Saturday, April 23, 2022

Thou Wilt Revive Me

 

నేను ఆపదలలో చిక్కుబడియున్నను నీవు నన్ను బ్రదికించెదవు (కీర్తన 138:7)

హెబ్రీ భాషలో ఈ మాటలెలా ఉన్నాయంటే “ఆపదల మధ్యలోకి వెళ్ళినప్పటికీ” అని వ్రాయబడ్డాయి. మన కష్టకాలంలో దేవుడికి మనం మొర్రపెట్టాము. విడిపిస్తానన్న ఆయన మాటనుబట్టి ఆయన్నడిగాము, గాని విడుదల రాలేదు. శత్రువు వేధిస్తూనే ఉన్నాడు. మనం యుద్ధరంగ నడిబొడ్డులోకి, ఆపదల కేంద్ర బిందువులోకి వెళ్ళిపోయాం. ఇక ప్రభువుకు మొర్రపెట్టి మాత్రం ప్రయోజనం ఏముంది?అని అనుకుంటాము. 

మార్త అంది కదా, “ప్రభూ, నువ్వు ఇక్కడ ఉన్నట్టయితే మా తమ్ముడు చనిపోయే వాడు కాదు.” అయితే ఈ నైరాశ్యాన్ని యేసు మరొక వాగ్దానంతో ఎదుర్కొన్నాడు. “మీ తమ్ముడు తిరిగి బ్రతుకుతాడు” ఇలా కష్టాల నడిబొడ్డుకి మనం చేరినప్పుడు మార్త లాగా మనం కూడా ఇక విడుదల సమయం దాటిపోయిందని అనుకుంటాము. కాని తన వాక్యం లోని వాగ్దానం ద్వారా ఆయన మనకి జవాబిస్తున్నాడు. “నీవు ఆపదలలో చిక్కుబడి యున్నను, నేను నిన్ను బ్రతికించెదను.”

ఆయన ఆదుకోవడం ఆలస్యం చేసినప్పటికీ మనం ఆపదల్లోనే ఇంకా కొనసాగుతూ ఉన్నప్పటికీ ఆపద నడిబొడ్డే ఆయన మనల్ని బ్రతికించే చోటు. మనల్ని విడిచిపెట్టే చోటు కాదది.

ఆశలు అడుగంటిన ఆ స్థలంలోనే ఆయన మన శత్రువు దౌర్జన్యానికి విరోధంగా - తన చెయ్యి చాపి వాడిని సరిచేస్తాడు. సరిగ్గా ఆ క్షణంలోనే, ఆయన మనపై జరిగే దాడిని అరికట్టి శత్రువును ఓడించి సమాప్తం చేస్తాడు. ఇక మనం నిస్పృహ చెందవలసిన అవసరం ఏముంది?

సుడిగాలి నిన్నెగరేసుకు పోగలదని

దిగులుపడి దీనంగా దిక్కులు చూడకు

వడగండ్లవాన వేధిస్తుందని వేదన పడకు

తుపాను నడిబొడ్డుకి ధైర్యంగా నడిచివెళ్ళు

అక్కడుందో చోటు వెచ్చగా హాయిగా

విశ్వాసపు నేత్రాలకి మాత్రమే కనిపించే చోటు.


సుడులపై చిందులు తొక్కింది పెనుగాలి

దుష్టశక్తులు పొర్లిపారాయి కట్టలు తెంచుకుని

కొండల్లా అలలెగసిపడ్డాయి

వాన పడగ అవనిని మూసింది

దేవుడి నానుకున్న ఆత్మ నిబ్బరంగా ఉంది

తుపాను నడిబొడ్డున స్తుతి పాటలు పాడింది 


పెనుచీకటిలో ఆశల్ని ఆర్పెయ్యవద్దు

పెనుగాలికి కొంతకాలం చిరుదీపం ఆరినా

చీకటి వెనకాల పెనుతారలు వెలుగుతున్నాయి

తండ్రి ప్రేమ నీకు ఇస్తుంది ఆకాశ దీపాల కాంతి

చీకటి పొరల్ని చీల్చుకుని పైపైకి దృష్టి సారించు

కాంతిమయుని వదనారవిందంలోకి


ప్రమాదం నుండీ పాపం నుండీ నీకు రక్షణగా

దేవుడే తుపానుని రప్పించాడు

ఆయన మాటతోనే ఊరుకుంటుంది

గాలిచేసే గోల హల్లెలూయ అవుతుంది

అందుకే తుఫాను మబ్బులు పడితే ఉత్సహించు

తుఫాను నడిబొడ్డులో దేవుని చిరునవ్వు నీకు తోడు

-----------------------------------------------------------------------------------------------------------------------------

Though I walk in the midst of trouble, thou wilt revive me (Ps - 138:7)

The Hebrew rendering of the above is “go on in the center of trouble.” What descriptive words! We have called on God in the day of trouble; we have pleaded His promise of deliverance but no deliverance has been given; the enemy has continued oppressing us until we were in the very thick of the fight, in the center of trouble. Why then trouble the Master any further?

When Martha said, “Lord, if thou hadst been here my brother had not died,” our Lord met her lack of hope with His further promise, “Thy brother shall rise again.” And when we walk “in the center of trouble” and are tempted to think like Martha that the time of deliverance is passed, He meets us too with a promise from His Word. “Though I walk in the midst of trouble, thou wilt revive me.”

Though His answer has been so long delayed, though we may still continue to “go on” amid trouble, “the center of trouble” is the place where He revives, not the place where He fails us.

When in the hopeless place, the continued hopeless place, is the very time when He will stretch forth His hand against the wrath of our enemies and perfect that which concerneth us, the very time when He will make the attack cease and fail and come to an end. What occasion is there then for fainting? —Aphra White

THE EYE OF THE STORM

“Fear not that the whirlwind shall carry thee hence,  

Nor wait for its onslaught in breathless suspense,  

Nor shrink from the whips of the terrible hail,  

But pass through the edge to the heart of the gale,  

For there is a shelter, sunlight and warm,  

And Faith sees her God through the eye of the storm.  


“The passionate tempest with rush and wild roar  

And threatenings of evil may beat on the shore,  

The waves may be mountains, the fields battle plains,  

And the earth be immersed in a deluge of rains,  

Yet, the soul stayed on God, may sing bravely its psalm,  

The heart of the storm is the center of calm.  


“Let hope be not quenched in the blackness of night,  

Though the cyclone awhile may have blotted the light,  

For behind the great darkness the stars ever shine,  

And the light of God’s heavens, His love shall make thine,  

Let no gloom dim thine eyes, but uplift them on high  

To the face of thy God and the blue of His sky.  


“The storm is thy shelter from danger and sin,  

And God Himself takes thee for safety within;  

The tempest with Him passeth into a deep calm,  

And the roar of the winds is the sound of a psalm.  

Be glad and serene when the tempest clouds form;  

God smiles on His child in the eye of the storm.”

Friday, April 22, 2022

God Knows

 నేను నడచుమార్గము ఆయనకు తెలియును (యోబు 23:10). 

విశ్వాసీ, ఎంత ఆదరణకరమైన హామీ ఇది! నువ్వు నడిచేదారి అది ఎంత అస్తవ్యస్తంగా, వంకరటింకరగా, అర్థం కాకుండా ఉన్నప్పటికీ అది శ్రమలతో, కన్నీళ్ళతో నిండిన దారైనప్పటికీ, అది దేవునికి తెలుసు. అగ్నిగుండం వేడిమి ఏడింతలు ఎక్కువ కావచ్చు. దేవుడు దాన్ని చల్లబరుస్తాడు. మన అడుగుల్ని సరిగా వేయించే సర్వశక్తిమంతుడు మనకున్నాడు. అది మారా లాంటి చేదైన ప్రదేశం కానివ్వండి, ఏలీము లాంటి సేదదీర్చే చోటు కానివ్వండి. అంతా దేవునికి తెలుసు. 

ఆ దారిలో ఐగుప్తు సైన్యాలకి చీకటినీ, ఇశ్రాయేలువాళ్ళకి వెలుగునూ ఇచ్చే అగ్ని స్థంభం, మేఘ స్థంభం ఉన్నాయి. అగ్ని గుండం మండుతోంది. కాని దాన్ని వెలిగించిన దేవుడు నమ్మదగినవాడు. అంతేకాక ఆ అగ్ని మనల్ని దహించడానికి కాదుగాని, శుద్ధి చెయ్యడానికే అని ఆయన మాట ఇచ్చాడు. ఆయన నిర్ణయించిన సమయానికి ఆ శుద్ధి కార్యక్రమం పూర్తి అయితే ఆయన తన ప్రజల్ని మేలిమి బంగారంలాగా బయటికి తీస్తాడు. 

ఆయన చాలా దూరంగా ఉన్నాడనుకునే సమయంలో నిజానికి ఆయన అతి సమీపంగా ఉంటాడు.

మిట్ట మధ్యాహ్నపు సూర్యబింబం కంటే ప్రకాశమానమైనదెవరో మీకు తెలుసా? ఉదయకాలపు కిరణాలతోపాటు మనల్ని పలకరించి నిద్రలేపేదెవరో తెలుసా? మితిలేని లాలిత్యం, మృదుత్వం, వాత్సల్యం కురిపిస్తూ మన వెన్నంటి తిరుగుతూ ఉండే ఆ కళ్ళెవరివో మీకు తెలుసా?

కష్టాలెదురైనప్పుడు లోకానికి చెందిన మనుషులు ఏదేదో పదజాలాలను సృష్టించి ఇదంతా ఖర్మ అంటారు. "అంతా ఆ పైవాడి లీల” అంటారు. విధి వైపరీత్యం అంటారు. విధి అంటే ఏమిటి? అర్థంలేని అలాంటి పదాలు వాడటం అనవసరం. 

సజీవుడైన పరమ దేవుడిని, చక్రవర్తిలాగా అన్నింటినీ తన సంకల్పమాత్రంగా నడిపిస్తున్న దేవుడిని, వర్ణించడంలో అర్థంపర్థంలేని ”విధి” లాటి మాటల్ని ఆయనకి బదులుగా ఉపయోగించడం ఏమిటి? పనులు చేస్తూ తన ఇష్ట ప్రకారం సమస్తాన్నీ చక్కబరుస్తున్న వ్యక్తిగతమైన నిజ యెహోవాకి బదులుగా ఏవేవో వేదాంత శబ్దాలు వాడడం ఎందుకు?

మహాశ్రమలు తనను చుట్టుకుని ఇహలోకపరంగా ఆశలన్నీ అడుగంటిన వేళ యోబు దృష్టి నేరుగా దేవునిపైనే పడింది. మనుషులెవరూ కాదు, దేవుడే అది తనకు చేసాడని నమ్మాడు. ఇలాటి దృష్టి మనమూ కలిగి ఉంటే మనకి వచ్చిన శ్రమ ఎంత వేధిస్తున్నా అది మనల్ని బాధించలేదు కదా. యోబుకి షేబాయీయుల కత్తుల వెనక దేవుని హస్తమే కనబడింది. ఆకాశంనుండి పడిన పిడుగు వెనక, తన కుమారుల ఇంటిని చుట్టుముట్టి నాశనం చేసిన సుడిగాలి వెనక, సమస్తమూ పోయి నిశ్శబ్దం తప్ప ఏమీ మిగలని తన జీవితం వెనక దేవుని హస్తాన్నే చూసాడు.

“యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనిపోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక.”

అన్నిటిలోనూ దేవుణ్ణి చూస్తూ ఉన్న యోబులో విశ్వాసం పరిపక్వమైంది. ఊజు దేశపు సంపన్నుడు తన బూడిదెలో కూర్చుని ఉండి కూడా అనగలుగుతున్నాడు “ఆయన నన్ను సంహరించినా, నేనాయనలో నమ్మకముంచుతాను.” ఎంత విశ్వాసం!

-----------------------------------------------------------------------------------------------------------------------------

He knoweth the way that I take (Job -  23:10)

Believer! What a glorious assurance! This way of thine—this, it may be, a crooked, mysterious, tangled way—this way of trial and tears. “He knoweth it.” The furnace seven times heated—He lighted it. An Almighty Guide is knowing and directing our footsteps, whether it be to the bitter Marah pool, or to the joy and refreshment of Elim.

That way, dark to the Egyptians, has its pillar of cloud and fire for His own Israel. The furnace is hot; but not only can we trust the hand that kindles it, but we have the assurance that the fires are lighted not to consume, but to refine; and that when the refining process is completed (no sooner—no later) He brings His people forth as gold.

When they think Him least near, He is often nearest. “When my spirit was overwhelmed, then thou knewest my path.”

Do we know of ONE brighter than the brightest radiance of the visible sun, visiting our chamber with the first waking beam of the morning; an eye of infinite tenderness and compassion following us throughout the day, knowing the way that we take?

The world, in its cold vocabulary in the hour of adversity, speaks of “Providence”—“the will of Providence”—“the strokes of Providence.” PROVIDENCE! what is that?

Why dethrone a living, directing God from the sovereignty of His own earth? Why substitute an inanimate, death-like abstraction, in place of acting, controlling, personal Jehovah?

How it would take the sting from many a goading trial, to see what Job saw (in his hour of aggravated woe, when every earthly hope lay prostrate at his feet)—no hand but the Divine. He saw that hand behind the gleaming swords of the Sabeans—he saw it behind the lightning flash—he saw it giving wings to the careening tempest—he saw it in the awful silence of his rifled home.

“The Lord gave, and the Lord hath taken away; blessed be the name of the Lord!”

Thus seeing God in everything, his faith reached its climax when this once powerful prince of the desert, seated on his bed of ashes, could say, “Though He slays me, yet will I trust him.” —Macduff

Thursday, April 21, 2022

నీ సొంత సమయం కోసం పరుగెత్తకు

☘️ అత్యాధునిక కాలములో అన్ని ఇన్స్టంట్ గా జరుగుతున్న సమయములో ప్రతిదానికి వేచి ఉండాలి అంటే మనకి చాల కష్టముగా అనిపిస్తుంది, ఒకవేళ దేవుడు ఏదైనా విషయమై వేచి ఉండమంటే ఉండటానికి మనసొప్పదు. అన్ని పనులు వెంటనే చక చక జరిగిపోవాలి అని కోరుకుంటాము. ఆలోచిస్తాము. 

☘️ రక్షించబడిన పౌలు గారు ప్రతి పట్టణములో క్రీస్తు రాజ్య సువార్తను గురించి ప్రకటిస్తూ ఒక ప్రాంతము నుండి మరొక ప్రాంతమునకు వెళ్తున్నారు. అయితే ఆ సమయములో ఆసియాలో వాక్యం చెప్పకుండా పరిశుద్దాత్మ దేవుడు వారిని ఆటంకపరచారు. మనం అయితే ఎందుకు, ఏమిటి అంటూ దేవుణ్ణి వంద ప్రశ్నలు వేస్తాము కానీ పౌలుగారు దేవుడు చూపించిన ప్రాంతమునకు వెళ్లి సువార్త ప్రకటించడం చేసారు.. అయితే దేవుని చిత్తానుసారముగా ఒక సమయము వచ్చినప్పుడు తిరిగి అదే ఆసియా ప్రాంతములో పౌలుగారు వాక్యం ప్రకటించినప్పుడు ఇంచుమించు ఆసియా ప్రాంతమంతా వాక్యాన్ని అంగీకరించి రక్షించబడ్డారు. 

🍁 ఆసియలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటంకపరచినందున, వారు ఫ్రుగియ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్లిరి. ముసియ దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్లుటకు ప్రయత్నము చేసిరి గాని - అ.కార్యములు 16:6 

🍁 అతడు సమాజమందిరములోనికి వెళ్లి ప్రసంగించుచు, దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యముగా మాటలాడుచు మూడు నెలలు గడిపెను. అయితే కొందరు కఠినపరచబడినవారై యొప్పుకొనక, జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి, శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచు వచ్చెను. రెండేండ్లవరకు ఈలాగున జరిగెను గనుక యూదులేమి గ్రీసుదేశస్థులేమి ఆసియలో కాపురమున్న వారందరును ప్రభువు వాక్యము వినిరి - అ.కార్యములు 19:8-10

🍁 మరియు దేవుడు పౌలుచేత విశేషమైన అద్భుతములను చేయించెను, ప్రభావముతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించెను - అ.కార్యములు 19:11,20

☘️ పలు గారు వెళ్ళాలి అనుకున్నప్పుడు పరిశుద్దాత్మ దేవుడు ఆటంకపరిచారు, కానీ దేవుని సమయమందు అక్కడ పరిచర్య చేయుట వలన ఆసియలో కాపురమున్న ప్రతి ఒక్కరికి సిలువను గూర్చిన వార్త వినిపించింది, అక్కడ దేవుని మహత్కార్యములు అనేకములుగా జరిగాయి. 

☘️ అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రతిదానికి సమయము కలదు (ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు, పుట్టుటకు, చచ్చుటకు; నాటుటకు నాటబడినదాని పెరికివేయుటకు, చంపుటకు బాగుచేయుటకు; పడగొట్టుటకు కట్టుటకు; ఏడ్చుటకు నవ్వుటకు; దుఃఖించుటకు నాట్యమాడుటకు; రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు; కౌగలించుటకు కౌగలించుట మానుటకు; వెదకుటకు పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు పారవేయుటకు; చింపుటకు కుట్టుటకు; మౌనముగా నుండుటకు మాటలాడుటకు; ప్రేమించుటకు ద్వేషించుటకు; యుద్ధము చేయుటకు సమాధానపడుటకు - ప్రసంగి 3:1 - 8) అదేవిధముగా కాలములను, సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకుని ఉన్నారు (అ.కార్యములు 1:7) మన కాలగతులు దేవుని వశమై ఉన్నాయి (కీర్తనలు 31:15)

☘️ నడు నీవు కూడా ఆలస్యం అవుతుంది అనో, లేక ఇంకా నీవు ఆశించినది జరగటం లేదనో ఇలా ఏదొక కారణం చేత తొందరపడి నిర్ణయం తీసుకోవాలి, ఇప్పుడు నిర్ణయం తీసుకోలేకపోతే ఎవరినైనా లేదా దేనినైనా కోల్పోవాల్సి వస్తుందేమో అంటూ తొందరపడుతున్నావేమో.... లేక దేవునికోసం ఏదేదో చెయ్యాలి సమయం లేదు అంటూ నీ సొంత ఆలోచనలతో ఆరాటపడుతున్నావేమో.... అయితే నీ సమయం కోసం కాదు, పరిస్థితులను కాదు దేవుని సమయాన్ని చూడు, ఆయన ప్రణాళికలను చూడు.... ఆనాడు ఆసియ వెళ్లకుండా అడ్డుపడిన పరిశుద్దాత్మ దేవుడు తన సమయమందు ఆ ప్రాంతమందు సువార్త వ్యాప్తికి అనుమతి కల్పించారు. ఎప్పుడైతే దేవుని సమయమందు పౌలు అక్కడ పరిచర్య చేసారో అప్పుడు ఆసియ యందంతట దేవుని నామము మహిమపరచబడింది, దేవుని ప్రేమ అందరికి తెలియపరచబడింది. 

☘️ ఇదేవిధముగా నీవు, నేను కూడా ఎప్పుడైతే దేవుని సమయము కోసం ఎదురుచూస్తామో అప్పుడు మన జీవితములో కూడా దేవుని మహిమార్థమై అద్భుతకార్యాలు జరుగుతాయి, మన జీవితం కూడా సంతోషముతో నింపబడుతుంది....