Saturday, April 2, 2022

Do Not Yield to Discouragement

 

వారు అరణ్యము వైపు చూచిరి, అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను (నిర్గమ 16:10). 

మేఘాలు కమ్ముకున్న వేళ మేఘాల అంచుల్లో కనబడే శ్వేతకాంతిని చూడడం అలవాటు చేసుకోండి. ఆ శ్వేత కాంతి కనిపిస్తే దానినుండి దృష్టి మరల్చుకోవద్దు. మేఘం మధ్యలో కనిపించే కారు చీకటిని అసలే చూడొద్దు.

ఎంత ఒత్తిడి, నిస్సహాయత ఆవరించినప్పటికీ, నిసృహకి తావియ్యకండి. నిస్పృహ చెందిన హృదయం మరే పనీ చెయ్యలేదు. శత్రువు బాణాలను ఎదుర్కోవాలనే మెలకువే నశించిపోతుంది. ఇతరులను తన ప్రార్థనల ద్వారా ఆదుకోవాలనే ప్రసక్తే ఉండదిక.

సర్పం బారినుండి తప్పించుకున్నట్టుగా ఈ నిస్పృహ అనే భయంకరమైన రోగం నుండి పారిపోండి.

దేవుని వాగ్దానాల కోసం వెదకండి. ప్రతిదాన్నీ నోరారా వల్లించండి. “ఈ వాగ్దానం నాకే" అని. మీకింకా అనుమాన పిశాచం వదలకపోతే మీ హృదయాలను దేవుని సన్నిధిలో కుమ్మరించండి. మీ హృదయాన్ని పదేపదే వేధిస్తున్న శంకల్ని గద్దించమని శరణు వేడండి.

మీరు మనసారా ఇలాంటి అపనమ్మకం నిస్పృహలనుండి మొహం తిప్పేసుకున్న మరుక్షణం, పరిశుద్ధాత్మ మీ విశ్వాసానికి క్రొత్త ఊపిరి పోసి, మీ హృదయాల్లో దైవ శక్తిని నింపుతాడు.

మొదట్లో ఇది మీకు అనుభవంలోకి రాకపోవచ్చు. కాని సర్దుబాటుకి తావు లేకుండా అచంచలమైన నిశ్చయతతో మిమ్మల్ని వేధిస్తున్న అనుమానాల భూతాలను మీరు అణగదొక్కుతున్న కొద్దీ క్రమంగా అంధకార శక్తులు ఒకదానివెంట ఒకటి మీనుండి వెనక్కి తగ్గుతున్నట్టు మీకే అర్థం అవుతుంది. 

పిశాచాల సైన్యాలను తిరస్కరించి దేవుని వైపుకి తిరగడానికి మనల్ని ప్రోత్సహిస్తున్న ఆ తిరుగులేని శక్తిసామర్థ్యాల పరలోక దళాలను మన నేత్రాలు చూడగలిగితే ఎంత మంచిది! మనల్ని నిస్పృహలోకి, ఆందోళన, నిరుత్సాహాల్లోకి ఈడ్చే దుర్మార్గుడైన సైతానుని మనం అసలు పట్టించుకోనే పట్టించుకోము.

దైవత్వంలోని అత్యున్నతమైన బలప్రభావాలన్నీ, క్రీస్తు పేరట, సంపూర్ణ విశ్వాసంతో, దేవునికి తన్ను తాను సమర్పించుకుని, ఆయన వైపుకి సహాయ సహకారాల కోసం తిరిగే అతి దీనుడైన విశ్వాసి పక్షమవుతాయి.

ఒకరోజు ఉదయం ఒక డేగ తుపాకి గుండు దెబ్బ తిని కూలిపోయింది. దాని కళ్ళింకా కాంతిపుంజాల్లాగా మెరుస్తూనే ఉన్నాయి. అది మరణ బాధలో అతి కష్టం మీద కళ్ళెత్తి ఆశగా, ఆబగా ఆకాశం లోనికి చూసింది. ఆ ఆకాశమే దాని ఇల్లు. అది ఆ డేగ సామ్రాజ్యమే. తన రెక్కల్లోని తేజస్సుని, బలాన్ని అక్కడ ఎన్నోసార్లు ఉపయోగించింది. ఆ ఉన్నత ప్రదేశాల్లో మెరుపుల్ని ముద్దు పెట్టుకుంది. గాలితో పందాలు వేసింది. మరి ఇప్పుడో, తన దారికి దూరంగా, నేలమీద మరణానికి దగ్గరగా పడి ఉంది. ఇది ఎలా జరిగిందంటే క్షణ కాలం ఏమరుపాటు వల్ల ఆ డేగ భూమికి దగ్గరగా ఎగిరింది. తుపాకీ దెబ్బకు గురయ్యింది. మన ఆత్మ ఈ డేగ లాటిదే, ఈ లోకం కాదు దాని నివాసం. ఆకాశ వీధుల్ని, ఆకాశం వంక దృష్టిని వదలకూడదు. విశ్వాసాన్ని, నిరీక్షణని, ధైర్యాన్ని, క్రీస్తుని ఎప్పుడూ అంటిపెట్టుకుని ఉండాలి. ఆత్మలో కంగారుపడి తప్పటడుగులు వేయాల్సిన సమయం కాదిది. ఆత్మతో చెప్పండి, “ఆకాశం వైపుకే దృష్టిసారించు” అని.

పాదాల చుట్టూ కెరటాలు నురగలు కడితే

ఆ దేవుడే చూసుకుంటాడు! అదే మన నినాదం

పైవాటినే లక్ష్య పెట్టండి, పైకి చూడండి


ఆత్మని అంధకారం ఆవరించినప్పుడు

దేవుని దివ్యకాంతి ఆత్మని వెలిగిస్తుంది

పైవాటినే లక్ష్యపెట్టండి, పైకే చూడండి


అంతులేని పోరాటాలతో అలసినప్పుడు

ఆదరిస్తాడు సైన్యాల అధిపతియైన నీ దేవుడు

పైవాటినే లక్ష్యపెట్టండి, పైకే చూడండి.

పశ్చిమ దిక్కుకి ఎంతకాలం చూసినా సూర్యోదయం కనిపించదు.

-----------------------------------------------------------------------------------------------------------------------------

They looked...and behold, the glory of the Lord appeared in the cloud ( Exod -  16:10)

Get into the habit of looking for the silver lining of the cloud and when you have found it, continue to look at it, rather than at the leaden gray in the middle.

Do not yield to discouragement no matter how sorely pressed or beset you may be. A discouraged soul is helpless. He can neither resist the wiles of the enemy himself, while in this state, nor can he prevail in prayer for others.

Flee from every symptom of this deadly foe as you would flee from a viper. And be not slow in turning your back on it, unless you want to bite the dust in bitter defeat.

Search out God’s promises and say aloud of each one: “This promise is mine.” If you still experience a feeling of doubt and discouragement, pour out your heart to God and ask Him to rebuke the adversary who is so mercilessly nagging you.

The very instant you whole-heartedly turn away from every symptom of distrust and discouragement, the blessed Holy Spirit will quicken your faith and inbreathe Divine strength into your soul.

At first, you may not be conscious of this, still, as you resolutely and uncompromisingly “snub” every tendency toward doubt and depression that assails you, you will soon be made aware that the powers of darkness are falling back.

Oh, if our eyes could only behold the solid phalanx of strength, of power, that is ever behind every turning away from the hosts of darkness, God-ward, what scant heed would be given to the effort of the wily foe to distress, depress, discourage us!

All the marvelous attributes of the Godhead are on the side of the weakest believer, who in the name of Christ, and in simple, childlike trust, yields himself to God and turns to Him for help and guidance. —Selected

On a day in the autumn, I saw a prairie eagle mortally wounded by a rifle shot. His eye still gleamed like a circle of light. Then he slowly turned his head and gave one more searching and longing look at the sky. He had often swept those starry spaces with his wonderful wings. The beautiful sky was the home of his heart. It was the eagle’s domain. A thousand times he had exploited there his splendid strength. In those far away heights he had played with the lightning, and raced with the winds, and now, so far away from home, the eagle lay dying, done to the death, because for once he forgot and flew too low. The soul is that eagle. This is not its home. It must not lose the skyward look. We must keep the faith, we must keep hope, we must keep courage, we must keep Christ. We would better creep away from the battlefield at once if we are not going to be brave. There is no time for the soul to stampede. Keep the skyward look, my soul; keep the skyward look!

“Keep looking up—  

The waves that roar around thy feet,  

Jehovah-Jireh will defeat  

When looking up.  


“Keep looking up—  

Though darkness seems to wrap thy soul;  

The Light of Light shall fill thy soul  

When looking up.  


“Keep looking up—  

When worn, distracted by the fight;  

Your Captain gives you conquering might  

When you look up.”  

We can never see the sunrise by looking into the west. —Japanese Proverb

Friday, April 1, 2022

Hold Fast and Trust

 

ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను (యోబు 13:15).

నేను నమ్మినవాని ఎరుగుదును గనుక సిగ్గుపడను (2 తిమోతి 1:12). 

నా నావలన్నీ విరిగి

తెరచాపలు చిరిగి నిరర్థకమైనా 

శంక నన్నంటదు

నే నమ్మిన వానిని నేనెరుగుదును

కనిపించే కీడంతా నాకు మేలయ్యేను

ఆశలు జారినా అదృష్టాలు మారినా

నిన్నే నమ్మానంటూ గొంతెత్తి పిలిచేను


విన్నపాలు వీగిపోయినా, సన్నుతుడు మూగయైనా

నే నమ్మిన ప్రేమను నేనెరుగుదును

నేనర్రులు చాచే ఈవులు ఇవ్వకపోయినా

కళ్ళల్లో కన్నీళ్ళు సుళ్ళు తిరిగినా

భావనలలో ఎగసిన విశ్వాస హోమం

భారమైనా దూరమైనా ఆయనకే అర్పితం


బాధలు వడగండ్లయి బాధించినా

కష్టాలు కందిరీగలై వేధించినా

నేనెదురు చూసే ఔన్నత్యం నేనెరుగుదును

కష్టనష్టాలే దానికి నిచ్చెనలు

నా సిలువ క్రింద నే నలిగి నీరైనా

నా కెదురయ్యే విపరీత నష్టాలే

నా పాలిట అపురూప లాభాలు


విశ్వాసపు లంగరు దించాను

శోధన పెనుగాలుల నెదిరించాను

తొణకదు బెణకదు నా ఆత్మ నావ

మృత్యుసాగరపు తీరం చేరే దాకా

నా మనసు, నా తనువు ప్రకటించాయి

నా కడ ఊపిరిదాకా నీ విశ్వాస్యతను అనుమానించను నేనని

ఒక అనుభవశాలి అయిన నావికుడన్నాడు - “భయంకరమైన తుపాను చెలరేగినప్పుడు చెయ్యాల్సిన పని ఒకటుంది. అది తప్ప వేరే మార్గం లేదు. అదేమిటంటే ఓడని ఒక దిక్కుగా నిలిపి అది అక్కడే స్థిరంగా కదలకుండా ఉండేలా ఏర్పాటు చెయ్యడం.”

క్రైస్తవుడా, నువ్ చెయ్యవలసిందీ ఇదే. పౌలు ఉన్న ఓడ పెనుతుపానులో చిక్కుకున్నప్పుడు చాలాకాలం సూర్యుణ్ణి గాని, నక్షత్రాలు గాని చూడలేకపోయిన అనుభవం నీకు సంభవించవచ్చు. ఇలాంటప్పుడు ఒకటే దారి. ఇది తప్పనిసరి.

నీ తెలివితేటలు నీకు తోడు రావు. గతంలోని అనుభవాలు సహాయపడవు. ఒక్కోసారి ప్రార్థనలవల్ల కూడా ఓదార్పు కనిపించదు. ఇక మిగిలింది ఒకటే దారి. ఆత్మను ఒక దిశలో స్థిరంగా నిలిపి అటూ ఇటూ కొట్టుకుపోకుండా చూసుకోవడమే.

క్రీస్తు దిశగా ఆత్మ నావను లంగరు వెయ్యాలి. ఝంఝామారుతాలు, ఉవ్వెత్తున లేచిపడే కెరటాలు, విసిరికొట్టే ప్రవాహాలు, ఉరుములూ మెరుపులూ, గండశిలలూ ఏం వచ్చినా పర్వాలేదు. చుక్కానికి కట్టేసి, నీ ఆత్మ విశ్వాసానికి దేవుని విశ్వాస్యతనూ ఆయన నిబంధననూ యేసుక్రీస్తు ద్వారా నీపై చూపించే ప్రేమనూ ఆధారంగా చేసి స్థిరంగా ఉండాలి.

-----------------------------------------------------------------------------------------------------------------------------

Though he slays me, yet will I trust him (Job  - 13:15)

For I know whom I have believed - 2 Tim 1:12

“I will not doubt, though all my ships at sea  

Come drifting home with broken masts and sails;  

I will believe the Hand which never fails,  

From seeming evil worketh good for me.  

And though I weep because those sails are tattered,  

Still, will I cry, while my best hopes lie shattered:  

‘I trust in Thee.’


“I will not doubt, though all my prayers return  

Unanswered from the still, white realm above;  

I will believe it is an all-wise love  

Which has refused these things for which I yearn;  

And though at times I cannot keep from grieving,  

Yet the pure ardor of my fixed believing  

Undimmed shall burn.


“I will not doubt, though sorrows fall like rain,  

And troubles swarm like bees about a hive.  

I will believe in the heights for which I strive  

Are only reached by anguish and by pain;  

And though I groan and writhe beneath my crosses.  

I yet shall see through my severest losses  

The greater gain.


“I will not doubt. Well anchored is this faith,  

Like some staunch ship, my soul braves every gale;  

So strong its courage that it will not quail  

To breast the mighty unknown sea of death.  

Oh, may I cry, though body parts with spirit,  

‘I do not doubt,’ so listening worlds may hear it,  

With my last breath.”

“In fierce storms,” said an old seaman, “we must do one thing; there is only one way: we must put the ship in a certain position and keep her there.”

This, Christian, is what you must do. Sometimes, like Paul, you can see neither sun nor stars, and no small tempest lies on you; and then you can do but one thing; there is only one way.

Reason cannot help you; past experiences give you no light. Even prayer fetches no consolation. Only a single course is left. You must put your soul in one position and keep it there.

You must stay upon the Lord; and come what may—winds, waves, cross-seas, thunder, lightning, frowning rocks, roaring breakers—no matter what, you must lash yourself to the helm, and hold fast your confidence in God’s faithfulness, His covenant engagement, His everlasting love in Christ Jesus. —Richard Fuller

Thursday, March 31, 2022

Security in Storms

 

గాలి యెదురైనందున…. - (మత్తయి 14:24). 

పెనుగాలులు నాలుకలు చాపి విజృంభిస్తుంటాయి. మన జీవితాల్లో వచ్చే తుఫానులు ప్రకృతి సంబంధమైన సుడిగాలులకంటే భయంకరమైనవి కావా? కాని నిజంగా ఇలాంటి గాలివానల అనుభవాల గురించి మనం సంతోషించాలి. ఉదయం, అస్తమయం లేక సంవత్సరం పొడుగునా సంధ్యా సమయం ఉండే ప్రదేశాల్లో ఆకైనా గలగలలాడకుండా గాలి విసరని లోతైన కొండలోయల్లోనూ ఉండడం కంటే, వర్షాలు కురిసి వరదలు వచ్చేచోట్ల నివసించడం మేలు కదా. శోధనల కారుమేఘాలు గుండెల్లో గుబులు పుట్టించవచ్చు. కాని ఆత్మ తీవ్రత నిండిన ప్రార్ధనకి ప్రేరేపించేవి అవే కదా, ఇంకా ఆత్రుతతో మనకియ్యబడిన వాగ్దానాలను గట్టిగా పట్టుకునేలా చేసేవి అవే కదా.

ఎడబాటులనే తుఫానులు హృదయ విదారకమైనవి. అయితే తనవైపుకి మనల్ని  మళ్ళించుకునే దేవుని సాధనాలే అవి. ఆయన రహస్యంగా మనతో ఉండి మృదువుగా మెల్లగా మనతో మాట్లాడే సందర్భాలు అవి. అలలకీ పెనుగాలుల తాకిడికీ నావ ఊగినప్పుడే కదా నావికుని సామర్థ్యం బయటపడేది."

తుఫానులు మనపై విరుచుకుపడకుండా చేసేవాడు కాదు యేసు ప్రభువు, ఆ తుఫానులో మనకి అండగా నిలిచేవాడు ఆయన. మన ప్రయాణం సుఖంగా సాగుతుందని ఎప్పుడూ మాట ఇవ్వలేదాయన. కాని గమ్యం మాత్రం క్షేమంగా చేర్చే బాధ్యత ఆయనది.

పరలోక పవనాలొస్తున్నాయి, తెరచాప ఎత్తండి

పెనుగాలులు వీచినా, ఆటంకాలొచ్చినా

పొగమంచు పట్టినా, గాలివాన కొట్టినా

పయనం దూరమైనా, గమ్యం కానరానిదైనా

ఉప్పునీళ్ళ తుంపరలో, సాగరం కక్కే నురగల్లో

సాగిపో గమ్యం వైపుకి నీ పరుగుల్లో

-----------------------------------------------------------------------------------------------------------------------------

The wind was contrary - (Matt -  14:24)

Rude and blustering the winds of March often are. Do they not typify the tempestuous seasons of my life? But, indeed, I ought to be glad that I make acquaintance with these seasons. Better it is that the rains descend and the floods come than that I should stay perpetually in the Lotus Land where it seems always afternoon, or in that deep meadowed Valley of Avilion where never wind blows loudly. Storms of temptation appear cruel, but do they not give intenser earnestness to prayer? Do they not compel me to seize the promises with a tighter hand grip? Do they not leave me with a character refined?

Storms of bereavement are keen; but, then, they are one of the Father’s ways of driving me to Himself, that is the secret of His presence His voice may speak to my heart, soft and low. There is a glory of the Master that can be seen only when the wind is contrary and the ship is tossed with waves.

“Jesus Christ is no security against storms, but He is perfect security in storms. He has never promised you an easy passage, only a safe landing.”

Oh, set your sail to the heavenly gale,  

And then, no matter what winds prevail,  

No reef can wreck you, no calm delay;  

No mist shall hinder, no storm shall stay;  

Though far you wander and long you roam  

Through salt sea sprays and o’er white sea foam,  

No wind that can blow but shall speed you Home.