Thursday, November 11, 2021

Lawn Care

 

గడ్డి కోసిన బీటి మీద కురియు వానవలెను భూమిని తడుపు మంచి వర్షము వలెను అతడు విజయము చేయును (కీర్తనలు 72:6). 


గడ్డి కోయడాన్ని గురించి ఆమోసు రాసాడు. మన రాజు దగ్గర చాలా కొడవళ్ళు ఉన్నాయి. ఆయన నిత్యమూ తన గడ్డి భూముల్ని కోస్తున్నాడు. ఆకురాయి మీద కొడవలి పదును పెడుతున్న సంగీతానికి పరపరా గడ్డి కోస్తున్న శబ్దాలు తోడౌతున్నాయి. పచ్చని గడ్డిపరకలు, చిన్న చిన్న రంగు రంగుల పూలు ఇంత క్రితమే కళకళలాడుతూ ఉన్నాయి. ఇప్పుడు తెగి కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి. మానవ జీవితంలో కూడా బాధ అనే కొడవలి, నిరాశ అనే కత్తిరింపు రాకముందు మనం చాలా ధైర్యంగా, దర్జాగా నిలబడి ఉంటాం.


అయితే పట్టు తివాచీలాంటి పచ్చిక పెరగాలంటే ప్రతిదినం ఆ గడ్డిని కోస్తూ ఉండడమే మార్గం. దేవుని కొడవలి మన మీదికి రానిదే మనలో వాత్సల్యం, సానుభూతి, గంభీరత రావు. దేవుని వాక్యం ఎప్పుడూ మనిషిని గడ్డితోను, అతని మహిమను గరిక పువ్వుతోను పోలుస్తూ ఉంటుంది. గడ్డి కోసినప్పుడు, దాని లేత పరకలన్నీ తెగిపడినప్పుడు, పూలు పూసిన చోట అంతా సర్వనాశనం తాండవమాడినట్టు అనిపించినప్పుడు అదే మెత్తగా, వెచ్చగా వాన చినుకులు పడవలసిన సమయం.


"ఓ హృదయమా, నిన్ను కూడా దేవుడు కత్తిరించాడు. చాలాసార్లు నీ రాజు తన కొడవలితో నీ దగ్గరకు వచ్చాడు. కొడవలికి భయపడకు. వెంటనే వర్షం కురుస్తుంది.”


దౌర్భాగ్యపు మనసులో

విచారపు కెరటాలు పొంగాయి 

రేపు అనేది నిరాశ నిండిన నిశీధి అయ్యింది

తుఫాను అదుపు లేకుండా ఎగిసింది


ఇహలోకపు సౌఖ్యాలు

నోటికి చేదయ్యాయి

ఆశలు పేలవంగా కూలిపోతూ

వ్యధ నిండిన మదిని వెక్కిరించాయి


కుములుతున్న మదిలో నిట్టూర్పును

మదిలో నిండిన శూన్యాన్ని

ఎవరాపగలరు? ఎవరు మాపగలరు?

శాంతిని ఎవరు నింపగలరు?


ఎవరి హృదయం గాయపడి పగిలిపోయిందో

ఎవరు ముళ్ళకిరీటధారియై సిలువ మోశారో

మన కోసం తన జీవం ఎవరు ధారపోశారో

ఆయన ప్రేమ వాక్కులే శాంతి ప్రదాతలు


పరమ వైద్యుడా! తేలికచెయ్యి మా భారాలు

శాంతిని, నీ శాంతిని మాలో స్థాపించు

తెల్లారేదాకా నీతో తిరగనీ

నీడలు పోయేదాకా మాకు నీడగా ఉండు.

----------------------------------------------------------------------------------------------------------------------------

He shall come down like rain upon the mown grass (Ps - 72:6)

Amos speaks of the king’s mowings. Our King has many scythes, and is perpetually mowing His lawns. The musical tinkle of the whetstone on the scythe portends the cutting down of myriads of green blades, daisies and other flowers. Beautiful as they were in the morning, within an hour or two they lie in long, faded rows.

Thus in human life we make a brave show, before the scythe of pain, the shears of disappointment, the sickle of death.

There is no method of obtaining a velvety lawn but by repeated mowings; and there is no way of developing tenderness, evenness, sympathy, but by the passing of God’s scythes. How constantly the Word of God compares man to grass, and His glory to its flower! But when grass is mown, and all the tender shoots are bleeding, and desolation reigns where flowers were bursting, it is the most acceptable time for showers of rain falling soft and warm.

O soul, thou hast been mown! Time after time the King has come to thee with His sharp scythe. Do not dread the scythe—it is sure to be followed by the shower. —F. B. Meyer

“When across the heart deep waves of sorrow  

Break, as on a dry and barren shore;  

When hope glistens with no bright tomorrow,  

And the storm seems sweeping evermore;  


“When the cup of every earthly gladness  

Bears no taste of the life-giving stream;  

And high hopes, as though to mock our sadness,  

Fade and die as in some fitful dream,  


“Who shall hush the weary spirit’s chiding?  

Who the aching void within shall fill?  

Who shall whisper of a peace abiding,  

And each surging billow calmly still?  


“Only He whose wounded heart was broken  

With the bitter cross and thorny crown;  

Whose dear love glad words of Joy had spoken,  

Who His life for us laid meekly down.  


“Blessed Healer, all our burdens lighten;  

Give us peace, Thine own sweet peace, we pray!  

Keep us near Thee till the morn shall brighten,  

And all the mists and shadows flee away!”

Wednesday, November 10, 2021

Faith Triumphs

 నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను (రోమా 4:18).

అబ్రాహాము నిరీక్షణ దేవుని శక్తికి, ఆయన విశ్వాస్యతకు సరిగ్గా అతికినట్టు సరిపోయింది. అప్పుడు ఉన్న అతని పరిస్థితుల్ని బట్టి చూస్తే వాగ్దానం నెరవేరుతుందని ఎదురు చూడడం బొత్తిగా అర్థంలేని పని అనిపిస్తుంది. అయినా అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు. తన సంతానం ఆకాశ నక్షత్రాల్లాగా విస్తరిల్లే సమయం కోసం ఎదురు చూశాడు.

అయితే ఓ నా హృదయమా, అబ్రాహాము లాగ నీకు దేవుడు ఒక్క వాగ్దానమిచ్చి ఊరుకోలేదు. వేలకొలది వాగ్దానాలు నీకు ఉన్నాయి. ఇంతకుముందు వాటిని నమ్మి లాభం పొందిన ఎంతోమంది విశ్వాసులున్నారు కూడా. అందువల్ల దేవుని మాట మీద నమ్మకముంచి ఆయన మీద ఆధారపడడమే నీకు తగినది. ఒకవేళ ఆయన నీకు జవాబియ్యడం ఆలస్యం చేసినప్పటికీ, నీకు జరుగుతున్న కీడు నానాటికి పెరిగినప్పటికీ బలహీనుడివై పోకుండా ఇంకా బలం, ధైర్యం తెచ్చుకుంటూ సంతోషిస్తూ ఉండు. ఎందుకంటే దేవుని వాగ్దానాల్లో అతి శ్రేష్టమైనవి ఎలా నెరవేరుతుంటాయంటే, దాని నెరవేర్పుకు అనువైన పరిస్థితులు లేశమాత్రమైనా లేని పరిస్థితుల్లో దేవుడు ప్రత్యక్షమై వాటిని జరిగిస్తాడు.

మనం ప్రమాదంలో చిక్కుకుని ఆఖరు దశలో ఉన్నప్పుడు వచ్చి సహాయం చేస్తాడు. ఎందుకంటే ఇలా చేస్తేనే ఆయన జోక్యం కలుగజేసుకున్నాడన్న సత్యం బయటకు కనిపిస్తుంది. పైగా అలవాటు చొప్పున కంటికి కనిపించే వాటి మీద నమ్మకం పెట్టుకోకుండా కేవలం ఆయన ఇచ్చిన మాట మీదే సర్వకాల, సర్వావస్థల్లో మనం ఆధారపడాలని కూడా ఆయన ఇలా చేస్తాడు.

దారీ తెన్నూ తోచనప్పుడే విశ్వాసం రంగంలోకి దిగవలసి ఉంటుంది. కష్టాలు ఎంత భరించరానివైతే విశ్వాసం ఉంచడం అంత తేలికౌతూ ఉంటుంది. మనకై మనం తప్పించుకునే మార్గం కనబడుతున్నంతవరకూ విశ్వాసం స్థిరపడలేదు.

-----------------------------------------------------------------------------------------------------------------------------

Under hopeless circumstances he hopefully believed (Rom - 4:18)

Abraham’s faith seemed to be in a thorough correspondence with the power and constant faithfulness of Jehovah. In the outward circumstances in which he was placed, he had not the greatest cause to expect the fulfillment of the promise. Yet he believed the Word of the Lord, and looked forward to the time when his seed should be as the stars of heaven for multitude.

O my soul, thou hast not one single promise only, like Abraham, but a thousand promises, and many patterns of faithful believers before thee: it behooves thee, therefore, to rely with confidence upon the Word of God. And though He delayeth His help, and the evil seemeth to grow worse and worse, be not weak, but rather strong, and rejoice, since the most glorious promises of God are generally fulfilled in such a wondrous manner that He steps forth to save us at a time when there is the least appearance of it.

He commonly brings His help in our greatest extremity, that His finger may plainly appear in our deliverance. And this method He chooses that we may not trust upon anything that we see or feel, as we are always apt to do, but only upon His bare Word, which we may depend upon in every state. —C. H. Von Bogatzky

Remember it is the very time for faith to work when sight ceases. The greater the difficulties, the easier for faith; as long as there remain certain natural prospects, faith does not get on even as easily as where natural prospects fail. —George Mueller

Tuesday, November 9, 2021

Seek Communion

 అతని నీడయందు నివసించువారు మరలివత్తురు. ధాన్యమువలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టువలె వారు వికసింతురు (హోషేయ 14:7). 


ఆ రోజు జోరుగా వాన కురిసింది. మా తోటలోని చెట్లన్నీ వంగిపోయాయి. తోటలో నాకు ఎక్కువ ఇష్టమైన ఒక పువ్వును చూశాను. దాని అందంతో అది నన్ను ఆకట్టుకుంది. దాని పరిమళం నన్ను మత్తెక్కించేది. ఇప్పుడు అది ఆ జడివాన పాలయింది. దాని రేకులన్నీ ముడుచుకుపోయి, వాడిపోయి వేలాడుతుంది. దాని అందమంతా పోయింది. 'ఇంత అందమైన పువ్వును మళ్ళీ చూడాలంటే వచ్చే సంవత్సరం దాకా ఆగాలి' అనుకున్నాను.


ఆ రాత్రి గడిచి తెల్లవారింది. సూర్యుడు ఉదయించాడు. ఉదయంతో పాటే ఆ పువ్వుకి ఏదో క్రొత్త బలం వచ్చింది. సూర్యకాంతి ఆ పువ్వు మీద పడింది. పువ్వు దాని వంకకి చూసింది. అవి రెండూ ఏమి గుసగుసలాడుకున్నాయో, సూర్య కిరణాలలోని ఏ శక్తి ఆ పువ్వుకు సోకిందో, అది తన తలను పైకెత్తి రేకుల్ని విప్పి నిటారుగా నిలిచి తన అందాన్నంతటినీ మళ్ళీ ప్రదర్శించింది. ఇదివరకటి కంటే ఇంకా అందంగా ఉన్నట్టు అనిపించింది. ఇదెలా జరిగింది! అని నాకాశ్చర్యం వేస్తూ ఉంటుంది. వడలి వేలాడిపోయిన ఈ పువ్వుకు చైతన్యవంతమైన కిరణాలు తాకే సరికి ఆ పువ్వు వాటి శక్తిని పొందింది.


నా హృదయంలోకి దేవుని శక్తిని ఎలా గ్రహించగలనో, ఆయనతో ఎలా సంబంధం పెట్టుకోగలనో తెలియదుగాని ఇది వాస్తవంగా జరిగిందని మాత్రం చెప్పగలను.


నిన్ను అణచివేసే శ్రమలో, ఆపదలో ఉన్నావా? క్రీస్తుతో ఈ సంబంధాన్ని ఏర్పరచుకో. నీకు శక్తి లభిస్తుంది. శ్రమలను జయించగలుగుతావు. “నేను నిన్ను బలపరుస్తాను” అన్నాడు దేవుడు. 


నిన్నటి వానలే నేడు గులాబి రేకపై వైఢూర్యం

తామరాకు పైన మంచి ముత్యం

నిన్నటి శోకం ఈనాటి దేవుని ప్రేమ

హృదయంపై చెక్కిన స్వర్ణ శిలాక్షరం.


నిన్నటి వర్షం కొండ చరియలను

నేడు తళతళలాడించింది

గడ్డిని మిసమిసలాడించింది.

నిన్నటి శోకం హృదయానికి పాఠం నేర్పింది

ఎన్ని గాలులు వీచినా నిత్యానందం

మనసులో గుసగుసలాడుతూనే ఉంది.


అల్పవిశ్వాసీ, నేటి వర్షం రేపు నిన్ను పరిశుద్ధుడిని చేస్తుంది

అది ముళ్ళపొదల్లో చిక్కుకున్న ముత్యాలహారం వంటిది

ఈనాడు శోకం కలవరపెట్టినా

ఉదయమయ్యేసరికి అది అందమైన ఆనందమౌతుంది.

----------------------------------------------------------------------------------------------------------------------------

They that dwell under his shadow shall return; they shall revive as the corn and grow as the vine (Hos - 14:7)


The day closed with heavy showers. The plants in my garden were beaten down before the pelting storm, and I saw one flower that I had admired for its beauty and loved for its fragrance exposed to the pitiless storm. The flower fell, shut up its petals, dropped its head; and I saw that all its glory was gone. “I must wait till next year,” I said, “before I see that beautiful thing again.”


That night passed, and morning came; the sun shone again, and the morning brought strength to the flower. The light looked at it, and the flower looked at the light. There was contact and communion, and power passed into the flower. It held up its head, opened its petals, regained its glory, and seemed fairer than before. I wonder how it took place—this feeble thing coming into contact with the strong thing, and gaining strength!


I cannot tell how it is that I should be able to receive into my being a power to do and to bear by communion with God, but I know It is a fact.


Are you in peril through some crushing, heavy trial? Seek this communion with Christ, and you will receive strength and be able to conquer. “I will strengthen thee.”


YESTERDAY’S GRIEF


The rain that fell a-yesterday is ruby on the roses,  

Silver on the poplar leaf, and gold on willow stem;  

The grief that chanced a-yesterday is silence that incloses  

Holy loves when time and change shall never trouble them.  


The rain that fell a-yesterday makes all the hillsides glisten,  

Coral on the laurel and beryl on the grass;  

The grief that chanced a-yesterday has taught the soul to listen  

For whispers of eternity in all the winds that pass.  


O faint-of-heart, storm-beaten, this rain will gleam tomorrow,  

Flame within the columbine and jewels on the thorn,  

Heaven in the forget-me-not; though sorrow now be sorrow,  

Yet sorrow shall be, beauty in the magic of the morn.