దేవుడు చెప్పిన యే మాటయైనను నిరర్థకము కానేరదు (లూకా 1:37).
హిమాలయ పర్వతాల్లో ఎక్కడో పైన ప్రతి యేడూ దేవుడు ఒక అద్భుతాన్ని చేస్తుంటాడు. మంచు కురిసిన చోట్ల మంచు గడ్డలు కట్టి మట్టిని గట్టిగా కప్పేసి ఉంటాయి. ఎండ వెలుతురు చలిరాత్రుల వణికింపు ఆ నేలను తాకదు. ఆ మంచు గడ్డలను చీల్చుకుని అత్యంత ఆకర్షణీయమైన పూలు బయటకు వచ్చి వికసిస్తాయి.
గడిచిన ఎండాకాలమంతా ఆ మొక్క నేల మీద పాకుతూ తన ఆకులను, కొమ్మలను వ్యాపింపజేస్తుంది. సూర్యరశ్మినంతా ఆత్రంగా తాగుతుంది. ఆ వేడిమినంతటినీ చలికాలం పొడుగునా తన వేళ్ళలో భద్రంగా దాచుకుంటుంది. వసంతం రాగానే మంచు గడ్డలక్రింద ఉన్న మొక్కల్లో చలనం వస్తుంది. దానిలోనుంచి పుట్టిన వేడి మంచుపొరను కొద్దికొద్దిగా కరిగిస్తూ ఆ మొగ్గ పెరుగుతుంటుంది. ఆ మొగ్గ అలా చొచ్చుకుంటూ వస్తున్నప్పుడు మంచులో చిన్న గాలి ప్రదేశం ఎప్పుడూ ఆ మొగ్గ చుట్టూ ఉంటుంది. మంచుపొరను తొలుచుకుని మొగ్గ బయటకి వచ్చిన తరువాత సూర్యరశ్మిలో ఇది అందంగా వికసిస్తుంది. ఎండలో మంచుగడ్డ తళతళలాడినట్టుగానే ఆ పుష్పపు ముఖ్ మల్ ఎరుపుదనం తళతళ లాడుతుంది.
స్ఫటికంలా, స్వచ్ఛంగా మెరిసే ఈ పువ్వు మన హృదయంతో మాట్లాడినంత స్పష్టంగా వెచ్చని వాతావరణంలో విరగబూసిన బంగారు రంగుల పూలు మాట్లాడలేవు. అసాధ్యాలు సాధ్యం కావడాన్ని చూడడానికి మనం కుతూహలపడుతుంటాం. దేవునికి కూడా ఇదే ఇష్టం.
చివరిదాకా ఎదుర్కోండి. మానవపరమైన ఆశలు, ప్రయత్నాలన్నీ దేవుని శక్తికి ఆటంకాలే. ఎదురైన కష్టాలన్నిటినీ పడేసి మూట కట్టండి. మీరు వెయ్యగలిగినన్నిటిని వేసి మోపు కట్టండి. ఇది అసాధ్యం అనే ప్రసక్తి తేవద్దు. విశ్వాసం దేవునివైపుకి చూస్తుంది. మన దేవుడు అసాధ్యాలకు దేవుడు.
-----------------------------------------------------------------------------------------------------------------------------
For with God nothing shall be impossible (Luke 1:37)
Far up in the Alpine hollows, year by year God works one of His marvels. The snow-patches lie there, frozen with ice at their edge from the strife of sunny days and frosty nights; and through that ice-crust come, unscathed, flowers that bloom.
Back in the days of the by-gone summer, the little soldanelle plant spread its leaves wide and flat on the ground, to drink in the sun-rays, and it kept them stored in the root through the winter. Then spring came, and stirred the pulses even below the snow-shroud, and as it sprouted, warmth was given out in such strange measure that it thawed a little dome in the snow above its head.
Higher and higher it grew and always above it rose the bell of air, till the flower-bud formed safely within it: and at last the icy covering of the air-bell gave way and let the blossom through into the sunshine, the crystalline texture of its mauve petals sparkling like snow itself as if it bore the traces of the flight through which it had come.
And the fragile thing rings an echo in our hearts that none of the jewel-like flowers nestled in the warm turf on the slopes below could waken. We love to see the impossible done. And so does God.
Face it out to the end, cast away every shadow of hope on the human side as an absolute hindrance to the Divine, heap up all the difficulties together recklessly, and pile as many more on as you can find; you cannot get beyond the blessed climax of impossibility. Let faith swing out to Him. He is the God of the impossible.