Saturday, January 15, 2022

Put Forth

 

అతడు తన సొంత గొఱ్ఱెలనన్నిటిని వెలుపలికి నడిపించును (యోహాను 10:4) 

ఆయన ఈ పని చాలా అయిష్టంగా చేస్తున్నాడనుకుంటాను. ఆయన గొర్రెలమైన మనకి ఇది కష్టాలు తెచ్చిపెట్టే విషయమే. కాని ఇది జరగక తప్పదు. మనం నిజంగా వర్ధిల్లాలంటే సంతోషంగా, సౌకర్యంగా గొర్రెల దొడ్డిలోనే ఎప్పుడూ ఉండిపోవడం తగదు. దొడ్డి ఖాళీ అయిపోవాలి. గొర్రెలు కొండ చరియల్లో తిరగాలి. పనివాళ్ళు పంట నూర్చడానికి వెనుకాడకూడదు. వెనుకాడితే పండిన పంట పాడైపోతుంది.


నిరుత్సాహపడవద్దు, ఆయన నిన్ను బయటికి పంపిస్తుంటే లోపలే ఉంటాననడం మంచిది కాదు. ప్రేమించే ఆయన చెయ్యి మనల్ని బయటికి తోలుతుందంటే అది మన మంచికే. ఆయన నామం పేరిట పచ్చిక బయళ్లలోకి, సెలయేళ్ళ ఒడ్డుకి, పర్వత శిఖరాల పైకి వెళదాం రండి. మీకు ముందుగా ఆయన నడుస్తాడు. మన కోసం ఏ ఆపద కాచుకొని ఉందో అది ముందు ఆయన కంటబడుతుంది. విశ్వాసం గల హృదయానికి ముందు దారి తీస్తూ వెళ్తున్న ప్రభువు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటాడు. కానీ అలా అయన మన ముందు లేనప్పుడు వెళ్ళడం ప్రమాదకరం. నిన్ను వెళ్ళమని ఆయన ఆదేశించే అనుభవాలన్నింటిలోకి ఆయన ముందుగానే వెళ్ళి ఉన్నాడు అన్న విషయాన్ని గుర్తు చేసుకొని ధైర్యం తెచ్చుకోండి. నీ పాదాలకి ఆ దారులు నువ్వు భరించలేనంత బాధ కలిగిస్తాయనుకుంటే ఆయన నిన్ను వెళ్ళమని చెప్పడు.


ఎప్పుడో భవిష్యత్తులో ఏమవుతుందో అని ఆందోళన చెందకపోవడం, తరువాతి అడుగు ఎక్కడ వెయ్యాలి అని కంగారు పడకపోవడం, దారిని మనమే నిర్ణయించుకోవాలని తాపత్రయం లేకపోవడం, రాబోయే కాలంలో మనం వహించబోయే బాధ్యత గురించిన చింత లేకపోవడం, ఇవన్నీ ధన్యకరమైన జీవితానికి ఉండే లక్షణాలు. అలాటి  గొర్రె తన కాపరి వెనుక ఒక్కొక్క అడుగు వేస్తూ సాగిపోతుంది.


రేపేం జరుగుతుందో తెలియదు

బ్రతుకు బాటలో వేకువింకా కాలేదు

నా నేత్రాలు గమ్యాన్నింకా చూడలేదు

నా ముందు ఆయన నడుస్తున్నాడు 

అందుకు మాత్రం సందేహం లేదు


ప్రమాదాలు వస్తున్నాయి, భయాలు ఎదురవుతున్నాయి

జీవితంలో ఏం రాసి పెట్టి ఉందోనని

మనసులో వణుకు పుట్టుకొస్తున్నది

కాని నేనాయనవాణ్ణి, నాదారి ఏదైనా

నాముందు ఆయన వెళ్తున్నాడు


జీవితంలో ఇక ఆనందాలేమీ లేవంటూ

సందేహాలు మదిలో నీడలు పరుస్తున్నాయి

ఆయన వాక్కు తప్ప నన్ను బలపరిచేది ఏది?

ఆయన్ని వెంబడిస్తున్నానన్న దానికంటే

ధన్యకరమైన నిశ్చయత ఏది?


నా ముందుగా ఆయన వెళ్తున్నాడు

దీని మీదే నా మనసు నిలుపుకున్నాను

నా రక్షణకి అభయం ఇదే

నాకు ముందుగా ఆయన వెళ్తున్నాడు

ఇక నాకంతా క్షేమమే


కాపరులెప్పుడూ గొర్రెల మందకి ముందుగానే నడుస్తారు. ఏదైనా మంద మీద దాడి చెయ్యాలనుకుంటే కాపరిని ఎదుర్కోవలసి ఉంటుంది. మనకి దేవుడే ముందుగా నడుస్తున్నాడు. మనకి రాబోయే 'రేపు'లో దేవుడిప్పుడే ఉన్నాడు. ఆ 'రేపు' గురించే మనుషులంతా దిగులు పెట్టుకునేది. గాని దేవుడు మనకంటే ముందుగా అక్కడికి వెళ్ళాడు. ఆ రేపు అనేది ముందు ఆయన్ని దాటుకోగలిగితేనే మన మీదికి రాగలిగేది.


దేవుడు ప్రతి రేపటిలో ఉన్నాడు

నేను ఈ రోజు కోసమే బ్రతుకుతాను

దారిలో ఉషోదయం నడిపింపు

తప్పకుండా దొరుకుతుందన్న తపనతో

ప్రతి బలహీనతని భరించే సత్తువ

ప్రతి దుఃఖం గెలిచేందుకు  నిబ్బరం

వర్షించిన తరువాత హర్షించే సూర్య రశ్మి

ఆయనిస్తాడన్న  నిత్య నిరీక్షణతో

ఈ రోజు కోసమే బ్రతుకుతాను

-----------------------------------------------------------------------------------------------------------------------------

He putteth forth his own sheep - (John - 10:4 )

    Oh, this is bitter work for Him and us—bitter for us to go, but equally bitter for Him to cause us pain; yet it must be done. It would not be conducive to our true welfare to stay always in one happy and comfortable lot. He, therefore, puts us forth. The fold is deserted, that the sheep may wander over the bracing mountain slope. The laborers must be thrust out into the harvest, else the golden grain would spoil.

    Take heart! it could not be better to stay when He determines otherwise; and if the loving hand of our Lord puts us forth, it must be well. On, in His name, to green pastures and still waters and mountain heights! He goeth before thee. Whatever awaits us is encountered first by Him. Faith’s eye can always discern His majestic presence in front; and when that cannot be seen, it is dangerous to move forward. Bind this comfort to your heart, that the Savior has tried for Himself all the experiences through which He asks you to pass; and He would not ask you to pass through them unless He was sure that they were not too difficult for your feet, or to trying for your strength.

    This is the Blessed Life—not anxious to see far in front, nor care about the next step, not eager to choose the path, nor weighted with the heavy responsibilities of the future, but quietly following behind the Shepherd, one step at a time.


Dark is the sky! and veiled the unknown morrow

Dark is life’s way, for the night is not yet o’er;

The longed-for glimpse I may not meanwhile borrow;

But, this I know, HE GOETH ON BEFORE.


Dangers are nigh! and fears my mind are shaking;

Heart seems to dread what life may hold in-store;

But I am His—He knows the way I’m taking,

More blessed still—HE GOETH ON BEFORE.


Doubts cast their weird, unwelcome shadows o’er me,

Doubts that life’s best—life’s choicest things are o’er;

What but His Word can strengthen, can restore me,

And this blest fact; that still HE GOES BEFORE.


HE GOES BEFORE! Be this my consolation!

He goes before! On this, my heart would dwell!

He goes before! This guarantees salvation!

HE GOES BEFORE! And therefore all is well.

—J. D. Smith


    The Oriental shepherd was always ahead of his sheep. He was down in front. Any attack upon them had to take him into account. Now God is down in front. He is in tomorrow. It is tomorrow that fills men with dread. God is there already. All the tomorrows of our life have to pass Him before they can get to us.  —F. B. M.


“God is in every tomorrow,

Therefore I live for today,

Certain of finding at sunrise,

Guidance and strength for the way;

Power for each moment of weakness,

Hope for each moment of pain,

Comfort for every sorrow,

Sunshine and joy after rain.”

Friday, January 14, 2022

Hardship Makes Character

మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము (రోమా 8:37)


ఇది విజయంకంటే ఇంకా ఎక్కువైంది. ఇది ఎంత సంపూర్ణ విజయమంటే మనం ఓటమిని, వినాశనాన్ని తప్పించుకోవడమే గాక, మన శత్రువుల్ని తుడిచిపెట్టేసి, విలువైన దోపుడు సొమ్ము చేజిక్కించుకొని, అసలు ఈ యుద్ధం వచ్చినందుకు దేవునికి కృతజ్ఞత చెప్పేలా చేసే విజయం. మనం అత్యధిక విజయాన్ని ఎలా పొందగలం? మనకి వచ్చిన సంఘర్షణ ద్వారా మన విశ్వాసాన్ని కట్టుదిట్టం చేసి, మన ఆత్మీయ వ్యక్తిత్వాన్ని స్థిరపరిచే ఆత్మీయ క్రమశిక్షణను ఈ పోరాటాల మూలంగా పొందగలగాలి. ఆత్మీయ జీవితంలో మనం వేళ్ళు పాతుకుని వర్ధిల్లాలంటే శోధన అవసరం. కొండలోయల్లో వీచే బలమైన గాలి ఆ కొండల్లో పెరిగే దేవదారు వృక్షాల వేళ్ళు లోతుగా పాతుకుపోవడానికి కారణమవుతుంది. మన ఆత్మీయ సంఘర్షణలు మన పాలిటి అద్భుత ఆశీర్వాదాలు. మనకి బద్ధశత్రువని మనమనుకునేది నిజానికి దాన్ని ఓడించడానికి మనకి శిక్షణ నిస్తుందన్నమాట. పురాతన కాలంలో ప్రుగియ ప్రాంతంలో ఒక నమ్మకం ఉండేది. వాళ్ళు ఎవరైనా శత్రువుని గెలిచినప్పుడెల్లా గెలిచినవాడు తన చేతిలో ఓడిపోయినవాడి బలాన్నంతటినీ తనలోకి పీల్చుకుంటాడట. ఆ విధంగా అతని తేజస్సు, శక్తి పెరుగుతాయట. అలానే మనమొక శోధనని విజయవంతంగా ఎదుర్కోగలిగితే మన ఆత్మబలం రెట్టింపవుతుంది. ఈ విధంగా మన శత్రువుని ఓడించడమే కాకుండా మన పక్షంగా దాని చేత పనిచేయించుకోవచ్చు. ఫిలిష్తీయుల భుజాల మీద ఎక్కడం గురించి యెషయా మాట్లాడుతాడు (యెషయా 11:14). ఈ ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల బద్ద శత్రువులు. అయితే ఇక్కడ అంటున్నదాని ప్రకారం ఇశ్రాయేలీయులు వాళ్ళని జయంచడమే కాకుండ తమని ఇంకా మిగిలిన విజయాలు పొందడానికి వాహనాలుగా వాళ్ళను ఉపయోగించుకుంటారట. తెలివైన నావికుడు గాలివాటును బట్టి తెరచాపనెత్తి ఆ ప్రకృతి శక్తిని తనకనుకూలంగా వినియోగించుకోవడం లాంటిది ఇది. అలాగే జయాన్ననుగ్రహించే దేవుని కృప మూలంగా మన ఆత్మీయ జీవితాల్లో మనకి విరోధంగా అనిపించేవాటిని అనుకూలంగా మార్చుకోవడం మనకి సాధ్యమే. "నాకు వ్యతిరేకంగా జరిగిన ఈ సంఘటనలు సువార్త వ్యాప్తి కోసమే జరిగాయి” అని ప్రతిసారి చెప్తుండాలి.


కడుపులో చల్ల కదలకుండా ప్రశాంతంగా బ్రతకగలగడం అనేది క్షేమకర జీవితం అని అందరూ అనుకుంటారు. కాని మహాపురుషులైన వాళ్ళ జీవితాలు ఇందుకు వ్యతిరేకంగా చెపుతున్నాయి. కష్టాలను భరించగలగడమే మనిషిని ఉన్నతునిగా చేస్తుంది.  కేవలం బ్రతుకు వెళ్ళబుచ్చడానికి, శక్తివంతమైన నిండు బ్రతుకుకీ తేడా ఇదే. కష్టాలు వ్యక్తిత్వాన్ని పెంచుతాయి.


“మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయనయందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము” (2 కొరింథీ 2:14)

-----------------------------------------------------------------------------------------------------------------------------

In all these things we are more than conquerors through him, that loved us - (Rom - 8:37) 


    This is more than victory. This is a triumph so complete that we have not only escaped defeat and destruction, but we have destroyed our enemies and won a spoil so rich and valuable that we can thank God that the battle ever came. How can we be “more than conquerors”? We can get out of the conflict a spiritual discipline that will greatly strengthen our faith and establish our spiritual character. Temptation is necessary to settle and confirm us in the spiritual life. It is like the fire which burns in the colors of the mineral paint, or like winds that cause the mighty cedars of the mountain to strike more deeply into the soil. Our spiritual conflicts are among our choicest blessings, and our great adversary is used to train us for his ultimate defeat. The ancient Phrygians had a legend that every time they conquered an enemy the victor absorbed the physical strength of his victim and added so much more to his own strength and valor. So temptation victoriously met doubles our spiritual strength and equipment. It is possible thus not only to defeat our enemy but to capture him and make him fight in our ranks. The prophet Isaiah speaks of flying on the shoulders of the Philistines (Isa. 11:14). These Philistines were their deadly foes, but the figure suggested that they would be enabled not only to conquer the Philistines but to use them to carry the victors on their shoulders for further triumphs. Just as the wise sailor can use a headwind to carry him forward by tacking and taking advantage of its impelling force; so it is possible for us in our spiritual life through the victorious grace of God to turn to account the things that seem most unfriendly and unfavorable, and to be able to say continually, “The things that were against me have happened to the furtherance of the Gospel.”  —Life More Abundantly


    A noted scientist observing that “early voyagers fancied that the coral-building animals instinctively built up the great circles of the Atoll Islands to afford themselves protection in the inner parts,” has disproved this fancy by showing that the insect builders can only live and thrive fronting the open ocean, and in the highly aerated foam of its resistless billows. So it has been commonly thought that protected ease is the most favorable condition of life, whereas all the noblest and strongest lives prove on the contrary that the endurance of hardship is the making of the men and the factor that distinguishes between existence and vigorous vitality. Hardship makes character.  —Selected


    “Now thanks be unto God Who always leads us forth to triumph with the Anointed One, and Who diffuses by us the fragrance of the knowledge of Him in every place” (2 Cor. 2:14, literal translation).

Thursday, January 13, 2022

Hedged In


 నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని ఎంచుకొనుడి (యాకోబు 1:2,3)


దేవుడే తన వారికి కొన్ని అవరోధాలు కల్పిస్తాడు. ఇలా కల్పించడం వాళ్ళని క్షేమంగా ఉంచడానికే.  అయితే వాళ్ళు దాన్ని వ్యతిరేకమైన దృష్టితోనే చూస్తారు. ఆయన్ను అపార్ధం చేసుకుంటారు. యోబు కూడా అంతే (యోబు 3:23). ఇలాటి కంచెల వలన వాళ్ళకి చేకూరే లాభం సైతానుకి బాగా తెలుసు. యోబు 1:10లో కంచెని గూర్చి సైతాను అంటున్న మాటలు చూడండి. మనల్ని కప్పేసే ప్రతి శ్రమలోను ఎంతో కొంత ఆదరణ తప్పకుండా ఉంటుంది. మనం వాటిని ఆనుకుంటే తప్ప ముళ్ళు గుచ్చుకోవు. దేవుడి ఆజ్ఞ లేకుండా ఒక్క ముల్లు కూడా నీకు గుచ్చుకోదు. నిన్ను బాధపెట్టిన మాటలు, ఆవేదనపాలు చేసిన ఉత్తరం, నీ ప్రియ మిత్రుడు చేసిన గాయం, చేతిలో డబ్బులేక పడిన ఇబ్బంది, అన్నీ దేవుడికి తెలుసు. ఎవ్వరికీ లేనంత సానుభూతి ఆయనకి నీపట్ల ఉంది. ఆ బాధలన్నింటిలోను ఆయనపై సంపూర్ణంగా ఆనుకుంటున్నావా, లేదా అన్నది ఆయన చూస్తాడు. 


ముళ్ళకంప హద్దుపై నిలిచి అడ్డగిస్తుంది 

ఆకు రాలే కాలంలో ప్రతి కొమ్మా 

పొడుచుకొచ్చిన ముళ్ళతో 

గుడ్లురిమి చూస్తుంది 


వసంతం వస్తుంది, మోళ్ళు  చిగురిస్తాయి 

కొమ్మలన్నీ పచ్చగా ముస్తాబౌతాయి 

భయపెట్టిన కంటకాలన్నీ

పత్రహరితం మాటున దాక్కుంటాయి 


కలతలు మనల్ని కలవరపెడతాయి 

కాని మన ఆత్మలు చెదిరిపోకుండా 

మనం పెద్ద ప్రమాదంలో పడకుండా 

దేవుని కృపలే అడ్డుకుంటాయి 


నరకానికి మన పరుగును ఆపలేవు 

గులాబీ పూదండల బంధకాలు 

కసిగా గుచ్చుకునే కటికముళ్ళే ఆపగలవు 

నాశనానికి చేసే పయనాన్ని 


కాటేసి నెత్తురు చిందించే ముళ్ళ పోటుకి 

ఉలిక్కిపడి ఏడ్చి గోలపెడతాము          

దేవుడు వేసిన కంచెల కాఠిన్యం 

మనకి జఠిలంగానే ఉంటుంది


సర్వేశ్వరుడు చల్లగా చేసే వసంతం 

సణుగుడులన్నీ సర్దుకుంటాయి 

గుచ్చిన ముళ్లన్నీ చిగురిస్తాయి 

శాంతి ఫలాలు విరగ గాస్తాయి 


మన దారిని సరిచేసిన ముళ్ళ కొరకు 

పాడదాం ప్రభువుకి కీర్తనలు 

కృప, తీర్పు కలగలిపిన కంచెల కొరకు 

ఆనందం నిండిన ఆవేదన కొరకు

----------------------------------------------------------------------------------------------------------------------------

My brothers and sisters, consider it nothing but joy when you fall into all sorts of trials because you know that the testing of your faith produces endurance - (James - 1:2-3)

God hedges in His own that He may preserve them, but oftentimes they only see the wrong side of the hedge, and so misunderstand His dealings. It was so with Job (Job 3:23). Ah, but Satan knew the value of that hedge! See his testimony in chapter 1:10. Through the leaves of every trial, there are chinks of light to shine through. Thorns do not prick you unless you lean against them, and not one touches without His knowledge. The words that hurt you, the letter which gave you pain, the cruel wound of your dearest friend, shortness of money—are all known to Him, who sympathizes as none else can and watches to see, if, through all, you will dare to trust Him wholly.


“The hawthorn hedge that keeps us from intruding,

Looks very fierce and bare

When stripped by winter, every branch protruding

Its thorns would wound and tear.


“But spring-time comes, and like the rod that budded,

Each twig breaks out in green;

And cushions soft of tender leaves are studded,

Where spines alone were seen,


“The sorrows, that to us seem so perplexing,

Are mercies kindly sent

To guard our wayward souls against sadder vexing,

And greater ills prevent.


“To save us from the pit, no screen of roses

Would serve for our defense,

The hindrance that completely interposes

Stings back like a thorny fence.


“At first when smarting from the shock, complaining

Of wounds that freely bleed,

God’s hedges of severity us paining,

May seem severe indeed.


“But afterward, God’s blessed spring-time cometh,

And bitter murmurs cease;

The sharp severity that pierced us bloometh,

And yields the fruits of peace.


“Then let us sing, our guarded way thus wending

Life’s hidden snares among,

Of mercy and of judgment sweetly blending;

Earth’s sad, but lovely song.”