Wednesday, April 13, 2022

Waiting and Working

 

అక్కడ యెహోవా హస్తము నామీదికి వచ్చి, నీవు లేచి మైదానపు భూమికి వెళ్లుము, అక్కడ నేను నీతో మాటలాడుదునని ఆయన నాకు సెలవిచ్చెను. (యెహెజ్కేలు 3:22)

ప్రత్యేకంగా కొంత కాలం ఎదురు చూస్తూ గడపవలసిన అవసరం రాని వాళ్ళెవరూ దేవుని కోసం గొప్ప పనులు చేసినట్లు మనం చూడం. మొదట్లో తప్పనిసరిగా అలాంటి వాళ్ళు అనుకున్నవన్నీ పూర్తిగా తారుమారైపోతాయి. పౌలు తాను మారుమనసు పొందిన వెంటనే సువార్తతో ఉరకలేసేటప్పుడు మూడేళ్లు అరేబియా ఎడారిలో ఉండాల్సి రావడం నుండి ఈనాటి వరకు ఇది ఇలానే వస్తూ ఉంది.

నా విషయంలో ఇలానే జరిగింది. సాహిత్యం ద్వారా దైవ సేవ చేయడానికి నాకు అవకాశం దొరకగానే ఎగిరి గంతేసి మొదలుపెట్టేద్దామనుకున్నాను కానీ డాక్టర్ అడ్డుపడ్డాడు. “లాభం లేదు, ఆవిడకి రాయడం ముఖ్యమో ప్రాణం నిలబెట్టుకోవడం ముఖ్యమో తేల్చుకోవాలి” అన్నాడు. రెండూ చేయాలంటే కుదరదు.

ఇది 1860వ సంవత్సరంలో జరిగింది. ఆ గూట్లో నుండి నేను 1869 లో బయటకు వచ్చాను. నీడలో తొమ్మిదేళ్లు నన్ను ఎదురు చూస్తూ ఉంచిన దేవుని జ్ఞానం నాకు అర్థమైంది. దేవుని ప్రేమ మార్పు లేనిది. ఆయన ప్రేమ మనకి కనిపించకపోయినా అనుభవంలోకి రాకపోయినా ఆయన మాత్రం అలానే ప్రేమిస్తూ ఉంటాడు. ఆయన ప్రేమ, ఆయన ప్రభుత్వం ఒకదానితో ఒకటి పెనవేసుకున్నాయి. అందువల్ల మనకి ఇష్టంగానూ అభివృద్ధికరంగానూ కనిపించే వాటిని కొన్నిసార్లు మనకివ్వడు. ఎందుకంటే మనలో తన కార్యాలను ఇంకా విజయవంతంగా చెయ్యగలిగే పరిపక్వత ఇంకా రాలేదని ఆయనకి తెలుసు.

నా పనిని మౌనంగా ప్రక్కన పెట్టాను

విశ్రాంతి సమయాన్ని వినయంతో స్వీకరించాను

”విశ్రాంతి తీసుకో” అంటూ యజమాని పిలిచాడు

“క్రీస్తుతోనే నా విశ్రాంతి” నా మనసు పలికింది


తనదైన విశ్రాంతిని తన చేతితో ఇచ్చాడు

ఇప్పుడున్న అనారోగ్యం ఆయన నిర్ణయమే

విశ్రాంతి తీసుకోమంటే కష్టపడి పోతాం మనం ఆయన దారి మంచిది, అంధులం మనం


ఆయన ఇచ్చిన పనిని ఆయనే పూర్తి చేస్తాడు అలసిన పాదాలు నడవవలసిన దారులున్నాయి

అలసిన చేతులు చెయ్యవలసిన పనులు ఉన్నాయి

ఇప్పుడైతే విధేయత చూపాల్సిన అవసరం ఉంది


కదలక మెదలక ఉండడంలో దివ్య విశ్రాంతి ఉంది

తన ఇష్టప్రకారం ఆయన చేతులు తీర్చిదిద్దుతాయి

ఆయన పని జరగాలి పాఠం పూర్తిగా నేర్చుకోవాలి

మర్చిపోవద్దు, ఆయనకున్న నేర్పు మరెవ్వరికీ లేదు


పని చెయ్యడమే కాదు, శిక్షణ పొందాలి

శిక్షలో యేసు శిరస్సు వంచడం నేర్చుకున్నాడు ఆయన భారం తేలిక, ఆయన కాడి సులువు

నీతి ఉంది ఆయన క్రమశిక్షణలో


ఏ పనిముట్లు కావాలో ఏరుకోవడం

మన పని కాదు, మనం సేవకులమే

పనిలోనూ, ఎదురు చూడడం లోను

మన చిత్తం కాదు, దేవుని చిత్తమే నెరవేరాలి

దేవుడు మనకు పనులు పురమాయించినట్లుగానే విశ్రాంతి తీసుకునే స్థలాలను కూడా చూపిస్తాడు. విశ్రాంతి తీసుకోండి. అలసిన మిమ్మల్ని దారి ప్రక్కన బావి దగ్గరకు తీసుకు వచ్చిన ఆయన పట్ల కృతజ్ఞులై ఉండండి.

-----------------------------------------------------------------------------------------------------------------------------

And the hand of the Lord was there upon me; and he said unto me, Arise, go forth unto the plain, and I will there talk with thee (Ezek - 3:22)

Did you ever hear of anyone being much used for Christ who did not have some special waiting time, some complete upset of all his or her plans first; from St. Paul’s being sent off into the desert of Arabia for three years, when he must have been boiling over with the glad tidings, down to the present day?

You were looking forward to telling about trusting Jesus in Syria; now He says, “I want you to show what it is to trust Me, without waiting for Syria.”

My own case is far less severe, but the same in principle, that when I thought the door was flung open for me to go with a bound into literary work, it is opposed, and the doctor steps in and says, simply, “Never! She must choose between writing and living; she can’t do both.”

That was in 1860. Then I came out of the shell with “Ministry of Song” in 1869 and saw the evident wisdom of being kept waiting nine years in the shade. God’s love is unchangeable, He is just as loving when we do not see or feel His love. Also, His love and His sovereignty are co-equal and universal; so He withholds the enjoyment and conscious progress because He knows best what will really ripen and further His work in us. —Memorials of Frances Ridley Havergal

I laid it down in silence,  

This work of mine,  

And took what had been sent me—  

A resting time.  

The Master’s voice had called me  

To rest apart;  

“Apart with Jesus only,”  

Echoed my heart.  


I took the rest and stillness  

From His own Hand,  

And felt this present illness  

Was what He planned.  

How often do we choose labor,  

When He says “Rest”—  

Our ways are blind and crooked;  

His way is best.  


The work Himself has given,  

He will complete it.  

There may be other errands  

For tired feet;  

There may be other duties  

For tired hands,  

The present is obedience  

To His commands.  


There is a blessed resting  

In lying still,  

In letting His hand mold us,  

Just as He will.  

His work must be completed.  

His lesson set;  

He is the higher Workman:  

Do not forget!  


It is not only “working.”  

We must be trained;  

And Jesus “learned” obedience,  

Through suffering gained.  

For us, His yoke is easy,  

His burden is light.  

His discipline most needful,  

And all is right.  


We are but under-workmen;  

They never choose  

If this tool or if that one  

Their hands shall use.  

In working or in waiting  

May we fulfill  

Not ours at all, but only  

The Master’s will!  

—Selected

God provides resting places as well as working places. Rest, then, and be thankful when He brings you, wearied to a wayside well.

Tuesday, April 12, 2022

God Permits Temptation

 

యేసు పరిశుద్ధాత్మ  పూర్ణుడై  యొర్దాను నది నుండి  తిరిగివచ్చి  నలువది దినములు  ఆత్మచేత  అరణ్యములో నడిపింపబడి అపవాది చేత  శోధింపబడి చుండెను - (లూకా 4:1,2).

యేసు పరిశుద్ధాత్మతో నిండి ఉన్నాడు. అయినప్పటికీ శోధన తప్పలేదు. శోధన అన్నది మనం దేవునికి ఎంత దగ్గరగా ఉంటే అంత బలంగా వస్తుంది. సైతాను లక్ష్యాలు ఎప్పుడూ అతి ఉన్నతంగా ఉంటాయి. ఒకసారయితే ఒక అపొస్తలుడి చేత “యేసు ఎవరో నాకు తెలియదు” అని పలికించగలిగాడు వాడు. 

మార్టిన్ లూథర్ కంటే ఎక్కువసార్లు సైతానుతో ఘర్షణకు దిగిన వాళ్లు చాలా తక్కువమంది ఉంటారేమో. ఎందుకు? లూధర్ ఏకంగా నరక రాజ్యం మీదే దండెత్తాడు. జాన్ బన్యన్ సైతానుపై సాధించిన విజయాలను ఎవరు వర్ణించగలరు!

ఎవరిలో అయితే ఎక్కువగా దేవుని ఆత్మ నిండి ఉంటుందో వారికి అపవాదితో ఎక్కువ పోరాటాలు తటస్థిస్తాయి. దేవుడు అందుకు సమ్మతిస్తాడు. ఎందుకంటే తుపానులు వృక్షాలకు ఎలా మేలు చేస్తాయో, శోధనలు మన ఆత్మీయ జీవితాలకు అలా మేలు చేస్తాయి. వేరు లోతుగా తన్నడానికి సహాయ పడతాయి ఈ తుఫానులు.  పింగాణీని కాల్చడం వల్ల ఆ పాత్ర సౌష్టవం శాశ్వతం అవుతుంది కదా!

నువ్వు క్రీస్తు చేతిని గట్టిగా పట్టుకొని ఉన్నావని, ఆయన నిన్ను పట్టుకుని ఉన్నాడని నీకు తెలియదు. సైతాను తన శక్తినంతా ఉపయోగించి నిన్ను రెండో వైపుకి లాగుతున్నప్పుడు క్రీస్తు నిన్ను తన వైపుకి లాక్కోవడం తెలుస్తుంది.

అసాధారణమైన కష్టాలు వస్తే అవి మనం చేసిన అసాధారణమైన పాపాలకు ప్రతిఫలం అని భావించకూడదు. కొన్నిసార్లు అవి అసాధారణమైన కృపకు ప్రతిరూపాలే. తన ఆభరణాలను మెరుగు పెట్టడానికి దేవుని దగ్గర పదునుగల పరికరాలు చాలా ఉన్నాయి. ఆయన ప్రత్యేకంగా ప్రేమించి ఎవరినైతే ఎక్కువ తళతళలాడేలా చేయాలనుకుంటాడో వాళ్లపైనే ఎక్కువగా తన పరికరాలను వాడతాడు.

ఇది ఇది నా వ్యక్తిగత సాక్ష్యం. దేవుడి కర్మాగారంలోని కొలిమికీ, సుత్తులకీ, సానపెట్టే పరికరాలకీ నేను ఋణపడి ఉన్నాను. అసలు బెత్తం ద్వారా తప్ప నేను నేర్చుకున్నదేదైనా ఉందా అని నా అనుమానం. నేను శిక్షణ పొందుతున్న గదిలో చీకటి క్రమ్మిన వేళల్లో నేను స్పష్టంగా చూడగలను.

-----------------------------------------------------------------------------------------------------------------------------

And Jesus being full of the Holy Ghost returned from Jordan and was led by the Spirit into the wilderness, being forty days tempted of the devil (Luke - 4:1-2)

Jesus was full of the Holy Ghost, and yet He was tempted. Temptation often comes upon a man with its strongest power when he is nearest to God. As someone has said, “The devil aims high.” He got one apostle to say he did not even know Christ.

Very few men have such conflicts with the devil as Martin Luther had. Why? Because Martin Luther was going to shake the very kingdom of hell. Oh, what conflicts John Bunyan had!

If a man has much of the Spirit of God, he will have great conflicts with the tempter. God permits temptation because it does for us what the storms do for the oaks—it roots us, and what the fire does for the paintings on the porcelain—it makes them permanent.

You never know that you have a grip on Christ, or that He has a grip on you, as well as when the devil is using all his force to attract you from Him; then you feel the pull of Christ’s right hand. —Selected

Extraordinary afflictions are not always the punishment of extraordinary sins, but sometimes the trial of extraordinary graces. God hath many sharp-cutting instruments, and rough files for the polishing of His jewels; and those He especially loves and means to make the most resplendent, He hath oftenest His tools upon. —Archbishop Leighton

I bear my willing witness that I owe more to the fire and the hammer, and the file than to anything else in my Lord’s workshop. I sometimes question whether I have ever learned anything except through the rod. When my schoolroom is darkened, I see most.

Monday, April 11, 2022

Proclaim What You Have Learned

 

చీకటిలో  నేను మీతో  చెప్పునది  మీరు వెలుగులో చెప్పుడి (మత్తయి 10:27).

మన దేవుడు మనకి కొన్ని విషయాలు చెప్పాలని మాటిమాటికీ మనల్ని చీకటిలోకి తీసుకుపోతున్నాడు. నీడలు కమ్మిన ఇంట్లోకి,  ఆవేదన పరదాలు కట్టిన గదుల్లోకి, ఒంటరితనం నిండిన దిక్కుమాలిన జీవితంలోకి, ఏదో ఒక వైకల్యం మనల్ని పిండిచేసే దుఃఖపు చీకటి కొట్టులోకి నడిపిస్తున్నాడు.

అక్కడ అత్యాశ్చర్యం, అత్యద్భుతం అయిన తన నిత్య, అనంత సత్యాలను చెప్తాడు. మిరుమిట్లు గొలిపే ఈ లోకపు కాంతివల్ల గుడ్డివైపోయిన మన కళ్ళకు పరలోకపు నక్షత్ర సమూహాలు కనపడేలా చేస్తాడు. బండబారిన మన చెవులకు తన మృదువైన స్వరాన్ని వినిపిస్తాడు. ఇహలోకపు రణగొణధ్వనులలో అయితే ఆ స్వరం వినిపించదు మరి.

 కాని  ఈ విధంగా వినడం వల్ల బాధ్యత మన మీద దానంతటదే పడుతున్నది. "దానిని మీరు వెలుగులో చెప్పండి. ఇంటి కప్పుల మీద దానిని ప్రకటించండి." అదే దేవుడు మనకు అప్పగించిన బాధ్యత. 

మనం కలకాలం చీకట్లోనే, మూసిన తలుపుల వెనకనే ఉండిపోకూడదు. త్వరలోనే జీవితపు త్రొక్కిసలాటలోకి మనమూ వెళ్ళవలసి ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు మనం చీకట్లో నేర్చుకున్న దాన్ని ప్రకటించవలసి ఉంది.

దీని వలన శ్రమలు అనుభవించడంలోను, తలాతోకా లేనట్టు అనిపించే సంఘటనల్లోనూ ఒక క్రొత్త  ప్రయోజనం, అర్థం మనకు స్పురిస్తాయి.

"నేనెంత పనికిమాలిన వాణ్ణి!" "మనుషుల ప్రయోజనార్థం నేనేమి చేస్తున్నాను?"  "నా ఆత్మ అనే ఈ ప్రశస్త పరిమళ ద్రవ్యం ఇలా వ్యర్థం కావలసిందేనా?"  శ్రమలనుభవించేవారు ఇలా వాపోతూ ఉంటారు. అయితే వీటన్నింటిలో దేవునికి ఒక పధకం ఉంది. ఆయన వాళ్లను తనకి సమీపంగా ఎత్తైన కొండల్లోకి పిలిచి ముఖాముఖి మాట్లాడుతున్నాడు. వాళ్లు కొండ దిగి వెళ్లి ఎదురు చూస్తున్న జనసమూహానికి ఆ సందేశాలను అందించాలి.

కొండమీద మోషే గడిపిన  నలభై రోజులు, హోరేబులో ఏలీయా గడిపిన కాలము, అరేబియాలో పౌలు గడిపిన సంవత్సరాలు వ్యర్థం ఎలా అవుతాయి?

విశ్వాస జీవితంలో దగ్గర దారి అంటూ ఏమీ లేదు.  దేవునితో ఒంటరి సంభాషణ, సహవాసం, ధ్యానం ప్రతి ఒక్కరికీ తప్పనిసరి. దైవ సన్నిధి అనే శిఖరాగ్రంలో సహవాసమూ, స్థిరమైన బండ సందులో విశ్రాంతికరమైన నిద్ర విశ్వాస జీవితంలో అంతర్భాగాలు. ఇహలోకపు తాపత్రయాలను అంధకారం కమ్మి ఆకాశ తారలు కనిపించే వేళల్లో అనంతమూ, శాశ్వతమూ అయిన ప్రపంచాల దర్శనాలను మన ఆత్మలు చూడగలగడం అన్నది అవశ్యం.

దైవసన్నిధి మన ఆత్మలో సుస్థిరంగా నెలకొని ఉండాలంటే ఇంతకంటే వేరే మార్గం లేదు. అలాంటప్పుడే మన ఆత్మలు కూడా కీర్తనకారుడితో కలిసి పాడగలుగుతాయి "దేవా నీవు సమీపంగా ఉన్నావు.”

-----------------------------------------------------------------------------------------------------------------------------

What I tell you in the darkness, speak ye in the light (Matt -  10:27)

Our Lord is constantly taking us into the dark, that He may tell us things. Into the dark of the shadowed home, where bereavement has drawn the blinds; into the dark of the lonely, desolate life, where some infirmity closes us in from the light and stir of life; into the dark of some crushing sorrow and disappointment.

Then He tells us His secrets, great and wonderful, eternal and infinite; He causes the eye which has become dazzled by the glare of earth to behold the heavenly constellations; and the ear to detect the undertones of His voice, which is often drowned amid the tumult of earth’s strident cries.

But such revelations always imply a corresponding responsibility—’ that speak ye in the light—that proclaim upon the housetops.”

We are not meant to always linger in the dark, or stay in the closet; presently we shall be summoned to take our place in the rush and storm of life; and when that moment comes, we are to speak and proclaim what we have learned.

This gives a new meaning to suffering, the saddest element in which is often its apparent aimlessness. “How useless I am!” “What am I doing for the betterment of men?” “Wherefore this waste of the precious spikenard of my soul?”

Such are the desperate laments of the sufferer. But God has a purpose in it all. He has withdrawn His child to the higher altitudes of fellowship, that he may hear God speaking face to face, and bear the message to his fellows at the mountain foot.

Were the forty days wasted that Moses spent on the Mount, the period spent at Horeb by Elijah, or the years spent in Arabia by Paul?

There is no shortcut to the life of faith, which is the all-vital condition of a holy and victorious life. We must have periods of lonely meditation and fellowship with God. That our souls should have their mountains of fellowship, their valley of quiet rest beneath the shadow of a great rock, their nights beneath the stars, when darkness has veiled the material and silenced the stir of human life, and has opened the view of the infinite and eternal, is as indispensable as that our bodies should have food.

Thus alone can the sense of God’s presence become the fixed possession of the soul, enabling it to say repeatedly, with the Psalmist, “Thou art near, 0 God.” —F. B. Meyer

“Some hearts, like evening primroses, open more beautifully in the shadows of life.”