నీ పేరు ఎన్నటికిని ఘనపరచబడునట్లు నీవు సెలవిచ్చిన మాట నిశ్చయముగా స్థిరపరచబడును గాక - (1 దిన 17:24).
యథార్థమైన ప్రార్థనకి ఆయువుపట్టైన వాక్యమిది. చాలాసార్లు మనకి వాగ్దత్తం కాని వాటికోసం ప్రార్థిస్తూ ఉంటాము. అందుకని ఇది దైవసంకల్పం అవునో కాదో తెలుసుకోవడానికి కొంతకాలం పట్టుదలగా ప్రార్థించవలసిన అవసరం కలుగుతూ ఉంటుంది. అయితే కొన్ని సమయాల్లో మాత్రం మనం అడుగుతున్నది దేవుని చిత్తానికి అనువైనదే అన్న దృఢ నిశ్చయం కలుగుతుంది. దావీదు జీవితంలో ఈ ప్రార్థన అలాటిదే. బైబిల్లో ఉన్న ఒక వాగ్దానాన్ని తీసుకొని దాని కొరకు వాదించడానికి ప్రేరేపణ కలుగుతున్నది. దాన్లో మనకి సంబంధించినదేదో ఉందనిపిస్తుంది. అలాటి సమయాల్లో స్థిరమైన విశ్వాసంతో “దేవా నువ్వన్నట్టుగా చెయ్యి” అని ప్రార్థిస్తాము. దైవ వాక్కులోని ఒక వాగ్దానం మీద చెయ్యివేసి అది కావాలి అని అడగడం అన్నిటికంటే క్షేమకరమైనది, అందమైనది. ఇందులో మనం చెమటోడ్చవలసినదేమీ లేదు. పెనుగులాడవలసిన పనిలేదు. చెక్కును బ్యాంకులో ఇచ్చి డబ్బు తీసుకున్నట్టు ఆ వాగ్దానాన్ని దేవుని ముందుపెట్టి దాని నెరవేర్పును పొందడమే. అనుమానం లేదు. ప్రార్థన ఖచ్చితమైనదైతే చాలా ఆసక్తిదాయకంగా తయారవుతుంది. ఎడాపెడా నోటికి వచ్చిన వాటన్నిటినీ అడిగేసి దేన్నీ పొందలేకపోవడం కంటే, కొద్దిపాటి దీవెనలను ప్రత్యేకించి అడిగి పొందగలగడం మేలు కదా!
బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానమూ దేవుని చేతి వ్రాతే. “నువ్వన్నట్టుగానే చెయ్యి” అనే మాటను జోడించి ఆ వాగ్దానం కోసం మనం అడగవచ్చు. తన సత్యంపై ఆధారపడ్డ జీవులను వాటి సృష్టికర్త ఎప్పుడూ మోసం చేయడు. అలాంటప్పుడు పరలోకపు తండ్రి తన కొడుకులకిచ్చిన మాటను మీరగలడా?
“నాలో ఆశలు రేకెత్తించిన నీ మాటను జ్ఞాపకం చేసుకో” ఇది ఫలితాలను ఇచ్చే ప్రార్థన. దీన్లో రెండు అంశాలున్నాయి. ఇది నీ మాట. దీన్ని నిలబెట్టుకోలేవా? దీన్ని నిజం చేసే ఉద్దేశం లేకపోతే అసలెందుకు అన్నావు? దీన్లో నేను ఆశపెట్టుకున్నాను. నువ్వే నాలో కల్పించిన ఈ ఆశను వమ్ము చేస్తావా?
“అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక, దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునొందెను” (రోమా 4:20,21).
మాట తప్పని దేవుని మాటలే బైబిల్లోని వాగ్దానాలను అంత అమూల్యమైనవిగా, అపురూపమైనవిగా చేసాయి. మనుషులు చేసే వాగ్దానాలు ఒక్కోసారి పనికిరాకుండా పోతాయి. ఇలా మాట తప్పడంవల్ల ఎన్నో హృదయాలు నిరాశతో కుమిలిపోయాయి. అయితే ప్రపంచం పుట్టినప్పటినుంచి దేవుడు తనని నమ్మేవాళ్ళకి చేసిన వాగ్దానాల్లో ఒక్కటి కూడా తప్పిపోలేదు.
దీన క్రైస్తవుడు వాగ్దానపు గుమ్మం దగ్గర చలిలో, శ్రమల చీకట్లో నిలబడి ఆ తలుపు గడియ తియ్యడానికి సందేహించడం అనేది ఎంత విచారకరం. అతను నిస్సంకోచంగా ఆ తలుపు నెట్టుకుని లోపలికివచ్చి తండ్రి ఇంట్లో ఆశ్రయం పొందాలి.
ప్రతి వాగ్దానానికి మూడు స్థంభాలు ఆధారంగా ఉన్నాయి. (1) దేవుని న్యాయం, ఆయన పరిశుద్ధత ఆయన్ని మాట తప్పనీయకుండా చేస్తాయి. (2) ఆయన కృప, వాత్సల్యం ఆ వాగ్దానాలను ఆయన మర్చిపోకుండా చేస్తాయి. (3) ఆయన నిజాయితీ ఆ వాగ్దానాన్ని మార్చెయ్యకుండా, ఆచరణలో పెట్టేలా చేస్తుంది.
-----------------------------------------------------------------------------------------------------------------------------
Do as thou hast said, that thy name may be magnified forever - (1 Chr -17:23-24)
This is the most blessed phase of true prayer. Many a time we ask for things that are not absolutely promised. We are not sure therefore until we have persevered for some time whether our petitions are in the line of God’s purpose or not. There are other occasions, and in the life of David, this was one, when we are fully persuaded that what we ask is according to God’s will. We feel led to take up and plead some promise from the page of Scripture, under the special impression that it contains a message for us. At such times, in confident faith, we say, “Do as Thou hast said.” There is hardly any position more utterly beautiful, strong, or safe than to put the finger upon some promise of the Divine Word and claim it. There need be no anguish, struggle, or wrestling; we simply present the check and ask for cash, produce the promise, and claim its fulfillment; nor can there be any doubt as to the issue. It would give much interest to prayer if we were more definite. It is far better to claim a few things specifically than a score vaguely. —F. B. Meyer
Every promise of Scripture is a writing of God, which may be pleaded before Him with this reasonable request: “Do as Thou hast said.” The Creator will not cheat His creature who depends upon His truth; and far more, the Heavenly Father will not break His word to His own child.
“Remember the word unto thy servant, on which thou hast caused me to hope,” is the most prevalent pleading. It is a double argument: it is Thy Word. Wilt Thou did not keep it? Why hast thou spoken of it, if Thou wilt does not make it good. Thou hast caused me to hope in it, wilt Thou disappoint the hope which Thou has Thyself begotten in me? —C. H. Spurgeon
“Being absolutely certain that whatever promise he is bound by, he is able also to make good” (Rom. 4:21, Weymouth’s Translation).
It is the everlasting faithfulness of God that makes a Bible promise “exceeding great and precious.” Human promises are often worthless. Many a broken promise has left a broken heart. But since the world was made, God has never broken a single promise made to one of His trusting children.
Oh, it is sad for a poor Christian to stand at the door of the promise, in the dark night of affliction, afraid to draw the latch, whereas he should then come boldly for shelter as a child into his father’s house. —Journal
Every promise is built upon four pillars: God’s justice and holiness, which will not suffer Him to deceive; His grace or goodness, which will not suffer Him to forget; His truth, which will not suffer Him to change, which makes Him able to accomplish. —Selected