Tuesday, May 3, 2022

How Your Spiritual Life

🌿 ప్రతిరోజు ప్రార్ధన చేస్తున్నాను, వాక్యము చదువుతున్నాను, అంతా సవ్యమైన దిశలోనే నా ఆధ్యాత్మిక జీవితం ఉంది అని చాలాసార్లు మనం నిర్లిప్తముగా ఉంటూ ఉంటాము.. దేవునితో సహవాసం సరైన దిశలోనే ఉందొ లేదో అనే అనుమానం లేకుండా ఆలోచన దరిచేరనివ్వకుండా జీవించేస్తూ ఆచారబద్ధమైన ఆత్మీయ జీవితాన్ని జీవిస్తూ రోజులు గడిపేస్తుంటాము... అయితే దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే "తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను - 1కోరింథీయులకు 10:12" అని దేవుడు స్పష్టముగా చెప్తున్నారు.

🍂 ఇశ్రాయేలీయులు అందరు మోషే మాట చొప్పున నడిచి ఐగుప్తు దేశమునుండి బయలుదేరారు. అందరు ఆకాశము నుండి వచ్చిన మన్నాను భుజించారు, ఒకే బండ నుండి వచ్చిన నీటిని పానము చేసారు, ఒక్కటే మేఘము క్రింద నడిచారు అయితే నలువది సంవత్సరములు గడచి వాగ్దాన దేశమైన కనానును చేరేప్పటికీ ఎవరైతే ఐగుప్తు దేశమునుండి బయలుదేరారో వారిలో అందరు వారి తరమంతా మధ్యలోనే రాలిపోయింది..... కేవలం యెహోషువ, కాలేబు తప్ప... అందుకే వారి గురించి దేవుడు చెప్తున్నారు వారిలో ఎక్కువమంది దేవునికి ఇష్టులుగా ఉండలేకపోయిరి గనుక అరణ్యములోని సంహరించబడ్డారు అని. 

🌿 ఎందుకు వారు సంహరించబడ్డారు అంటే దేవుడే నాలుగు కారణాలు చెప్తున్నారు. విగ్రహారాధన, వ్యభిచారం, దేవుణ్ణి శోధించడం, దేవునిపై సణగటం అని. 

🍂 మన పితరులందరు మేఘముక్రింద నుండిరి. వారందరును సముద్రములో నడచిపోయిరి అందరును మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి; అందరు ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి; అందరు ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మసంబంధమైన బండలోనిది త్రాగిరి; ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువమంది దేవునికిష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి - 1కోరింథీయులకు 10:1-5 

🍂 జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి, ఆడుటకు లేచిరి. వారిలో కొందరివలె మీరు విగ్రహారాధకులై యుండకుడి. వారివలె మనము వ్యభిచరింపకయుందము; వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక్కదినముననే యిరువది మూడువేలమంది కూలిరి. మనము ప్రభువును శోధింపక యుందము; వారిలో కొందరు శోధించి సర్పములవలన నశించిరి. మీరు సణుగకుడి; వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి - 1కోరింథీయులకు 10:7-10

🌿 అయితే నేడు మనము కూడా ఒక్కటే ఆహారమైన జీవాహారమును... ఒక్కటే పానీయము అయిన జీవజలమును, అలాగే ఒక్క దేవుణ్ణి సేవిస్తున్నాము... అయితే మనం దేవునికి యిష్టులుగా  ఉంటున్నామా... లేక వారివలె దేవునికి ఇష్టములేని జీవితము జీవిస్తున్నామా.... తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను అని దేవుడు తెలియజేస్తున్నారు గనుక ఒక్కసారి ఆలోచిద్దాము... దేవుని చేతిలో సంహరించేబడే విధముగా మన జీవితం ఉంటుందా లేక దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తున్నామా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుని సరిచేసుకుందాము...

Monday, May 2, 2022

The Key to the Wind

 

యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరచియున్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు*_ (కీర్తన 103:19). 

వసంత కాలం అప్పుడే ప్రవేశించింది. ఒక రోజున ఎక్కడికో వెళ్ళాలని బయలు దేరాను. హటాత్తుగా తూర్పు గాలి కొట్టింది. మహా వేగంతో నిర్దాక్షిణ్యంగా, భయం గొలుపుతూ, తనవెంట దుమ్మును రేపుకుంటూ బయలుదేరింది.

అప్పుడే ఇంటికి తాళం వేసాను. చిరాకుగా మనసులో అనుకున్నాను. “అబ్బ! ఈ గాలి...” ‘తగ్గిపోతే ఎంత బాగుణ్ణు' అందామనుకుంటూ ఆగిపోయాను. ఆ వాక్యం పూర్తి చెయ్యలేదు.

నేను ప్రయాణమై వెళుతుండగా ఈ సంఘటన నాకో ఉపమానంలా అనిపించింది. ఒక దేవదూత నా ఎదుట నిలిచి ఒక తాళం చెవి యిచ్చి అన్నాడు. “నా యజమాని నీకు తన ఆశీస్సులు చెప్పమన్నాడు. ఇది నీ కిమ్మని నన్ను పంపాడు.”

“ఏమిటిది?” “గాలి తాళం చెవి” ఆ దూత అదృశ్యమయ్యాడు.

చాలా సంతోషం వేసింది. త్వర త్వరగా ఎత్తయిన ప్రదేశాలకు, గాలి పుట్టే ప్రదేశాలకు వెళ్ళి ఆ కొండ గుహల మధ్య నిలబడ్డాను. 'ఆ తూర్పు గాలిని మాత్రం ముందు అరికట్టాలి. అది ఇక నన్ను బాధపెట్టదు' అనుకుని ఆ గాలిని పిలిచి దాన్ని నా తాళం చెవిలో బంధించాను. శూన్య ప్రదేశాల్లో ప్రతిధ్వనించే నిశ్శబ్దం వినిపించింది ఆ గాలి స్థంభించగానే. “ఇంతటితో తూర్పుగాలి పీడ వదిలింది” అనుకున్నాను.

“దాని స్థానంలో మరి దేన్ని తీసుకురావాలి?” అని ఆలోచించాను. దక్షిణ వాయువు చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది. చిన్న చిన్న గొర్రె పిల్లలు, ప్రతి చోటా కళ్ళు తెరుస్తున్న పిల్ల జీవులు, రహదారుల ప్రక్కన కళ్ళు తెరుస్తున్న పూలమొగ్గలు సంతోషిస్తాయి. సందేహించకుండా దక్షిణ వాయువు తలుపులోకి తాళం పోనిచ్చాను. నా చెయ్యి మండడం మొదలు పెట్టింది.

“నేను చేస్తున్నదేమిటి!” బాధతో అరిచాను “ఈ పనివల్ల ఎలాటి అరిష్టాలు సంభవిస్తాయో ఎవరికి తెలుసు! పొలాలకు ఏ గాలి కావాలో నాకేం తెలుసు! నేను చెయ్యబోయే తెలివితక్కువ పనివల్ల ఎన్ని నష్టాలున్నాయో కదా!”

ఎటూ తోచక సిగ్గుపడిపోయి దేవుడు మళ్ళీ తన దూతను పంపి ఈ తాళం చెవి నా నుండి తీసేసుకోవాలని ప్రార్ధించాను. ‘నేను మాత్రం ఆ తాళం చెవిని ఇక ఎప్పుడూ కావాలని కోరుకోను’ అని నిశ్చయించుకున్నాను.

చూస్తుండగానే దేవుడే నా ఎదుట ప్రత్యక్షమయ్యాడు. తన చెయ్యి చాపి తాళం చెవిని తీసేసుకున్నాడు. ఆయన చేతిలో దాన్ని ఉంచుతూ చూసాను - అది ఆయన చేతిలోని గాయపు మచ్చమీద ఆనింది. ఆయన చేసిన కార్యాలలో దేనిమీదనైనా విసుక్కున్నందుకు బాధపడ్డాను. అలాటి ప్రతి పనిలోనూ నాపట్ల ఆయనకి ఉన్న ప్రేమ ముద్రితమై ఉంది. ఆయన ఆ తాళం చెవిని తన నడుముకి కట్టుకున్నాడు.

“ప్రభూ, అయితే ఈ తాళం చెవి నీ చేతిలో ఉంటుందా ఎప్పుడూనూ?” ప్రభువుని అడిగాను. “అవునయ్యా” దయతో జవాబిచ్చాడాయన.

నేను తేరిపార చూస్తే, నా జీవితానికి సంబంధించిన తాళం చెవులన్నీ ఆయన నడుముకే వేలాడుతున్నాయి. నా మొహంలోని ఆశ్చర్యాన్ని చూసి ఆయన అన్నాడు “కుమారా, అన్నీ నా అదుపులో ఉన్నాయని నీకు తెలియదా?”

“అన్నీనా ప్రభూ?” భయభక్తులతో పలికాను, “అయితే దేన్ని గురించి కూడా విసుక్కోవడం నాకు క్షేమం కాదు. నీవే అన్నింటినీ నిర్ణయిస్తున్నావు కదా.” ఆయన ప్రేమతో నా మీద తన చెయ్యి వేసాడు. "కుమారా, ప్రతి దానిలోనూ నీకు క్షేమకరమైనదేమిటంటే, నన్ను ప్రేమించడం, స్తుతించడం, నాపై నమ్మకముంచడం.”

-----------------------------------------------------------------------------------------------------------------------------

The Lord hath prepared his throne in the heavens; and his kingdom ruleth over all* (Ps - 103:19)

Some time since, in the early spring, I was going out at my door when round the corner came a blast of east wind—defiant and pitiless, fierce and withering—sending a cloud of dust before it.

I was just taking the latchkey from the door as I said, half impatiently, “I wish the wind would”—I was going to say change, but the word was checked, and the sentence was never finished.

As I went on my way, the incident became a parable to me. There came an angel holding out a key, and he said:

“My Master sends thee His love, and bids me give you this.”

“What is it?” I asked, wondering. “The key of the winds,” said the angel, and disappeared.

Now indeed should I be happy? I hurried away up into the heights whence the winds came, and stood amongst the caves. “I will have done with the east wind at any rate—and that shall plague us no more,” I cried; and calling in that friendless wind, I closed the door, and heard the echoes ringing in the hollow places. I turned the key triumphantly. “There,” I said, now we have done with that.

“What shall I choose in its place?” I asked myself, looking about me. “The south wind is pleasant”; and I thought of the lambs, the young life on every hand, and the flowers that had begun to deck the hedgerows. But as I set the key within the door, it began to burn my hand.

“What am I doing?” I cried; “who knows what mischief I may bring about? How do I know what the fields want! Ten thousand things of ill may come of this foolish wish of mine.”

Bewildered and ashamed, I looked up and prayed that the Lord would send His angel yet again to take the key; and for my part, I promised that I would never want to have it anymore.

But lo, the Lord Himself stood by me. He reached His hand to take the key; and as I laid it down, I saw that it rested against the sacred wound print.

It hurt me indeed that I could ever have murmured against anything wrought by Him who bare such sacred tokens of His love. Then He took the key and hung it on His girdle.

“Dost THOU keep the key of the winds?” I asked.

“I do, my child,” He answered graciously.

And lo, I looked again, and there hung all the keys of all my life. He saw my look of amazement, and asked, “Didst thou not know my child, that my kingdom ruleth overall?”

“Overall, my Lord!” I answered; “then it is not safe for me to murmur at anything?” Then did He lay His hand upon me tenderly. “My child,” He said, “thy only safety is, in everything, to love and trust and praise.”—Mark Guy Pearse

Sunday, May 1, 2022

The Prayer of Faith

 అబద్ధమాడనేరని దేవుడు అనాదికాలమందే వాగ్దానము చేసెను (తీతు 1:4).

విశ్వాసం అంటే ఒక విషయం తప్పకుండా జరుగుతుంది అనే ఒకరకమైన సంకల్ప శక్తిని మన మనస్సులో పెంచుకోవడం కాదు. దేవుడు ఈ మాట చెప్పాడు కాబట్టి జరుగుతుందనే సత్యాన్ని గుర్తించడమే. ఆ మాట నిజమనీ, ఉల్లసిస్తూ దేవుడు పలికాడు కాబట్టి ఇక చీకు చింత మాని ఉండడమే విశ్వాసం అంటే.

విశ్వాసం అనేది మనకి దొరికిన ఒక వాగ్దానాన్నే భవిష్యవాణిగా మలుచుకుంటుంది. అది ప్రస్తుతానికి వాగ్దానమే కాబట్టి మనం సహకరించకపోతే దానికంటూ ఒక అర్థం ఉండదు. అయితే దాన్ని విశ్వాసానికి జోడిస్తే ముందు జరుగబోయే విషయాన్ని ఇప్పుడే తెలుసుకోవడం అవుతుంది. మనలో ఓ నమ్మకం కలుగుతుంది. ఇది తప్పకుండా జరిగి తీరుతుంది. ఎందుకంటే దేవుడు అబద్ధమాడడు కాబట్టి.

చాలామంది ఎక్కువ విశ్వాసం ఇమ్మని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. అయితే వాళ్ళ ప్రార్థనల్ని సూక్ష్మంగా గమనించి వాటి నిజమైన అర్థాన్ని పరిశీలిస్తే, అవి నిజానికి విశ్వాసం కోసం ప్రార్థనలు కావని అర్థమౌతుంది. వాళ్ళు కేవలం తాము విశ్వసించిన దానిని ప్రత్యక్షపరచమని ప్రార్థన చేస్తుంటారు. 

నిజమైన విశ్వాసి “ఇది నాకు మంచిని చేకూర్చేది గనుక దేవుడు నాకిచ్చాడు” అనడు. ఏమంటాడంటే “దేవుడు దీన్ని నాకిచ్చాడు గనుక ఇది నాకు మంచిదన్న మాట.” విశ్వాసం అంటే చీకట్లో దేవునితో నడుస్తూ తన చేతిని వదలకుండా పట్టుకోమని దేవుణ్ణి ప్రార్థించి, దేవుడు తన చెయ్యి పట్టుకొని ఉన్నాడన్న ధైర్యం తో ఉండటమే.

*నీ విశ్వాసంపై విశ్వాసాన్ని కాదు*

*తనపై విశ్వాసాన్నే అడిగాడు*

*విశ్వ కాపరి మన యేసు*

*నా చెంతకి రండని పిలిచాడు*

*తనపై విశ్వాసాన్ని అడిగాడు*

*వెలుగు నీడల్లో విశ్వసించండి*

*విశ్వాస ఫలాలను ఆయన్నుండే ఆశించండి*

‘దేవుడు ఇలా చేస్తాడని నాకు బాగా తెలుసు’ అని నీవు ఏ విషయం గూర్చి అనుకుంటున్నావో ఆ విషయం దరిదాపు జరిగి పోయినట్లే. దాని విషయం నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఇప్పుడే ప్రారంభించాలి.

-----------------------------------------------------------------------------------------------------------------------------

God that cannot lie promised* (Titus -1:2)

Faith is not working up by will power a sort of certainty that something is coming to pass, but it is seeing as an actual fact that God has said that this thing shall come to pass and that it is true, and then rejoicing to know that it is true, and just resting because God has said it.

Faith turns the promise into a prophecy. While it is merely a promise it is contingent upon our cooperation. But when faith claims it, it becomes a prophecy, and we go forth feeling that it is something that must be done because God cannot lie.—Days of Heaven upon Earth

I hear men praying everywhere for more faith, but when I listen to them carefully and get at the real heart of their prayer, very often it is not more faith at all that they are wanting, but a change from faith to sight.

Faith says not, “I see that it is good for me, so God must have sent it,” but, “God sent it, and so it must be good for me.”

Faith, walking in the dark with God, only prays Him to clasp its hand more closely. —Phillips Brooks

“The Shepherd does not ask of thee  

Faith in thy faith, but only faith in Him;  

And this He meant in saying, ‘Come to me.’  

In light or darkness seek to do His will,  

And leave the work of faith to Jesus still.”