ఇదిగో అగ్ని రాజబెట్టి అగ్ని కొరువులను మీచుట్టు పెట్టుకొనువారలారా, మీ అగ్ని జ్వాలలో నడువుడి. రాజబెట్టిన అగ్ని కొరువులలో నడువుడి. నా చేతివలన ఇది మీకు కలుగుచున్నది. మీరు వేదనగలవారై పండుకొనెదరు - (యెషయా 50:11).
చీకటిలో నడుస్తూ వెలుగులోకి తమకై తామే రావాలని ప్రయత్నించే వ్యక్తులకి ఎంత గంభీరమైన హెచ్చరిక! అగ్నిని రాజబెట్టి కొరువులని తమచుట్టూ పెట్టుకున్నట్టుగా వీళ్ళ గురించి వర్ణించబడింది. దీని అర్థం ఏమిటి?
తమచుట్టూ చీకటి ఉన్నప్పుడు దేవుని ఆశ్రయించకుండా తమకై తాము ఏదో మార్గాన్ని వెదుకులాడుతున్నారనే గదా దీని భావం. దేవుడి సహాయాన్ని తోసిపుచ్చి మనకి మనమే సహాయం చేసుకోవడమే ఈ వాక్యంలోని అర్థం. ప్రకృతి సంబంధమైన కాంతిని వెదుకుతాము. స్నేహితుల సలహాలను అనుసరిస్తుంటాము. మన తర్క జ్ఞానం మీద ఆధారపడి సొంత అభిప్రాయాలను ఏర్పరచుకొంటాము. ఇబ్బందులనుండి తప్పించుకోవడానికి ఏ దారి కనిపిస్తే ఆ దారిలో పరుగెడదామని చూస్తుంటాము. అది దేవుడికిష్టమైన మార్గమా కాదా అని చూడము.
ఇవన్నీ మనం స్వంతంగా రాజబెట్టుకున్న అగ్ని జ్వాలలు. మనల్ని నీటి గుంటల్లోకి నడిపించే గుడ్డి దీపాలు. ఈ కొరువుల వెలుగు సాయంతో నడవదలచుకుంటే దేవుడేమీ అడ్డు పెట్టడు. అయితే దాని ఫలితం దుఃఖమే.
ప్రియులారా, దేవుడు నిర్దేశించిన సమయంలో, నిర్దేశించిన విధానంలో తప్ప చీకటిలో నుండి బయటపడడానికి పెనుగులాడవద్దు. కష్టకాలాలకు ఓ ప్రయోజనం ఉంది. మన జీవితాలకి అత్యవసరమైన గుణపాఠాలు నేర్చుకోవడానికి అవి సంభవిస్తూ ఉంటాయి.
కలగవలసిన దానికంటే ముందుగా విడుదల కలిగితే దేవుడు మనపట్ల సిద్ధం చేసిన కృపా పథకాలు వీగిపోయే ప్రమాదం ఉంది. మన పని కేవలం పరిస్థితిని ఆయన చేతుల్లో పెట్టి ఊరుకోవడమే. ఆయన ప్రత్యక్షత మనతో ఉన్నంత కాలం చీకటిలోనే నిలిచి ఉండడానికి మనకి అభ్యంతరం ఎందుకుండాలి? గుర్తుంచుకోండి. ప్రభువు లేకుండా వెలుగులో నడవడం కంటే ప్రభువుతో చీకట్లో ఉండడమే మేలు.
దేవుని అంచనాలతోను ఆయన చిత్తంతోను చెలగాటాలాడవద్దు. ఆయన చేస్తున్న పనిలో మనం వ్రేలు పెడితే ఆ పని అంతా పాడైపోతుంది. గడియారం ముల్లును మన ఇష్టం వచ్చినట్లు తిప్పుకోవచ్చు. కాని కాలం మాత్రం తిరగదు కదా. దేవుని చిత్తం వెల్లడయ్యే విధానం త్వరగా జరిగిపోవాలని మనం కల్పించుకుంటే మొత్తంగా మూలను బడుతుంది. గులాబి మొగ్గను చేతులతో తెరువవచ్చు. కాని పువ్వు వికసించదు వాడిపోతుంది. అంతా దేవునికి వదలండి. చేతులు ముడుచుకుని కూర్చోండి. ప్రభువా, నీ చిత్తమే సిద్ధించును గాక, నాదేమీ లేదు.
ఆయన మార్గం
చల్లని నీడలు పరుచుకున్నాయి
ఆగి విశ్రమిద్దామంటే ప్రభువు సాగమన్నాడు
ముందుకి సాగి అర్థం కాక ఆగి వెనక్కి చూసాను
గండ శిల దొర్లి పడింది ఆగాలనుకున్న చోట
ఉత్సాహం ఉరకలేసి సాగుతుంటే ఆగమన్నాడు
జాగులేక సమ్మతించి ఆగిపోయాను
సాగవలసిన బాటలో పడుకుని ఉంది
పగబట్టి బుసలు కొడుతున్న కోడెత్రాచు
దైవాజ్ఞకి కారణాలడగనిక
నా దారి, నా గమ్యం నావి కావిక
క్షేమపు దారుల్లో నడిపించే
మార్గదర్శి దేవుడైనప్పుడు నాకేమి భయమిక?
-----------------------------------------------------------------------------------------------------------------------------
Behold, all ye that kindle a fire, that compass yourselves about with sparks: walk in the light of your fire, and in the sparks that ye have kindled. This shall ye have of mine hand; ye shall lie down in sorrow - (Isa - 50:11)
What a solemn warning to those who walk in darkness and yet who try to help themselves out into the light. They are represented as kindling a fire and compassing themselves with sparks. What does this mean?
Why does it means that when we are in darkness the temptation is to find a way without trusting in the Lord and relying upon Him? Instead of letting Him help us out, we try to help ourselves out. We seek the light of nature and get the advice of our friends. We try the conclusions of our reason, and might almost be tempted to accept a way of deliverance that would not be of God at all.
All these are fires of our own kindling; rushlights that will surely lead us onto the shoals. And God will let us walk in the light of those sparks, but the end will be sorrow.
Beloved, do not try to get out of a dark place, except, in God’s time and in God’s way. The time of trouble is meant to teach you lessons that you sorely need.
Premature deliverance may frustrate God’s work of grace in your life. Just commit the whole situation to Him. Be willing to abide in darkness so long as you have His presence. Remember that it is better to walk in the dark with God than to walk alone in the light. —The Still Small Voice
Cease meddling with God’s plans and will. You touch anything of His, and you mar the work. You may move the hands of a clock to suit you, but you do not change the time; so you may hurry the unfolding of God’s will, but you harm and do not help the work. You can open a rosebud but you spoil the flower. Leave all to Him. Hands down. Thy will, not mine. —Stephen Merritt
HIS WAY
God bade me go when I would stay
(’Twas cool within the wood);
I did not know the reason why.
I heard a boulder crashing by
Across the path where I stood.
He bade me stay when I would go;
“Thy will be done,” I said.
They found one day at early dawn,
Across the way, I would have gone,
A serpent with a mangled head.
No more do I ask the reason why,
Although I may not see
The path ahead, His way I go;
For though I know not, He doth know,
And He will choose safe paths for me.