అప్పుడు పెద్ద తుఫాను రేగెను (మార్కు 4:37)
జీవితంలో కొన్ని కొన్ని తుఫాన్లు హఠాత్తుగా వస్తాయి. ఓ గొప్ప ఆవేదన, భయంకరమైన నిరాశ, లేక అణగదొక్కేసే అపజయం. కొన్ని క్రమక్రమంగా వస్తాయి. అవి దూరాన కనిపించే మనిషి చెయ్యి అంత మేఘంలా ప్రారంభమై, ఇది చిన్నదే కదా అని అనుకుంటుండగానే ఆకాశమంతా కమ్ముకుని మనల్ని ముంచెత్తుతుంది.
అయితే ఇలాంటి తుఫాను వేళల్లో దేవుడు మనల్ని సేవకు సిద్ధపరుస్తాడు. దేవునికొక దేవదారు వృక్షం అవసరమైతే ఆయన దాన్ని మైదానంలో నాటుతాడు. పెనుగాలులు దాన్ని వణికిస్తాయి. వర్షం దాన్ని మర్దిస్తుంది. ఈ పోరాటాల్లో నే ఆ చెట్టుకి కావలసిన చేవను అది సంపాదించుకుని అరణ్యం మొత్తానికే రాజవుతుంది.
దేవుడు ఒక మనిషిని ఎన్నుకున్నప్పుడు ఆయన అతన్ని తుఫానులో నిలబెడతాడు. ఒక మనిషి విజయం సంపాదించడం అనేది చాలా కఠినమైన పరీక్షలతో కూడుకొని ఉంటుంది. ఏ మనిషీ “తుఫానుకు ఎదురు నిలిచి గెలవకుండా” మనిషి అనిపించుకోలేడు. ప్రభూ, నన్ను పగులగొట్టు. తిరిగి నీ చేతులతో తయారు చెయ్యి అని తాను చేసిన ప్రార్థన సార్థకం కాకుండా ఎవడూ పునీతుడు కాలేడు.
ఒక ఫ్రెంచి కళాకారుడు తన అపార మేధా శక్తిని ఉపయోగించి ఒక చిత్రాన్ని గీశాడు. ఆ బొమ్మలో గొప్ప గొప్ప వేదాంతులు, అమరవీరులు, ప్రపంచంలో అన్ని రంగాల్లోనూ ప్రఖ్యాతి గాంచిన మహామహులంతా ఉన్నారు. అయితే ఆ చిత్రం ప్రత్యేకత ఏమిటంటే వాళ్ళు విశ్వవిఖ్యాతి చెందడానికి ముందు కష్టాల్లో ఆరితేరినవాళ్లు. ఆ బొమ్మలో అందరికంటే ముందుగా వాగ్దానం వల్ల వారసత్వంగా లభించిన కనానుకు చేరలేకపోయిన మోషే ఉన్నాడు. అతని ప్రక్కన తడుములాడుతూ కళ్ళు లేని హోమర్, మిల్టన్ ఉన్నారు. వీళ్లందరి ప్రక్కన ఉన్నతునిగా కనిపిస్తున్న మరొక వ్యక్తి ఉన్నాడు. ఆయన ముఖంలో వీరెవ్వరి ముఖంలోనూ కనిపించని బాధ కనిపిస్తున్నది. ఆ కళాఖండానికి ‘తుఫాను’ అనే పేరు సరిగ్గా సరిపోతుంది.
తుఫాను తరువాతే ప్రకృతిలోని అసలు అందం బయటపడుతుంది. పర్వతానికి ఉన్న కరుకు సౌందర్యం తుఫాను సమయంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అలాగే మనుషుల్లో మహాత్ములైన వాళ్ళ జీవితాలన్నీ తుఫానుల తాకిడికి రాటుదేరినవే.
నీ జీవితంలో కూడా పెనుగాలులు విసిరి నిన్ను అటూ ఇటూ కొట్టాయి. వాటన్నిటి వలన నువ్వు పగిలిపోయి, అలసిపోయి లోయలో మట్టికరిచావా? లేక ఆ పెనుగాలులు నిన్ను మరింత మెరుగుపెట్టి నీ వ్యక్తిత్వానికి ఔన్నత్యాన్ని సంపాదించిపెట్టాయా? తుఫాను తాకిడులకు అలసిసొలసి ఉన్న వాళ్లంటే సానుభూతిని నీలో రేకెత్తించాయా?
దేవుడు నాటిన వృక్షాన్ని ఏ ప్రభంజనమూ కదిలించలేదు
గాలి రేగినా, కొమ్మలు ఊగినా ఆ చెట్టుకు మాత్రం మరింత పట్టు
భూమి లోతుల్లో వేరు తన్నే మహా వృక్షంగా
దేవుని పోషణలో అది శాఖోపశాఖలై పల్లవిస్తుంది
ప్రభువు గుర్తించే పాదసాన్ని కదిలించే తుఫాను లేదు
ఉరుములు మెరుపులు వడిగా కురిసిన పిడుగుల సవ్వడి
ఎంత రేగినా ఏమీ కాదు
దేవుడు నాటిన ఆ దివ్య వృక్షము
నిలకడగా ఉంటుంది, నిత్యం పుష్పిస్తుంది
----------------------------------------------------------------------------------------------------------------------------
And there arose a great storm - (Mark 4:37)
Some of the storms of life come suddenly: a great sorrow, a bitter disappointment, a crushing defeat. Some come slowly. They appear upon the ragged edges of the horizon no larger than a man’s hand, but, trouble that seems so insignificant spreads until it covers the sky and overwhelms us.
Yet it is in the storm that God equips us for service. When God wants an oak He plants it on the moor where the storms will shake it and the rains will beat down upon it, and it is in the midnight battle with elements that the oak wins its rugged fiber and becomes the king of the forest.
When God wants to make a man He puts him into some storm. The history of manhood is always rough and rugged. No man is made until he has been out into the surge of the storm and found the sublime fulfillment of the prayer: “O God, take me, break me, make me.”
A Frenchman has painted a picture of universal genius. There stand orators, philosophers, and martyrs, all who have achieved pre-eminence in any phase of life; the remarkable fact about the picture is this: Every man who is pre-eminent for his ability was first pre-eminent for suffering. In the foreground stands that figure of the man who was denied the promised land, Moses. Beside him is another, feeling his way—blind Homer. Milton is there, blind and heartbroken. Now comes the form of one who towers above them all. What is His characteristic? His Face is marred more than any man's. The artist might have written under that great picture, “The Storm.”
The beauties of nature come after the storm. The rugged beauty of the mountain is born in a storm, and the heroes of life are the storm-swept and the battle-scarred.
You have been in the storms and swept by the blasts. Have they left you broken, weary, beaten in the valley, or have they lifted you to the sunlit summits of a richer, deeper, more abiding manhood and womanhood? Have they left you with more sympathy with the storm-swept and the battle-scarred? —Selected
The wind that blows can never kill
The tree God plants;
It bloweth east, it bloweth west,
The tender leaves have little rest,
But any wind that blows is best.
The tree that God plants
Strikes deeper root grows higher still,
Spreads greater boughs, for God’s goodwill
Meets all its wants.
There is no storm hath power to blast
The tree God knows;
No thunderbolt, nor beating rain,
Nor lightning flash, nor hurricane;
When they are spent, it doth remain,
The tree God knows,
Through every tempest standeth fast,
And from its first day to its last
Still, fairer grows. —Selected