◆ బంధకములనుండి విడుదల అవసరం:
ఇశ్రాయేలీయులు ఐగుప్తు లో 430 సంవత్సరములు బానిసలుగా బాధలను అనుభవించుచున్నపుడు వారు పెట్టిన మొఱ్ఱ కృప కలిగిన దేవుడు ఆలకించి వారిని విడిపించుటకు మోషే ను పంపించాడు. యూదా జనాంగము బబులోనులో చేరలోనుండుటకు కొనిపోబడిన 70 సంవత్సరముల తరువాత వారిని బంధకముల నుండి విడిపించాడు.
● విమోచనకై మార్గాలు ●
◆ విమోచించగలవాడు దేవుడొక్కడే:
"కాబట్టి ఐగుప్తీయుల చేతిలోనుండి వారిని విడిపించుటకును, ఆ దేశములోనుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు హిత్తీయులకు అమోరీయులకు పెరిజ్జీయు లకు హివ్వీయులకు యెబూసీయులకు నివాసస్థానమై, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించు టకును దిగివచ్చి యున్నాను. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నాయొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారినిపెట్టు చున్న హింస చూచితిని." (నిర్గమ 3: 8,9).
◆ విమోచించుటకు ఒక మధ్యవర్తి కావాలి:
"కాగా రమ్ము, నిన్ను ఫరోయొద్దకు పంపెదను; ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులోనుండి తోడుకొని పోవలెననెను. (నిర్గమ 3:10)." ఇశ్రాయేలీయులు తమ కష్టకాలంలో దేవునికి మొఱ్ఱపెట్టగా మొదట మోషేను, ఒకసారి ఒత్నియేలును, ఒకసారి ఏ హుదును, ఒకసారి గిద్యోనును ( న్యాయాధిపతులు 3:9,15; 6:14) వారికి రక్షకులుగా పంపితివి. మనం పాపులుముగా ఉండగా యేసే స్వయముగా రక్షకునిగా (మత్త 1:21) వచ్చియున్నాడు.
◆ విమోచించుటకు రక్తం అవసరం:
"మీరున్న యిండ్లమీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయెదను. నేను ఐగుప్తుదేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు." (నిర్గమ 12:13). ఇశ్రాయేలీయుల పస్కా పశువు రక్తమును తమ ఇంటి ద్వారము యొక్క కమ్మీ మీద చిలకరించుట ద్వార దేవుని ఆజ్ఞ నెరవేర్చి మరణము నుండి తప్పింపబడి యున్నారు. మానమింక పాపులమై యుండగా పస్కా పశువుగా యేసే విధింప బడి ఆ రక్తము ద్వార మనం రక్షింపబడియున్నాము. "అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల. మనము అన్యోన్యసహవాసము గలవారమైయుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును. (1 యెహను 1:7)".
◆ విమోచించుటకు బహువు (ఒక శక్తి ) అవసరం:
"కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఈలాగు చెప్పుమునేనే యెహోవాను; నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి, వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి, నా బాహువు చాపి గొప్ప తీర్పులుతీర్చి మిమ్మును విడిపించెదను (నిర్గమ 6:6)."
"నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది నేను కలుగజేయు రక్షణ బయలుదేరుచున్నది నా బాహువులు జనములకు తీర్పుతీర్చును ద్వీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవా రగుదురు వారు నా బాహువును ఆశ్రయింతురు. (యెషయా 51:5)"
ఉగ్రత నుండి తప్పించుకొనుటకు, విమోచింపబడుటకు యేసు యొక్క బహువు అవసరం.
◆ విమోచించడానికి ఒక దినం అవసరం:
ఇశ్రాయేలీయులు 450 సంవత్సరములు గడిచిన తరువాతే యెహోవా సేనలు ఐగుప్తు నుండి బయలుదేరి పోయెను. ఆనాడే పస్కా (15th of Bisan). ఇది దైవ నిర్ణయం. ఇది ఆదిలో అబ్రాహామును పిలిచిన దినమున దేవుడు బయలుపరచాడు (ఆది 15:14). ఆ మహా దేవుని ప్రణాళిక ఎంత సుధీర్ఘమైనది? మరి మన విషయమైతే ప్రతి వ్యక్తి రక్షణ (విమోచన) గూర్చి ఒక దినము నిర్ణయించాడు (హెబ్రీ 4:7), ఇదిగో ఇదియే రక్షణ దినము (2కోరింది 6:2). కాబట్టి రక్షణ పొందుటకు ఆలస్యము చేయకు. మంచి రోజు అని చూడకు. ఎందుకంటే రేపు నీది కాదేమో!
ప్రియమైన సహోదరుడా, సహోదరీ నీవు మరణము యొక్క బలము నుండి, ధర్మశాస్త్ర శాపము నుండి, దుర్నీతి నుండి, సాతాను బంధకముల నుండి విడుదల పొందితివా? అవును అంటే దేవునికి వందనములు. ఇంకా లేదు అంటే నేడే నిన్ను నీవు దేవునికి అప్పగించుకో. ఎందుకనగా నీకు నీవు విడిపించుకోలేవు సుమా! విమోచింపబడిన ఇశ్రాయేలు వలె ఎఱ్ఱసముద్రం దాటి, యెర్ధను దాటి కనాను చేరాలి. విమోచింపబడిన గాడిద వలె ప్రభువుని కలిగి యెరూషలేము చేరాలి. అలా చేరుటకు ఆ ప్రభువు సహాయం చేయును గాక! ఆమెన్!!!