Tuesday, February 1, 2022

Quietness

 

ఆయన సమాధానము కలుగజేయును (యోబు 34:29)

తుఫాను ఊపేసే వేళ సమాధానం! ఆయనతో మనం సముద్రాన్ని దాటుతున్నాము. సముద్రం మధ్య, తీరానికి దూరంగా, చీకటి ఆకాశం క్రింద, హఠాత్తుగా పెద్ద తుపాను రేగింది. నింగీ, నేల ఏకమై ఎదురు నిలిచినట్టు హోరుగాలి, వర్షం, లేచే ప్రతి అలా మనల్ని మింగేసేటట్టు ఉంది. అప్పుడాయన నిద్ర లేస్తాడు. గాలిని, అలలను గద్దిస్తాడు. విలయతాండవం చేసే ప్రకృతిని తన చెయ్యి చాపి నిమ్మళింపజేస్తాడు. గాలివేసే వికృతమైన ఈలలకు పైగా, పడి లేచే పెను కెరటాల హోరుకంటే బిగ్గరగా ఆయన స్వరం వినిపిస్తుంది “ప్రశాంతంగా ఉండండి.” నీకు ఆ స్వరం ఎప్పుడైనా వినిపించిందా? వెంటనే గొప్ప ప్రశాంతత అలుముకుంటుంది. ఆయన సమాధానం కలుగజేస్తాడు. మనలను మనం ఓదార్చుకోలేని సమయాల్లో తన సమాధానాన్ని మనకిస్తాడు. మన సంతోషాలు, మన ఆదర్శాలు, ఆశయాలు వీటన్నిటిని చూసుకుని మనం తృప్తి పడుతుంటాము. కాని ఆయన కృప చొప్పున మనం వీటన్నిటికీ ఆయనకీ ఉన్న తేడా గుర్తించగలిగేలా మనకి సహాయం చేస్తాడు. మనల్ని చేరదీసి తాను మనతోనే ఉన్నాడన్న ధైర్యాన్ని కలిగిస్తాడు. మన మనస్సులోను, హృదయంలోను అంతులేని నిశ్చలత పరచుకుంటుంది. సమాధానాన్నిస్తాడాయన.


ఎవరి పాదాలు బాధల బాటను నడిచాయో

ఎవరి హస్తాలు మన కలతలను మోసాయో 

అన్నా! ఆయనే మనకి శాంతినిస్తాడు 

మన నష్టాన్నే లాభంగా చేస్తాడు. 


నీ దీవెనలన్నిటిలో ఆదరణలన్నిటిలో

ప్రభూ, నే కోరుకునేదొక్కటే

మోగుతున్న యుద్ధభేరుల మధ్య

నీ స్వరం వినాలనీ, విశ్రాంతి పొందాలనీ


పిల్లగాలులు వీచే విశ్వాసపు శుభ దినాన

భయాలు నా ప్రశాంతతను భంగపరచవు

చీకటి మూసిన దారుల్లో చేతిలో చేతితో

నీ వెంట సాగితే శోకాలు నన్నంటవు


చీకట్లు సమసే ఉదయం వస్తుంది

ఇది తెలిసి ఆశతో ఎదురు చూస్తాను

అశాంతిగా మార్చగలవారెవరు

నువ్విచ్చిన నిత్యశాంతిని?

-----------------------------------------------------------------------------------------------------------------------------

He giveth quietness - (Job  - 34:29)

     Quietness amid the dash of the storm. We sail the lake with Him still; and as we reach its middle waters, far from land, under midnight skies, suddenly a great storm sweeps down. Earth and hell seem arrayed against us, and each billow threatens to overwhelm. Then He arises from His sleep, and rebukes the winds and the waves; His hand waves benediction and repose over the rage of the tempestuous elements. His voice is heard above the scream of the wind in the cordage and the conflict of the billows, “Peace, be still!” Can you not hear it? And there is instantly a great calm. “He giveth quietness.” Quietness amid the loss of inward consolations. He sometimes withdraws these, because we make too much of them. We are tempted to look at our joy, our ecstasies, our transports, or our visions, with too great complacency. Then love for love’s sake withdraws them. But, by His grace, He leads us to distinguish between them and Himself. He draws nigh and whispers the assurance of His presence. Thus an infinite calm comes to keep our heart and mind. “He giveth quietness.”

“He giveth quietness.” O Elder Brother,

Whose homeless feet have pressed our path of pain,

Whose hands have borne the burden of our sorrow,

That in our losses we might find our gain.


“Of all Thy gifts and infinite consolings,

I ask but this: in every troubled hour

To hear Thy voice through all the tumults stealing,

And rest serenely beneath its tranquil power.


“Cares cannot fret me if my soul be dwelling

In the still air of faith’s untroubled day;

Grief cannot shake me if I walk beside thee,

My hand in Thine along the darkening way.


“Content to know there comes a radiant morning

When from all shadows I shall find release,

Serene to wait for the rapture of its dawning—

Who can make trouble when Thou sendest peace?”

Monday, January 31, 2022

Refreshing Dew

 

చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతనికుందును (హోషేయ 14:5) 

మంచు కురవడం వల్ల ఎంత తాజాదనం! భూమిని నూతన పరచడానికి ఇది ప్రకృతి అందించే కానుక. మంచు రాత్రిలో కురుస్తుంది. ఇది లేకుంటే మొక్కలు ఎదగవు. బైబిల్లో ఈ మంచుకున్న విలువకి గుర్తింపు ఉంది. దీన్ని ఆత్మీయ తాజాదనానికి సాదృశ్యంగా వాడారు. ప్రకృతి మంచును కురిపించినట్టే దేవుడు తన ప్రజలకు క్రొత్త శక్తిని ఉత్సాహాన్ని ఇస్తుంటాడు. తీతు 3:5లో ఈ ఆత్మీయ తాజాదనాన్ని గురించిన ప్రసక్తి పరిశుద్ధాత్ముని పరిచర్య గురించి చెప్పే సందర్భంలో కనిపిస్తుంది. "పరిశుద్ధాత్మ నూతన స్వభావమును కలుగజేయును."

చాలామంది దైవ సేవకులు కూడా ఈ పరలోకపు మంచు కున్న ప్రాముఖ్యత గురించి పట్టించుకోరు. అందువల్ల వాళ్లలో స్వచ్ఛత, చురుకుదనం ఉండవు. ఆధ్యాత్మిక మంచు లేకపోవడంతో వాళ్ల ఆత్మలు తోటకూరకాడల్లాగా వేలాడుతూ ఉంటాయి. 

నాతోటి సేవకులారా, భోజనం చేయకుండా శ్రమించి పని చేస్తుంటే కూలివాడి గతి ఏమవుతుందో మీకు తెలుసు కదా. అలానే పరలోకపు మన్నాను తినకుండా తన తోటివారికి వాక్య పరిచర్య చేయబూనుకునేవాళ్ల గతి కూడా అంతే. అప్పుడప్పుడూ ఆత్మీయాహారం తీసుకుంటామంటే కుదరదు. ప్రతినిత్యం పరిశుద్ధాత్మ సహాయంతో నువ్వు నూతనత్వం పొందాలి. నీలో ప్రతి అణువు జీవంతో ఉట్టిపడుతూ ఉరకలేస్తున్న స్థితికీి, నువ్వు నీరసించిపోయి కళ్ళు తేలేసిన స్థితికీ తేడా నీకే తెలుస్తుంది గదా. నిశ్చలమైన ధ్యానం, వాక్యాన్ని వంటబట్టించుకునే శ్రద్ధ నీ మీద మంచు కురవడానికి సహాయం చేస్తాయి. రాత్రివేళల్లో ఆకులన్నీ నిశ్చలంగా ఉన్నపుడు వాటి రంద్రాలు తెరుచుకుని ఆకాశపు మంచును జుర్రుకుంటాయి. ఆత్మసంబంధమైన మంచు దేవుని సన్నిధిలో నిర్మలమైన ధ్యానంవల్ల నీ మీద కురుస్తుంది. ఆయన సన్నిధిలో ధ్యాన ముద్ర వహించు. తొందరపాటు మంచును అడ్డగిస్తుంది. నీ ఆకులన్నీ మంచులో తడిసేదాకా ఆయన సన్నిధిలో వేచి ఉండు. ఆ పైన నీ విధి నిర్వహణకు తాజాదనంతో క్రీస్తులో చురుకుదనంతో ఉత్సాహంతో బయలుదేరి వెళ్ళు.  

వేడిమి గాని, గాలి గాని ఉన్నపుడు మంచు కురవదు, వాతావరణం చల్లారాలి.  గాలి స్తంభించాలి. పరిసరాలన్నీ చల్లగా, నిశ్చలంగా అయిపోతేనే గాని గాలిలోని తేమ మంచు ముత్యాలుగా మారి ఆకులమీద, పువ్వుల మీద కురవదు. అలానే మనిషి హృదయం కూడా ఆ ప్రశాంత గంభీర ముద్ర వహించి మౌనంగా, నిశ్చలంగా ఉన్నపుడే పరిశుద్ధాత్మ ఆ హృదయంలోకి దిగి వస్తాడు.


నీ నిశ్చలత్వపు మంచు కురిపించు

ప్రభూ నా అసహనాన్ని ఖండించు

కదులుతూ మెదులుతూ కలవరపడే

నా మనస్సులో నీ శాంతిని స్థాపించు


కోరికలతో వేసారిన నా హృదయంలోకి

నీ చల్లని ఊపిరి పంపించు

భూకంప అగ్నిజ్వాలల్లో

వినబడే నీ కోమల స్వరాన్ని వినిపించు

-----------------------------------------------------------------------------------------------------------------------------

I will be as the dew unto Israel - (Hos - 14:5 )

     The dew is a source of freshness. It is nature’s provision for renewing the face of the earth. It falls at night, and without it, the vegetation would die. It is this great value of the dew which is so often recognized in the Scriptures. It is used as the symbol of spiritual refreshing. Just as nature is bathed in dew, so the Lord renews His people. In Titus 3:5 the same thought of spiritual refreshing is connected with the ministry of the Holy Ghost—“renewing of the Holy Ghost.”

    Many Christian workers do not recognize the importance of the heavenly dew in their lives, and as a result, they lack freshness and vigor. Their spirits are drooping for lack of dew.

    Beloved fellow-worker, you recognize the folly of a laboring man attempting to do his day’s work without eating. Do you recognize the folly of a servant of God attempting to minister without eating the heavenly manna? Nor will it suffice to have spiritual nourishment occasionally. Every day you must receive the renewing of the Holy Ghost. You know when your whole being is pulsating with the vigor and freshness of Divine life and when you feel jaded and worn. Quietness and absorption bring the dew. At night when the leaf and blade are still, the vegetable pores are open to receive the refreshing and invigorating bath; so spiritual dew comes from quiet lingering in the Master’s presence. Get still before Him. Haste will prevent your receiving the dew. Wait before God until you feel saturated with His presence; then go forth to your next duty with the conscious freshness and vigor of Christ.  —Dr. Pardington

    Dew will never gather while there is either heat or wind. The temperature must fall, and the wind ceases, and the air come to a point of coolness and rest—absolute rest, so to speak—before it can yield up its invisible particles of moisture to bedew either herb or flower. So the grace of God does not come forth to rest the soul of man until the still point is fairly and fully reached.

“Drop Thy still dews of quietness,

Till all our strivings cease:

Take from our souls the strain and stress;

And let our ordered lives confess

The beauty of Thy peace.


“Breathe through the pulses of desire

Thy coolness and Thy balm;

Let sense be dumb, its beats expire:

Speak through the earthquake, wind, and fire,

O still small voice of calm!”

Sunday, January 30, 2022

Unshaken in Christ

 

దేవుడు ఆ పట్టణములోనున్నాడు. దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు (కీర్తన 46: 5)

“దానికి చలనము లేదు” అనే మాట ఎంత ధన్యకరమైన మాట! ఈ లోకపు ఒడిదుడుకులు అన్నిటికీ అంత తేలికగా చలించిపోయే మనం, మన ప్రశాంతతను ఏదీ భంగం చేయలేని స్థితికి చేరుకోగలమా? అవును, ఇది సంభవమే. ఈ సంగతి అపొస్తలుడైన పౌలుకు తెలుసు. యెరూషలేముకి వెళ్ళబోతున్నపుడు అక్కడ తన కోసం “బంధకములు, శ్రమలు" కాచుకొని ఉన్నాయని తెలిసినా “ఈ విషయాలేమీ నన్ను కదిలించవు" అంటూ ధైర్యంగా చెప్పగలిగాడు. పౌలు జీవితంలోనూ, అనుభవంలోనూ గతించిపోదగిన బలహీనతలన్నీ గతించిపోయాయి. ఇక అతడు జీవితాన్ని గాని జీవితాశలను గానీ ప్రియంగా ఎంచుకోవడం లేదు. దేవుడు మన జీవితాల్లో చేయదలచుకున్నదాన్ని చెయ్యనిస్తే మనం కూడా అలాంటి స్థితికి చేరుకోగలం. అప్పుడు చికాకు పరిచే చిన్న చిన్న అవరోధాలు గాని, బాధ పెట్టే బరువైన శ్రమలు గానీ మన ఊహకందని ప్రశాంతతకు భంగం కలిగించలేవు. దేవుని మీద ఆనుకోవడం నేర్చుకున్నవాళ్ళకి బహుమానం ఇదే.

“జయించేవాడిని నా దేవుని మందిరంలో మూలస్థంభంగా చేస్తాను. అతణ్ణి అక్కడినుండి కదిలించడం ఎవరికీ సాధ్యం కాదు." దేవుని గుడిలో స్థంభంగా అచంచలంగా ఉండగలిగే ధన్యతను అందుకోవడం కోసం మనల్ని అక్కడికి తీసుకొచ్చేటప్పుడు కలిగే కుదుపులను భరించగలగాలి.


దేవుడు ఒక రాజ్యంలో లేక నగరంలో ఉంటే అది సీయోను పర్వతంలాగా స్థిరంగా ఉంటుంది. అలాగే ఆయన ఒక హృదయంలో ఉంటే దానికి ఇరువైపుల నుండి ఆపదలు చుట్టుముట్టి సముద్రపు హోరులాగా ఘోష పెట్టినప్పటికీ, ఆ హృదయంలో మాత్రం గొప్ప ప్రశాంతత నెలకొని ఉంటుంది. అలాటి ప్రశాంతతను ప్రపంచంలోని ఏ శక్తీ ఇవ్వలేదు. ఏ శక్తీ లాగేసుకోలేదు. ప్రతి చిన్న ప్రమాదపు గాలి వీచినప్పుడు కూడా మనుషుల హృదయాలు ఆకులా వణికిపోతాయెందుకు? దేవుడు ఉండవలసిన వాళ్ళ హృదయాల్లో లోకం ఉన్నందువల్లనే కదా. దాన్ని తొలగించి దాని స్థానంలో దేవుణ్ణి ప్రతిష్టించడమే కదా కావలసింది.


ప్రభువులో విశ్వాసముంచేవాళ్ళు సీయోను పర్వతంలాగా కదలక సిరులై ఉంటారు. మనల్ని బలపరిచే పాతకాలపు పద్యం ఒకటి ఉంది

నమ్మికతో దేవుణ్ణి ఆశ్రయించేవాళ్ళు

సీయోను శిఖరంలా నిలబడతారు నిండుగా

అది తొణకదు బెణకదు గడగడ వణకదు 

ఇనుములా, ఉక్కులా నిలిచే ఉంటుంది మొండిగా

-----------------------------------------------------------------------------------------------------------------------------

God is in the midst of her; she shall not be moved: God shall help her, and that right early - (Ps  - 46:2,3,5)

    “Shall not be moved”—what an inspiring declaration! Can it be possible that we, who are so easily moved by the things of earth, can arrive at a place where nothing can upset us or disturb our calm? Yes, it is possible; and the Apostle Paul knew it. When he was on his way to Jerusalem where he foresaw that “bonds and afflictions” awaited him, he could say triumphantly, “But none of these things move me.” Everything in Paul’s life and experience that could be shaken had been shaken, and he no longer counted his life, or any of life’s possessions, dear to him. And we, if we will but let God have His way with us, may come to the same place, so that neither the fret and tear of little things of life nor the great and heavy trials, can have the power to move us from the peace that passeth understanding, which is declared to be the portion of those who have learned to rest only on God.

    “He that overcometh will I make a pillar in the temple of my God, and he shall go no more out.” To be as immovable as a pillar in the house of our God, is an end for which one would gladly endure all the shakings that may be necessary to bring us there!  —Hannah Whitall Smith

    When God is amid a kingdom or city He makes it as firm as Mount Zion, that cannot be removed. When He is amid a soul, though calamities throng about it on all hands, and roar like the billows of the sea, yet there is a constant calm within, such a peace as the world can neither give nor take away. What is it but want of lodging God in the soul, and that in His stead the world is in men’s hearts, that makes them shake like leaves at every blast of danger?  —Archbishop Leighton

    “They that trust in the Lord shall be as mount Zion, which cannot be removed, but abideth for ever.” There is a quaint old Scottish version that puts iron into our blood:


“Who sticketh to God in stable trust

As Zion’s mount, he stands full just,

Which moveth no whit, nor yet doth reel,

But standeth forever as stiff as steel!”