Thursday, March 31, 2022

Security in Storms

 

గాలి యెదురైనందున…. - (మత్తయి 14:24). 

పెనుగాలులు నాలుకలు చాపి విజృంభిస్తుంటాయి. మన జీవితాల్లో వచ్చే తుఫానులు ప్రకృతి సంబంధమైన సుడిగాలులకంటే భయంకరమైనవి కావా? కాని నిజంగా ఇలాంటి గాలివానల అనుభవాల గురించి మనం సంతోషించాలి. ఉదయం, అస్తమయం లేక సంవత్సరం పొడుగునా సంధ్యా సమయం ఉండే ప్రదేశాల్లో ఆకైనా గలగలలాడకుండా గాలి విసరని లోతైన కొండలోయల్లోనూ ఉండడం కంటే, వర్షాలు కురిసి వరదలు వచ్చేచోట్ల నివసించడం మేలు కదా. శోధనల కారుమేఘాలు గుండెల్లో గుబులు పుట్టించవచ్చు. కాని ఆత్మ తీవ్రత నిండిన ప్రార్ధనకి ప్రేరేపించేవి అవే కదా, ఇంకా ఆత్రుతతో మనకియ్యబడిన వాగ్దానాలను గట్టిగా పట్టుకునేలా చేసేవి అవే కదా.

ఎడబాటులనే తుఫానులు హృదయ విదారకమైనవి. అయితే తనవైపుకి మనల్ని  మళ్ళించుకునే దేవుని సాధనాలే అవి. ఆయన రహస్యంగా మనతో ఉండి మృదువుగా మెల్లగా మనతో మాట్లాడే సందర్భాలు అవి. అలలకీ పెనుగాలుల తాకిడికీ నావ ఊగినప్పుడే కదా నావికుని సామర్థ్యం బయటపడేది."

తుఫానులు మనపై విరుచుకుపడకుండా చేసేవాడు కాదు యేసు ప్రభువు, ఆ తుఫానులో మనకి అండగా నిలిచేవాడు ఆయన. మన ప్రయాణం సుఖంగా సాగుతుందని ఎప్పుడూ మాట ఇవ్వలేదాయన. కాని గమ్యం మాత్రం క్షేమంగా చేర్చే బాధ్యత ఆయనది.

పరలోక పవనాలొస్తున్నాయి, తెరచాప ఎత్తండి

పెనుగాలులు వీచినా, ఆటంకాలొచ్చినా

పొగమంచు పట్టినా, గాలివాన కొట్టినా

పయనం దూరమైనా, గమ్యం కానరానిదైనా

ఉప్పునీళ్ళ తుంపరలో, సాగరం కక్కే నురగల్లో

సాగిపో గమ్యం వైపుకి నీ పరుగుల్లో

-----------------------------------------------------------------------------------------------------------------------------

The wind was contrary - (Matt -  14:24)

Rude and blustering the winds of March often are. Do they not typify the tempestuous seasons of my life? But, indeed, I ought to be glad that I make acquaintance with these seasons. Better it is that the rains descend and the floods come than that I should stay perpetually in the Lotus Land where it seems always afternoon, or in that deep meadowed Valley of Avilion where never wind blows loudly. Storms of temptation appear cruel, but do they not give intenser earnestness to prayer? Do they not compel me to seize the promises with a tighter hand grip? Do they not leave me with a character refined?

Storms of bereavement are keen; but, then, they are one of the Father’s ways of driving me to Himself, that is the secret of His presence His voice may speak to my heart, soft and low. There is a glory of the Master that can be seen only when the wind is contrary and the ship is tossed with waves.

“Jesus Christ is no security against storms, but He is perfect security in storms. He has never promised you an easy passage, only a safe landing.”

Oh, set your sail to the heavenly gale,  

And then, no matter what winds prevail,  

No reef can wreck you, no calm delay;  

No mist shall hinder, no storm shall stay;  

Though far you wander and long you roam  

Through salt sea sprays and o’er white sea foam,  

No wind that can blow but shall speed you Home.

Wednesday, March 30, 2022

Rely on God, Not Self

ఇదిగో అగ్ని రాజబెట్టి అగ్ని కొరువులను మీచుట్టు పెట్టుకొనువారలారా, మీ అగ్ని జ్వాలలో నడువుడి. రాజబెట్టిన అగ్ని కొరువులలో నడువుడి. నా చేతివలన ఇది మీకు కలుగుచున్నది. మీరు వేదనగలవారై పండుకొనెదరు - (యెషయా 50:11). 

చీకటిలో నడుస్తూ వెలుగులోకి తమకై తామే రావాలని ప్రయత్నించే వ్యక్తులకి ఎంత గంభీరమైన హెచ్చరిక! అగ్నిని రాజబెట్టి కొరువులని తమచుట్టూ పెట్టుకున్నట్టుగా వీళ్ళ గురించి వర్ణించబడింది. దీని అర్థం ఏమిటి?

తమచుట్టూ చీకటి ఉన్నప్పుడు దేవుని ఆశ్రయించకుండా తమకై తాము ఏదో మార్గాన్ని వెదుకులాడుతున్నారనే గదా దీని భావం. దేవుడి సహాయాన్ని తోసిపుచ్చి మనకి మనమే సహాయం చేసుకోవడమే ఈ వాక్యంలోని అర్థం. ప్రకృతి సంబంధమైన కాంతిని వెదుకుతాము. స్నేహితుల సలహాలను అనుసరిస్తుంటాము. మన తర్క జ్ఞానం మీద ఆధారపడి సొంత అభిప్రాయాలను ఏర్పరచుకొంటాము. ఇబ్బందులనుండి తప్పించుకోవడానికి ఏ దారి కనిపిస్తే ఆ దారిలో పరుగెడదామని చూస్తుంటాము. అది దేవుడికిష్టమైన మార్గమా కాదా అని చూడము.

ఇవన్నీ మనం స్వంతంగా రాజబెట్టుకున్న అగ్ని జ్వాలలు. మనల్ని నీటి గుంటల్లోకి నడిపించే గుడ్డి దీపాలు. ఈ కొరువుల వెలుగు సాయంతో నడవదలచుకుంటే దేవుడేమీ అడ్డు పెట్టడు. అయితే దాని ఫలితం దుఃఖమే.

 ప్రియులారా, దేవుడు నిర్దేశించిన సమయంలో, నిర్దేశించిన విధానంలో తప్ప చీకటిలో నుండి బయటపడడానికి పెనుగులాడవద్దు. కష్టకాలాలకు ఓ ప్రయోజనం ఉంది. మన జీవితాలకి అత్యవసరమైన గుణపాఠాలు నేర్చుకోవడానికి అవి సంభవిస్తూ ఉంటాయి.

కలగవలసిన దానికంటే ముందుగా విడుదల కలిగితే దేవుడు మనపట్ల సిద్ధం చేసిన కృపా పథకాలు వీగిపోయే ప్రమాదం ఉంది. మన పని కేవలం పరిస్థితిని ఆయన చేతుల్లో పెట్టి ఊరుకోవడమే. ఆయన ప్రత్యక్షత మనతో ఉన్నంత కాలం చీకటిలోనే నిలిచి ఉండడానికి మనకి అభ్యంతరం ఎందుకుండాలి? గుర్తుంచుకోండి. ప్రభువు లేకుండా వెలుగులో నడవడం కంటే ప్రభువుతో చీకట్లో ఉండడమే మేలు.

దేవుని అంచనాలతోను ఆయన చిత్తంతోను చెలగాటాలాడవద్దు. ఆయన చేస్తున్న పనిలో మనం వ్రేలు పెడితే ఆ పని అంతా పాడైపోతుంది. గడియారం ముల్లును మన ఇష్టం వచ్చినట్లు తిప్పుకోవచ్చు. కాని కాలం మాత్రం తిరగదు కదా. దేవుని చిత్తం వెల్లడయ్యే విధానం త్వరగా జరిగిపోవాలని మనం కల్పించుకుంటే మొత్తంగా మూలను బడుతుంది. గులాబి మొగ్గను చేతులతో తెరువవచ్చు. కాని పువ్వు వికసించదు వాడిపోతుంది. అంతా దేవునికి వదలండి. చేతులు ముడుచుకుని కూర్చోండి. ప్రభువా, నీ చిత్తమే సిద్ధించును గాక, నాదేమీ లేదు.

 ఆయన మార్గం

చల్లని నీడలు పరుచుకున్నాయి

ఆగి విశ్రమిద్దామంటే ప్రభువు సాగమన్నాడు

ముందుకి సాగి అర్థం కాక ఆగి వెనక్కి చూసాను

గండ శిల దొర్లి పడింది ఆగాలనుకున్న చోట


ఉత్సాహం ఉరకలేసి సాగుతుంటే ఆగమన్నాడు

జాగులేక సమ్మతించి ఆగిపోయాను

సాగవలసిన బాటలో పడుకుని ఉంది

పగబట్టి బుసలు కొడుతున్న కోడెత్రాచు


దైవాజ్ఞకి కారణాలడగనిక

నా దారి, నా గమ్యం నావి కావిక

క్షేమపు దారుల్లో నడిపించే

మార్గదర్శి దేవుడైనప్పుడు నాకేమి భయమిక?

-----------------------------------------------------------------------------------------------------------------------------

Behold, all ye that kindle a fire, that compass yourselves about with sparks: walk in the light of your fire, and in the sparks that ye have kindled. This shall ye have of mine hand; ye shall lie down in sorrow - (Isa - 50:11)

What a solemn warning to those who walk in darkness and yet who try to help themselves out into the light. They are represented as kindling a fire and compassing themselves with sparks. What does this mean?

Why does it means that when we are in darkness the temptation is to find a way without trusting in the Lord and relying upon Him? Instead of letting Him help us out, we try to help ourselves out. We seek the light of nature and get the advice of our friends. We try the conclusions of our reason, and might almost be tempted to accept a way of deliverance that would not be of God at all.

All these are fires of our own kindling; rushlights that will surely lead us onto the shoals. And God will let us walk in the light of those sparks, but the end will be sorrow.

Beloved, do not try to get out of a dark place, except, in God’s time and in God’s way. The time of trouble is meant to teach you lessons that you sorely need.

Premature deliverance may frustrate God’s work of grace in your life. Just commit the whole situation to Him. Be willing to abide in darkness so long as you have His presence. Remember that it is better to walk in the dark with God than to walk alone in the light. —The Still Small Voice

Cease meddling with God’s plans and will. You touch anything of His, and you mar the work. You may move the hands of a clock to suit you, but you do not change the time; so you may hurry the unfolding of God’s will, but you harm and do not help the work. You can open a rosebud but you spoil the flower. Leave all to Him. Hands down. Thy will, not mine. —Stephen Merritt

HIS WAY


God bade me go when I would stay  

(’Twas cool within the wood);  

I did not know the reason why.  

I heard a boulder crashing by  

Across the path where I stood.


He bade me stay when I would go;  

“Thy will be done,” I said.  

They found one day at early dawn,  

Across the way, I would have gone,  

A serpent with a mangled head.


No more do I ask the reason why,  

Although I may not see  

The path ahead, His way I go;  

For though I know not, He doth know,  

And He will choose safe paths for me.

Tuesday, March 29, 2022

Leave it With Him

 

అడవిపువ్వులు ఏలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి - (మత్తయి 6:28).

ఆలివ్ నూనె బొత్తిగా దొరకడం లేదు. సరే, ఆ ఆలివ్ మొక్క ఒకటి నాటితే సరిపోతుంది అనుకున్నాడు పూర్వం ఒక సన్యాసి. మొక్కని నాటాడు. “దేవా దీనికి వర్షం కావాలి. దీని వేళ్ళు చాలా సున్నితమైనవి. కాబట్టి మెల్లని తొలకరి జల్లును కురిపించు” అంటూ ప్రార్ధించాడు. ఆ ప్రకారంగానే దేవుడు చిరుజల్లు కురిపించాడు. “దేవా ఈ మొక్కకి సూర్యరశ్మి కావాలి. సూర్యుడిని ప్రకాశింపజెయ్యి” మళ్ళీ ప్రార్ధించాడు, అలానే వెచ్చని సూర్యరశ్మి తొలకరి మేఘాలను చీల్చుకుని ప్రకాశించింది. "తేమ కావాలి దేవా, ఈ మొక్క కణజాలాలకు పుష్టి కలిగేందుకుగాను తేమని పంపించు” మళ్ళీ ప్రార్ధన చేశాడు. చల్లని మంచు, తేమ ఆ మొక్కని ఆవరించింది. సన్యాసి సంతోషించాడు. కాని ఆ సాయంత్రమే ఆ మొక్క వాడిపోయింది.

సన్యాసి విచారంగా మరో సన్యాసి ఆశ్రమానికి వెళ్ళి ఇదంతా ఆయనకి వివరించాడు. ఆయనన్నాడు “నేను కూడా ఓ మొక్క నాటాను. చూడూ అది ఎంత పచ్చగా కళకళలాడుతుందో. దాన్ని సృష్టించింది దేవుడు కాబట్టి నాకంటే దాని బాగోగులు ఆయనకే బాగా తెలుసు. దేవుడితో నేనేమీ బేరం ఆడలేదు. ఇలా ఇలా చెయ్యి అంటూ ఆయనకి నేనేమీ సలహాలనివ్వలేదు. “దేవా ఈ మొక్కకి ఏది కావాలో అది ఇయ్యి” అని మాత్రం ప్రార్థించాను. తుఫాను కావాలో, తుషారం కావాలో, నీరెండ కావాలో, నీటి చినుకులు కావాలో, మొక్కకి ఏది అవసరమో ఆయనకి తెలుసు కదా.”

గరిక పూలు దిగులుపడవు 

దిగులుపడకు నువ్వు కూడా.

వానచినుకులో గడ్డిపరకలు

పొగమంచులో పున్నాగ పూలు

చీకటి ముసుగున సిరిమల్లెలు

ఉదయపు కాంతిలో ప్రకృతి అంతా

పెరుగుతుంది, కుసుమిస్తుంది

వాటికాధారం దేవుడే

నీరు పోసేవాడు ఆయనే


పూలు పూసేది ఆయన వల్లే 

జాజికంటే సంపెంగకంటే

మంచు కడిగిన మల్లికంటే

ఆయనకి నువ్వే ఇష్టం తెలుసుకుంటే.

నీ బరువాయనదే

కొరతలు, విన్నపాలు ఆయనకి చేరాలి.

నీ బాధ్యత ఆయనదే 

నిశ్చింతగా ఉండు

అంతా ఆయనకి వదిలి.

---------------------------------------------------------------------------------------------------------------------------

Consider the lilies, how they grow - (Matt - 6:28)

I need oil,“ said an ancient monk; so he planted an olive sapling. ”Lord,“ he prayed, ”it needs rain that its tender roots may drink and swell. Send gentle showers.“ And the Lord sent gentle showers. ”Lord,“ prayed the monk, ”my tree needs sun. Send sun, I pray Thee.“ And the sun shone, gilding the dripping clouds. ”Now frost, my Lord, to brace its tissues," cried the monk. And behold, the little tree stood sparkling with frost, but in the evening it died.

Then the monk sought the cell of a brother monk and told his strange experience. “I, too, planted a little tree,” he said, “and see! it thrives well. But I entrust my tree to its God. He who made it knows better what it needs than a man like me. I laid no condition. I fixed no ways or means. ’Lord, send what it needs,’ I prayed, ’storm or sunshine, wind, rain, or frost. Thou hast made it and Thou dost know.’”

Yes, leave it with Him,  

The lilies all do,  

And they grow—  

They grow in the rain,  

And they grow in the dew—  

Yes, they grow:  

They grow in the darkness, all hid in the night—  

They grow in the sunshine, revealed by the light—  


Still, they grow.  

Yes, leave it with Him  

’Tis dearer to His heart,  

You will know,  

Then the lilies that bloom,  

Or the flowers that start  

’Neath the snow:  

Whatever you need, if you seek it in prayer,  

You can leave it with Him—for you are His care.  

You, you know.