🍂 ఇశ్రాయేలీయులు అందరు మోషే మాట చొప్పున నడిచి ఐగుప్తు దేశమునుండి బయలుదేరారు. అందరు ఆకాశము నుండి వచ్చిన మన్నాను భుజించారు, ఒకే బండ నుండి వచ్చిన నీటిని పానము చేసారు, ఒక్కటే మేఘము క్రింద నడిచారు అయితే నలువది సంవత్సరములు గడచి వాగ్దాన దేశమైన కనానును చేరేప్పటికీ ఎవరైతే ఐగుప్తు దేశమునుండి బయలుదేరారో వారిలో అందరు వారి తరమంతా మధ్యలోనే రాలిపోయింది..... కేవలం యెహోషువ, కాలేబు తప్ప... అందుకే వారి గురించి దేవుడు చెప్తున్నారు వారిలో ఎక్కువమంది దేవునికి ఇష్టులుగా ఉండలేకపోయిరి గనుక అరణ్యములోని సంహరించబడ్డారు అని.
🌿 ఎందుకు వారు సంహరించబడ్డారు అంటే దేవుడే నాలుగు కారణాలు చెప్తున్నారు. విగ్రహారాధన, వ్యభిచారం, దేవుణ్ణి శోధించడం, దేవునిపై సణగటం అని.
🍂 మన పితరులందరు మేఘముక్రింద నుండిరి. వారందరును సముద్రములో నడచిపోయిరి అందరును మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి; అందరు ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి; అందరు ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మసంబంధమైన బండలోనిది త్రాగిరి; ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువమంది దేవునికిష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి - 1కోరింథీయులకు 10:1-5
🍂 జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి, ఆడుటకు లేచిరి. వారిలో కొందరివలె మీరు విగ్రహారాధకులై యుండకుడి. వారివలె మనము వ్యభిచరింపకయుందము; వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక్కదినముననే యిరువది మూడువేలమంది కూలిరి. మనము ప్రభువును శోధింపక యుందము; వారిలో కొందరు శోధించి సర్పములవలన నశించిరి. మీరు సణుగకుడి; వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి - 1కోరింథీయులకు 10:7-10
🌿 అయితే నేడు మనము కూడా ఒక్కటే ఆహారమైన జీవాహారమును... ఒక్కటే పానీయము అయిన జీవజలమును, అలాగే ఒక్క దేవుణ్ణి సేవిస్తున్నాము... అయితే మనం దేవునికి యిష్టులుగా ఉంటున్నామా... లేక వారివలె దేవునికి ఇష్టములేని జీవితము జీవిస్తున్నామా.... తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను అని దేవుడు తెలియజేస్తున్నారు గనుక ఒక్కసారి ఆలోచిద్దాము... దేవుని చేతిలో సంహరించేబడే విధముగా మన జీవితం ఉంటుందా లేక దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తున్నామా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుని సరిచేసుకుందాము...
No comments:
Post a Comment