Friday, March 4, 2022

The Price of Freedom

అప్పుడు అది (అపవిత్రాత్మ) కేకవేసి, వానినెంతో విలవిలలాడించి వదలిపోయెను. - (మార్కు 9:26).

దురాత్మ చివరిదాకా పోరాడకుండా ఎప్పుడూ తన స్థానాన్ని వదిలి వెళ్ళడు. మనం కూడా సరదాగా కాలక్షేపం చెయ్యడం మూలాన ఏలాటి ఆత్మీయమైన మేలును పొందలేము. కాని యుద్ధరంగంలో నిలిచి పోరాడితేనే మనకు రావలసినదాన్ని దక్కించుకోగలం. ఆత్మీయంగా కూడా ఇదే వర్తిస్తుంది. ఆత్మీయ స్వాతంత్ర్యాన్ని ఆశించిన ప్రతి విషయంలోనూ రక్తాన్ని కార్చవలసి ఉంది. నెమ్మదిగా వాదిస్తే సాతాను పారిపోడు. దారికి అడ్డంగా పరుచుకుని నిలబడే ఉంటాడు. మనం కన్నీళ్ళు, రక్తం కార్చి మన దారిని సుగమం చేసుకోవాలి. ఇది మనం గుర్తుంచుకోలేకపోతే మనకున్న ఇతర భారాలకి ఈ అజ్ఞాన భారాన్ని చేర్చుకున్న వాళ్ళమవుతాము. మనం తిరిగి పుట్టింది శిశు సంరక్షణా కేంద్రాల్లోన్ని మెత్తని పట్టు పరుపులో పడుకోవడానికి కాదు. ఆరుబయట నిలబడి తుపాను తాకిడిని తట్టుకోవడానికే, దాని బీభత్సంలోనుంచి మన శక్తిని జుర్రుకోవడానికే మనం క్రీస్తులో మళ్ళీ జన్మించాం. ఘోర శ్రమల ద్వారా దేవుని రాజ్యంలో ప్రవేశించాలి.

చెరసాల, ఖడ్గం, అగ్నిగుండం

అన్నిటికీ ఎదురు నిలిచిన

మన తండ్రుల విశ్వాసం 

ఈ మాటలు వింటే మనకెంత గర్వం

మన తండ్రుల విశ్వాసం, పరిశుద్ధ విశ్వాసం

దానికి వారసులమవుదాం


చీకటి కొట్టుల్లో గొలుసులతో కట్టారు వాళ్లను

గానీ వాళ్ళ మనసులు, ఆత్మలు స్వతంత్రాలే

వారి సంతానం ఆదే దారిన వెళ్ళగలిగితే

ఎంత మేలు! అది వాళ్ళకెంత క్షేమం!

-----------------------------------------------------------------------------------------------------------------------------

And the spirit cried, and rent him sore, and came out of him - (Mark - 9:26)

Evil never surrenders its hold without a sore fight. We never pass into any spiritual inheritance through the delightful exercises of a picnic, but always through the grim contentions of the battlefield. It is so in the secret realm of the soul. Every faculty which wins its spiritual freedom does so at the price of blood. Apollyon is not put to flight by a courteous request; he straddles across the full breadth of the way, and our progress has to be registered in blood and tears. This we must remember or we shall add to all the other burdens of life the gall of misinterpretation. We are not “born again” into soft and protected nurseries, but in the open country where we suck strength from the very terror of the tempest. “We must through much tribulation enter into the kingdom of God.” Dr. J. H. Jowett

“Faith of our Fathers! living still,  

Despite dungeon, fire, and sword:  

O how our hearts beat high with joy  

Whenever we hear that glorious word.  

Faith of our Fathers! Holy Faith!  

We will be true to Thee till death!  


“Our fathers, chained in prisons dark,  

Were still in heart and conscience free;  

How sweet would be their children’s fate,  

If they, like them, could die for Thee!”

Thursday, March 3, 2022

Meet Him in the Morning

ఉదయమునకు...సీనాయి కొండయెక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి యుండవలెను. ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు - (నిర్గమ 34:2,3).

కొండమీద కనిపెట్టడం చాలా అవసరం. దేవుణ్ణి ఎదుర్కోకుండా కొత్తరోజును ఎదుర్కోకూడదు. ఆయనతో మాట్లాడనిదే ఇతరులతో మాట్లాడకూడదు. 

నీ బలాన్ని నమ్ముకుని రోజును ప్రారంభిస్తే నీకు విజయం రాదు. నీ హృదయంలో దేవుణ్ణి గురించిన కొన్ని ఆలోచనలతో, ధ్యానంతో అనుదిన జీవితంలోకి ప్రవేశించు. నీ జీవితపు నాయకుడు, మహిమాన్వితుడైన అతిథి యేసుక్రీస్తును కలుసుకోకుండా మరెవర్నీ, ఆఖరుకి నీ ఇంట్లో వాళ్ళని కూడా కలుసుకోవద్దు.

ఒంటరిగా ఆయన్ని కలుసుకో, క్రమంగా కలుసుకో. ఆయన మాటలున్న గ్రంథంలో ఆయనతో మాట్లాడు. ఆయన వ్యక్తిత్వపు మహిమ నీ దైనందిన జీవితంలోని ప్రతి పనినీ జరిగించేలా ఆ పనులన్నిటినీ ఆయన అనుమతితో ప్రారంభించు.

దేవునితో మొదలుపెట్టు ప్రతిదినం

నీ సూర్యుడాయనే

ప్రాతఃకాలపు వెలుగాయనే

చెయ్యాలనుకున్నవన్నీ చెప్పు ఆయనకే


ఉదయమే క్రొత్త పాట పాడు

అరణ్యాలతో పర్వతాలతో

మంద మారుతాలతో మైదానాలతో

మరుమల్లెలతో గొంతు కలిపి ఆలపించు


దేవునితోనే వెయ్యి నీ మొదటి అడుగు 

నీతో రమ్మని ఆయన్ని అడుగు

నదులైనా పర్వతాలైనా, జలపాతమైనా

అడుగు ఆయన తోడు


నీ మొదటి వ్యవహారం దేవునితో

వర్థిల్లుతుంది నీ వ్యాపారం

దినమంతా పెరుగుతుంది ప్రేమ

పైనున్నవానితో నీ సహవాసం


మొదటి పాట దేవునికి పాడు

నీ సాటి మనిషికి కాదు

మహిమగల సృష్టికర్తకే

ఆయన చేసిన సృష్టికి కాదు

దేవుని కోసం గొప్ప పనులు చేసిన వాళ్ళంతా ప్రతిరోజూ తెల్లవారుజామునే లేచి మోకరించినవాళ్ళే.

మాథ్యూ హెన్రీ ఉదయం నాలుగు గంటలకి లేచి ధ్యానం మొదలు పెట్టేవాడు. ఎనిమిదిదాకా ఉండేవాడు. ఉదయ ఫలహారం చేసాక కుటుంబ ప్రార్థన. మళ్ళీ మధ్యాహ్నం దాకా తన గదిలోనే చదువుకొని భోజనం చేసేవాడు. మళ్ళీ నాలుగుదాకా రాసుకుంటూ గడిపి ఆ పైన స్నేహితులను దర్శించడానికి వెళ్ళేవాడు.

డాడ్రిడ్జి గారు ఉదయం ఐదు గంటలకి లేవడానికి ఏడు గంటలకి లేవడానికి తేడాలు చెప్తుండేవారు. అంటే అలా రోజుకి 2 గంటల సమయం వృధా అయినట్టే లెక్క.

డాక్టర్ ఆడమ్ క్లార్కుగారి 'కామెంటరీ'ని ఆయన పూర్తిగా తెల్లవారు సమయంలోనే రాసాడట. బార్నెస్ గారి 'కామెంటరీ'ని కూడా ఆయన ఉదయం గంటల్లో పడిన కష్టం ఫలితమే. సిమ్యోను అనే కళాకారుడి కళాఖండాలన్నీ తెల్లవారుజాములో వేసినవే. కాబట్టి మనం కూడా ఉదయ సమయాన్ని దేవునికోసం గడపడం మంచిది కదా.

-----------------------------------------------------------------------------------------------------------------------------

Be ready in the morning, and come up ...present thyself there to me in the top of the mount. And no man shall come up with thee - (Exod - 34:2-3)

The morning watch is essential. You must not face the day until you have faced God, nor look into the face of others until you have looked into His.

You cannot expect to be victorious if the day begins only in your own strength. Face the work of every day with the influence of a few thoughtful, quiet moments with your heart and God. Do not meet other people, even those of your own home, until you have first met the great Guest and honored Companion of your life—Jesus Christ.

Meet Him alone. Meet Him regularly. Meet Him with His open Book of counsel before you, and face the regular and the irregular duties of each day with the influence of His personality definitely controlling your every act.

Begin the day with God!  

He is thy Sun and Day!  

His is the radiance of thy dawn;  

To Him address thy lay.  


Sing a new song at morn!  

Join the glad woods and hills;  

Join the fresh winds and seas and plains,  

Join the bright flowers and rills.  


Sing thy first song to God!  

Not to thy fellow-men;  

Not to the creatures of His hand,  

But to the glorious One.  


Take thy first walk with God!  

Let Him go forth with thee;  

By the stream, or sea, or mountain path,  

Seek still His company.  


Thy first transaction be  

With God Himself above;  

So shall thy business prosper well,  

And all the day be love.  

—Horatius Bonar

The men who have done the most for God in this world have been early upon their knees.

Matthew Henry used to be in his study at four, and remain there till eight; then, after breakfast and family prayer, he used to be there again till noon; after dinner, he resumed his book or pen till four, and spent the rest of the day in visiting his friends.

Doddridge himself alludes to his “Family Expositor” as an example of the difference of rising between five and seven, which, in forty years, is nearly equivalent to ten years more of life.

Dr. Adam Clark’s “Commentary” was chiefly prepared very early in the morning.

Barnes’ popular and useful “Commentary” has been also the fruit of “early morning hours.”

Simeon’s “Sketches” were chiefly worked out between four and eight.

Wednesday, March 2, 2022

Making Straight the Crooked

 దేవుని క్రియలను ధ్యానించుము; ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును? - (ప్రసంగి 7:13)

దేవుడు ఒక్కోసారి తన భక్తుల్ని గొప్ప ఇక్కట్లపాలు చేసినట్లు అనిపిస్తుంది. తిరిగి తప్పించుకోలేని వలలోకి వాళ్ళని నడిపించినట్టు, మానవపరంగా ఏ ఉపాయము పనికిరాని స్థితిని కల్పించినట్టు అనిపిస్తుంది. దేవుని మేఘమే  వాళ్ళనక్కడికి నడిపించినట్టు ఉంటుంది. ఒకవేళ నువ్విప్పుడు అలాటి పరిస్థితిలో ఉన్నావేమో.

ఇది చివరి దాకా చాలా అన్యాయంగానూ, ఊహాతీతంగానూ, ఆందోళనాపూరితంగానూ అనిపిస్తుంది. కాని ఇదంతా న్యాయమే. నిన్నక్కడికి నడిపించిన దేవుని సంకల్పం బయటపడినప్పుడు, ఆయన జ్ఞానం, మనపై గల ప్రేమ బయటపడతాయి. ఆయనకున్న అపార శక్తి, కృప వెల్లడి కావడానికి ఇలాటి పరిస్థితి ఒక వేదిక. నిన్నాయన విడిపించడమే కాకుండా నువ్వెప్పుడూ మర్చిపోలేని పాఠాన్ని కూడా నేర్పుతాడు. తరువాత కాలంలో నీ పాటల్లో, స్తోత్ర గానాల్లో దాన్ని నువ్వు స్మరించుకుంటావు. ఆయన చేసినదాని కోసం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో నీకు తనివి తీరదు.

ఆయన పరిపాలిస్తున్నాడు

మనకి చేసినదాన్ని

ఆయన వివరించేదాకా వేచి వుందాం


నాకు మసకగా ఉంది

కాని ప్రభూ! నీకు స్పష్టమే

ఒక రోజు ఇదంతా వివరించి చెప్తావు

అంతదాకా ఈ వంకర బాటే

నిన్ను హత్తుకునే మార్గమయ్యింది


నా దారులు వంకర చేసావు, అడ్డు కంచెలు వేసావు

నీనుండి తొలగిపోయే నా కళ్ళకి గంతలు కట్టావు

నన్ను విధేయుడిగా చెయ్యాలని

ఇహలోకపు ఆశలనుండి మళ్ళి నిన్నే ప్రేమించాలని


ఈ అర్థంకాని స్థితి కోసం ప్రభూ నీకే వందనాలు

అర్థంకాని విషయాల్లో నా నమ్మికే నన్ను నిలబెట్టింది

ఆ శోధన ఇవ్వడానికి నన్ను యోగ్యుడిగా ఎంచావు

నీ సన్నిధిని ఆ శోధనలు నీ చేత్తో నాకు పంచావు

-----------------------------------------------------------------------------------------------------------------------------

Consider the work of God: for who can make that straight, which he hath made crooked - (Eccl - 7:13)

Often God seems to place His children in positions of profound difficulty, leading them into a wedge from which there is no escape; contriving a situation which no human judgment would have permitted, had it been previously consulted. The very cloud conducts them thither. You may be thus involved at this very hour.

It does seem perplexing and very serious to the last degree, but it is perfectly right. The issue will more than justify Him who has brought you hither. It is a platform for the display of His almighty grace and power.

He will not only deliver you; but in doing so, He will give you a lesson that you will never forget, and to which, in many a psalm and song, in after days, you will revert. You will never be able to thank God enough for having done just as He has. —Selected

“We may wait till He explains,  

Because we know that Jesus reigns.”  


It puzzles me; but, Lord, Thou understandest,  

And wilt one day explain this crooked thing.  

Meanwhile, I know that it has worked out Thy best—  

Its very crookedness taught me to cling.  


Thou hast fenced up my ways, made my paths crooked,  

To keep my wondering eyes fixed on Thee;  

To make me what I was not, humble, patient;  

To draw my heart from earthly love to Thee.  


So I will thank and praise Thee for this puzzle,  

And trust where I cannot understand.  

Rejoicing Thou dost hold me worth such testing,  

I cling the closer to Thy guiding hand.