Thursday, May 19, 2022

Attitude of Trust

అతడు మాటలాడుట చాలింపకముందే... అబ్రాహామను నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు (అనెను). (ఆది 24:15,27).

యథార్థమైన ప్రతి పార్ధనకీ ఆ ప్రార్థన ముగియకముందే జవాబు దొరుకుతుంది. మనం మాటలాడుట చాలించకముందే మన మనవి అంగీకరించబడుతుంది. ఎందుకంటే దేవుడెప్పుడో మాట యిచ్చాడు. క్రీస్తు నామం పేరిట (అంటే క్రీస్తుతో ఏకమై ఆయన చిత్తం ప్రకారం) విశ్వాసంతో మనం అడిగినవన్నీ అనుగ్రహింపబడతాయని వాగ్దానం చేశాడు. 

దేవుని మాట నిరర్థకం కానేరదు. ప్రార్థనకి సంబంధించిన ఈ కొన్ని నిబంధనలనూ మనం అనుసరిస్తే, మనం ప్రార్థిస్తున్నప్పుడే మన ప్రార్థనలకి జవాబు వస్తుంది. పూర్తి అవుతుంది. అది ఇహలోకంలో మన కంటికి కనిపించడం ఆలస్యం అయితే కావచ్చు.

కాబట్టి ప్రతి ప్రార్థననూ స్తుతులతో ముగించడం అలవాటు చేసుకోవాలి. అడుగుతున్నప్పుడే జవాబిచ్చేసిన దేవుణ్ణి కీర్తించాలి. ఆయన తన కృపని, సత్యాన్ని చూపించడం మానడు (దానియేలు 9:20-27, 10:12 కూడా చదవండి).

మనం ఒక ఆశీర్వాదం వస్తుందని ఎదురు చూసేటప్పుడు అది విశ్వాస సహితంగా ఉండాలి. ఆ ఆశీర్వాదం మనకి దక్కిందన్నట్టే మన పనులూ, ప్రార్థనలూ ఉండాలి. మనం అడిగినదానిని దేవుడు ఇచ్చేశాడు అన్నట్టు ఆయనతో వ్యవహరించాలి. మనం అడిగినదానిని బట్టి ఆ భారాన్ని దేవుని మీదే మోపాలి. దాన్ని దేవుడు మనకు ఇచ్చేసినట్టే అనుకోవాలి. ఇదే మనకి ఉండవలసిన నమ్మకం.

ఒక కన్యక పెళ్ళయినప్పుడు ఆమె దృక్పధం అంతా ఒక్కసారిగా మారిపోతుంది. ఆ వాస్తవానికి తగినట్టుగా ఆమె ప్రవర్తన అంతా ఉంటుంది. అలాగే మనం క్రీస్తును మన రక్షకునిగా, పరిశుద్ధపరిచేవానిగా, బాగుచేసేవానిగా, విడిపించేవానిగా స్వీకరించినప్పటి నుంచీ ఆయన మీద మనం ఎలాటి ఆశపెట్టుకున్నామో దానికి తగిన రీతిలో ఆయనకి స్థానం ఇవ్వాలని క్రీస్తు కోరుకుంటాడు. ఆయనే మనకి సర్వస్వం అన్నది గుర్తించి, ఆయన మన పట్ల ఏవిధంగా ఉండాలని ఎదురు చూస్తున్నామో అలా ఉంటున్నాడు అని నమ్మాలి.


*ప్రార్థనలో నేనడిగిన మాట*

*ప్రార్థించిన ప్రకారమే*

*ప్రార్థిస్తుండగానే దక్కింది నాకు.*

*దేవునికి స్తోత్రం*

-----------------------------------------------------------------------------------------------------------------------------

And it came to pass, before he had done speaking...and he said, Blessed be Jehovah...who hath not forsaken his lovingkindness and his truth. (Gen - 24:15,27)

Every right prayer is answered before the prayer itself is finished—before we have “done speaking.” This is because God has pledged His Word to us that whatsoever we ask in Christ’s name (that is, in oneness with Christ and His will) and in faith, shall be done.

As God’s Word cannot fail, whenever we meet those simple conditions in prayer, the answer to our prayer has been granted and completed in Heaven as we pray, even though its showing forth on earth may not occur until long afterward.

So it is well to close every prayer with praise to God for the answer that He has already granted; He who never forsakes His loving-kindness and His truth. (See Daniel 9:20-27 and 10:12.) —Messages for the Morning Watch

When we believe for a blessing, we must take the attitude of faith, and begin to act and pray as if we had the blessing. We must treat God as if He had given us our request. We must lean our weight over upon Him for the thing that we have claimed, and just take it for granted that He gives it, and is going to continue to give it. This is the attitude of trust.

When the wife is married, she at once falls into a new attitude, and acts in accordance with the fact; and so when we take Christ as our Savior, as our Sanctifier, as our Healer, or as our Deliverer, He expects us to fall into the attitude of recognizing Him in the capacity that we have claimed, and expect Him to be to us all that we have trusted Him for. —Selected

“The thing I ask when God doth bid me pray,  

Begins in that same act to come my way.”

Sunday, May 15, 2022

Instant Obedience

దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే సున్నతి చేసెను. (ఆది 17:23).

వెంటనే కనపరచే విధేయతే విధేయత. ఆలస్యమైన విధేయత అవిధేయత క్రిందే లెక్క. దేవుడు మనల్నొక పనికి పిలుస్తున్నప్పుడు మనతో ఒక నిబంధన చెయ్యబోతున్నాడన్న మాట. ఆ పిలుపుకి లొంగడమే మన కర్తవ్యం. ఆ నిబంధన మేరకు మనకు రాబోయే ప్రత్యేకమైన ఆశీర్వాదాలివ్వడం దేవుని వంతు.

విధేయత చూపించే ఒకే ఒక పద్దతి ఏమిటంటే అబ్రాహాములాగా “ఆ దిన మందే” విధేయత చూపించడం. చాలాసార్లు మనం చెయ్యవలసిన పనిని వాయిదా వేసి తరువాతెప్పుడో చేస్తుంటాము. అసలు బొత్తిగా చెయ్యకపోవడంకంటే ఇది నయమే. కాని ఇలా చేసిన పని ఆలోచించి చూస్తే ‘చెయ్యాలి కాబట్టి ఉసూరు మంటూ చేసిన పని’. ఈ పని అవిటిది, అందం చందం లేనిది. వాయిదా పడిన నెరవేర్పు దేవునినుండి పూర్తి పూర్తి ఆశీర్వాదాలనెప్పుడూ తీసుకురాలేదు. వెంటనే నెరవేర్చిన బాధ్యత అయితే దేవుడు ఇవ్వడానికి సంకల్పించిన ఆశీర్వాదాలను సంపూర్ణంగా తీసుకువస్తుంది. 

ఆలస్యం చేసి మనల్ని మనం నష్టపరచుకుంటూ, దేవుణ్ణి, మనతోటి వాళ్ళని కూడా నష్ట పరచడం ఎంత దుస్థితి! “ఆ దినమందే” అన్నది అబ్రహాము పనులు చేసే పధ్ధతి. ఇప్పుడు మీరు చెయ్యాల్సిన వాటిని నెరవేర్చండి.

మార్టిన్ లూథర్ అంటాడు, “నిజమైన విశ్వాసి -  ఎందుకు?” అనే ప్రశ్నని శిలువ వెయ్యాలి. ప్రశ్నలకి తావు లేకుండా కట్టుబడాలి. నా మట్టుకు నేనైతే ఏదో ఒక సూచన, అద్భుతం కనిపిస్తే తప్ప నమ్మని వారిలో చేరను. సందేహానికి తావులేకుండా నేను నమ్మకం ఉంచుతాను.”

*ఎదురు చెప్పడం మన పనికాదు*

*బదులుగా తర్కించడం తగదు*

*దాటరాదు మన అవధి*

*చావుకైనా తెగించి చెయ్యడమే మన విధి.*

విధేయత విశ్వాస ఫలం, సహనం ఆ చెట్టుకి పూసిన పూలగుత్తి.

-----------------------------------------------------------------------------------------------------------------------------

In the selfsame day, as God had said unto him. (Gen - 17:23)

Instant obedience is the only kind of obedience there is; delayed obedience is disobedience. Every time God calls us to any duty, He offers to make a covenant with us; doing the duty is our part, and He will do His part in special blessing.

The only way we can obey is to obey “in the selfsame day,” as Abraham did. We often postpone a duty and then, later on, do it as fully as we can. It is better to do this than not to do it at all. But it is then, at the best, only a crippled, disfigured, halfway sort of duty-doing; and a postponed duty never can bring the full blessing that God intended, and that it would have brought if done at the earliest possible moment.

It is a pity to rob ourselves, along with robbing God and others, by procrastination. “In the selfsame day” is the Genesis way of saying, “Do it now.” —Messages for the Morning Watch

Luther says that “a true believer will crucify the question, ‘Why?’ He will obey without questioning.” I will not be one of those who, except they see signs and wonders, will in no wise belief. I will obey without questioning.

“Ours not to make reply,  

Ours not to reason why,  

Ours but to do and die.”

Obedience is the fruit of faith; patience is the bloom on the fruit. —Christina Rossetti

Saturday, May 14, 2022

Can Thine Heart Endure

 

మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు. (రోమా 8:26)

మన క్రైస్తవ అనుభవాల్లో మనకు ఎక్కువ సార్లు బోధపడనిది ఏమిటంటే మన ప్రార్థనలకి జవాబు. మనం సహనం ఇమ్మని దేవుణ్ణి ప్రార్థిస్తాము. దేవుడు దానికి జవాబుగా మనల్ని వేధించే వాళ్ళని పంపిస్తాడు, ఎందుకంటే శ్రమ ఓర్పును అభివృద్ధి చేస్తుంది.

మనం విధేయత కోసం ప్రార్థిస్తాము. దేవుడు మన మీదికి శ్రమలను పంపుతాడు. ఎందుకంటే మనం శ్రమపడుతూ ఉన్నప్పుడే దేవునికి లొంగడం నేర్చుకుంటాము.

మాకు నిస్వార్థపరత ప్రసాదించమని అడుగుతాము. ఇతరుల భారాలను నెత్తిన వేసుకుని మన సోదరుల కోసం ప్రాణాలు పెట్టవలసి వచ్చే త్యాగం చెయ్యడానికి అవకాశాలను దేవుడిస్తాడు.

మనం శక్తి కోసం, నమ్రత కోసం ప్రార్థిస్తే సైతాను బంటు ఎవడో వస్తాడు. మనం ధూళిలో కూలిపోయి వాడు తొలగిపోయేలా మొర పెట్టే దాకా బాధిస్తాడు.

మా విశ్వాసాన్ని బలపరచు తండ్రీ అని ప్రార్థిస్తే మన డబ్బు రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది. లేక మన పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది. లేక ఇప్పటి వరకు కని విని ఎరుగని శ్రమ ఏదో సంభవిస్తుంది. అప్పటి దాకా ఎలాటి విశ్వాసాన్ని మనం అలవరచుకోలేదో అలాటి విశ్వాసం మనలో చిగురించడం మొదలుపెడుతుంది.

దీన మనస్సు కోసం ప్రార్థిస్తే ఎక్కడో తక్కువ స్థాయి సేవ మనకప్పగించబడుతుంది. మనకి ద్రోహాలు  జరిగిపోతుంటాయి. ప్రతీకారానికి తావుండదు. ఎందుకంటే వధకి తేబడే గొర్రెలాగా మన ప్రభువుని తీసుకెళ్ళారు. ఆయన నోరు మెదపలేదు.

ప్రసన్నత ప్రసాదించమని ప్రార్థిస్తాము. వెంటనే మన కోపాన్నీ దురుసుతనాన్నీ రేపేలా ఏదో ఒక శోధన వస్తుంది. ప్రశాంతత కోసం ప్రార్థిస్తే మనసు అల్లకల్లోలమైపోయే సంఘటన జరుగుతుంది . ఇందుమూలంగా దేవుని వైపు చూచి ఆయననుండి నేర్చుకుని ఆయన అనుగ్రహించే శాంతిని పొందుతాము.

మనలో ప్రేమ పెరగాలని ప్రార్థిస్తాము. దేవుడు ప్రత్యేకమైన బాధలను మనపైకి రప్పించి ప్రేమలేని మనుషుల మధ్య మనల్ని పడేస్తాడు. మనస్సుని గాయ పరిచే మాటలు, హృదయాన్ని కోసే మాటలూ వాళ్ళు యెడా పెడా మాట్లాడేస్తారు. ఎందుకంటే ప్రేమ దయ గలది, దీర్ఘశాంతం గలది. ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు. కవ్వింపుకి లొంగదు. అన్నింటినీ సహిస్తుంది. అన్నింటినీ నమ్ముతుంది. నిరీక్షణతో ఓర్చు కుంటుంది. ఎప్పుడూ మాట ఇచ్చి తప్పదు. మనం యేసు పోలికగా మారాలని దేవుణ్ణి వేడుకుంటాము. సమాధానంగా “శ్రమల కొలిమి పాలు చెయ్యడానికి నిన్ను ఎన్నుకున్నాను” అని జవాబు వస్తుంది. “నీ హృదయం భరించగలదా, నీ చేతులు బలంగా ఉంటాయా? వీటిని సహించడం నీకు చేతనౌతుందా?”

శాంతి, విజయాలను సాధించే ఏకైక మార్గం ఏమిటంటే ప్రతి పరిస్థితిని, శ్రమనీ ప్రేమమూర్తి అయిన దేవునినుండి నేరుగా స్వీకరించి మేఘాలకు పైగా పరిశుద్ధ స్థలాల్లో సింహాసనం ఎదుట నివసిస్తూ మన ప్రకృతిపై ప్రసరిస్తున్న దేవుని మహిమను దేవుని ప్రేమ చొప్పున తిలకించడమే.


*శక్తినిమ్మని వేడుకుంటే కొంతకాలం*

*అందరూ చెయ్యి విడిచి ఒంటరి చేసారు.*

*హత్తుకున్న ప్రేమ గాయాలు చేసింది*

*ఆసరాలన్నీ విదిలించి కొట్టి వదిలేసాయి*

*నిస్త్రాణలో, వణుకులో ఒంటరితనంలో*

*పరమ తండ్రి హస్తాలు నన్నెత్తి పట్టాయి*


*వెలుగునిమ్మని వేడుకుంటే దాక్కున్నారు సూర్యచంద్రులు*

*అనుమానాల పెనుమబ్బుల్లో మిణుకుమనే చుక్క*

*నా బేలతనం కేసి జాలిగా చూసింది.*

*నా చిరుదీపపు కాంతి కొడిగట్టింది*

*చీకటి కంబళి కప్పుకుని నీడల్లో తారాడుతుంటే*

*క్రీస్తు వదనం చీకట్లు చెదరగొట్టి వెలుగు నిచ్చింది.*


*శాంతినిమ్మని వేడుకుంటే, విశ్రాంతికై అర్రులు చాస్తే*

*బాధల చేదుమందు మింగి కళ్ళు మూతలుబడితే*

*ఆకాశాలు ఏకమై పెనుగాలిని పోగుచేశాయి*

*పగవారు కత్తులు నూరి సన్నద్ధులయ్యారు*

*పోరాటం రేగింది, పెను తుపాను సాగింది.*

*ప్రభువు మృదువైన స్వరము వినిపించి శాంతిని తెచ్చింది.*


*ప్రభూ వందనాలు, నా బలహీన ప్రార్థనలు పరిగణించి*

*నా విన్నపానికి భిన్నంగా దయచేసే జ్ఞానవంతుడవు.*

*జవాబుగా ఇచ్చిన ఈవులే, ఊహకి మించిన దీవెనలైనాయి*

*వర ప్రదాతా నా ప్రతి ప్రార్థనకూ*

*నీ జ్ఞానం చొప్పున నీ సమృద్దిలోనుండి*

*నా మనసుకి పట్టని ఈవులు ప్రసాదించు.*

-----------------------------------------------------------------------------------------------------------------------------

We know not what we should pray for as we ought* ( Rom - 8:26)

Much that perplexes us in our Christian experience is but the answer to our prayers. We pray for patience, and our Father sends those who tax us to the utmost; for “tribulation worketh patience.”

We pray for submission, and God sends sufferings; for “we learn obedience by the things we suffer.”

We pray for unselfishness, and God gives us opportunities to sacrifice ourselves by thinking on the things of others, and by laying down our lives for the brethren.

We pray for strength and humility, and some messenger of Satan torments us until we lie in the dust crying for its removal.

We pray, “Lord, increase our faith,” and money takes wings; or the children are alarmingly ill; or a servant comes who is careless, extravagant, untidy or slow, or some hitherto unknown trial calls for an increase of faith along a line where we have not needed to exercise much faith before.

We pray for the Lamb-life, and are given a portion of lowly service, or we are injured and must seek no redress; for “he was led as a lamb to the slaughter and…opened not his mouth.”

We pray for gentleness, and there comes a perfect storm of temptation to harshness and irritability. We pray for quietness, and every nerve is strung to the utmost tension, so that looking to Him we may learn that when He giveth quietness, no one can make trouble.

We pray for love, and God sends peculiar suffering and puts us with apparently unlovely people, and lets them say things which rasp the nerves and lacerate the heart; for love suffereth long and is kind, love is not impolite, love is not provoked. LOVE BEARETH ALL THINGS, believeth, hopeth and endureth, love never faileth. We pray for likeness to Jesus, and the answer is, “I have chosen thee in the furnace of affliction.” “Can thine heart endure, or can thine hands be strong?” “Are ye able?”

The way to peace and victory is to accept every circumstance, every trial, straight from the hand of a loving Father; and to live up in the heavenly places, above the clouds, in the very presence of the Throne, and to look down from the Glory upon our environment as lovingly and divinely appointed. —Selected


I prayed for strength, and then I lost awhile  

All sense of nearness, human and divine;  

The love I leaned on failed and pierced my heart,  

The hands I clung to loosed themselves from mine;  

But while I swayed, weak, trembling, and alone,  

The everlasting arms upheld my own.  


I prayed for light; the sun went down in clouds,  

The moon was darkened by a misty doubt,  

The stars of heaven were dimmed by earthly fears,  

And all my little candle flames burned out;  

But while I sat in shadow, wrapped in night,  

The face of Christ made all the darkness bright.  


I prayed for peace, and dreamed of restful ease,  

A slumber drugged from pain, a hushed repose;  

Above my head the skies were black with storm,  

And fiercer grew the onslaught of my foes;  

But while the battle raged, and wild winds blew,  

I heard His voice and Perfect peace I knew.  


I thank Thee, Lord, Thou wert too wise to heed  

My feeble prayers, and answer as I sought,  

Since these rich gifts Thy bounty has bestowed  

Have brought me more than all I asked or thought;  

Giver of good, so answer each request  

With Thine own giving, better than my best.  

—Annie Johnson Flint