దేవుడు ఏర్పరచిన సమయం నీ ఇష్టానుసారంగా ఉండదు. కాబట్టి చెకుముకి రాయిని మొదటిసారి కొట్టినప్పుడు నిప్పు రవ్వలు రాకపోతే మళ్ళీ కొట్టాలి. దేవుడు ప్రార్థనలను వింటాడు. అయితే మనం ఊహించుకున్న సమయంలో ఆయన నుండి జవాబు రాకపోవచ్చు. వెదికే మన హృదయాలకు ఆయన తన్ను తాను కనబరచుకుంటాడు. అయితే మనం ఎదురు చూసిన సమయంలో, అనుకున్న ప్రదేశంలో కాకపోవచ్చు. అందుకే పట్టు వదలక ప్రార్థనలో గోజాడాలి.
వెనుకటికి చెకుముకి రాతితో నిప్పు రప్పించడం, ఆ తరువాత గంధకంతో చేసిన అగ్గిపుల్లతో నిప్పు పుట్టించడం చాలా కష్టమయ్యేది. పదే పదే గీసి చేతులు నొప్పి పుట్టేవి. చివరికి నిప్పు రాజుకున్నప్పుడు హమ్మయ్య అనిపించేది. పరలోకానికి సంబంధించిన ఈవుల విషయంలో కూడా మనం ఇంత పట్టుదలగా ఉండవద్దా. చెకుముకి రాతితో నిప్పు పుట్టించడంకంటే ప్రార్థనా విజయాలను సాధించడమే తేలిక. ఎందుకంటే దేవుని వాగ్దానాలు ఆ మేరకు ముందే ఉన్నాయి.
నిరాశ చెందవద్దు. దేవుడు దయ చూపే సమయం తప్పకుండా వస్తుంది. మనం నమ్మకముంచ గలిగిన సమయం వచ్చిందంటే మన మనవులు నెరవేరే సమయం కూడా వచ్చేసిందన్నమాటే. విశ్వాసంతో అడగండి. తొట్రుపడవద్దు. నీ రాజు జవాబివ్వడం ఆలస్యం చేస్తున్నాడనుకొని విన్నవించుకోవడం చాలించవద్దు. చెకుముకి రాతిని మళ్ళీ మళ్ళీ గీస్తూ ఉండండి. నిప్పు రవ్వలు రేగినప్పుడు బొగ్గుల్ని సిద్ధంగా ఉంచుకోండి. మంట రావడానికి ఇక ఆలస్యం లేదు.
దేవుని రాజ్య చరిత్రలో సరియైన ప్రార్థనను సరియైన సమయంలో చేసినట్టయితే దానికి ఎప్పటికీ జవాబు రాకపోవడం అన్నది కేవలం అసంభవం అని నా నమ్మకం.
-----------------------------------------------------------------------------------------------------------------------------
Hear what the unjust judge saith. And shall not God avenge his own elect which cry day and night unto him, though he bear long with them? I tell you that he will avenge them speedily (Luke - 18:6-7)
God’s seasons are not at your beck. If the first stroke of the flint doth not bring forth the fire, you must strike again. God will hear prayer, but He may not answer it at the time which we in our minds have appointed; He will reveal Himself to our seeking hearts, but not just when and where we have settled in our own expectations. Hence the need of perseverance and importunity in supplication.
In the days of flint and steel and brimstone matches we had to strike and strike again, dozens of times, before we could get a spark to live in the tinder; and we were thankful enough if we succeeded at last.
Shall we not be as persevering and hopeful as to heavenly things? We have more certainty of success in this business than we had with our flint and steel, for we have God’s promises at our back.
Never let us despair. God’s time for mercy will come; yea, it has come, if our time for believing has arrived. Ask in faith nothing wavering; but never cease from petitioning because the King delays to reply. Strike the steel again. Make the sparks fly and have your tinder ready; you will get a light before long. —C. H. Spurgeon
I do not believe that there is such a thing in the history of God’s kingdom as a right prayer offered in a right spirit that is forever left unanswered. —Theodore L. Cuyler