Friday, November 5, 2021

Nothing is Too Hard

 

యెహోవాకు అసాధ్యమైనది ఏదైననున్నదా? (ఆది 18:14).


ఇది నీకూ, నాకూ ఈ రోజు దేవుని ప్రేమపూర్వకమైన సవాలు. మన హృదయంలో ఉన్న ప్రియమైన అత్యున్నతమైన, అత్యంత యోగ్యమైన కోరికను దేన్నయినా తలుచుకోమంటున్నాడు. అది మన కోసం గాని, మనకు అయినవాళ్ళ కోసం గాని మనం మనసారా ఆశించింది. ఎంతో కాలంగా అది నెరవేరకపోతున్నందుకు దాన్ని గురించి నిరాశ పడిపోయి ఆ విషయం ఇంక ఆలోచించడం మానేసామేమో. గతంలో అయితే అది జరిగి ఉండదేమో. ఇక జరిగే ఆశ లేదనుకుని, ఈ జీవితంలో ఇక దాన్ని చూడలేమనుకుని వదిలేసిన కోరికేమో అది.


అదే, ఆ విషయమే, మనకు ఇస్తానని దేవుడు తన సమ్మతిని తెలియజేసి ఉన్నట్టయితే (అబ్రాహాము శారాలకు సంతానంలాగా) అది ఎంత అసంభవం అయినప్పటికీ, అది హాస్యాస్పదంగా అనిపించి మనకు నవ్వు వచ్చినప్పటికీ, ఆ విషయాన్ని దేవుడు మనపట్ల అక్షరాలా జరిగించనున్నాడు - మనం ఆయన్ను జరిగించనిస్తే.


దేవునికి అసాధ్యమైనదేదైనా ఉన్నదా? అవును, మనం ఆయనలో విశ్వాసముంచి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ అసంభవమైన దానిని మన పక్షంగా చెయ్యడానికి ఆయనతో సహకరిస్తే ఆయనకు అసాధ్యమైనదేదీ లేదు. అబ్రాహాము, శారా కూడా అపనమ్మకంతోనే ఉన్నట్టయితే దేవుని తలంపు వారిపట్ల నెరవేరేది కాదు.


యెహోవాకు కష్టమనిపించేది ఒకటే. ఆయన ప్రేమనూ, శక్తినీ మనం అదే పనిగా శంకిస్తూ, మనపట్ల ఆయనకు ఉన్న ఉద్దేశాలను త్రోసిపుచ్చుతూ ఉండడమే. తనమీద విశ్వాసం ఉన్నవాళ్ళ విషయంలో దేవునికి అసాధ్యం ఏదీ లేదు.

-----------------------------------------------------------------------------------------------------------------------------

Is there anything too hard for Jehovah? (Gen - 18:14)


Here is God’s loving challenge to you and to me today. He wants us to think of the deepest, highest, worthiest desire and longing of our hearts, something which perhaps was our desire for ourselves or for someone dear to us, yet which has been so long unfulfilled that we have looked upon it as only a lost desire, that which might have been but now cannot be, and so have given up hope of seeing it fulfilled in this life.


That thing, if it is in line with what we know to be His expressed will (as a son to Abraham and Sarah was), God intends to do for us, even if we know that it is of such utter impossibility that we only laugh at the absurdity of anyone’s supposing it could ever now come to pass. That thing God intends to do for us, if we will let Him.


“Is anything too hard for the Lord?” Not when we believe in Him enough to go forward and do His will, and let Him do the impossible for us. Even Abraham and Sarah could have blocked God’s plan if they had continued to disbelieve.


The only thing too hard for Jehovah is deliberate, continued disbelief in His love and power, and our final rejection of His plans for us. Nothing is too hard for Jehovah to do for them that trust Him —Messages for the Morning Watch

Thursday, November 4, 2021

The Captive

 

నేను కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని; ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను…-

యాజకుడునగు యెహెజ్కేలునకు ప్రత్యక్షము కాగా అక్కడనే యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను (యెహెజ్కేలు 1:1,3).


మనకు దేవుని వాక్యాన్ని చెరసాల వివరించినంత స్పష్టంగా మరేదీ వివరించ లేదు. మనం బబులోను నదుల ఒడ్డున కూర్చుని ఉన్నప్పుడు మన దైవ సంకీర్తనలు మన హృదయాలను కదిలించినట్టుగా మరెన్నడూ కదిలించ లేదు. మనం చెరలో పాడిన పాటలు ఆనందంతో మారుమ్రోగుతాయి. 


జీవితంలో కష్టాలను అనుభవించిన వ్యక్తి తన దైవగ్రంథాన్ని ఎప్పుడూ విడిచిపెట్టి ఉండడు. మరొక బైబిలుకి అతని బైబిలుకీ చూడడానికి తేడా ఏమీ కనిపించకపోవచ్చు. అయితే అతనికి అలా కాదు. ఆ పాతగిలిపోయిన, కన్నీళ్ళ మరకలతో నిండిన బైబిలు నిండా ఇతరులెవరికీ కనిపించని అక్షరాలతో అతడు తన అనుభవాలను రాసుకున్నాడు. అతని జీవితపు బేతేలు స్థంభం దగ్గరకీ లేక ఎలీము చెట్ల దగ్గరకీ అతనెప్పుడూ వస్తుంటాడు. అతని జీవిత చరిత్రలో అవి మలుపు రాళ్ళు.


మన చెరనుబట్టి మనకు కూడా ఆశీర్వాదం రావాలంటే ఆ పరిస్థితిని మనకు అనుకూలమైనదిగా మార్చుకోవాలి. మన దగ్గరనుండి దేన్నయినా దేవుడు లాగేసుకుంటే, లేక దూరం చేస్తే దానిని గురించి చింతించడంవల్ల ఏమీ లాభం లేదు. మనకు మిగిలి ఉన్నవాటిని అభివృద్ధిపరచుకోనియ్యకుండా ఇది చేస్తుంది. లాగిన కొద్దీ ఉరి బిగుసుకుంటుందే తప్ప వదులు కాదు కదా?


దూకుడు స్వభావం ఉన్న గుర్రం తన కళ్ళెం ఆజ్ఞలను ఓపికగా అనుసరించకపోతే దానికే నొప్పికదా? కాడి కింద ఎద్దు అసహనంగా అటూ ఇటూ కదులుతుంటే దాని మెడమీదే పుండ్లు లేస్తాయి. పంజరం కమ్మీలకేసి 'నన్నొదిలేయండి, నన్నొదిలేయండి' అంటూ రెక్కలు టపాటపా కొట్టుకోవడం కంటే పంజరంలో ప్రశాంతంగా కూర్చుని బయట స్వేచ్ఛగా ఎగిరే కోయిలకంటే తియ్యగా పాటలు పాడడం చిలకమ్మకు మేలు కదా.


ఏ ఆపదా మనకు చెడు చెయ్యలేదు. దాన్ని మనం తీవ్రమైన ప్రార్థనలో దేవుని ముందు ఉంచగలిగితే. వర్షం నుంచి తప్పించుకుందామని చెట్టుని ఆశ్రయించిన వాడికి తాను వెతుకుతున్న పండు ఆ చెట్టు కొమ్మల్లోనే కనిపించవచ్చు. దేవుని రెక్కల క్రిందికి ఆశ్రయం కోసం పరుగెత్తిన మనకు ఇంతకు ముందెన్నడూ దేవునిలో కనిపించని, తెలియని దీవెనలు కనిపిస్తాయి.


ఈ విధంగా దేవుడు తనను తాను మన శ్రమల్లో, బాధల్లోనే కనబరచుకుంటాడు. యబ్బోకు రేవు దాటితే పెనూయేలు చేరతాము. అక్కడ మన పెనుగులాట మూలంగా దేవుణ్ణి ముఖాముఖిగా చూస్తాము. ఆ విధంగా మన ప్రాణాలు దక్కించుకుంటాము. "చెరలో ఉన్నవాళ్ళలారా, దేవుడు మీకు రాత్రిలో ఆనందగానాన్ని ఇస్తాడు. నీకోసం మరణచ్ఛాయను అరుణోదయంగా మార్చేస్తాడు”


దేవుని చిత్తానికి లోబడడం అనేది తలవాల్చుకోవడానికి అత్యంత క్షేమకరమైన తలగడ.


అదృశ్యమైన మహిమ

నా గదిలో నిండింది

నా బ్రతుకులో నిండింది


పెనుగులాటల్లో ప్రశాంతత నిచ్చింది

వాగ్దాన విహంగ తంతి 

పాటలు పాడింది.

-----------------------------------------------------------------------------------------------------------------------------

As I was among the captives by the river of Chebar, the heavens were opened and I saw visions of God ... and the hand of the Lord was there upon me (Ezek - 1:1,3)


There is no commentator of the Scriptures half so valuable as a captivity. The old Psalms have quavered for us with a new pathos as we sat by our “Babel’s stream,” and have sounded for us with new joy as we found our captivity turned as the streams in the South.


The man who has seen much affliction will not readily part with his copy of the Word of God. Another book may seem to others to be identical with his own; but it is not the same to him, for over his old and tear-stained Bible he has written, in characters which are visible to no eyes but his own, the record of his experiences, and ever and anon he comes on Bethel pillars or Elim palms, which are to him the memorials of some critical chapter in his history.


If we are to receive benefit from our captivity we must accept the situation and turn it to the best possible account. Fretting over that from which we have been removed or which has been taken away from us, will not make things better, but it will prevent us from improving those which remain. The bond is only tightened by our stretching it to the uttermost.


The impatient horse which will not quietly endure his halter only strangles himself in his stall. The high-mettled animal that is restive in the yoke only galls his shoulders; and every one will understand the difference between the restless starling of which Sterne has written, breaking its wings against the bars of the cage, and crying, “I can’t get out, I can’t get out,” and the docile canary that sits upon its perch and sings as if it would outrival the lark soaring to heaven’s gate.


No calamity can be to us an unmixed evil if we carry it in direct and fervent prayer to God, for even as one in taking shelter from the rain beneath a tree may find on its branches fruit which he looked not for, so we in fleeing for refuge beneath the shadow of God’s wing, will always find more in God than we had seen or known before.


It is thus through our trials and afflictions that God gives us fresh revelations of Himself; and the Jabbok ford leads to Peniel, where, as the result of our wrestling, we “see God face to face,” and our lives are preserved. Take this to thyself, O captive, and He will give thee “songs in the night,” and turn for thee “the shadow of death into the morning.” —William Taylor


“Submission to the divine will is the softest pillow on which to recline.”


“It filled the room, and it filled my life,  

With a glory of source unseen;  

It made me calm in the midst of strife,  

And in winter my heart was green.  

And the birds of promise sang on the tree  

When the storm was breaking on land and sea.”

Wednesday, November 3, 2021

It Must Be Bought

 

చెట్లులేని మిట్టలన్నిటి మీద వారికి మేపు కలుగును (యెషయా 49:9).


ఆట బొమ్మలు, చేతి గాజులు తేలికగా లభిస్తాయి. కాని విలువైన వస్తువులు కొనాలంటే కష్టపడాలి. ఉన్నతాధికారాలు రక్తం ధారపోసిన వారికే దక్కుతాయి. నీ రక్తమిచ్చి ఎంత ఎత్తైన స్థానాన్నెనా కొనుక్కోవచ్చు. పరిశుద్ధ శిఖరాలను చేరడానికి షరతు ఇదే. నిజమైన శూరత్వం ఏమిటంటే తన రక్తాన్ని ఇతరుల కోసం ఒలికించడమే. జీవితంలో అత్యుత్కృష్టమైన వ్యక్తిత్వపు విలువలు గాలివాటుగా మన పాదాల దగ్గర వచ్చి పడవు. గొప్పవాళ్ళ హృదయాల్లో గొప్ప దుఃఖాలు ఉంటాయి.


చేదు నిజాలు చెత్త కాగితాలు

గాలికి ఎగిరొచ్చే గడ్డి పరకలు

విలువైన నిజాలనైతే

ధర పెట్టి కొనుక్కోవాలి.


గొప్ప నిజాల కోసం పోరాడాలి

కలలో దొరికేవి కావవి

ఆత్మలో సంఘర్షణలో శోధనలో

ఎదురు దెబ్బలో దొరికేవవి.

 

శోకాలు బాధలు శోధించే రోజున 

బలమైన దేవుడు తన చెయ్యి చాపి

కరడుగట్టిన గుండె లోతుల్ని దున్ని

పాతుకుని ఉన్న సత్యాలని పైకి తీస్తాడు.


కలత చెందిన ఆత్మలో కార్చిన కన్నీళ్ళలో

దున్నిన భూమిలో దండిగా మొలకెత్తిన

పంటలాగా సత్యం సాక్షాత్కరిస్తే

ఆ కన్నీళ్ళు వ్యర్థం కావని తెలుస్తుంది.


దేవుడు మన విశ్వాసం ఉపయోగించవలసిన పరిస్థితుల్లోకి మనలను నడిపిస్తున్న కొద్దీ ఆయన్ను తెలుసుకొనే అవగాహన శక్తి మనలో ఎక్కువౌతూ ఉంటుంది. కాబట్టి శ్రమలు మన దారికి అడ్డం వచ్చినప్పుడల్లా దేవుడు మన గురించి శ్రద్ధ తీసుకుంటున్నాడని మనం తెలుసుకుని సహాయం కోసం ఆయన మీదే ఆధారపడుతూ ఆయనకు కృతజ్ఞతా స్తుతులను అర్పించాలి.

-----------------------------------------------------------------------------------------------------------------------------

On all bare heights shall be their pasture (Isa - 49:9)


Toys and trinkets are easily won, but the greatest things are greatly bought. The top-most place of power is always bought with blood. You may have the pinnacles if you have enough blood to pay. That is the conquest condition of the holy heights everywhere. The story of real heroisms is the story of sacrificial blood. The chiefest values in life and character are not blown across our way by vagrant winds. Great souls have great sorrows.


“Great truths are dearly bought, the common truths,  

Such as men give and take from day to day,  

Come in the common walk of easy life,  

Blown by the careless wind across our way.  


“Great truths are greatly won, not found by chance,  

Nor wafted on the breath of summer dream;  

But grasped in the great struggle of the soul,  

Hard buffeting with adverse wind and stream.  


“But in the day of conflict, fear and grief,  

When the strong hand of God, put forth in might,  

Plows up the subsoil of the stagnant heart,  

And brings the imprisoned truth seed to the light.  


“Wrung from the troubled spirit, in hard hours  

Of weakness, solitude, perchance of pain,  

Truth springs like harvest from the well-plowed field,  

And the soul feels it has not wept in vain.”  


The capacity for knowing God enlarges as we are brought by Him into circumstances which oblige us to exercise faith; so, when difficulties beset our path let us thank God that He is taking trouble with us, and lean hard upon Him.