుగడుక్కీ ఈ వాగ్దానం నెరవేరే సూచనలు కనుమరుగైనాయి. చివరికి చెయ్యని నేరానికి జైలుపాలయ్యాడు. నేరం చేసి బంధించబడిన నేరస్తులు ఒక్కొక్కరు విడుదలై వెళ్ళిపోతూ ఉంటే యోసేపు మాత్రం చెరసాలలోనే మ్రగ్గిపోయాడు.
అక్కడ ఒంటరితనంలో గడిపిన ఆ ఘడియలే అతన్ని పదును పెట్టాయి. అవి ఆత్మాభివృద్ధి కలుగజేసే ఘడియలు. చివరికి అతని విడుదలకి ఆజ్ఞ వచ్చినప్పుడు, తన అన్నలతో ఎలా వ్యవహరించాలన్న జ్ఞానం అంతా అతనికి అబ్బింది. దేవునిలో తప్ప మరెక్కడా కనిపించని ఓర్పు, ప్రేమ అతనిలో నిలిచాయి.
ఇలాటి అనుభవాలు మనకి నేర్పేటంత శ్రేష్టమైన పాఠాలు మరెక్కడా నేర్చుకోలేము. ఒకసారి దేవుడు ఒక పనిచేస్తానంటూ పలికి రోజులు గడిచిపోతున్నా ఆయన దాన్ని చెయ్యకుండా ఉంటే అది మనకి కష్టంగానే ఉంటుంది. అయితే విశ్వాసంలో క్రమశిక్షణ నేర్చుకుని దేవునికి సంబంధించిన జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఇదే మార్గం. మరే విధంగానూ ఇది సాధ్యపడదు.
-----------------------------------------------------------------------------------------------------------------------------
All things are possible to him that believeth. (Mark - 9:23)
The “all things” do not always come simply for the asking, for the reason that God is ever seeking to teach us the way of faith, and in our training in the faith life there must be room for the trial of faith, the discipline of faith, the patience of faith, the courage of faith, and often many stages are passed before we really realize what is the end of faith, namely, the victory of faith.
Real moral fiber is developed through the discipline of faith. You have made your request of God, but the answer does not come. What are you to do?
Keep on believing God’s Word; never be moved away from it by what you see or feel, and thus as you stand steady, enlarged power and experience are being developed. The fact of looking at the apparent contradiction to God’s Word and being unmoved from your position of faith makes you stronger on every other line.
Often God delays purposely, and the delay is just as much an answer to your prayer as is the fulfillment when it comes.
In the lives of all the great Bible characters, God worked thus. Abraham, Moses, and Elijah were not great in the beginning but were made great through the discipline of their faith, and only thus were they fitted for the positions to which God had called them.
For example, in the case of Joseph whom the Lord was training for the throne of Egypt, we read in the Psalms:
“The word of the Lord tried him.” It was not the prison life with its hard beds or poor food that tried him, but it was the word God had spoken into his heart in the early years concerning elevation and honor which were greater than his brethren were to receive; it was this which was ever before him when every step in his career made it seem more and more impossible of fulfillment until he was there imprisoned, and all in innocency, while others who were perhaps justly incarcerated, were released, and he was left to languish alone.
These were hours that tried his soul, but hours of spiritual growth and development, that, “when his word came” (the word of release), found him fitted for the delicate task of dealing with his wayward brethren, with love and patience only surpassed by God Himself.
No amount of persecution tries like such experiences as these. When God has spoken of His purpose to do, and yet the days go on and He does not do it, that is truly hard; but it is a discipline of faith that will bring us into a knowledge of God that would otherwise be impossible.
No comments:
Post a Comment