Friday, February 4, 2022

Suddenness of Change

 

వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసికొనిపోయెను - (మార్కు 1:12).

దేవుడు చేసే మేళ్ళకి ఇది విచిత్రమైన ఉదాహరణ. వెంటనే...అంటే దేని వెంటనే? ఆకాశం చీలి పరిశుద్ధాత్మ పావురంలాగా క్రీస్తు మీదికి దిగివచ్చి, తండ్రి దీవెన వాక్యం “నీవు నా ప్రియ కుమారుడవు, నీయందు నేనానందించుచున్నాను" అంటూ వినిపించిన వెంటనే. ఇది అసాధారణమైన అనుభవమేమీ కాదు. నీ ఆత్మకి కూడా ఇలాటి అనుభవాలు కొత్తేమీ కాదు. నీ మనసు ఉత్సాహంతో గాలిలో తేలిన మరుక్షణమే దిగులుతో పాతాళానికి క్రుంగిపోయిన సందర్భాలు లేవా? నిన్ననే ఆకాశంతో ఆడుకుంటూ ఉదయ కిరణాలతో ఊసులాడింది నీ హృదయం. ఈ రోజు దాని రెక్కలు ముడుచుకున్నాయి. దాని నోరు మూతబడింది. మధ్యాహ్నం తండ్రి చిరునవ్వుతో కేరింతలు కొట్టావు. సాయంత్రమయ్యేసరికి అరణ్య ప్రాంతాల్లో తిరుగుతూ “నా దారి దేవునికి కనుమరుగైంది” అని నిట్టూరుస్తున్నావు.

'వెంటనే' అనే మాటలోని ఆదరణని గమనించావా? దీవెన వెంటనే ఎడబాటు ఎందుకు కలగాలి? ఇంత త్వరగా కష్టం కలగడమే మనకి నిశ్చయత కలుగజేస్తున్నది. ఎలాగంటే దీవెన వెంటనే కష్టం వాటిల్లింది కాబట్టి ఆ కష్టం కూడా మారువేషంలో ఉన్న దీవెనన్న మాట. నువ్వు అరణ్యాలలోను, గెత్సెమనే తోటలలోను, కల్వరిలోను ధైర్యవంతుడివిగా ఉండాలని దేవుడు తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపజేస్తాడు. నువ్వింకా లోతుల్లోకి దిగగలగాలని నిన్ను పైకెత్తి నీకు బలాన్నిస్తాడు. అసహాయులకి సహాయం చెయ్యడానికిగాను నిన్ను రాత్రి చీకటిలోకి పంపనుద్దేశించి నిన్ను వెలిగిస్తాడు.

అరణ్యంలోకి పోవడానికి అన్ని వేళల్లోనూ నీకు శక్తి చాలదు. యొర్దాను నది ఒడ్డున మహిమానుభవం పొందిన మరుక్షణంలోనే నీకు ఆ శక్తి ఉంటుంది. బాప్తిస్మం లోని తేజస్సే నిన్ను అరణ్యంలోని ఆకలిని తట్టుకునేలా చెయ్యగలదు. ఆశీర్వాదాల తరువాత వచ్చేవి పోరాటాలే.

ఆధ్యాత్మిక జీవితాన్ని స్థిరపరచి దాన్ని అనేక రెట్లు అభివృద్ది చెందించే పరీక్షలు సామాన్యమైనవి కావు. ఆ సమయాల్లో నరకమే దిగివచ్చినట్టు ఉంటుంది. మన ఆత్మ వలలో చిక్కుకుపోయినట్టుగా అనిపిస్తుంది. దేవుడు మనల్ని సైతాను చేతికి అప్పగించాడని అర్థమవుతుంది. అయితే ఆత్మకు దేవుణ్ణే కాపరిగా ఉంచుకున్న వాళ్ళకి ఈ అనుభవం ఒక ఘనవిజయానికి దారి తీస్తుంది. శోధన తరువాత కాలమంతా జీవితానికి అరవై రెట్లు ప్రయోజనం కనిపిస్తుంది.

----------------------------------------------------------------------------------------------------------------------------

And immediately the Spirit driveth him into the wilderness - (Mark  - 1:12)

      It seemed a strange proof of Divine favor. “Immediately.” Immediately after what? After the opened heavens and the dove-like peace and the voice of the Father’s blessing, “Thou art my beloved Son, in whom I am well pleased.” It is no abnormal experience. Thou, too, has passed through it, O my soul. Are not the times of thy deepest depression just the moments that follow thy loftiest flight? Yesterday thou went soaring far in the firmament, and singing in the radiance of the morn; today thy wings are folded and thy song silent. At noon thou went basking in the sunshine of a Father’s smile; at eve thou art saying in the wilderness, “My way is hidden from the Lord.”

    Nay, but, my soul, the very suddenness of the change is proof that it is not revolutionary.

    Hast thou weighed the comfort of that word “immediately”? Why does it come so soon after the blessing? Just to show that it is the sequel to the blessing. God shines on thee to make thee fit for life’s desert-places—for its Gethsemanes, for its Calvaries. He lifts thee up that He may give thee strength to go further down; He illuminates thee that He may send thee into the night, that He may make thee help to the helpless.

    Not at all times art thou worthy of the wilderness; thou art only worthy of the wilderness after the splendors of Jordan. Nothing but Son’s vision can fit thee for the Spirit’s burden; only the glory of the baptism can support the hunger of the desert.  —George Matheson

    After benediction comes to battle.

    The time of testing that marks and mightily enriches a soul’s spiritual career is no ordinary one, but a period when all hell seems let loose, a period when we realize our souls are brought into a net when we know that God is permitting us to be in the devil’s hand. But it is a period which always ends in certain triumph for those who have committed the keeping of their souls to Him, a period of marvelous “nevertheless afterward” of abundant usefulness, the sixty-fold that surely follows.  —Aphra White

Thursday, February 3, 2022

Lessons in the Shadow

 తన చేతి నీడలో నన్ను దాచియున్నాడు; నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసి పెట్టియున్నాడు - (యెషయా 49:2).

“నీడలో”. ఎంత మంచి మాట ఇది! మనమందరం నీడలోకి ఏదో ఒక సమయంలో వెళ్ళాలి. ఎండ కళ్ళను మిరుమిట్లు గొలుపుతుంది. కళ్ళు దెబ్బ తింటాయి. ప్రకృతి వర్ణాలను, వివిధ రంగుల్ని గుర్తుపట్టే శక్తిని కోల్పోతాయి. వ్యాధికి లోనై మసక చీకటి కమ్మిన గదిలోనో, మన వాళ్ళెవరన్నా చనిపోతే దుఃఖఛాయలు కమ్మిన ఇంట్లోనో కొన్నాళ్ళు ఉండాలి.

కాని భయపడవద్దు, అవి దేవుని చేతి నీడలే. ఆయనే నిన్ను నడిపిస్తున్నాడు. నీడలో మాత్రమే నేర్చుకోగలిగిన పాఠాలు కొన్ని ఉన్నాయి.

ఆయన వదనాన్ని చూపించే చిత్రం చీకటి గదిలోనే వ్రేలాడుతుంది. చీకటిలో ఉండి ఆయన నిన్ను పక్కకి నెట్టేస్తాడని అనుకోవద్దు సుమీ. నువ్వింకా ఆయన అంబుల పొదిలోనే ఉన్నావు. పనికిరానిదాన్ని పారేసినట్టు ఆయన నిన్ను పారెయ్యలేదు.

సమయం వచ్చేదాకా నిన్నలా ఉంచుతున్నాడు. సమయం వచ్చినప్పుడు గురిపెట్టి నిన్ను పంపాలనుకున్న చోటికి రివ్వున వదులుతాడు. తద్వారా ఆయన మహిమ పొందుతాడు. నీడల్లో, ఒంటరితనంలో కాలం గడుపుతున్న వాళ్ళలారా, అంబులపొది విలుకాడి వీపుకి ఎంత గట్టిగా కట్టేసి ఉంటుందో తెలుసుకదా. చెయ్యిచాపితే అందేలా ఉంటుంది. దాన్ని అతనెప్పుడూ పోగొట్టుకోడు.

కొన్ని సందర్భాలలో చీకటి స్థితిలో ఎక్కువ ఎదుగుదల ఉంటుంది. మొక్కజొన్న ఎండాకాలపు వెచ్చని రాత్రుళ్ళలో పెరిగినంత వేగంగా మరెప్పుడూ పెరగదు. మధ్యాహ్నపుటెండలో దీని ఆకులు వంకీలు తిరిగి ముడుచుకుపోతాయి. కాని ఏదన్నా మబ్బు సూర్యుణ్ణి కమ్మగానే తిరిగి తెరుచుకుంటాయి. వెలుగులో లేని శ్రేష్ఠత కొన్నిసార్లు నీడలో ఉంటుంది. ఆకాశంలో రాత్రి వ్యాపించినప్పుడే నక్షత్రలోకం సాక్షాత్కరిస్తుంది. సూర్యరశ్మిలో వికసించని పూలు కొన్ని రాత్రివేళ విరబూస్తాయి. అలాగే మామూలు సమయాల్లో మనకు కనబడని సద్గుణాలెన్నో కష్టకాలాల్లో స్పష్టంగా బయటికి కనిపిస్తాయి.


బ్రతుకునిండా ఎండలే మండిపోతే

ముఖం కమిలి వాడిపోతుంది

చల్లని చిరువాన జల్లులు పడితే 

అది నవజీవంతో కళకళ లాడుతుంది.

-----------------------------------------------------------------------------------------------------------------------------

In the shadow of his hand hath he hid me, and made me a polished shaft: in his quiver hath he hid me - (Isa  - 49:2 )

     “In the shadow.” We must all go there sometimes. The glare of the daylight is too brilliant; our eyes become injured, and unable to discern the delicate shades of color, or appreciate neutral tints—the shadowed chamber of sickness, the shadowed house of mourning, the shadowed life from which the sunlight has gone.

    But fear not! It is the shadow of God’s hand. He is leading thee. Some lessons can be learned only there.

    The photograph of His face can only be fixed in the dark chamber. But do not suppose that He has cast thee aside. Thou art still in His quiver; He has not flung thee away as a worthless thing.

    He is only keeping thee close till the moment comes when He can send thee most swiftly and surely on some errand in which He will be glorified. Oh, shadowed, solitary ones, remember how closely the quiver is bound to the warrior, within easy reach of the hand, and guarded jealously.  —Christ in Isaiah, Meyer

    In some spheres, the shadow condition is the condition of greatest growth. The beautiful Indian corn never grows more rapidly than in the shadow of a warm summer night. The sun curls the leaves in the sultry noon light, but they quickly unfold, if a cloud slips over the sky. There is a service in the shadow that is not in the shine. The world of stellar beauty is never seen at its best till the shadows of night slip over the sky. Some beauties bloom in the shade that will not bloom in the sun. There is much greenery in lands of fog and clouds and shadow. The florist has “evening glories” now, as well as “morning glories.” The “evening glory” will not shine in the noon’s splendor, but comes to its best as the shadows of evening deepened.


If all of life were sunshine,

Our faces would be fain

To feel once more upon them

The cooling plash of rain.

—Henry Van Dyke

Wednesday, February 2, 2022

This Thing is From Me

 

జరిగినది నా వలననే జరిగెను - (1రాజులు 12:24).

 “బ్రతుకులోని నిరాశలన్నీ దేవుని ప్రేమ విశేషాలే” అని రెవ. సి.ఎ.ఫాక్స్ గారు అన్నారు.

 దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. "ప్రియ కుమారుడా, ఈ రోజు నీకోసం ఒక సందేశాన్ని తీసుకొచ్చాను. దాన్ని నీ చెవిలో చెప్పనీ. ముసురుకుంటున్న కారుమబ్బులను అది మహిమ రథాలుగా మార్చేస్తుంది. నీ అడుగు పడబోతున్న ఇరుకు దారుల్ని మృదువుగా చేస్తుంది. ఈ సందేశంలో మూడు మాటలే ఉన్నాయి. దాన్ని నీ అంతరంగంలోకి ఇంకిపోనీ. నీ తలగడగా అది ఉపయోగపడనీ. ఆ సందేశమేమంటే జరిగినది నా వలననే జరిగెను.”

నీవెప్పుడన్నా ఆలోచించావా? నీకు సంబంధించిన వాటన్నిటిలో నా బాధ్యత కూడా ఉంది. “మిమ్మల్ని ముట్టుకున్నవాడు నా కనుగుడ్డును ముట్టుకున్నాడు” (జెకర్యా 2:8). (స్వేచ్ఛానువాదం). “నీవు నా దృష్టికి ప్రియుడవు” (యెషయా 43:4). అందుకని నీకు సంగతులన్నీ తెలియజెప్పడం నాకెంతో ఇష్టం.

నిన్ను శోధనలెప్పుడు అటకాయిస్తాయో నీకు తెలియజేస్తాను. శత్రువు ఎప్పుడు వరదలాగ వచ్చిపడతాడో చెప్తాను. ఇవన్నీ నావల్లనే జరుగుతాయి. నీ బలహీనతకి నాశక్తిని జోడిస్తాను. నీపక్షంగా నన్ను యుద్దం చెయ్యనివ్వడంలోనే నీకు క్షేమముంది.


నిన్ను అపార్థం చేసుకునే మనుష్యుల మధ్య కష్టకాలంలో ఉంటున్నావా? వాళ్ళు నిన్ను లెక్కచేయకుండా నిన్ను ఓ మూలకి నెట్టేస్తున్నారా? ఇదంతా చేయిస్తున్నది నేనే. ఈ పరిస్థితులన్నిటికీ ప్రభువుని నేనే. నువ్విప్పుడున్న చోటికి రావడమన్నది ఎవరి ప్రమేయం లేకుండా జరిగింది కాదు. నేను నీ కోసం నిర్దేశించిన స్థానమే ఇది.

విధేయతను నేర్పమని అడిగావు కదూ. ఆ పాఠం నేర్పే బడిలో నిన్నుంచాను. నీ పరిసరాలు, పరిస్థితులు నా ఇష్టాన్ని నెరవేరుస్తున్నాయి.

గడ్డు పరిస్థితుల్లో ఉన్నావా? నువ్వు గడించేది పొట్టకూటికే సరిపోవడం లేదా? ఇదంతా నా వలననే జరుగుతున్నది. నీ మనీ పర్సు నా చేతిలోనే ఉంది. నా మీద ఆధారపడి నా దగ్గర్నుండి డబ్బు తీసుకో. నా సంపదకి అంతులేదు (ఫిలిప్పీ 4:19). నా వాగ్దానాలను స్వంతం చేసుకో. “మీ దేవుడైన యెహోవాయందు మీరు విశ్వాస ముంచలేదు” (ద్వితీ 1:33) అనే మాట నీపట్ల నిజం కానివ్వకు.

శోకాల చీకటిలో ఉన్నావా? నేనే దానికి కారకుణ్ణి. నేను చింతలెన్నిటినో అనుభవించాను. దుఃఖమంటే ఏమిటో నాకు బాగా తెలుసు. ఇహలోకపు ఆదరణలు నీకు సహాయపడకుండా చేశాను. ఎందుకంటే నా వైపుకి తిరగడం ద్వారా నీకు శాశ్వతమైన ఓదార్పు కలుగుతుంది (2 థెస్స 2:16,17). నా కోసం ఓ గొప్ప కార్యాన్ని తలపెట్టి ఇప్పుడు బాధలో, నీరసంలో, రోగిగా ఉన్నావా? ఇది నావలన జరిగినదే. నువ్వు హడావిడిగా తిరుగుతున్న రోజుల్లో నీకు ఏదైనా చెప్పాలంటే సాధ్యపడలేదు. నీకు కొన్ని లోతైన అనుభవాలను నేర్పుదామనుకున్నాను. ఊరక నిలిచి చూస్తుండే వాళ్ళు కూడా తమ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నవారే. నా సేవకుల్లో గొప్పవాళ్ళు చాలామందిని పనిచెయ్యనివ్వకుండా కొంతకాలం అలా ఉంచాను. తద్వారా ప్రార్థన అనే ఆయుధాన్ని ఉపయోగించడం వాళ్ళు నేర్చుకున్నారు.

ఈనాడు నీ చేతుల్లో ఈ నూనెపాత్రను పెడుతున్నాను. ఉచితంగా దాన్ని వాడుకో. నీకెదురయ్యే ప్రతి పరిస్థితినీ, నిన్ను గాయపరిచే ప్రతి మాటనీ, నిన్ను సహనం కోల్పోయేలా చేసే ప్రతి ఆలస్యాన్నీ, నీ బలహీనతని నువ్వు గ్రహించిన ప్రతి సమయాన్నీ ఆ నూనెతో అభిషేకించు. అన్ని విషయాల్లోనూ నా జోక్యాన్ని నువ్వు అర్థం చేసుకున్నట్టయితే నీలో కలుక్కుమనే బాధ ఉండదు.


“ఇది నావలనే" అన్నాడు రక్షకుడు

వంగి నా నుదురు ముద్దు పెట్టుకున్నాడు

నిన్ను ప్రేమిస్తున్నవాడే దీన్ని చేసాడు

నన్ను నమ్మి ఇప్పటికి ఓపిక పట్టు 

 

నీ అవసరాలు తెలుసు నీ తండ్రికి

నీకు దొరకనివాటి కోసం బాధపడకు

నేను పంపేవే నీకు క్షేమ కారకాలు

నీళ్ళు నిండిన కళ్ళతో వేడుకున్నాను.


ప్రియ ప్రభూ క్షమించు, గ్రహించలేకపోయాను

నేను వెళ్ళే ప్రతి దారిలో నాకంటే ముందు నీ పాదాలు వెళ్ళాయి

నా క్షేమానికి ఇదే సరైనది, అందుకే పాడతాను

నీ కృప నాకు సరిపోతుంది, నువ్వేర్పరచినదే నాకతిమధురం

-----------------------------------------------------------------------------------------------------------------------------

This thing is from me - (1 Kgs - 12:24)

    “Life’s disappointments are veiled love’s appointments.”  —Rev. C. A. Fox

    My child, I have a message for you today; let me whisper it in your ear, that it may gild with glory any storm clouds which may arise, and smooth the rough places upon which you may have to tread. It is short, only five words, but let them sink into your inmost soul; use them as a pillow upon which to rest your weary head. This thing is from Me.

    Have you ever thought of it, that all that concerns you concerns Me too? For, “he that toucheth you, toucheth the apple of mine eye” (Zech. 2:8). You are very precious in My sight. (Isa. 43:4) Therefore, it is My special delight to educate you.

    I would have you learn when temptations assail you, and the “enemy comes in like a flood,” that this thing is from Me, that your weakness needs My might, and your safety lies in letting Me fight for you.

    Are you in difficult circumstances, surrounded by people who do not understand you, who never consult your taste, who put you in the background? This thing is from Me. I am the God of circumstances. Thou camest not to thy place by accident, it is the very place God meant for thee.

    Have you not asked to be made humble? See then, I have placed you in the very school where this lesson is taught; your surroundings and companions are only working out My will.

    Are you in money difficulties? Is it hard to make both ends meet? This thing is from Me, for I am your purse-bearer and would have you draw from and depend upon Me. My supplies are limitless (Phil.4:19). I would have you prove my promises. Let it not be said of you, “In this thing ye did not believe the Lord your God” (Deut. 1:32).

    Are you passing through a night of sorrow? This thing is from Me. I am the Man of Sorrows and acquainted with grief. I have let earthly comforters fail you, that by turning to Me you may obtain everlasting consolation (2 Thess. 2:16, 17). Have you longed to do some great work for Me and instead have been laid aside on a bed of pain and weakness? This thing is from Me. I could not get your attention in your busy days and I want to teach you some of my deepest lessons. “They also serve who only stand and wait.” Some of My greatest workers are those shut out from active service, that they may learn to wield the weapon of all—prayer.

    This day I place in your hand this pot of holy oil. Make use of it free, my child. Let every circumstance that arises, every word that pains you, every interruption that would make you impatient, every revelation of your weakness be anointed with it. The sting will go as you learn to see Me in all things.  —Laura A. Barter Snow


“’ This is from Me,’ the Saviour said,

As bending low He kissed my brow,

’For One who loves you thus has led.

Just rest in Me, be patient now,

Your Father knows you need this,

Tho’, why perchance you cannot see.

Grieve not for things you’ve seemed to miss.

The thing I send is best for thee.’


“Then, looking through my tears, I plead,

’Dear Lord, forgive, I did not know,

’Twill not be hard since Thou dost tread,

Each path before me here below.

And for my good, this thing must be,

His grace was sufficient for each test.

So still I’ll sing, ”Whatever be

God’s way for me is always best.“’”