Saturday, January 8, 2022

Showers and Sunshine

 వారిని, నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను, దీవెనకరముగు వర్షములు కురియును (యెహెజ్కేలు 34:26)


ఈ వేళ ఏ ఋతువు? అనావృష్టి కాలమా? వర్ష ఋతువు ఇంకెంతో దూరం లేదు. గొప్ప భారంతో కూడిన మబ్బులు కమ్మిన కాలమా? వర్ష ఋతువు వచ్చేసింది. నీ బలం దిన దినం అభివృద్ది చెందుతుంది. దీవెనకరమైన వర్షాలు కురుస్తాయి. ఇక్కడ బహువచనం ఉంది. అన్ని రకాలైన దీవెనలనూ దేవుడు కురిపిస్తాడు. దేవుని దీవెనలన్నీ కలిసికట్టుగా వస్తాయి. బంగారు గొలుసులోని లింకుల్లాగే అన్నీ ఒక దాని వెంట ఒకటి వస్తాయి. మారుమనస్సు పొందడానికి ఆయన కృపనిస్తే నిన్ను ఆదరించే కృపలను కూడా ఆయనే ఇస్తాడు. ఆయన ‘దీవెనకరమైన వర్షాలు’ కురిపిస్తాడు. ఎండిపోయిన మొక్కల్లారా, పైకి చూడండి. మీ ఆకుల్ని, పువ్వుల్ని విప్పండి. పరలోక వర్షాలు మిమ్మల్ని తడుపుతాయి.


దిగుడులోయగా మార్చుకో నీ గుండెను 

అది నిండి, పొంగి పొర్లేదాకా 

దేవుడు కురిపిస్తాడు దీవెన వర్షాన్ని 


ప్రభూ, నా ముల్లుని నువ్వు పువ్వుగా మార్చగలవు. నా నివేదన ఇదే. యోబు జీవితంలో వర్షం తరువాత ఎండ కాసింది. కాని కురిసిన వర్షం వ్యర్ధం కాలేదుగా. యోబు అడిగాడు, నేనూ అడుగుతున్నాను. వర్షం తరువాత వచ్చే తళతళలకు, వర్షానికీ సంబంధం లేదా? నువ్వు చెప్పగలవు – నీ శిలువ చెప్పగలదు. నీ బాధల్లో కిరీటం ఉంది. ప్రభూ, ఆ కిరీటం నాకు కావాలి. వర్షం కురిసి వెలసిన తరువాత ఉండే తళతళల్లోని తళుకుని నాకు బోధపరచు. అప్పుడే నేను జయశీలిగా ఉండగలను. 


జీవితం ఫలభరితం కావాలంటే సూర్యరశ్మితోబాటు వర్షం కూడా కావాలి.


ఎండి పగులువారిన నేలపై 

జీవవాయువు పోసే వర్షం కావాలి  

ధరణీతలం హరిత శాద్వలంగా మారాలంటే 

మబ్బు నీళ్ళు కావాల్సిందే !

భయాల మొయిళ్లు

బాధల వర్షాన్ని మోసుకొచ్చాయి

బ్రతుకు భూమిపై కురిసి 

గుండెలోతుల్లోకి తేమను తెచ్చాయి


దేవుని దివ్య సూత్రాన్ని ఆచరించగా 

పగుళ్ళు విచ్చిన దిగుళ్ల నేలలో 

పచ్చదనం మందహాసం చేసింది 

నిన్ను ఆవరించిన ప్రతి కారుమబ్బులో 

పౌలు రాసిన పవిత్ర వాక్కులు గమనించు 

ఈ మేఘాలు నీ ఆత్మకు క్షేమాలు 

అవి నీకు మేలే చేస్తాయి 

అది నీవు గుర్తించు.

-----------------------------------------------------------------------------------------------------------------------------

I will cause the shower to come down in his season; there shall be showers of blessing - (Ezek - 34:26)  

    What is thy season this morning? Is it a season of drought? Then that is the season for showers. Is it a season of great heaviness and black clouds? Then that is the season for showers. “As thy day so shall thy strength be.” “I will give thee showers of blessing.” The word is in the plural. All kinds of blessings God will send. All God’s blessings go together, like links in a golden chain. If He gives converting grace, He will also give comforting grace. He will send “showers of blessings.” Look up today, O parched plant, and open thy leaves and flowers for a heavenly watering.  —Spurgeon

“Let but thy heart become a valley low,

And God will rain on it till it will overflow.”

    Thou, O Lord, canst transform my thorn into a flower. And I want my thorn transformed into a flower. Job got the sunshine after the rain, but has the rain been all waste? Job wants to know, I want to know if the shower had nothing to do with the shining. And Thou canst tell me Thy Cross can tell me. Thou hast crowned Thy sorrow. Be this my crown, O Lord. I only triumph in Thee when I have learned the radiance of the rain.  —George Matheson

    The fruitful life seeks showers as well as sunshine.

“The landscape, brown and sere beneath the sun,

Needs but the cloud to lift it into life;

The dews may damp the leaves of trees and flowers,

But it requires the cloud-distilled shower

To bring rich verdure to the lifeless life.


“Ah, how like this, the landscape of a life:

Dews of trial fall like incense, rich and sweet;

But bearing little in the crystal tray

Like nymphs of night, dews lift at break of day

And transient impress leaves, like lips that meet.


“But clouds of trials, bearing burdens rare,

Leave in the soul, moisture settled deep:

Life kindles by the magic law of God;

And where before the thirsty camel trod,

There richest beauties to life’s landscape leap.


“Then read thou in each cloud that comes to thee

The words of Paul, in letters large and clear:

So shall those clouds thy soul with blessing feed,

And with a constant trust as thou dost read,

All things together work for good. Fret not, nor fear!”

Friday, January 7, 2022

Contentment

 నేనేస్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగియుండ నేర్చుకొనియున్నాను (ఫిలిప్పీ 4:11)


తాను బందీగా ఉన్న చీకటి కొట్టులో ఉండి, సౌకర్యాలేమీ లేని స్థితిలో పౌలు ఈ మాటలు రాసాడు. 

ఒక రాజు గారు ఒక రోజున  తన తోట లోనికి వెళ్లి చూసే సరికి మొక్కలు, చెట్లు అన్నీ వాడిపోయి ఎండిపోతూ ఉన్నాయట. గేటు దగ్గర నిలిచియున్న మర్రిచెట్టును రాజుగారు అడిగారట. ఎందుకిలా అయిపోయావు? అని. కొబ్బరి చెట్టుకంటే నేను పొడుగ్గా లేను కాబట్టి నాకు జీవితం మీద విరక్తి పుట్టింది అని చెప్పిందట ఆ మర్రి వృక్షం. కొబ్బరిచెట్టేమో తనకి ద్రాక్షపళ్ళు కాయలేదని ఆత్మహత్యకి సిద్ధపడి ఉంది. ద్రాక్షాతీగేమో నిటారుగా నిలబడలేనే అనే దిగులుతో కృశించిపోతున్నది. బంతి మొక్కేమో తన పూలకి సంపంగిలా వాసన లేదని నిరాహార దీక్షలో ఉంది. చివరికి ఒక చోట సన్నజాజి తీగె మాత్రం నిండుగా, పచ్చగా కనుల విందుగా కనిపించింది. రాజుగారన్నారు, “సన్నజాజీ, కనీసం నువ్వన్నా పచ్చగా కళకళలాడుతూ ఉన్నావు. ఈ తోటంతా నిస్పృహ చెందిన మొక్కలే కనిపించాయి. నువ్వు చిన్నదానివైనా ధైర్యంగా ఉన్నావు, చాలా సంతోషం.”


అప్పుడు సన్నజాజి అందట “రాజా, మిగతా మొక్కలన్నీ తాము మరెవరిలాగానో లేమే అని బాధపడుతున్నాయి. అయితే నీకు మర్రిచెట్టు కావాలనే మర్రిమొక్క నాటావు. ద్రాక్ష కావాలనే ద్రాక్షతీగె నాటావు. సన్నజాజి కావాలనుకున్నావు కాబట్టే నన్ను నాటావు. అందుచేత నేను సన్న జాజిగానే ఉంటాను. మరెవరిలాగానో లేననే నిరుత్సాహం నాకెందుకు?”


కొంతమంది చేస్తారెన్నైనా మహత్తులు 

పంతమెందుకు నీ పని నీదే 

సృష్టి అంతటిలోకి ఎవరూ 

నీ అంత బాగా ఆ పని చేయలేరు 


పూర్తిగా దేవునికి చెందినవాళ్ళు ఎలాంటి పరిస్థితిల్లోనైనా సంతృప్తిగానే ఉంటారు. ఎందుకంటే దేవుని చిత్తమే వాళ్ళ చిత్తం. ఆయన ఏం చెయ్యాలని కోరతాడో అదే ఆయన కోసం చెయ్యాలని వాళ్ళు కోరుకుంటారు. తమకున్న ప్రతిదాన్ని వాళ్ళు వదిలేసుకుంటారు. అలాటి నగ్నత్వంలో అన్ని వస్తువులూ తమకి నూరంతలుగా తిరిగి సమకూరడం వాళ్ళు చూస్తారు.

-----------------------------------------------------------------------------------------------------------------------------

I am not saying this because I am in need, for I have learned to be content in any circumstance. - (Phil -  4:11)

Paul, denied of every comfort, wrote the above words in his dungeon. A story is told of a king who went into his garden one morning and found everything withered and dying. He asked the oak that stood near the gate what the trouble was. He found it was sick of life and determined to die because it was not tall and beautiful like the pine. The pine was all out of heart because it could not bear grapes, like the vine. The vine was going to throw its life away because it could not stand erect and have as fine fruit as the peach tree. The geranium was fretting because it was not tall and fragrant like the lilac, and so on all through the garden. Coming to a heart’s-ease, he found its bright face lifted as cheery as ever. “Well, heart’s-ease, I’m glad, amidst all this discouragement, to find one brave little flower. You do not seem to be the least disheartened.” “No, I am not of much account, but I thought that if you wanted an oak, or a pine, or a peach tree, or a lilac, you would have planted one; but as I knew you wanted a heart’s-ease, I am determined to be the best little heart’s-ease that I can.”

“Others may do a greater work,

But you have your part to do;

And no one in all God’s heritage

Can do it so well as you.”

They who are God’s without reserve, are in every state content; for they will only what He wills, and desire to do for Him whatever He desires them to do; they strip themselves of everything, and in this nakedness find all things restored a hundredfold.

Thursday, January 6, 2022

Step-By-Step Grace

 నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లిపారవు (యెషయా 43:2)


మన మార్గానికి ముందుగానే దేవుడు ఆ దారిని సిద్ధం చేయడు. సహాయం అవసరం కాకముందే సహాయం చేస్తానని మాట ఇవ్వడు. అడ్డంకులు ఇంకా మనకి ఎదురు కాకముందే వాటిని తొలగించడు గాని, మనకి అవసరం ముంచుకు వచ్చినప్పుడు మాత్రమే తన చెయ్యి చాపుతాడు. 


చాలామందికి ఈ విషయం తెలియదు. భవిష్యత్తులో తమకి వస్తాయనుకున్న కష్టాల గురించి ఇప్పటినుంచే ఆందోళన పడుతూ ఉంటారు. తమ కనుచూపు మేర మైళ్ళ తరబడి దారిని దేవుడు  ముందుగానే సాఫీ చేసి ఉంచాలని వాళ్ళ కోరిక. అయితే ఆయనేమో వాళ్ళ అవసరానికి తగినట్టుగా ఒకొక్క అడుగు చదును చేస్తానంటున్నాడు. ‘మిమ్మల్ని నదులు దాటిస్తాను’  అన్న ఆయన ప్రమాణాన్ని  మన పట్ల నిజం చేసుకోవాలంటే మనం నీటిలోకి దిగి దాని ప్రవాహాల్లోకి వెళ్లిపోవాలి. చాలామందికి చావంటే భయం. చిరునవ్వుతో చనిపోయే ధైర్యం మాకు లేదు అంటూ అంగలారుస్తారు. అలాంటి ధైర్యం అసలు అనవసరం. ఎందుకంటే  వాళ్ళు తమని తాము ఆరోగ్యవంతులుగా ఉంచుకుంటూ దైనందిన కార్యాల్లో పాల్గొంటూ ఉంటే చావు ఎప్పుడో  వచ్చే ఒక నీడ మాత్రమే. ముందుగా కావలసింది ప్రస్తుతం మన విధుల్ని నిర్వర్తించడానికి, బ్రతకడానికి ధైర్యం. అది ఉంటే చావడానికి కూడా ధైర్యం దానంతట అదే వస్తుంది. 


నదిలోనికి నీవు నడిచి వెళ్తున్నప్పుడు 

ఝల్లుమనేలా నీళ్ళు చల్లగా తగలొచ్చు 

కష్టాల  కడలిలో శోధనా తరంగాలు

విషవేదన ఓపలేని బాధ మనసునీ, ఆత్మనీ 

మదనపెట్టి ముంచెత్తితే 

అవి నీ తల మీదుగా పొర్లి ప్రవహించవు 

నీటిలో నడిచి వెళ్ళే వేళ 

నిజంగా నువ్వు మునిగిపోవు 


నమ్మదగిన దేవుని వాగ్దానాలు 

నీనుంచి ఎప్పుడూ దూరం కావు 

కెరటాల పరవళ్ళు దేవునివే 

తీరం చేర్చే పడవలూ ఆయనవే

----------------------------------------------------------------------------------------------------------------------------

When you pass through the waters, I am with you; when you pass through the streams, they will not overwhelm you. When you walk through the fire, you will not be burned; the flames will not harm you. - (Isa  - 43:2)

God does not open paths for us in advance of our coming. He does not promise help before help is needed. He does not remove obstacles out of our way before we reach them. Yet when we are on the edge of our need, God’s hand is stretched out.

Many people forget this and are forever worrying about difficulties which they foresee in the future. They expect that God is going to make the way plain and open before them, miles and miles ahead; whereas He has promised to do it only step by step as they may need. You must get to the waters and into their floods before you can claim the promise. Many people dread death, and lament that they have no “dying grace.” Of course, they will not have dying grace when they are in good health, amid life’s duties, with death far in advance. Why should they have it then? Grace for duty is what they need then, living grace; then dying grace when they come to die. —J. R. M.

“When thou passest through the waters”

Deep the waves may be and cold,

But Jehovah is our refuge,

And His promise is our hold;

For the Lord, Himself hath said it,

He, the faithful God and true:

“When thou comest to the waters

Thou shalt not go down, BUT THROUGH.”


Seas of sorrow, seas of trial,

Bitterest anguish, fiercest pain,

Rolling surges of temptation

Sweeping over heart and brain

They shall never overflow us

For we know His word is true;

All His waves and all His billows

He will lead us safely through.


Threatening breakers of destruction,

Doubt’s insidious undertow,

Shall not sink us, shall not drag us

Out to ocean depths of woe;

For His promise shall sustain us,

Praise the Lord, whose Word is true!

We shall not go down, or under,

For He saith, “Thou passest THROUGH.”

—Annie Johnson Flint