అబద్ధమాడనేరని దేవుడు అనాదికాలమందే వాగ్దానము చేసెను (తీతు 1:4).
విశ్వాసం అంటే ఒక విషయం తప్పకుండా జరుగుతుంది అనే ఒకరకమైన సంకల్ప శక్తిని మన మనస్సులో పెంచుకోవడం కాదు. దేవుడు ఈ మాట చెప్పాడు కాబట్టి జరుగుతుందనే సత్యాన్ని గుర్తించడమే. ఆ మాట నిజమనీ, ఉల్లసిస్తూ దేవుడు పలికాడు కాబట్టి ఇక చీకు చింత మాని ఉండడమే విశ్వాసం అంటే.
విశ్వాసం అనేది మనకి దొరికిన ఒక వాగ్దానాన్నే భవిష్యవాణిగా మలుచుకుంటుంది. అది ప్రస్తుతానికి వాగ్దానమే కాబట్టి మనం సహకరించకపోతే దానికంటూ ఒక అర్థం ఉండదు. అయితే దాన్ని విశ్వాసానికి జోడిస్తే ముందు జరుగబోయే విషయాన్ని ఇప్పుడే తెలుసుకోవడం అవుతుంది. మనలో ఓ నమ్మకం కలుగుతుంది. ఇది తప్పకుండా జరిగి తీరుతుంది. ఎందుకంటే దేవుడు అబద్ధమాడడు కాబట్టి.
చాలామంది ఎక్కువ విశ్వాసం ఇమ్మని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. అయితే వాళ్ళ ప్రార్థనల్ని సూక్ష్మంగా గమనించి వాటి నిజమైన అర్థాన్ని పరిశీలిస్తే, అవి నిజానికి విశ్వాసం కోసం ప్రార్థనలు కావని అర్థమౌతుంది. వాళ్ళు కేవలం తాము విశ్వసించిన దానిని ప్రత్యక్షపరచమని ప్రార్థన చేస్తుంటారు.
నిజమైన విశ్వాసి “ఇది నాకు మంచిని చేకూర్చేది గనుక దేవుడు నాకిచ్చాడు” అనడు. ఏమంటాడంటే “దేవుడు దీన్ని నాకిచ్చాడు గనుక ఇది నాకు మంచిదన్న మాట.” విశ్వాసం అంటే చీకట్లో దేవునితో నడుస్తూ తన చేతిని వదలకుండా పట్టుకోమని దేవుణ్ణి ప్రార్థించి, దేవుడు తన చెయ్యి పట్టుకొని ఉన్నాడన్న ధైర్యం తో ఉండటమే.
*నీ విశ్వాసంపై విశ్వాసాన్ని కాదు*
*తనపై విశ్వాసాన్నే అడిగాడు*
*విశ్వ కాపరి మన యేసు*
*నా చెంతకి రండని పిలిచాడు*
*తనపై విశ్వాసాన్ని అడిగాడు*
*వెలుగు నీడల్లో విశ్వసించండి*
*విశ్వాస ఫలాలను ఆయన్నుండే ఆశించండి*
‘దేవుడు ఇలా చేస్తాడని నాకు బాగా తెలుసు’ అని నీవు ఏ విషయం గూర్చి అనుకుంటున్నావో ఆ విషయం దరిదాపు జరిగి పోయినట్లే. దాని విషయం నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఇప్పుడే ప్రారంభించాలి.
-----------------------------------------------------------------------------------------------------------------------------
God that cannot lie promised* (Titus -1:2)
Faith is not working up by will power a sort of certainty that something is coming to pass, but it is seeing as an actual fact that God has said that this thing shall come to pass and that it is true, and then rejoicing to know that it is true, and just resting because God has said it.
Faith turns the promise into a prophecy. While it is merely a promise it is contingent upon our cooperation. But when faith claims it, it becomes a prophecy, and we go forth feeling that it is something that must be done because God cannot lie.—Days of Heaven upon Earth
I hear men praying everywhere for more faith, but when I listen to them carefully and get at the real heart of their prayer, very often it is not more faith at all that they are wanting, but a change from faith to sight.
Faith says not, “I see that it is good for me, so God must have sent it,” but, “God sent it, and so it must be good for me.”
Faith, walking in the dark with God, only prays Him to clasp its hand more closely. —Phillips Brooks
“The Shepherd does not ask of thee
Faith in thy faith, but only faith in Him;
And this He meant in saying, ‘Come to me.’
In light or darkness seek to do His will,
And leave the work of faith to Jesus still.”