Friday, December 10, 2021

Learning From Suffering

 

మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము; మేమాదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ, మేముకూడ పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమైయున్నది. మీరు శ్రమలలో ఏలాగు పాలివారైయున్నారో, ఆలాగే ఆదరణలోను పాలివారైయున్నారని యెరుగుదుము గనుక మిమ్మును గూర్చిన మా నిరీక్షణ స్థిరమైయున్నది (2 కొరింథీ 1:6, 7).


నీకేదైనా వేదన, బాధ కలిగినప్పుడు వెంటనే వెళ్ళి కష్టసుఖాలు చెప్పుకోవడానికి నీ పరిచయస్థుల్లో ప్రత్యేకమైన వ్యక్తులున్నారు కదా. వాళ్ళెప్పుడూ ఇంపైన మాటలు, సేదదీర్చే మాటలు పలుకుతుంటారు. నీ అవసరానికి తగిన ఆలోచన చెబుతుంటారు. అయితే గాయపడిన హృదయాలను కట్టడానికి, కారే కన్నీళ్ళని తుడవడానికి సామర్థ్యం వాళ్ళకెలా వచ్చిందో నీకు తెలియదు. అయితే నువ్వు వాళ్ళ గత చరిత్ర తిరగేస్తే తెలుస్తుంది. అందరికంటే వాళ్ళు ఎక్కువ శ్రమలననుభవించి ఉన్నారని. వాళ్ళ ఆనందాల పసిడి పాత్ర వాళ్ళ ఎదుటే భళ్ళున బద్దలైపోయిందొకనాడు. ఆటుపోటులను చవి చూశారు వాళ్ళు. వాడిపోతున్న తీగెల్ని చూశారు. మధ్యాహ్నం వేళనే అస్తమించిన సూర్యుణ్ణి చూశారు. ఇదంతా వాళ్ళని ఈ విధంగా మనుషులకి ఆదరణ కారకులయ్యేలా చెయ్యడంలో సహాయపడింది. దూరదేశాల నుండి వచ్చే ప్యాకెట్లు మురికిమురికిగా ఉండొచ్చు. కాని వాటిలో సుగంధ ద్రవ్యాలుంటాయి. అలానే శ్రమలు భరించరానివిగా ఉండొచ్చు. కాని వాటి క్రమశిక్షణలో మన ఔన్నత్యం, ఉదాత్త గుణం పెరిగి ఇతరులకు సహాయపడే నిపుణతను పొందుతాము. శ్రమలలో చిరాకు పడొద్దు. దాని ద్వారా నువ్వు పొందగలిగినదంతా పొందడం నేర్చుకో. దేవుని చిత్త ప్రకారం నీ తరం వాళ్ళకి సేవ చేయగలిగేలా దాని సహాయం తీసుకో.


ఓ సుప్రభాత శుభవేళ ఒక తియ్యని పాట నాలకించాను

మృదు మధుర ప్రార్థనా గీత రవళిలో పులకించాను

ఆ పాట పాడిన స్వరం కోసం అన్వేషించి

శరాఘాతానికి నేలకొరిగిన పక్షిని తిలకించాను.


బాధలో రెక్కలు ముడిచిన ఆ జీవ ఆత్మని చూశాను

విలపించే లోకానికి చిరునవ్వునిచ్చే మధురిమను చూశాను

జీవన మాధుర్యం బాధలో, వేదనలోనే ఉందని తెలుసుకున్నాను

ఆ గాయపడిన ఆత్మ గుచ్చుకున్న బాణంతో పాడుతూ ఉంది.


ప్రేమించి హింసల పాలైన మనిషి గురించి తెలుసా

ఆ చేతులకున్న మేకుల గురించి, ప్రక్కలోని బల్లెం గురించి

కొరడా దెబ్బల గురించి, అపహాస్యాల గురించి

ముళ్ళకిరీటం ధరించి నీ పాపాల కోసం చనిపోవడం గురించి నీకు తెలుసా.


యజమానికంటే అధికుడవేం కాదు

నీ ఆత్మలో ముల్లున్నా ఆయన కృప చాలు

నీ జీవితం గాయపడినా ఆయన పిల్లల కోసం పాటుపడు

గుచ్చుకున్న బాణంతో పాడుతున్న గువ్వలాగా.

-----------------------------------------------------------------------------------------------------------------------------

If I am in distress, it is in the interests of your comfort, which is effective as it nerves you to endure the same sufferings as I suffered myself. Hence my hope for you is well-founded, since I know that as you share the sufferings you share the comfort also - (2 Cor - 1:6-7)

Are there not some in your circle to whom you naturally betake yourself in times of trial and sorrow? They always seem to speak the right word, to give the very counsel you are longing for; you do not realize, however, the cost which they had to pay ere they became so skillful in binding up the gaping wounds and drying tears. But if you were to investigate their past history you would find that they have suffered more than most. They have watched the slow untwisting of some silver cord on which the lamp of life hung. They have seen the golden bowl of joy dashed to their feet, and its contents spilt. They have stood by ebbing tides, and drooping gourds, and noon sunsets; but all this has been necessary to make them the nurses, the physicians, the priests of men. The boxes that come from foreign climes are clumsy enough; but they contain spices which scent the air with the fragrance of the Orient. So suffering is rough and hard to bear; but it hides beneath it discipline, education, possibilities, which not only leave us nobler, but perfect us to help others. Do not fret, or set your teeth, or wait doggedly for the suffering to pass; but get out of it all you can, both for yourself and for your service to your generation, according to the will of God. —Selected

Once I heard a song of sweetness,  

As it cleft the morning air,  

Sounding in its blest completeness,  

Like a tender, pleading prayer;  

And I sought to find the singer,  

Whence the wondrous song was borne;  

And I found a bird, sore wounded,  

Pinioned by a cruel thorn.  


I have seen a soul in sadness,  

While its wings with pain were furl’d,  

Giving hope, and cheer and gladness  

That should bless a weeping world;  

And I knew that life of sweetness,  

Was of pain and sorrow row borne,  

And a stricken soul was singing,  

With its heart against a thorn.  


Ye are told of One who loved you,  

Of a Saviour crucified,  

Ye are told of nails that pinioned,  

And a spear that pierced His side;  

Ye are told of cruel scourging,  

Of a Savior bearing scorn,  

And He died for your salvation,  

With His brow against a thorn.  


Ye “are not above the Master.”  

Will you breathe a sweet refrain?  

And His grace will be sufficient,  

When your heart is pierced with pain.  

Will you live to bless His loved ones,  

Tho’ your life be bruised and torn,  

Like the bird that sang so sweetly,  

With its heart against a thorn?  

Thursday, December 9, 2021

Achieving the Victory

 క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది (2 కొరింథీ 4:18). 


'మా కొరకు ... కలుగజేయుచున్నది' అనే మాటల్ని గమనించండి. మానవ జీవితంలో కన్నీరెప్పుడూ వరదలై పారుతూ ఉంటుందెందుకని? రక్తంతో బ్రతుకు తడిసి ఉంటుంది ఎందుకని? ఇలాటి ప్రశ్నలు పదే పదే వినిపిస్తూ ఉంటాయి. పై వాక్యంలో దీనికి సమాధానం కన్పిస్తోంది. శ్రమలు మనకోసం కొన్ని ప్రశస్థమైన వాటిని సాధించి పెడుతున్నాయి. విజయ మార్గాన్ని కాక విజయ సాధన సూత్రాలను కూడా అవి మనకి నేర్పుతున్నాయి. ప్రతి దుఃఖానికి ఏదో ఒక నష్ట పరిహారం మనకి దక్కుతుంది. ఇంగ్లీషులో ప్రసిద్ధి చెందిన పాటలో ఈ విషయమే ఉంది. 


సిలువ ఎక్కవలసి వచ్చినా

నీ చెంతకి… దేవా నీ చేరువకి…

నీ వైపుకి… చేరితే నాకదే చాలు


విచారపు కడుపునుండే ఆనందం ఉద్భవిస్తుంది. “ఆయన్ని ముఖాముఖిగా చూస్తాను” అంటూ ఫానీ క్రాస్బీ ఎలా రాయగలిగిందంటే ఆమె ఎన్నడూ పచ్చని చేలనూ, సంధ్య కాంతులనూ, తల్లి కన్నుల్లోని మమతనూ చూడడానికి నోచుకోలేదు. కంటి చూపు లేకపోవడమే ఆమెకు ఆత్మీయ దృష్టి తేటపడేలా చేసింది.


విచారం అనేది కేవలం రాత్రి గడిచే మట్టుకే ఉంటుందని గ్రహించి ఆదరణ పొందాలి. ఉదయం కాగానే అది సెలవు పుచ్చుకుంటుంది. వసంత కాలపు ఆహ్లాదకరమైన రోజును తలుచుకుంటే తుఫాను రోజు చాలా తక్కువ కాలమే. రాత్రంతా విలాపాలున్నా, ఉదయాన ఆనందం ఉదయిస్తుంది.


కేరింతలతో కాదు దాని మూలం 

ఆదరించే ప్రేమ కాదు దానికి పునాది 

మనోనిబ్బరమే దాని ప్రాణం

ఓర్పుతో జయించడమే దాని ధ్యేయం


త్యాగంలో శాంతి ఉంది

అనుభూతుల అల్లకల్లోలాలు లేని శాంతి ఏదెనులో నెలకొన్న శాంతి కాదది

గెత్సెమనె లో గెలిచినదే అది

-----------------------------------------------------------------------------------------------------------------------------

For this our light and transitory burden of suffering is achieving for us a weight of glory - (2 Cor - 4:17)

“Is achieving for us,” mark. The question is repeatedly asked—Why is the life of man drenched with so much blood, and blistered with so many tears? The answer is to be found in the word “achieving”; these things are achieving for us something precious. They are teaching us not only the way to victory, but better still the laws of victory. There is a compensation in every sorrow, and the sorrow is working out the compensation.

It is the cry of the dear old hymn:


“Nearer my God to Thee, nearer to Thee,  

E’en tho’ it be a cross that raiseth me.”  


Joy sometimes needs pain to give it birth. Fanny Crosby could never have written her beautiful hymn, “I shall see Him face to face,” were it not for the fact that she had never looked upon the green fields nor the evening sunset nor the kindly twinkle in her mother’s eye. It was the loss of her own vision that helped her to gain her remarkable spiritual discernment.


It is the tree that suffers that is capable of polish. When the woodman wants some curved lines of beauty in the grain he cuts down some maple that has been gashed by the axe and twisted by the storm. In this way he secures the knots and the hardness that take the gloss.


It is comforting to know that sorrow tarries only for the night; it takes its leave in the morning. A thunderstorm is very brief when put alongside the long summer day. “Weeping may endure for the night but joy cometh in the morning.” —Songs in the Night


“There is a peace that cometh after sorrow,  

Of hope surrendered, not of hope fulfilled;  

A peace that looketh not upon tomorrow,  

But calmly on a tempest that it stilled.  


“A peace that lives not now in joy’s excesses,  

Nor in the happy life of love secure;  

But in the unerring strength the heart possesses,  

Of conflicts won while learning to endure.  


“A peace there is, in sacrifice secluded,  

A life subdued, from will and passion free;  

’Tis not the peace that over Eden brooded,  

But that which triumphed in Gethsemane.”

Wednesday, December 8, 2021

Show Love

 దేవునిచేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును ప్రియులునైనవారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును ... ధరించుకొనుడి (కొలొస్స 3:12).


ఒక వృద్ధుడు ఎక్కడికి వెళ్ళినా ఒక డబ్బాలో నూనె తీసుకువెళ్ళేవాడట. ఏదైనా తలుపు కిర్రుమని చప్పుడౌతుంటే కాస్త నూనెని ఆ తలుపు బందుల మధ్య పోసేవాడట. ఏదైనా గడియ తియ్యడం కాస్త కష్టంగా ఉంటే నూనె రాసి తేలికగా వచ్చేలా చేసేవాడట. ఇలా తన దారిలో కష్టంగా ఉన్న వాటినన్నిటినీ నూనెతో మెత్తన చేస్తూ తన తరువాత వచ్చేవాళ్ళకి సౌకర్యంగా ఉండేలా చేసేవాడు.


అతణ్ణి అందరూ పిచ్చివాడనేవారు. కాని ఆ వృద్ధుడు మాత్రం తొణకకుండా డబ్బా ఖాళీ అయినప్పుడెల్లా దాన్ని నింపుకుంటూ తన పని తాను చేసుకుంటూ పోయేవాడు.


చాలా జీవితాలు ప్రతిరోజూ ఇలాటి చప్పుళ్ళు చేస్తూ భారంగా, చిరాకుగా మూలుగుతూ ఉంటాయి. ఏదీ సవ్యంగా జరగదు. వాళ్ళకి సంతోషం, సాత్వికం, వివేచన అనే నూనె అవసరం. నీ దగ్గర ఈ నూనె సీసా ఉందా? నీ సన్నిహితులకి సహాయపడడానికి ఉదయం మొదలుకొని సిద్ధపడి ఉండు. దిగులుగా ఉన్న హృదయానికి ప్రోత్సాహం అనే నూనె రాయి. అది ఆ హృదయానికి ఎంత ఆదరణకరమో కదా! వెన్నుతట్టి లేవనెత్తే ఒక్క మాట. ఆ మాటను పలకడానికి బద్ధకించకు.


జీవిత గమనంలో మన జీవితం కొన్ని జీవితాలకి ఒక్కసారే ఎదురవుతుంది. అక్కడినుండి విడిపోయి మరెన్నటికీ కలుసుకోదు. మన దగ్గర ఉన్న జాలి అనే నూనెను కష్టాల్లో ఉన్న అనేకమైన జీవితాల మీద పోసి వాటిలోని ఘర్షణనూ రాపిడినీ మెత్తగా చెయ్యగలిగితే, రక్షకుని విమోచనా వాత్సల్యానికి ఆ హృదయాలను సిద్ధపరచగలిగితే మన విధిని మనం నిర్వహించినట్టే.


దిగులుగా ఉన్న వ్యక్తితో పలికిన ఒక్క ఆదరణ వాక్యం అతని హృదయంలో సూర్యోదయాన్ని కలుగజేస్తుంది.


మనుషుల మనసుల్లో రగిలే వేదన

మనకర్థం కాదు

మనం చూడలేము

అయితే ప్రేమ అన్నిటినీ వెలిగిస్తుంది

పగులుతున్న గుండెల్ని రగులుతున్న ఆత్మల్ని

దిగులు మాన్పించి సేదదీర్చేలా జాలి చూపిద్దాం


“సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగము గలవారైయుండుడి (రోమా 12:10).

-----------------------------------------------------------------------------------------------------------------------------

Put on as the elect of God, kindness - (Col - 3:12)

There is a story of an old man who carried a little can of oil with him everywhere he went, and if he passed through a door that squeaked, he poured a little oil on the hinges. If a gate was hard to open, he oiled the latch. And thus he passed through life lubricating all hard places and making it easier for those who came after him.

People called him eccentric, queer, and cranky; but the old man went steadily on refilling his can of oil when it became empty, and oiled the hard places he found.

There are many lives that creak and grate harshly as they live day by day. Nothing goes right with them. They need lubricating with the oil of gladness, gentleness, or thoughtfulness. Have you your own can of oil with you? Be ready with your oil of helpfulness in the early morning to the one nearest you. It may lubricate the whole day for him. The oil, of good cheer to the downhearted one—Oh, how much it may mean! The word of courage to the despairing. Speak it.

Our lives touch others but once, perhaps, on the road of life; and then, mayhap, our ways diverge, never to meet again, The oil of kindness has worn the sharp, hard edges off of many a sin-hardened life and left it soft and pliable and ready for the redeeming grace of the Saviour.

A word spoken pleasantly is a large spot of sunshine on a sad heart. Therefore, “Give others the sunshine, tell Jesus the rest.”


“We cannot know the grief  

That men may borrow;  

We cannot see the souls  

Storm-swept by sorrow;  

But love can shine upon the way  

Today, tomorrow;  

Let us be kind.  

Upon the wheel of pain so many weary lives are  

broken,  

We live in vain who give no tender token.  

Let us be kind.”


“Be kindly affectioned one to another with brotherly love” (Rom. 12:10).