Thursday, November 25, 2021

God's Best

 

బాణములను పట్టుకొనుము.. నేలను కొట్టుమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను. అందు నిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి - నీవు అయిదు మారులైన ఆరుమారులైన కొట్టినయెడల సిరియనులు నాశనమగు వరకు నీవు వారిని హతము చేసియుందువు (2 రాజులు 13:18, 19). 


ఈ మాటల్లోని సందేశం ఎంత సూటిగా కనిపిస్తున్నది! యెహోయాషు తాను చెయ్యవలసిన పనిని రెండవసారి మూడవసారికూడా చేసినందుకు మురిసిపోయి ఉండవచ్చు. అతని దృష్టిలో ఇది విశ్వాస కార్యమే. అయితే దేవుడు మరియు దైవజనుడు అతడు మధ్యలో ఆపినందుకు చాలా నిరుత్సాహపడ్డారు.


అతనికి కొంత దొరికింది. చెప్పాలంటే చాలా దొరికింది. పరీక్షలో అతడు ఎంతవరకు నమ్మి, ఆశించాడో అంతవరకు దొరికింది. కాని అతనికి దక్కాలని ప్రవక్త ఆశించినదంతా అతడు పొందలేకపోయాడు. ఆశీర్వాదంలోనూ, వాగ్దానంలోనూ ఉన్న పరిపూర్ణతలోని అర్థం అతనికి తెలిసి రాలేదు. మనుషులందరూ పొందగలిగేదానికంటే ఎక్కువే పొందాడు గాని, దేవుడు ఇవ్వగలిగిన దాన్నంతటినీ పొందలేదు.


మన జీవితాల్లో ఇది ఎంత ఉపయోగకరమైన సందేశం! ఈ దేవుని వాక్యం హృదయాన్ని ఎంతగా పరిశోధిస్తుంది! చివరి దాకా ప్రార్థన చెయ్యడమనేది ఎంత ముఖ్యం. వాగ్దాన పరిపూర్ణతను, నమ్మికగల ప్రార్థనవల్ల లభించే అన్ని దీవెనలనూ స్వంతం చేసుకుందాం.


“మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి మహిమ కలుగును గాక” (ఎఫెసీ 3:20).


పౌలు వ్రాసిన వాటిల్లో ఇంతకంటే నొక్కి వక్కాణించిన మాటలు మరెక్కడా కనబడవు. ప్రతి మాటలోను అనంతమైన ప్రేమ, ప్రార్థించే మన పట్ల గొప్ప కార్యాలు చెయ్యగల శక్తి ఇమిడి ఉన్నాయి. అయితే ఒక్క షరతు - "మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున” మనం ఆయన్ను ఎంతవరకు చెయ్యనిస్తే అంతవరకు చేస్తాడు. మనలను రక్షించి, తన రక్తంలో కడిగి, తన ఆత్మమూలంగా మనలను శక్తిమంతుల్ని చేసి, అనేకమైన శోధనల్లో కాపాడిన దేవుని శక్తి మన పక్షంగా అత్యవసర పరిస్థితుల్లో, అన్ని ఆపదల్లో పనిచేస్తుంది.

-----------------------------------------------------------------------------------------------------------------------------

Take the arrows. ... Smite upon the ground. And he smote twice and stayed. And the man of God was wroth with him, and said, Thou shouldest have smitten five or six times (2 Kgs -  13:18-19)

How striking and eloquent the message of these words! Jehoash thought he had done very well when he duplicated and triplicated what to him was certainly an extraordinary act of faith. But the Lord and the prophet were bitterly disappointed because he had stopped half way.

He got something. He got much. He got exactly what he believed for in the final test, but he did not get all that the prophet meant and the Lord wanted to bestow. He missed much of the meaning of the promise and the fullness of the blessing. He got something better than the human, but he did not get God’s best.

Beloved, how solemn is the application! How heartsearching the message of God to us! How important that we should learn to pray through! Shall we claim all the fullness of the promise and all the possibilities of believing prayer? —A. B. Simpson

“Unto him that is able to do exceeding abundantly above all that we ask or think” (Eph. 3:20).

There is no other such piling up of words in Paul’s writings as these, “exceeding abundantly above all,” and each word is packed with infinite love and power to “do” for His praying saints. There is one limitation, “according to the power that worketh in us.” He will do just as much for us as we let Him do in us. The power that saved us, washed us with His own blood, filled us with might by His Spirit, kept us in manifold temptations, will work for us, meeting every emergency, every crisis, every circumstance, and every adversary. —The Alliance

No comments:

Post a Comment