నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని ఎంచుకొనుడి (యాకోబు 1:2,3)
దేవుడే తన వారికి కొన్ని అవరోధాలు కల్పిస్తాడు. ఇలా కల్పించడం వాళ్ళని క్షేమంగా ఉంచడానికే. అయితే వాళ్ళు దాన్ని వ్యతిరేకమైన దృష్టితోనే చూస్తారు. ఆయన్ను అపార్ధం చేసుకుంటారు. యోబు కూడా అంతే (యోబు 3:23). ఇలాటి కంచెల వలన వాళ్ళకి చేకూరే లాభం సైతానుకి బాగా తెలుసు. యోబు 1:10లో కంచెని గూర్చి సైతాను అంటున్న మాటలు చూడండి. మనల్ని కప్పేసే ప్రతి శ్రమలోను ఎంతో కొంత ఆదరణ తప్పకుండా ఉంటుంది. మనం వాటిని ఆనుకుంటే తప్ప ముళ్ళు గుచ్చుకోవు. దేవుడి ఆజ్ఞ లేకుండా ఒక్క ముల్లు కూడా నీకు గుచ్చుకోదు. నిన్ను బాధపెట్టిన మాటలు, ఆవేదనపాలు చేసిన ఉత్తరం, నీ ప్రియ మిత్రుడు చేసిన గాయం, చేతిలో డబ్బులేక పడిన ఇబ్బంది, అన్నీ దేవుడికి తెలుసు. ఎవ్వరికీ లేనంత సానుభూతి ఆయనకి నీపట్ల ఉంది. ఆ బాధలన్నింటిలోను ఆయనపై సంపూర్ణంగా ఆనుకుంటున్నావా, లేదా అన్నది ఆయన చూస్తాడు.
ముళ్ళకంప హద్దుపై నిలిచి అడ్డగిస్తుంది
ఆకు రాలే కాలంలో ప్రతి కొమ్మా
పొడుచుకొచ్చిన ముళ్ళతో
గుడ్లురిమి చూస్తుంది
వసంతం వస్తుంది, మోళ్ళు చిగురిస్తాయి
కొమ్మలన్నీ పచ్చగా ముస్తాబౌతాయి
భయపెట్టిన కంటకాలన్నీ
పత్రహరితం మాటున దాక్కుంటాయి
కలతలు మనల్ని కలవరపెడతాయి
కాని మన ఆత్మలు చెదిరిపోకుండా
మనం పెద్ద ప్రమాదంలో పడకుండా
దేవుని కృపలే అడ్డుకుంటాయి
నరకానికి మన పరుగును ఆపలేవు
గులాబీ పూదండల బంధకాలు
కసిగా గుచ్చుకునే కటికముళ్ళే ఆపగలవు
నాశనానికి చేసే పయనాన్ని
కాటేసి నెత్తురు చిందించే ముళ్ళ పోటుకి
ఉలిక్కిపడి ఏడ్చి గోలపెడతాము
దేవుడు వేసిన కంచెల కాఠిన్యం
మనకి జఠిలంగానే ఉంటుంది
సర్వేశ్వరుడు చల్లగా చేసే వసంతం
సణుగుడులన్నీ సర్దుకుంటాయి
గుచ్చిన ముళ్లన్నీ చిగురిస్తాయి
శాంతి ఫలాలు విరగ గాస్తాయి
మన దారిని సరిచేసిన ముళ్ళ కొరకు
పాడదాం ప్రభువుకి కీర్తనలు
కృప, తీర్పు కలగలిపిన కంచెల కొరకు
ఆనందం నిండిన ఆవేదన కొరకు
----------------------------------------------------------------------------------------------------------------------------
My brothers and sisters, consider it nothing but joy when you fall into all sorts of trials because you know that the testing of your faith produces endurance - (James - 1:2-3)
God hedges in His own that He may preserve them, but oftentimes they only see the wrong side of the hedge, and so misunderstand His dealings. It was so with Job (Job 3:23). Ah, but Satan knew the value of that hedge! See his testimony in chapter 1:10. Through the leaves of every trial, there are chinks of light to shine through. Thorns do not prick you unless you lean against them, and not one touches without His knowledge. The words that hurt you, the letter which gave you pain, the cruel wound of your dearest friend, shortness of money—are all known to Him, who sympathizes as none else can and watches to see, if, through all, you will dare to trust Him wholly.
“The hawthorn hedge that keeps us from intruding,
Looks very fierce and bare
When stripped by winter, every branch protruding
Its thorns would wound and tear.
“But spring-time comes, and like the rod that budded,
Each twig breaks out in green;
And cushions soft of tender leaves are studded,
Where spines alone were seen,
“The sorrows, that to us seem so perplexing,
Are mercies kindly sent
To guard our wayward souls against sadder vexing,
And greater ills prevent.
“To save us from the pit, no screen of roses
Would serve for our defense,
The hindrance that completely interposes
Stings back like a thorny fence.
“At first when smarting from the shock, complaining
Of wounds that freely bleed,
God’s hedges of severity us paining,
May seem severe indeed.
“But afterward, God’s blessed spring-time cometh,
And bitter murmurs cease;
The sharp severity that pierced us bloometh,
And yields the fruits of peace.
“Then let us sing, our guarded way thus wending
Life’s hidden snares among,
Of mercy and of judgment sweetly blending;
Earth’s sad, but lovely song.”
No comments:
Post a Comment