Monday, May 9, 2022

The Road Uphill

 

…అగ్నిలో సంచరించుట చూచుచున్నాను.(దానియేలు 3:25).

వాళ్ళ కదలికను అగ్ని ఆపలేకపోయింది. దాని మధ్యలో వాళ్ళు నడుస్తున్నారు. తమ గమ్యానికి చేరడానికి అగ్ని కూడా ఒక రాజమార్గమే. క్రీస్తు బోధనలోని ఒక ఆదరణ ఏమిటంటే ఆయన దుఃఖంనుండి విడుదల ఇస్తాననలేదు. దుఃఖం ద్వారా విడుదల ఇస్తానన్నాడు.

నా దేవా, చీకట్లు అలుముకున్నప్పుడు నేను కేవలం ఓ సొరంగంలో మాత్రమే ఉన్నాను అని నాకు జ్ఞాపకం చెయ్యి. కొంతకాలానికి అంతా చక్కబడుతుందని తెలియడమే నాకు చాలు.

నేను ఒలీవ కొండ శిఖరం మీద నిలబడాలట. పునరుత్థానపు మహిమలో పాలుపొందాలట. కాని ప్రియ తండ్రీ, ఆ శిఖరానికి నేను ఎక్కి వెళ్ళడానికి కల్వరి దారి కావాలి. ఈ లోకం లోని కష్టాల నీడలు నీ పరలోకపు ఇంటి దారి లోని చెట్ల నీడలే కదా. తండ్రీ, నీ ఇల్లు కొండ మీద ఉంది. కష్టపడి నేనా కొండపైకి ఎగబ్రాకక తప్పదు. నేను అగ్నిజ్వాల మధ్యలో నడిస్తే నన్ను ఏ దుఃఖమూ అంటదు.

*దారి కరుకుగా ఉంది*

*చాలా దూరం పైకెక్కిపోవాలి*

*పూలు కాదు ముళ్ళున్న దారి*

*ఆకాశం మబ్బులు పట్టింది.*


*ఆ మసక వెలుగులో ఎవరో*

*నా చేయి పట్టుకున్నారు*

*నా దారంతా పూలబాటగా పరచుకొంది.*


*శిలువ భయంకరం*

*నా వీపు మోయలేని భారం*

కర్కశం, కఠినం, పాషాణం*

*చేయూతనిచ్చే వాళ్ళు లేరు*

*ఒకరు మెల్లగా నా భుజం తట్టారు*

*“నాకు తెలుసు నేను నీకు తోడు*

*నేనర్థం చేసుకోగలను”*


*ఎందుకు బాధ, నిట్టూర్పు*

*సిలువ మోసేవాళ్ళలారా రండి*

*గమ్యమదిగో కన్పిస్తుంది*

*మన కల్ల పంట కనుచూపు మేరలో ఉంది.*

*మనం వేసే ప్రతి అడుగూ*

*వేద్దాం ప్రభు సన్నిధిలో.*

-----------------------------------------------------------------------------------------------------------------------------

Walking in the midst of the fire* (Dan - 3:25)

The fire did not arrest their motion; they walked in the midst of it. It was one of the streets through which they moved to their destiny. The comfort of Christ’s revelation is not that it teaches emancipation from sorrow, but emancipation through sorrow.

O my God, teach me, when the shadows have gathered, that I am only in a tunnel. It is enough for me to know that it will be all right someday.

They tell me that I shall stand upon the peaks of Olivet, the heights of resurrection glory. But I want more, O my Father; I want Calvary to lead up to it. I want to know that the shadows of this world are the shades of an avenue the avenue to the house of my Father. Tell me I am only forced to climb because Thy house is on the hill! I shall receive no hurt from sorrow if I shall walk in the midst of the fire. —George Matheson

“’ The road is too rough,’ I said;  

’It is uphill all the way;  

No flowers, but thorns instead;  

And the skies overhead are grey.’  

But One took my hand at the entrance dim,  

And sweet is the road that I walk with Him.  


“The cross is too great,’ I cried—  

’More than the back can bear,  

So rough and heavy and wide,  

And nobody by to care.’  

And One stooped softly and touched my hand:  

’I know. I care. And I understand.’  


“Then why do we fret and sigh;  

Cross-bearers all we go:  

But the road ends by-and-by  

In the dearest place, we know,  

And every step in the journey we  

May take in the Lord’s own company.”

Sunday, May 8, 2022

Beginning Without Finishing

 

వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. (లూకా 18:1) 

విసుగు పుట్టి ప్రార్థన చెయ్యడం మానుకోవడం అనేది క్రైస్తవ జీవితంలో అన్నింటి కంటే అతి భయంకరమైన శోధన. మనం ఒక విషయం గురించి ప్రార్థన చెయ్యడం మొదలు పెడతాము. ఒక రోజు, ఒక వారం, మహా అయితే ఒక నెల రోజులు దేవుడికి విన్నవించుకుంటాము. ఏదీ ఖచ్చితమైన సమాధానం రాకపోతే విసుగెత్తి ఇక బొత్తిగా ప్రార్థించడమే మానుకుంటాము.

ఇది చాలా ప్రమాదకరమైన పొరపాటు. ఇది ఆరంభ శూరత్వం. కనిపించిన ప్రతి పనీ మొదలు పెట్టి ఏది పూర్తి చెయ్యలేని పరిస్థితి. ఇది జీవితం నాశనం కావడానికి హేతువు. 

కార్యాన్ని మొదలుపెట్టి పూర్తిచెయ్యకుండా వదిలేసే పద్ధతిని అలవాటు చేసుకున్న వ్యక్తి పరాజయాలను అలవాటు చేసుకుంటున్నాడన్నమాట. ఒక ప్రయోజనం కోసం ప్రార్థించడం మొదలు పెట్టి సరైన జవాబు దొరికే దాకా ప్రార్థించని ప్రతి వ్యక్తీ ఇదే అలవాటు పడుతున్నాడు.

ప్రార్థనలో విసుగు చెందడం అంటే ఓడిపోవడం. ఈ ఓటమి ప్రార్థన అంటే ఆసక్తి, విశ్వాసం లేకుండా చేస్తుంది. జయ జీవితానికి ఇది ప్రక్కలో బల్లెం లాంటిది.

అయితే కొందరడుగుతారు, “ఎంత కాలం ప్రార్థన చెయ్యాలి? కొంత కాలం చేసాక ఇక దేవుడి చేతిలో ఆ విషయాన్ని వదిలి ఆయనకి మొరపెట్టడం మానెయ్యాలి కదా?”

దీనికి ఒకటే సమాధానం - మీరు అడిగిన విషయం మీకు దొరికే దాకా ప్రార్థించాలి. లేక అది దొరుకుతుంది అన్న నిశ్చయత మీ హృదయంలో కలిగే దాకా ప్రార్థించాలి.

మనం దేవుని సన్నిధిలో గోజాడడాన్ని ఈ రెంటిలో ఏదో ఒకటి జరిగే దాకా ఆపకూడదు. ఎందుకంటే ప్రార్ధన అంటే కేవలం దేవుణ్ణి అడగడం మాత్రమే కాదు. అది సైతానుతో పోరాటం కూడా. ఎందుకంటే ఈ పోరాటంలో దేవుడు మన ప్రార్ధనలను సైతానుకి వ్యతిరేకమైన ఆయుధంగా వాడుతున్నాడు. కాబట్టి ఎప్పుడు ప్రార్ధన చెయ్యడం ఆపాలో నిర్ణయించవలసింది దేవుడే. మనకి ఆ హక్కు లేదు. జవాబు వచ్చే దాకా లేక జవాబు వస్తుందన్న నిశ్చయత కలిగే దాకా మన ప్రార్థనలను ఆపే అధికారం మనది కాదు. 

మొదటి సందర్భంలో అయితే సమాధానం మన కంటికి కనిపించింది గనుక ప్రార్థించడం మానేస్తాము. రెండో సందర్భంలో అయితే సమాధానం వస్తుందని నమ్ముతాము గనుక మానేస్తాము. ఎందుకంటే మన హృదయంలోని నమ్మకం మన కంటికి కనిపించే దృశ్యాల వంటిదే. ఎందుకంటే ఈ నమ్మకం దేవునినుండి, దేవుని వలన కలిగిన నమ్మకం.

మనం ప్రార్థనా జీవితంలో అనుభవజ్ఞులమౌతున్న కొద్దీ దేవుడిచ్చే నిశ్చయత ఎలాటిది అనే విషయాన్ని మరింతగా గుర్తుపడుతుంటాము. ఆ నిశ్చయతను ఆధారం చేసుకుని ఎప్పుడూ నిశ్చింతగా ఉండవచ్చు. లేక ఎలాంటి పరిస్థితిలో మన ప్రార్థనని కొనసాగించాలి అనే సంగతి మనకర్థం అవుతుంది.

దేవుని వాగ్దానాల మజిలీలో వేచి ఉండండి. దేవుడొచ్చి మిమ్మల్ని అక్కడ కలుస్తాడు. తన వాగ్దానాల బాట మీదుగానే నడిచివస్తాడాయన.

----------------------------------------------------------------------------------------------------------------------------

He spoke a parable unto them...that men ought always to pray, and not to faint. (Luke - 18:1)

No temptation in the life of intercession is more common than this failure to persevere. We begin to pray for a certain thing; we put up our petitions for a day, a week, a month; and then, receiving as yet no definite answer, straightway we faint and cease altogether from prayer concerning it.

This is a deadly fault. It is simply the snare of many beginnings with no completions. It is ruinous in all spheres of life.

The man who forms the habit of beginning without finishing has simply formed the habit of failure. The man who begins to pray about a thing and does not pray it through to a successful issue of the answer has formed the same habit in prayer.

To faint is to fail; then defeat begets disheartenment, and unfaith in the reality of prayer, which is fatal to all success.

But someone says, “How long shall we pray? Do we not come to a place where we may cease from our petitions and rest the matter in God’s hands?”

There is but one answer. Pray until the thing you pray for has actually been granted, or until you have the assurance in your heart that it will be.

Only at one of these two places dare we stay our importunity, for prayer is not only a calling upon God but also a conflict with Satan. And since God is using our intercession as a mighty factor of victory in that conflict, He alone, and not we, must decide when we dare cease our petitioning. So we dare not stay in our prayer until the answer itself has come, or until we receive the assurance that it will come.

In the first case, we stop because we see. On the other, we stop because we believe, and the faith of our heart is just as sure as the sight of our eyes; for it is faith from, yes, the faith of God, within us.

More and more, as we live the prayer life, shall we come to experience and recognize this God-given assurance, and know when to rest quietly in it, or when to continue our petitioning until we receive it. —The Practice of Prayer

Tarry at the promise till God meets you there. He always returns by way of His promises. 

Saturday, May 7, 2022

The Secrets of Providence

 

యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులుగల వారికి తెలిసియున్నది. (కీర్తన 25:14). 

దైవ సంకల్పానికి సంబంధించి దేవుని పిల్లలు నేర్చుకోవలసినవెన్నో రహస్యాలు ఉన్నాయి. వారితో ఆయన ప్రవర్తించే తీరు చూసేవారికి కొన్ని సార్లు అర్ధం కానట్టు గానూ, భయంకరమైనది గానూ కనిపించవచ్చు. మనలో ఉన్న విశ్వాసం అయితే ఇంకా లోతుకి గమనిస్తుంది. “ఇది దేవుని రహస్యం, మీరైతే పైపైనే చూస్తారు, నేనైతే వీటి వెనక దాగున్న పరమార్థాన్ని చూస్తాను” అంటుంది.

ఒక్కోసారి వజ్రాలను అస్తవ్యస్తంగా ఏదో ఒక కాగితంలో పొట్లం కడుతుంటారు, అవి విలువైనవని ఇతరులు గమనించకుండా చెయ్యడానికి. అరణ్యంలో ప్రత్యక్ష గుడారాన్ని కట్టినప్పుడు బయటనుండి చూస్తే దాన్ని కట్టడానికి ఖరీదైన సరుకులేమీ ఉపయోగించలేదు. దాని విలువ అంతా లోపల ఉన్నది. పైకి కనిపించే ఆ పొట్టేలు చర్మం, మేక వెంట్రుకలు లోపల ఉన్న వైభవాన్ని ఎంతమాత్రమూ చూపించడం లేదు.

ప్రియ మిత్రులారా, దేవుడు మీకు ఖరీదైన బహుమతులు పంపించవచ్చు. వాటి మీద చుట్టిన కాగితం మురికిగా, గరుకుగా ఉంటే కంగారు పడకండి. అవి ప్రేమ, జ్ఞానం దేవుని కరుణల ఊటలని ఏమాత్రం సందేహించకుండా నమ్మండి. ఆయన పంపిన వాటిని స్వీకరించి ఆయన మంచితనం మీద నమ్మకం ఉంచినట్టయితే, అంధకారంలో అయినా సరే దేవుని మర్మాలు మనకి తేటతెల్లం అవుతాయి.

*మగ్గం తిరగడం మానేదాకా*

*నేతగాని చేతులు ఆగేదాకా*

*వస్త్రంలోని వన్నెలర్థం కావు.*

*పరలోకంలోని పరమ సాలెవాని చేతిలో*

*వెండి, పసిడి దారాలెంత ముఖ్యమో*

*ఆయన సంకల్పం నెరవేరాలంటే*

*నల్లదారాలంతే ముఖ్యం.*

క్రీస్తు ఎవర్నయితే మచ్చిక చేసుకుని తన స్వాధీనంలోకి తీసుకుంటాడో అతను పరిస్థితులన్నిటినీ మచ్చిక చేసుకోగల సమర్థుడు. పరిస్థితులు మిమ్మల్ని అటూ ఇటూ నొక్కి వేధిస్తున్నాయా? దూరంగా నెట్టెయ్యకండి. కుమ్మరివాని చేతులవి. ఆ పరిస్థితుల నుంచి తప్పించుకోవడం వల్ల కాకుండా, క్రమశిక్షణతో భరిస్తే ఆయన పనితనం బయట పడుతుంది. నిన్నాయన ఘనతకి తగిన పాత్రగా మలచడమే కాదు, నీలో దాక్కుని ఉన్న శక్తి సామర్థ్యాలను బయటికి తేవడం కూడా చేస్తున్నాడు.

---------------------------------------------------------------------------------------------------------------------------

The secret of the Lord is with them that fear him* (Ps - 25:14)

There are secrets of Providence which God’s dear children may learn. His dealings with them often seem, to the outward eye, dark and terrible. Faith looks deeper and says, “This is God’s secret. You look only on the outside; I can look deeper and see the hidden meaning.”

Sometimes diamonds are done up in rough packages so that their value cannot be seen. When the Tabernacle was built in the wilderness there was nothing rich in its outside appearance. The costly things were all within, and its outward covering of rough badger skin gave no hint of the valuable things which it contained.

God may send you, dear friends, some costly packages. Do not worry if they are done up in rough wrappings. You may be sure there are treasures of love, and kindness, and wisdom hidden within. If we take what He sends, and trust Him for the goodness in it, even in the dark, we shall learn the meaning of the secrets of Providence.—A. B. Simpson

“Not until each loom is silent,  

And the shuttles cease to fly,  

Will God unroll the pattern  

And explain the reason why  

The dark threads are as needful  

In the Weaver’s skillful hand,  

As the threads of gold and silver  

For the pattern which He planned.”  

He that is mastered by Christ is the master of every circumstance. Does the circumstance press hard against you? Do not push it away. It is the Potter’s hand. Your mastery will come, not by arresting its progress, but by enduring its discipline, for it is not only shaping you into a vessel of beauty and honor, but it is making your resources available.