Tuesday, April 5, 2022

God's Mysterious Dealings

అప్పుడు నీవు నీ యింటిలోకి వచ్చి నీవును నీ కుమారులును లోపలనుండి తలుపు మూయవలెను (2 రాజులు 4:4). 

వాళ్ళు ప్రకృతి సిద్ధమైన సూత్రాలకీ, మానవ ప్రభుత్వాలకీ, సంఘానికీ, యాజకత్వానికి, చివరకి ఎలీషా ప్రవక్తకి కూడా అతీతమైన అద్భుత కార్యం కోసం ఎదురుచూస్తున్నారు గనుక దేవునితో ఒంటరిగానే ఉండాలి. మరెవ్వరు వాళ్ళతో ఉండకూడదు. మానవ అవగాహన శక్తినీ, విజ్ఞాన శాస్త్ర సూత్రాలనూ వదిలి అంతరిక్షంలో దేవుని  మహిమకి ఎదురై నిలిచి ఆ అలోక శక్తిని తేరిపార చూడాలి.

దేవునితో వ్యవహారాలు పెట్టుకోవాలంటే ఏ పద్ధతి అనుసరించాలో ఇక్కడ మనకి కన్పిస్తున్నది. ఒంటరిగా రహస్య స్థలంలో ప్రార్థన విశ్వాసాలతో ప్రతి ఆత్మా ఆయన కోసం ఎదురు చూడాలి.

కొన్ని సమయాల్లో, కొన్ని ప్రదేశాల్లో దేవుడు మనచుట్టూ ఒక అనిర్వచనీయమైన గోడ కడతాడు. మనకి ఉన్న ఆధారాలన్నింటినీ పడగొడతాడు. సాధారణంగా మనం పనులు చేసే పరిస్థితులనూ, విధానాలనూ, నిరర్ధకం చేస్తాడు. మనకర్థం కాని దివ్య వాతావరణంలో బంధిస్తాడు. అది మనకి ఇంతకుముందు అనుభవం కానిది, క్రొత్తది. మనకి ఇంతవరకు అలవాటైన అనుభవాల చట్రంలో ఇమడనిది. ఈ కొత్త అనుభవంలో అయితే ముందేం జరగనున్నదో మనకి తెలియదు. మన జీవితం అనే వస్త్రాన్ని దేవుడు తన స్వరూపం వచ్చేలా కత్తిరిస్తాడు.

చాలామంది భక్తిగల మనుష్యులు కూడా ఒక రకమైన గానుగెద్దు జీవితం గడుపుతుంటారు. ప్రతిరోజూ అదే జీవితం. ముందు ఏమి జరుగనున్నదో అనే సందేహం వాళ్లకు ఉండదు. కాని దేవుడు నడిపించే ఆత్మలైతే ఎన్నెన్నో ప్రత్యేకమైన ఊహలకందని అనుభవాల్లోకి వెళుతూ ఉంటారు. దేవుడు తమని నడిపిస్తున్నాడు అన్న విషయం తప్ప మరేదీ తెలియని అనిశ్చత పరిస్థితుల్లో ఆయన బంధిస్తాడు. వాళ్ళు దేవునిపై తప్ప మరిక దేని మీదా ఏ విధంగానూ ఆధార పడడం వీలుకాదు.

పై వాక్యంలోని విధవరాలిలాగా మనం కూడా బాహ్యమైన వాటిని వదిలి, లోపల కేవలం దేవునితో మాత్రమే కలుపబడితేనే తప్ప ఆయన చేసే అద్భుతాన్ని చూడలేము.

అతి కష్టకాలంలోనే దేవుణ్ణి గురించిన అతి మధురమైన రహస్యాలు బయటపడుతుంటాయి.

మనల్ని లోపలుంచి తలుపు మూసి
మన బాధలో, దుఃఖంలో పలుకుతాడు దేవుడు
మనసు విప్పి మృదువుగా, ఏకాంతంలో
ముత్యాల్లాంటి మాటలు మన చెవిలో
-----------------------------------------------------------------------------------------------------------------------------
    God's Mysterious Dealings

Thou shalt shut the door upon thee and upon thy sons (2 Kgs - 4:4)

They were to be alone with God, for they were not dealing with the laws of nature, nor human government, nor the church, nor the priesthood, nor even with the great prophet of God, but they must needs be isolated from all creatures, from all leaning circumstances, from all props of human reason, and swung off, as it were, into the vast blue inter-stellar space, hanging on God alone, in touch with the fountain of miracles.

Here is a part in the programme of God’s dealings, a secret chamber of isolation in prayer and faith which every soul must enter that is very fruitful.

There are times and places where God will form a mysterious wall around us, and cut away all props, and all the ordinary ways of doing things, and shut us up to something Divine, which is utterly new and unexpected, something that old circumstances do not fit into, where we do not know just what will happen, where God is cutting the cloth of our lives on a new pattern, where He makes us look to Himself.

Most religious people live in a sort of treadmill life, where they can calculate almost everything that will happen, but the souls that God leads out into immediate and special dealings, He shuts in where all they know is that God has hold of them, and is dealing with them, and their expectation is from Him alone.

Like this widow, we must be detached from outward things and attached inwardly to the Lord alone in order to see His wonders. —Soul Food

In the sorest trials God often makes the sweetest discoveries of Himself. —Gems

“God sometimes shuts the door and shuts us in,  
That He may speak, perchance through grief or pain,  
And softly, heart to heart, above the din,  
May tell some precious thought to us again.”

Monday, April 4, 2022

తండ్రి క్రియలను కలిగి ఉన్నావా

మనం చాల వీడియోలలో చూస్తుంటాము, అలాగే మన ఇంట్లో ఉండే పిల్లలను చూస్తుంటాము తల్లి లేదా తండ్రి ఏమి చేస్తే అదే చేస్తుంటారు, ముఖ్యంగా తండ్రి ఏది చేస్తే తమ బిడ్డలు అదే చేస్తుంటారు, తండ్రి నడిచినట్లుగానే, తండ్రి మాట్లాడినట్లుగానే, తండ్రి పడుకున్నట్లుగానే వీళ్ళు కూడా అలానే చేస్తుంటారు, అదేవిధముగా చాలామంది పిల్లలు తమ తల్లిదండ్రులు ఎంచుకున్న రంగమునే ఎంచుకుంటుంటారు. తల్లిదండ్రులు డాక్టర్స్ అయితే వీరు కూడా డాక్టర్ అవ్వాలని, వాళ్ళు టీచర్స్ అయితే వీళ్ళు కూడా టీచర్ అవ్వాలని ఇలా ప్రతిదానిలో కూడా తండ్రిని అనుసరిస్తూ ఉంటారు.  

అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నారు "కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు; ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును ఆలాగే చేయును - యోహాను 5:19" 

ఆయన పరమునుండి వచ్చారు తండ్రిని చూసారు కాబట్టే ఆ తండ్రి క్రియలనే చేస్తున్నారు, చేసారు... అయితే దేవుని వాక్యము సెలవిస్తుంది "తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవునివలన పుట్టినవారే గాని, రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు - యోహాను 1:12,13, యేసే క్రీస్తయి యున్నాడని నమ్ము ప్రతివాడును దేవునిమూలముగా పుట్టియున్నాడు - 1యోహాను 5:1"

 యసుక్రీస్తు నందు విశ్వాసముంచి మనం కూడా ఇప్పుడు శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టక దేవుని వలన పుట్టినవారము, దేవుణ్ణి అనుభవపూర్వకంగా తెలుసుకుని ఉన్నవారము, ఆయన గుణాలక్షణాలను ఎరిగి ఉన్నవారము, ఆయన ప్రేమను రుచిచూసిన మనం... మన అంతట మనమే ఏమి చెయ్యకుండా మన పరమ తండ్రి ఏమి చేసారో, మన పరమ తండ్రి ఎలాంటి క్రియలను కలిగి ఉన్నారో, యేరీతిగా పరిశుద్ధముగా ఉన్నారో, ఏ రీతిగా ప్రేమ, జాలి, దయ కృపాసమృద్ధిగల దేవుడై యున్నారో మనం కూడా అదేరీతిగా ఉండాలి కదా మరి అలా ఉంటున్నామా... 

 మరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచినవాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు - 1పేతురు 2:9

మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి - మత్తయి 5:16

 ననే దేవుడను మీరే నాకు సాక్షులు - యెషయా 43:12

మరి తండ్రి తండ్రి అని పిలుస్తున్న నీవు నేను తండ్రి గుణాతిశయములను ప్రచురిస్తున్నామా... తండ్రి ప్రేమను చూపిస్తున్నామా... తండ్రి క్రియలను కలిగి ఉంటున్నామా... 

 మనుష్యకుమారునిగా పుట్టిన యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రిని లోకానికి చూపించారు, తండ్రి ప్రేమను లోకానికి తెలియజేసారు, తండ్రి చిత్తాన్ని పూర్తిగా సంపూర్తిచేసారు.... మరి ఆతండ్రికి వారసులమైన మనం మన రక్షకునివలె తండ్రిని లోకానికి కనపరుస్తున్నామా... ఆ తండ్రివలె జీవిస్తున్నామా.... లేక పెదవులతో తండ్రి అని పిలుస్తూ హృదయాన్ని తండ్రికి దూరముగా ఉంచుకుని, తండ్రిని బాధపెడుతూ, మన వలన మన పరమతండ్రికి చెడ్డపేరువచ్చేలా జీవిస్తున్నామా... ఒక్కసారి ఆలోచిద్దాము.....  

Sunday, April 3, 2022

Honor Him in the Trials

 

అగ్నిలో యెహోవాను ఘనపరచుడి (యెషయా 24:15 ).

లో (లోపల) అనే చిన్ని మాటని గమనించండి. శ్రమల్లో మనం దేవుని ఘనపరచాలి. అగ్నిలో నడిచే తన పరిశుద్ధుల్ని కాలిపోకుండా దేవుడు నడిపించిన ఘట్టాలు కొన్ని ఉన్నప్పటికీ, సాధారణంగా అగ్ని కాలుస్తుంది.

అయితే ఇలాటి సందర్భాల్లోనే మనం దేవుని కీర్తించాలి. ఇదంతా మన మీదికి రప్పించడంలో మనపై ఆయనకున్న ప్రేమను, దయను విశ్వాసంతో తలచుకోవాలి.

పైగా మనకి సంభవించిన ఈ ఘోర శ్రమ ద్వారా ఆయనకి ఘనత దక్కే అవకాశం వచ్చిందని నమ్మాలి.

కొన్ని కొన్ని అగ్నిగుండాల్లోంచి వెళ్ళాలంటే అంతులేని విశ్వాసం కావాలి. అల్ప విశ్వాసం పనిచెయ్యదు. అగ్ని గుండంలోనే మనకి విజయం చేకూరుతుంది.

ఒక వ్యక్తిలోని నమ్మకం అంతా అతని కష్టకాలంలోనే బయటపడుతుంది. కొందరు మనుషులు మండే అగ్ని గుండంలో త్రోయబడ్డారు. ఎలా వెళ్ళారో అలానే బయటికి వచ్చారు. వాళ్ళ చేతులకి ఉన్న బంధకాలు తప్ప.

కొన్ని అగ్నిగుండాల్లో ఎంత అద్భుతంగా తప్పిస్తాడు దేవుడు! వాళ్ళ శరీరాలకు గాయాలుండవు. కనీసం చర్మం బొబ్బలెక్కదు. వాళ్ళ వస్త్రాలు కమిలిపోవు. అగ్ని వాసన కూడా వాళ్ళనంటదు. అగ్ని గుండాల్లోంచి క్రైస్తవులు బయటపడవలసిన తీరు ఇదే. బంధకాలు తెగిపోవాలి. కాని, అగ్ని జ్వాలలు వాళ్ళనంటకూడదు.

నిజమైన విజయం అంటే ఇదే. అస్వస్థతలో దానిని జయించడం, మరణ శయ్యపై మరణం మీద విజయం సాధించడం, ప్రతికూల పరిస్థితుల్లో వాటిని ఓడించడం.

నిజంగా చెప్తున్నాను, ఆవేదనలో మనల్ని విజేతలుగా చేసే శక్తి ఒకటున్నది. చేరవలసిన ఉన్నత స్థానాలు ఉన్నాయి. అక్కడనుండి క్రిందికి చూస్తూ మనం ఎక్కి వచ్చిన దారిని తలుచుకుని విజయగీతాలు పాడే చోటు ఉంది. మనం పేదలుగా ఉన్నప్పటికీ, మనుషులు మనల్ని ధనికులుగా భావించేలా చేసే మార్గం ఉంది. మన పేదరికంలో ఎంతో మందిని ధనవంతులుగా చెయ్యగలిగే పద్దతి ఉంది. మన విజయ రహస్యం ఏమిటంటే మనల్ని ఓడించబూనుకున్న పరిస్థితిలో నిలిచి ఉండే విజయం సాధించడం. క్రీస్తు సాధించిన విజయం ఆయన పొందిన అవమానాల్లోనే. అలానే మన విజయం కూడా మనం పొందిన అవమానాల్లోనే దాగి ఉంది.

అనేకమైన ఇబ్బందుల్లో మునిగి ఉండి కూడా చురుకుగా ఉండే హృదయం కలిగియున్న వాళ్ళని చూస్తే ఎంత ముచ్చటగా ఉంటుంది! భయంకరమైన శోధనల ఊబిలో కూరుకుపోయి కూడా జయశీలిగా బ్రతికేవాళ్ళ జీవితం ఇతరులకి ఎంత ఆదర్శప్రాయంగా, ప్రోత్సాహకరంగా ఉంటుంది! శరీరం అంతా నలగగొట్టబడినా వసివాడని సహనంతో మెరిసిపోయే బాటసారిని చూస్తే ఎంత ఆదరణగా ఉంటుంది! దేవుడు మనకెప్పుడూ తన కృపామృతాన్ని ప్రసాదిస్తాడన్న దానికి ఇవన్నీ ఎంత చక్కటి నిదర్శనాలు!

ఇహలోకపు ఆధారాలన్నీ కూలిపోయినప్పుడు

బ్రతుకంతా అల్లకల్లోల సాగరమైనప్పుడు

దేవుడు ఇచ్చే వింత సంతోషముందా నీకిప్పుడు?

-----------------------------------------------------------------------------------------------------------------------------

Glorify ye the Lord in the fires   ( Isa - 24:15)

Mark the little word “in”! We are to honor Him in the trial—in that which is an affliction indeed and though there have been cases where God did not let His saints feel the fire, yet, ordinarily, fire hurts.

But just here we are to glorify Him by our perfect faith in His goodness and love that has permitted all this to come upon us.

And more than that, we are to believe that out of this is coming something more for His praise than could have come but for this fiery trial.

We can only go through some fires with a large faith; little faith will fail. We must have the victory in the furnace. —Margaret Bottome

A man has as much religion as he can show in times of trouble. The men who were cast into the fiery furnace came out as they went in—except for their bonds.

How often in some furnace of affliction God strikes them off! Their bodies were unhurt—their skin not even blistered. Their hair was unsinged, their garments not scorched, and even the smell of fire had not passed upon them. And that is the way Christians should come out of furnace trials—liberated from their bonds, but untouched by the flames.

“Triumphing over them in it” (Col. 2:15).

That is the real triumph—triumphing over sickness, in it; triumphing over death, dying; triumphing over adverse circumstances, in them. Oh, believe me, there is a power that can make us victors in strife. There are heights to be reached where we can look down and over the way we have come, and sing our song of triumph on this side of Heaven. We can make others regard us as rich, while we are poor, and make many rich in our poverty. Our triumph is to be in it. Christ’s triumph was in His humiliation. Possibly our triumph, also, is to be made manifest in what seems to others humiliation. —Margaret Bottome

Is there not something captivating in the sight of a man or a woman burdened with many tribulations and yet carrying a heart as sound as a bell? Is there not something contagiously valorous in the vision of one who is greatly tempted, but is more than a conqueror? Is it not heartening to see some pilgrim who is broken in body, but who retains the splendor of unbroken patience? What a witness all this offers to the enduement of His grace! —J. H. Jowett

“When each earthly prop gives under,  

And life seems a restless sea,  

Are you then a God-kept wonder,  

Satisfied and calm and free?”