Tuesday, December 14, 2021

Christ's Business is Supreme

ఆయన శిష్యులలో ఒకడు - ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయన నడిగెను. అందుకాయన - మీరు ప్రార్థన చేయునప్పుడు… నీ రాజ్యము వచ్చును గాక… అని పలుకుడని వారితో చెప్పెను*_ (లూకా 11:1,2). 


మాకు ప్రార్థన చెయ్యడం నేర్పించమని వాళ్ళు అడిగినప్పుడు ప్రభువు తన కళ్ళెత్తి దేవుని మహిమనొక్కసారి అవలోకించాడు. నిత్యత్వపు అంతిమ స్వప్నాన్ని ఒక్కసారి తలుచుకున్నాడు. దేవుడు మానవ జీవితంలో చేయ సంకల్పించిన దాని సారాంశాన్ని క్రోడీకరించి ఈ అర్థవంతమైన మాటల్లో ఇమిడ్చి “ఇలా ప్రార్థించండి” అంటూ ఆదేశించాడు. మనకు సాధారణంగా వినబడే ప్రార్థనకీ దీనికీ ఎంత వ్యత్యాసమో చూడండి. మన ఇష్టాన్ని అనుసరించి ప్రార్థిస్తే ఇలా ఉంటుంది మన ప్రార్థన “దేవా నన్ను దీవించు, నా కుటుంబాన్నీ, నా సంఘాన్నీ, మా ఊరినీ, మా దేశాన్నీ దీవించు” ఎక్కడో ఓ మూలను ఆయన రాజ్యం గురించి ఒకమాట అంటామేమో.


ప్రభువైతే మనం ఎక్కడైతే వదిలేశామో అక్కడ ప్రారంభించాడు. లోకం గురించి ముందు, మన వ్యక్తిగత అవసరాలు తరువాత అడగాలి. నా ప్రార్థన ఖండాంతరాలు దాటి ప్రతి ద్వీపాన్ని కలుపుకుని, ప్రపంచమంతటి కొరకు దేవుని సంకల్పం గురించీ, ప్రతి వ్యక్తి గురించి, ప్రతి జాతి గురించి ప్రార్థించిన తరువాత నా కోసం చిన్న రొట్టెముక్కనిమ్మని అడగమంటున్నాడు.


తనకున్నదంతా ఇచ్చేసి, తనకు తానే మన కోసం సిలువపై త్యాగం చేసేసిన తరువాత ఆయన మనల్ని ఏదైనా అడగడానికి యోగ్యుడే కదా. దేవుని రాజ్యం ముందు అందరు స్త్రీ పురుషులూ అల్పులే. ఆ అద్భుత శక్తి అంచుల్ని కూడా ఎవరూ తాకలేరు. క్రీస్తుకి సంబంధించిన వ్యవహారాలే మన జీవితాల్లో ప్రధానాంశాలనీ, మన వ్యక్తిగత అవసరాలు, మనకెంత ముఖ్యమైనవైనా, ప్రియమైనవైనా అవి క్రీస్తు పని తరువాతేనని మనం నేర్చుకునేదాకా ఇంతే.


ఆఫ్రికా ఖండపు మిషనరీ రాబర్ట్ మోఫత్ ని ఒక పాప తన ఆల్బమ్ లో ఏదైనా రాయమంది. ఆయన రాసిన మాటలివి,


*నా హృదయమే నా ఆల్బమ్*

*తుపానుకమ్మి చీకటి మూసి*

*కాంతి విహీనమైన ఆల్బమ్*

*యేసు పేరు దానిపై రాయాలి*

*ఆ హృదయం ఆయన ముందు మోకరిల్లాలి*

*సౌందర్య లోకాల్ని వీక్షించాలి*

*ఇదే నా ప్రియమైన కోరిక.*


*“ఆయన రాజ్యము అంతము లేనిదైయుండును”* (లూకా 1:33).


మిషనరీ పని చెయ్యడమన్నది ఈనాటి సంఘాలు తరువాత ఆలోచించి తెలుసుకున్నది కాదు. క్రీస్తు ముందుగానే నిర్ణయించి ఆదేశించినది.

-------------------------------------------------------------------
His disciples said unto him, Lord, teach us to pray ... and he said unto them, When ye pray, say... Thy kingdom come* - (Luke 11:1-2)


When they said, “Teach us to pray,” the Master lifted His eyes and swept the far horizon of God. He gathered up the ultimate dream of the Eternal, and, rounding the sum of everything God intends to do in the life of man, He packed it all into these three terse pregnant phrases and said, “When you pray, pray after this manner.”


What a contrast between this and much praying we have heard. When we follow the devices of our own hearts, how runs it? “O Lord bless me, then My family, My church, My city, My country,” and away on the far fringe as we close up, there is a prayer for the extension of His Kingdom throughout the wide parish of the world.


The Master begins where we leave off. The world first, my personal needs second, is the order of this prayer. Only after my prayer has crossed every continent and every far-flung island of the sea, after it has taken in the last man in the last backward race, after it has covered the entire wish and purpose, of God for the world, only then am I taught to ask for a piece of bread for myself.


When Jesus gave His all, Himself for us and to us in the holy extravagance of the Cross, is it too much if He asks us to do the same thing? No man or woman amounts to anything in the kingdom, no soul ever touches even the edge of the zone of power, until this lesson is learned that Christ’s business is the supreme concern of life and that all personal considerations, however dear or important, are tributary thereto. —Dr. Francis


When Robert Moffat, the veteran African missionary and explorer, was asked once to write in a young lady’s album, he penned these lines:


“My album is a savage breast,  

Where tempests brood and shadows rest,  

Without one ray of light;  

To write the name of Jesus there,  

And see that savage bow in prayer,  

And point to worlds more bright and fair,  

This is my soul’s delight.”


“And His Kingdom shall have no frontier” (Luke 1:33, the old Moravian version).


The missionary enterprise is not the Church’s afterthought; it is Christ’s forethought; —Henry van Dyke

Monday, December 13, 2021

When We're in the Dark

అంధకారస్థలములలో ఉంచబడిన నిధులను ... నీకిచ్చెదను*_ (యెషయా 45:3).


బ్రస్సెల్స్ నగరంలో ఉన్న లేసు దుకాణాలు ప్రపంచ ప్రఖ్యాతి నొందినాయి. వాటిల్లో అతి నాజూకైన ప్రశస్థమైన లేసును అల్లడానికి కొన్ని గదులు ప్రత్యేకంగా ఉంటాయి. ఆ గదులు చీకటిగా ఉంటాయి. ఒక చిన్న కిటికీలోనుండి పడుతున్న కొద్దిపాటి కాంతి మాత్రం నేరుగా కుడుతున్న లేసు మీద పడుతుంటుంది. ఒక్కొక్క గదిలో ఒక్కొక్క పనివాడే ఉంటాడు. ఆ కాంతి తన చేతులమీద పడేలా కూర్చుని ఉంటాడు. ఈ పద్ధతివల్ల అపురూపమైన లేసు డిజైన్లు తయారవుతాయి. అల్లేవాడు చీకట్లోను, డిజైను వెలుగులోను ఉంటే అందమైన లేసు తయారవుతుందట.


మన జీవితపు అల్లికలో కూడా ఇంతే. కొన్ని సమయాల్లో చీకటి కమ్మేస్తుంది. మనం ఏం చేస్తున్నామో మనకి అర్థం కాదు. మనం అల్లుతున్న డిజైను మనకి కనబడదు. మనకి అనుభవమౌతున్నదాన్లో ఏమీ అందం, ఉపయోగం కనబడవు. అయినా మనం నమ్మకంగా పనిచేస్తూ నిస్పృహకి, అలసటకి తావియ్యక అనుమానం లేక విశ్వాసంలో, ప్రేమలో సాగిపోవాలి. దేవుడు ఎప్పుడూ కనిపెడుతూనే ఉంటాడు. నీ బాధలోనుండి, కన్నీళ్ళలోనుండి అందాన్ని సృష్టిస్తాడు.


*దేవుని సంకల్పమనే మగ్గాలు తిరుగుతున్నాయి*

*ఆయనకిష్టమైన నేత నేస్తున్నాయి*

*వచ్చే మడతల్నీ, కలిసే నల్లదారాలనీ అయిష్టంగా చూడకు*

*ఆ నల్లదారాల వెంట బంగారుతీగె ఉంది.*


*ఉల్లాసంగా అల్లుకుంటూ వెళ్ళు*

*తుడుచుకో నీళ్ళు నిండిన నీ కళ్ళు* 

*దారాన్ని మాత్రం ఆయనే ఇస్తాడు*

*ప్రార్థనతో జాగ్రత్తగా అల్లు.*

------------------------------------------------------------------

I Will give thee the treasures of darkness* - (Isa - 45:3)


In the famous lace shops of Brussels, there are certain rooms devoted to the spinning of the finest and most delicate patterns. These rooms are altogether darkened, save for a light from one very small window, which falls directly upon the pattern. There is only one spinner in the room, and he sits where the narrow stream of light falls upon the threads of his weaving. “Thus,” we are told by the guide, “do we secure our choicest products. Lace is always more delicately and beautifully woven when the worker himself is in the dark and only his pattern is in the light.”


May it not be the same with us in our weaving? Sometimes it is very dark. We cannot understand what we are doing. We do not see the web we are weaving. We are not able to discover any beauty, any possible good in our experience. Yet if we are faithful and fail not and faint not, we shall some day know that the most exquisite work of all our life was done in those days when it was so dark.


If you are in the deep shadows because of some strange, mysterious providence, do not be afraid. Simply go on in faith and love, never doubting. God is watching, and He will bring good and beauty out of all your pain and tears. —J. R. Miller


The shuttles of His purpose move  

To carry out His own design;  

Seek not too soon to disapprove  

His work, nor yet assign  

Dark motives, when, with silent tread,  

You view some sombre fold;  

For lo, within each darker thread  

There twines a thread of gold.  


Spin cheerfully,  

Not tearfully,  

He knows the way you plod;  

Spin carefully,  

Spin prayerfully,  

But leave the thread with God.  


—Canadian Home Journal

Sunday, December 12, 2021

Fight the Good Fight

 

నేనిప్పుడే పానార్పణముగ పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమైయున్నది. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని (2 తిమోతి 4:6,7). 


సైనికులు ముసలితనంలో తమ ఇళ్ళకి తిరిగి వచ్చేసినప్పుడు తమ దేహానికున్న గాయపు మచ్చల్ని చూపించి తాము పాల్గొన్న యుద్ధాల గురించి చెబుతుంటారు. మనం కూడా ఏ నిత్యమైన నివాసానికి చేరుకోవాలని త్వరపడుతున్నామో అక్కడ దేవుని కరుణ గురించి, విశ్వాస్యత గురించి, మనల్ని ఆయన శ్రమల్లోనుంచి నడిపించిన దానిని గురించీ చెప్పుకుంటాము. ధవళవస్త్రాలు ధరించిన వారి మధ్య నేను నిలబడి ఉంటే నన్ను చూపించి ఇతడు తప్ప మిగిలిన వాళ్ళంతా మహా శ్రమల కాలాన్ని అనుభవించి ఇక్కడికి చేరుకున్నవాళ్ళు అని సాక్ష్యం రావడం నాకు సిగ్గుచేటు గదా?


నీ సంగతేమిటి? దుఃఖమంటే ఏమిటో తెలియని పరిశుద్ధుడు ఇడుగో అని నీవైపు చెయ్యెత్తి ఎవరైనా చూపించడం నీకు ఇష్టమా? అయితే ఆ గొప్ప గుంపులో ఒంటరివౌతావు. పోరాటంలో పాల్గొనాలి. ఎందుకంటే కిరీటం సిద్ధంగా ఉంది.


పర్వతం మీద యుద్ధంలో గాయపడిన ఒక సైనికుడిని డాక్టరు అడిగాడు “నీకు గాయం ఎక్కడ అయింది?” ఆ సైనికుడు జవాబిచ్చాడు "శిఖరం పైన. " తన శరీరంపైనున్న గాయం మాటే మర్చిపోయాడతను. పోరాటమే గుర్తుంది. తాను కూలిపోయిన చోటే గుర్తుంది. తమ గెలుపే గుర్తుంది. క్రీస్తు కోసం విశ్రాంతి లేకుండా ఉన్నతాశయ సాధన కోసం శ్రమిద్దాం. 'శిఖరం చేరాక మంచి పోరాటం పోరాడాను, నా పరుగు పూర్తిచేశాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను' అంటూ సింహనాదం చేద్దాము.


నీ పని సంపూర్ణం చెయ్యి

ఆ పైన విశ్రమించు

విశ్రాంతి దేవుడిచ్చేదే

ఆ విశ్రాంతి శాశ్వతమని గుర్తించు

దేవుడు నీ దగ్గర పతకాలూ,

డిగ్రీలూ ఉన్నాయా అని చూడడు

నీ గాయపు మచ్చల్ని చూస్తాడు.


ఒక వీరుని గురించి రాసిన పాటలో ఒక వచనం

అతని వీరఖడ్గానికి

అలంకారాలేం లేవు

అన్నీ గంట్లు తప్ప


సేవలో తనకి సంక్రమించిన గాయపు మచ్చలు తప్ప ఇతర అలంకారాలను ఏ యోగ్యుడైన సేవకుడు కోరుకుంటాడు? కిరీటం కోసం తాను భరించిన నష్టాలు, క్రీస్తు కోసం పడిన నిందలు, దేవుని సేవలో తాను పొందిన అలసట, ఇవే అతనికి గర్వకారణాలు.

-----------------------------------------------------------------------------------------------------------------------------

The last drops of my sacrifice are falling; my time to go has come. I have fought in the good fight; I have kept the faith (2 Tim - 4:6-7)

As soldiers show their scars and talk of battles when they come at last to spend their old age in the country at home, so shall we in the dear land to which we are hastening, speak of the goodness and faithfulness of God who brought us through all the trials of the way. I would not like to stand in the white-robed host and hear it said, “These are they that came out of great tribulation, all except one.”

Would you like to be there and see yourself pointed at as the one saint who never knew a sorrow? Oh, no! for you would be an alien in the midst of the sacred brotherhood. We will be content to share the battle, for we shall soon wear the crown and wave the palm. —C. H. Spurgeon

“Where were you wounded?” asked the surgeon of a soldier at Lookout Mountain. “Almost at the top,” he answered. He forgot even his gaping wound—he only remembered that he had won the heights. So let us go forth to higher endeavors for Christ and never rest till we can shout from the very top, “I have fought a good fight, I have finished my course, I have kept the faith.”

“Finish thy work, then rest,  

Till then rest never;  

The rest for thee by God  

Is rest forever.”  


“God will not look you over for medals, degrees or diplomas but for scars.”


Of an old hero the minstrel sang—


“With his Yemen sword for aid;  

Ornament it carried none,  

But the notches on the blade.”


What nobler decoration of honor can any godly man seek after than his scars of service, his losses for the crown, his reproaches for Christ’s sake, his being worn out in his Master’s service!