Monday, February 28, 2022

Alone With God

యాకోబు ఒక్కడు మిగిలిపోయెను;  ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను - (ఆది 32:24)

ఒక్కడే మిగిలిపోయాడు. ఈ మాటలు మన ఒక్కొక్కరిలో ఎంత భిన్నమైన అనుభవాలను గుర్తుకు తెస్తున్నాయి! కొందరికి ఒంటరితనం, చింత గుర్తొస్తాయి. కొందరికి ప్రశాంతత, విశ్రాంతి స్ఫురిస్తాయి. దేవుడు లేకుండా ఒక్కడే మిగిలిపోవడం చాలా భయంకరమైన స్థితి! కాని దేవునితో ఒంటరిగా ఉండడం పరలోకపు ఆనందానికి మారు పేరు. దేవునికి చెందినవాళ్ళు ఎక్కువ సమయాన్ని ఒంటరిగా ఆయనతో గడపగలిగితే, గతంలో లాగా ఈ కాలంలో కూడా ఆత్మలో వీరులైనవారు మనకి ఉంటారు.

మన ప్రభువే మనకి మాదిరి. దేవునితో ఒంటరిగా గడపడానికి క్రీస్తు ఎన్నిసార్లు వెళ్ళేవాడో గమనించండి. 'మీరు ప్రార్థించేటప్పుడు మీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థించండి' అని ఆయన ఆజ్ఞాపించడంలో చాలా గొప్ప ప్రయోజనముంది.

ఏలీయా, ఎలీషాలు దేవునితో ఒంటరిగా ఉన్నప్పుడే అద్భుత కార్యాలు జరిగాయి. యాకోబు దేవునితో ఒంటరిగా ఉన్నందువల్లే రాజవంశానికి మూలపురుషుడయ్యాడు. మనం కూడా కాగలం. దేవుడతణ్ణి దర్శించినప్పుడు యెహోషువ ఒంటరిగా ఉన్నాడు (యెహోషువ 1:1). గిద్యోను, యెఫ్తా ఒంటరిగా ఉన్నప్పుడే ఇశ్రాయేలును రక్షించమని వాళ్ళకి ఆజ్ఞ వచ్చింది (న్యాయాధి 6:11; 11:29). అరణ్యంలో మండే పొద దగ్గర మోషే ఒక్కడే ఉన్నాడు (నిర్గమ 3:1-5). దేవదూత కొర్నేలి దగ్గరకి వచ్చినప్పుడు అతను ఒక్కడే ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడు (అపొ.కా. 10:2). పేతురు అన్యుల దగ్గరకి వెళ్ళమని ఆజ్ఞ వచ్చినప్పుడు మిద్దె మీద అతనితో ఎవరూ లేరు. బాప్తిస్మమిచ్చే యోహాను అరణ్యంలో ఒక్కడే ఉన్నాడు (లూకా 1:8).  ప్రియ శిష్యుడైన యోహాను పత్మసులో ఒంటరిగా దేవునికి సన్నిహితంగా ఉన్నాడు (ప్రకటన 1:9).

దేవునితో ఒంటరితనాన్ని కోరుకోండి. మనం ఆశీర్వాదాలు పొందితేనే ఇతరులకి ఆశీర్వాదకారణంగా ఉంటాము. ఒంటరి ప్రార్థనను మనం నిర్లక్ష్యం చేస్తే మనల్ని మనమే నష్టపరచుకోవడం కాకుండా ఇతరులకి దీవెనలందకుండా చేసిన వాళ్ళమవుతాము. ఒంటరి ప్రార్థనల వల్ల బయట మనం చేసే పని తగ్గవచ్చు. అయితే మనలోని శక్తి నూరంతలు పెరుగుతుంది. ఫలితంగా మనుషులు క్రీస్తునే మనలో చూస్తారు.

ఒంటరి ప్రార్థన ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా అతిశయోక్తి కాదు.

మౌనంగా ప్రభు సన్నిధిని

ఎన్నికైన భక్తులు ఏకాంతాన

ధ్యానించక పోతే

ఎంత చేసినా సఫలం కావు

ఎంచదగ్గ దైవకార్యాలు

-----------------------------------------------------------------------------------------------------------------------------

And Jacob was left alone; and there wrestled a man with him until the breaking of the day - (Gen - 32:24)

Left alone! What different sensations those words conjure up to each of us. To some they spell loneliness and desolation, to others rest and quiet. To be left alone without God, would be too awful for words, but to be left alone with Him is a foretaste of Heaven! If His followers spent more time alone with Him, we should have spiritual giants again.

The Master set us an example. Note how often He went to be alone with God; and He had a mighty purpose behind the command, “When thou prayest, enter into thy closet, and when thou hast shut thy door, pray.”

The greatest miracles of Elijah and Elisha took place when they were alone with God. It was alone with God that Jacob became a prince; and just there that we, too, may become princes—“men (aye, and women too!) wondered at” (Zech. 3:8). Joshua was alone when the Lord came to him. (Josh. 1:1) Gideon and Jephthah were by themselves when commissioned to save Israel. (Judges 6:11 and 11:29) Moses was by himself at the wilderness bush. (Exodus 3:1-5) Cornelius was praying by himself when the angel came to him. (Acts 10:2) No one was with Peter on the house top, when he was instructed to go to the Gentiles. (Acts 10:9) John the Baptist was alone in the wilderness (Luke 1:90), and John the Beloved alone in Patmos, when nearest God. (Rev. 1:9)

Covet to get alone with God. If we neglect it, we not only rob ourselves, but others too, of blessing, since when we are blessed we are able to pass on blessing to others. It may mean less outside work; it must mean more depth and power, and the consequence, too, will be “they saw no man save Jesus only.”

To be alone with God in prayer cannot be over-emphasized.

“If chosen men had never been alone,  

In deepest silence open-doored to God,  

No greatness ever had been dreamed or done.”

Sunday, February 27, 2022

More Than Sufficient

 

నా కృప నీకు చాలును - (2 కొరింథీ 12:9). 

ఒకరోజు కష్టపడి పనిచేసి తిరిగి వెళ్తున్నాను. చాలా అలసటగా ఉంది. చాలా నీరసించిపోయి ఉన్నాను. హఠాత్తుగా మెరుపు మెరిసినట్లు ఈ వాక్యం నాకు తోచింది. "నా కృప నీకు చాలును." ఇంటికి చేరి నా బైబిలు తీసి చూసాను. నా కృప నీకు చాలును. నిజమే ప్రభూ. ఒక్కసారి ఆనందంతో గట్టిగా నవ్వు వచ్చింది. అబ్రాహాము ఎందుకు నవ్వుకుంటూ ఉండేవాడో అప్పుడు అర్ధం అయింది. అపనమ్మకం అనేది ఉందని కూడా నమ్మశక్యం కాలేదు. ఆ క్షణంలో ఎలా అనిపించిందంటే ఒక చిన్న చేపకి దాహం వేసింది వేసిందట. నీళ్లు తాగితే నదిలో నీళ్లన్నీ అయి పోతాయేమోనని భయపడిందట ఆ చేప. ఇలా ఉంది నా పరిస్థితి. గోదావరి అంటుంది, "ఓ చిన్న చేపా, నీ దాహం తీర్చుకో, నాలోని నీళ్లు నీకు చాలు". లేదా ఏడు సంవత్సరాల సమృద్ధి తరువాత ఓ చిట్టెలుక తాను కరువుతో చనిపోతానేమోనని భయపడినట్టుంది. యోసేపు దానితో అంటాడు "ఓ చిట్టెలుకా దిగులుపడకు, నా ధాన్యపు కొట్టులోనిది నీకు చాలు." ఇంకా ఆలోచిస్తే ఒక మనిషి పర్వతం మీద నిలబడి అనుకుంటున్నాడు "ప్రతీసారి నేను ఇంత గాలి పీల్చుకుంటున్నాను. వాతావరణంలోని ఆక్సిజన్ అంతా అయిపోతుందేమో." అయితే భూమి అంటుంది "ఓ మనిషీ, నీ ఇష్టం వచ్చినంత గాలితో మీ ఊపిరితిత్తుల్ని నింపుకో. నా చుట్టూ ఆవరించి ఉన్న వాతావరణం నీకు సరిపోతుంది."

ఓ సోదరులారా! నమ్మకం ఉంచండి. కొంచెం పాటి విశ్వాసం మీ హృదయాలను పరలోకానికి తీసుకువెళ్తుంది. గొప్ప విశ్వాసమైతే పరలోకాన్నే మీ హృదయాల్లోకి తీసుకు వస్తుంది.


ఘనకార్యాలు చేయించే

గొప్ప కృప దేవునిది

హృదయాన్ని ముంచెత్తే కెరటాలు

ఊపిరాడనియ్యని పెనుగాలులు 

అలవిగాని విపరీతాలు కూడివచ్చినా

దేవుని కృప చాలు


చిన్న పనులు చేసిపెట్టే

గొప్ప కృప దేవునిది

చిరాకు పెట్టే చిన్న చిన్న దిగుళ్ళు

జోరీగల హోరు పెట్టే శోధనలు

మనశ్శాంతిని పాడు చేసే ముళ్ళు

అన్నింటినీ మరిపిస్తాయి ఆయన కృపా పరవళ్ళు


పరలోకపు బొక్కసంలో మన పేరున పేరున చాలా మొత్తం ఉంది. విశ్వాసాన్ని చూపించి ఆ డబ్బును తీసుకోవచ్చు. ఇష్టం వచ్చినంత తీసుకోండి.

-----------------------------------------------------------------------------------------------------------------------------

My grace is sufficient for thee - (2 Cor - 12:9)

The other evening I was riding home after a heavy day’s work. I felt very wearied, and sore depressed, when swiftly, and suddenly as a lightning flash, that text came to me, “My grace is sufficient for thee.” I reached home and looked it up in the original, and at last, it came to me in this way, “MY grace is sufficient for thee”; and I said, “I should think it is, Lord,” and burst out laughing. I never fully understood what the holy laughter of Abraham was until then. It seemed to make unbelief so absurd. It was as though some little fish, being very thirsty, was troubled about drinking the river dry, and Father Thames said, “Drink away, little fish, my stream is sufficient for thee.” Or, it seemed after the seven years of plenty, a mouse feared it might die of famine; and Joseph might say, “Cheer up, little mouse, my granaries are sufficient for thee.” Again, I imagined a man away up yonder, in a lofty mountain, saying to himself, “I breathe so many cubic feet of air every year, I fear I shall exhaust the oxygen in the atmosphere,” but the earth might say, “Breath away, O man, and fill the lungs ever, my atmosphere is sufficient for thee.” Oh, brethren, be great believers! Little faith will bring your souls to Heaven, but great faith will bring Heaven to your souls. —C. H. Spurgeon


His grace is great enough to meet the great things  

The crashing waves that overwhelm the soul,  

The roaring winds that leave us stunned and breathless,  

The sudden storm is beyond our life’s control.  


His grace is great enough to meet the small things  

The little pin-prick troubles that annoy,  

The insect worries, buzzing and persistent,  

The squeaking wheels that grate upon our joy.  

—Annie Johnson Flint


There is always a large balance to our credit in the bank of Heaven waiting for our exercise of faith in drawing it. Draw heavily upon His resources.

Saturday, February 26, 2022

Enter Into Your Inheritance

 మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను - (యెహోషువ 1:3).

క్రీస్తు కోసం మనం ఇంతవరకు ఆక్రమించుకోలేని స్థలాల సంగతి మాత్రమే కాక, ఇంతవరకు మనం స్వతంత్రించుకోని అనేకమైన వాగ్దానాలు ఇంకా అలాగే ఉండిపోయాయి. దేవుడు యెహోషువాతో ఏం చెప్పాడు? 'మీరు అడుగుపెట్టే ప్రతి స్థలాన్నీ నేను మీకిచ్చాను.' అటు తరువాత వాగ్దాన దేశాన్ని గురించిన వివరాలనిచ్చాడు. అదంతా వాళ్ళదే. కాని ఒక్క షరతు. వాళ్ళు ఆ దేశమంతటా అటు నుంచి ఇటు చివరిదాకా తిరగాలి‌, తమ పాదాలతో దాన్ని కొలవాలి.

అయితే మూడింట ఒక వంతు కంటే ఎక్కువ ప్రదేశాన్ని వాళ్ళు తిరిగి చూడలేదు. అందుకే మూడింట ఒక వంతు భాగమే వాళ్ళ స్వాధీనమైంది. వాళ్ళు తమ పాదాలతో కొలిచి చూసినదే వాళ్ళకి దక్కింది.

పేతురు రాసిన 2వపత్రిక లో మన కోసం తెరిచి ఉన్న వాగ్దత్త దేశం గురించి చదువుతాము. మనం విధేయత, విశ్వాసాలనే అడుగులతో వాటిని కొలిచి, విధేయత గల నమ్మికతో,  దాన్నంతటినీ మన స్వంతం చేసుకోవాలని దేవుని చిత్తం.

మనలో ఎంతమందిమి క్రీస్తుపేరట దేవుని వాగ్దానాలను స్వాధీనం చేసుకొన్నాము?

విశ్వాస భూమి ఎంతో విస్తరించి ఉంది. దాని కొనల వరకు నడిచివెళ్ళి మొత్తాన్ని స్వాధీనపరచుకోవాలి.

మన స్వాస్థ్యం మొత్తాన్ని మనం చేజిక్కించుకుందాం.  ఉత్తరానికి, దక్షిణానికీ మన కన్నులెత్తుదాం. తూర్పు పడమరలను పరికించి చూద్దాం. "నీకు కనిపించే నేలంతటినీ నీకిస్తాను" అంటున్నాడు దేవుడు.

యూదా ఎక్కడెక్కడైతే తన కాలు మోపాడో అదంతా అతనిదే. బెన్యామీను ఎంత దూరం తిరిగితే అంత దూరమూ అతని స్వంతమే. ప్రతివాడూ వెళ్ళి తన అడుగుపెట్టడం ద్వారా తన స్వాస్థ్యాన్ని పొందాలి. వీళ్ళెవరైనా ఒక చోటులో పాదమూనారంటే వాళ్ళ మనసులో ఒక నిశ్చయత ఏర్పడిపోతుంది. 'ఈ భూమి నాదే.'

దానియేలు అనే ఒక నీగ్రో వృద్ధుడు కృపలో గొప్ప అనుభవం ఉన్నవాడు. అతన్ని ఒకసారి ఎవరో అడిగారు "దానియేలు, భక్తిలో నీకు అంత సంతోషం, శాంతి ఎలా దొరుకుతున్నాయి?" అతను జవాబిచ్చాడు. 'అతి శ్రేష్టమైన, విలువైన వాగ్దానాల మీద నేను బోర్లాపడిపోతాను. వాటిలో ఉన్నవన్నీ నావే. ఎంత సంతోషం!" అవును వాగ్దానాల మీద బోర్లా పడిపోయి వాటిల్లోని ఐశ్వర్యానంతటినీ కౌగలించుకుంటే అవన్నీ మనవే.

-----------------------------------------------------------------------------------------------------------------------------

Every place that the sole of your foot shall tread upon, that have I given unto you - (Josh - 1:3)

Beside the literal ground, unoccupied for Christ, there is the unclaimed, untrodden territory of Divine promises. What did God say to Joshua? “Every place that the sole of your foot shall tread upon, that have I given unto you,” and then He draws the outlines of the Land of Promise—all theirs on one condition: that they shall march through the length and breadth of it, and measure it off with their own feet.

They never did that to more than one-third of the property, and consequently, they never had more than one-third; they had just what they measured off, and no more.

In 2 Peter, we read of the “land of promise” that is opened up to us, and it is God’s will that we should, as it were, measure off that territory by the feet of obedient faith and believing obedience, thus claiming and appropriating it for our own.

How many of us have ever taken possession of the promises of God in the name of Christ?

Here is a magnificent territory for faith to lay hold on and march through the length and breadth, and faith has never done it yet.

Let us enter into all our inheritance. Let us lift up our eyes to the north and to the south, to the east and to the west, and hear Him say, “All the land that thou seest will I give to thee.” —A. T. Pierson

Wherever Judah should set his foot that should be his; wherever Benjamin should set his foot, that should be his. Each should get his inheritance by setting his foot upon it. Now, think you not, when either had set his foot upon a given territory, he did not instantly and instinctively feel, “This is mine”?

An old colored man, who had a marvelous experience in grace, was asked: “Daniel, why is it that you have so much peace and joy in religion?” “O Massa!” he replied, “I just fall flat on the exceeding great and precious promises, and I have all that is in them. Glory! Glory!” He who falls flat on the promises feels that all the riches embraced in them are his. —Faith Papers

The Marquis of Salisbury was criticized for his Colonial policies and replied: “Gentlemen, get larger maps.”