Monday, March 7, 2022

Keep Trusting

మేము నిరీక్షించియుంటిమి - (లూకా 24:21). 

ఒక విషయం నేనెప్పుడూ బాధపడుతుంటాను. ఎమ్మాయికి వెళ్ళే దారిలో ఆ ఇద్దరు శిష్యులు యేసుతో “మాకింకా నిరీక్షణ ఉంది” అనలేదు. “మేము నిరీక్షించాము” అన్నారు. “ఇది జరిగిపోయింది. కథ అంతమై పోయింది” అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎంత విచారకరం! 

వాళ్ళు ఇలా అనాల్సింది. “పరిస్థితులన్నీ మా నిరీక్షణకి వ్యతిరేకంగా ఉన్నాయి. మా నమ్మకం వ్యర్థమైపోయిందేమో అన్నట్టుగా ఉంది. కాని మేము మాత్రం ఆయన్ని మళ్ళీ చూస్తామన్న నిరీక్షణను పోగొట్టుకోలేదు” తాము కోల్పోయిన విశ్వాసాన్ని ఆయనకి వెల్లడిస్తూ ఆయనతో నడిచారు. చివరికి ఆయన ‘అవివేకులారా, విశ్వాస రహితులారా! అంటూ వాళ్ళని గద్దించవలసి వచ్చింది.

ఈ మాటలు మన గురించి కూడా అనే ప్రమాదం ఉంది. సత్యానికి, ప్రేమకి ఆధారభూతుడైన దేవునిలో విశ్వాసాన్ని పోగొట్టుకోనంత కాలము మనం దేన్ని పోగొట్టుకున్నా పర్వాలేదు.

ఈ శిష్యుల్లాగా మన విశ్వాసాన్ని భూత కాలంలో అనగా జరిగిపోయిన కాలంలో చెప్పవద్దు. ఎప్పుడూ "మేము నిరీక్షించి యుంటిమి” అనడానికి బదులు “మేము నిరీక్షించుచున్నాము” అని వర్తమాన కాలంలో అనగా జరుగుతూ ఉన్న కాలంలో చెప్పండి. 

వసంతం వయ్యారాలొలకబోస్తూ వచ్చింది

అన్ని కొమ్మలూ పూలతో బరువుగా ఊగుతున్నాయి

గులాబీలు పూసినప్పుడు నమ్మకముంచాను దేవునిపై

ఇప్పుడూ నమ్మకముంచుతున్నాను


గులాబీలు వాడినప్పుడు నా విశ్వాసం వాడితే

బలహీనమైనదనే నా నమ్మకం

తుఫాను మేఘాలు కమ్మిన వేళ నిరీక్షణ మారితే

ఆయన ప్రేమని శంకిస్తే అతి నీరసమే నా నిరీక్షణ

-----------------------------------------------------------------------------------------------------------------------------

We trusted - (Luke -  24:21)

I have always felt so sorry that in that walk to Emmaus the disciples had not said to Jesus, “We still trust”; instead of “We trusted.” That is so sad—something that is all over.

If they had only said, “Everything is against our hope; it looks as if our trust was vain, but we do not give up; we believe we shall see Him again.” But no, they walked by His side declaring their lost faith, and He had to say to them “O fools, and slow of heart to believe!”

Are we not in the same danger of having these words said to us? We can afford to lose anything and everything if we do not lose our faith in the God of truth and love.

Let us never put our faith, as these disciples did, in the past tense—“We trusted.” But let us ever say, “I am trusting.” —Crumbs

The soft, sweet summer was warm and glowing,  

Bright were the blossoms on every bough:  

I trusted Him when the roses were blooming;  

I trust Him now…  


Small was my faith should it weakly falter  

Now that the roses have ceased to blow;  

Frail was the trust that now should alter,  

Doubting His love when storm clouds grow.  

—The Song of a Bird in a Winter Storm

Sunday, March 6, 2022

Hold on Until the End

మొదటనుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన యెడలనే క్రీస్తులో పాలివారమై యుందుము - (హెబ్రీ 3:13-15).

మన చివరి అడుగే గెలుపు సాధిస్తుంది. యాత్రికుని ప్రయాణంలో ఆకాశ పట్టణం సమీపంలో ఉన్నన్ని ఆపదలు మిగతా ప్రయాణంలో ఎక్కడా లేవు. అనుమానపు కోట ఉన్నది ఆ సమీపంలోనే. ప్రయాణికుడిని నిద్రపుచ్చి సంహరించే దుష్టశక్తులున్నవి ఆ పొలిమేరల్లోనే. పరలోకపు వైభవం ప్రత్యక్షమైనప్పుడే నరక ద్వారాలు తప్పించుకోలేని శక్తితో, మనల్ని ఆకర్షిస్తుంటాయి. సత్కార్యాలు చెయ్యడంలో మనం అలసిపోకుండా ఉందాం. విరామం లేకుండా పనిచేస్తే త్వరలో మన పంట కోసుకుంటాము. కాబట్టి నీ బహుమతి కోసం పరుగెత్తు.

చింతల కెరటాలు ఎగసి అటూ ఇటూ కొడుతుంటే

శంకల తీరాల నుండి పెనుగాలులు అల్లాడిస్తుంటే

విశ్వాసపు లంగరులు ప్రవాహంలో తేలిపోతుంటే

స్థిరమైనదానికే నేను అంటిపెట్టుకుని ఉన్నాను


దయ్యాలు ఎంతగా పోరాడినా దేవదూతలు ఎంత సేపు దాక్కున్నా

ఈ విశ్వం న్యాయం పక్షమే

చుక్కల వెనక ఎక్కడో ఒక ప్రేమ నాకోసం కాచుకొని ఉంది

ఉదయమైనప్పుడు చూడగలను ఆ స్వరూపాన్ని

చివరి అర్ధగంటదాకా నిలిచి ఉంటేనే దేవునినుండి గొప్ప దీవెనలను పొందగలం.

-----------------------------------------------------------------------------------------------------------------------------

We are made partakers of Christ if we hold the beginning of our confidence steadfast unto the end - (Heb - 3:14)

It is the last step that wins, and there is no place in the pilgrim’s progress where so many dangers lurk as the region that lies hard by the portals of the Celestial City. It was there that Doubting Castle stood. It was there that the enchanted ground lured the tired traveler to fatal slumber. It is when Heaven’s heights are full in view that hell’s gate is most persistent and full of deadly peril. “Let us not be weary in well-doing, for in due season we shall reap if we faint not.” “So run, that ye may obtain.”

In the bitter waves of woe  

Beaten and tossed about  

By the sullen winds that blow  

From the desolate shores of doubt,  

Where the anchors that faith has cast  

Are dragging in the gale,  

I am quietly holding fast  

To the things that cannot fail.  


And fierce though the fiends may fight,  

And long though the angels hide,  

I know that truth and right  

Have the universe on their side;  

And that somewhere beyond the stars  

Is a love that is better than fate.  

When the night unlocks her bars  

I shall see Him—and I will wait.  

—Washington Gladden

The problem of getting great things from God is being able to hold on for the last half hour. —Selected

Saturday, March 5, 2022

Tempered and Tried

విశ్వాసము చేతను ఓర్పుచేతను వాగ్దానములను స్వతంత్రించుకొనువారిని పోలి నడుచుకొనుడి - (హెబ్రీ 6:11,12).

‘విశ్వాస వీరులు’ వాళ్ళెక్కిన కొండ శిఖరాల మీద నుండి మనల్ని పిలుస్తున్నారు. “ఒక మనిషి ఒక పనిని చెయ్యగలిగాడంటే మరో మనిషికి కూడా అది సాధ్యమే” అంటూ వాళ్ళు మనకి విశ్వాసం ఎంత అవసరమో చెప్తున్నారు. అంతేకాక, ‘విశ్వాసం’ ఫలించాలంటే ‘ఓర్పు’ దానితో కలిసి ఎలా పనిచెయ్యాలో హెచ్చరిస్తున్నారు. మన పరలోక నాయకుని అధీనంలోనుండి మనం తప్పిపోతామేమోనని, ఆయన ప్రేమ పూరితమైన క్రమశిక్షణతో నేర్పే పాఠాలను మన సందేహాల వల్ల నేర్చుకోకుండా నిర్లక్ష్యం చేస్తామేమోనని భయంతో జాగ్రత్త పడదాం.

ఒక గ్రామంలోని కమ్మరి అన్నాడు, “నేను భయపడేది ఒకటే. పనికిరాని తుక్కులో నేను కూడా పడిపోతానేమోనని.”

“నేను ఒక ఉక్కు ముక్కును తీసుకున్నప్పుడు దాన్ని ఎర్రగా కాలుస్తాను. సుత్తితో దాన్ని సాగదీస్తాను. ఒక్కసారిగా దాన్ని చన్నీళ్ళల్లో ముంచుతాను. అది ఎండు కర్రలా విరిగిపోతుందో లేక గట్టిగా నిలిచి ఉంటుందో నాకు అప్పుడు తెలుస్తుంది. రెండు మూడు ప్రయత్నాలు చేసి పనికిరాకపోతే దాన్ని అవతల పారేస్తాను. పనికిరాని సామాన్లు కొనేవాడు వచ్చినప్పుడు చవకగా దాన్ని అమ్మేస్తాను.”

“ప్రభువు కూడా నన్ను ఇలాగే పరీక్షిస్తాడు. అగ్నితోను, నీళ్ళతోను, బరువైన సుత్తి దెబ్బలతోను నన్ను పరిశోధిస్తాడు. దానికి నేను నిలబడలేకపోతే, ఆయన నాతో సంతృప్తి చెందకపోతే నన్ను తుక్కులోకి విసిరేస్తాడేమో.” ఇదే ఆ కుమ్మరి లో ఉన్న భయం. 

కొలిమి భయంకరమైన వేడిలో ఉన్నప్పుడు చలించకు. తరువాత దశలో దీవెన ఉంది. యోబుతో కలిసి మనమూ చెప్పవచ్చు, “ఆయన నన్ను పరీక్షించినప్పుడు కొలిమిలోని బంగారంలాగా తయారయ్యాను.”

శ్రమల ద్వారానే మనుషులు పరిశుద్ధులవుతారు. పెద్ద పియానోని శృతి చెయ్యాలంటే పదకొండు టన్నుల బరువుని ఉపయోగించాలి. అలాటి బరువుకి నువ్వు తట్టుకోగలిగితే దేవుడు నిన్ను పరలోకపు సంగీతానికి అనుగుణంగా శృతిచేస్తాడు.

బాధపెట్టి కలచివేసే విషయాలు

మనిషిని స్తోత్రార్పణకి సిద్ధం చేస్తాయి

కిలకిల నవ్వే ఆహ్లాదపు దినాలకంటే

దిగ్ర్భాంతి, నాశనం, యాతన దినాలే శ్రేష్టం

-----------------------------------------------------------------------------------------------------------------------------

Followers of them who through faith and patience inherit the promises - (Heb - 6:12)

They (heroes of faith) are calling to us from the heights that they have won and told us that what man once did man can do again. Not only do they remind us of the necessity of faith, but also of that patience by which faith has its perfect work. Let us fear to take ourselves out of the hands of our heavenly Guide or to miss a single lesson of His loving discipline by discouragement or doubt.

“There is only one thing,” said a village blacksmith, "that I fear, and that is to be thrown on the scrap heap.

“When I am tempering a piece of steel, I first beat it, hammer it, and then suddenly plunge it into this bucket of cold water. I very soon find whether it will take temper or go to pieces in the process. When I discover after one or two tests that it is not going to allow itself to be tempered, I throw it on the scrap heap and sell it for a cent a pound when the junk man comes around.

“So I find the Lord tests me, too, by fire and water and heavy blows of His heavy hammer, and if I am not willing to stand the test, or am not going to prove a fit subject for His tempering process, I am afraid He may throw me on the scrap heap.”

When the fire is hottest, hold still, for there will be a blessed “afterward”; and with Job, we may be able to say, “When he hath tried me I shall come forth as gold.” —Selected

Sainthood springs out of suffering. It takes eleven tons of pressure on a piano to tune it. God will tune you to harmonize with Heaven’s key-note if you can stand the strain.

“Things that hurt and things that mar  

Shape the man for perfect praise;  

Shock and strain and ruin are  

Friendlier than the smiling days.”