Wednesday, November 24, 2021

The Power of Silence

 

ఊరకుండుడి - నేనే దేవుడనని తెలిసికొనుడి (కీర్తనలు 46:10).


సంగీతం మధ్యలో వచ్చే మౌనం కంటే అందమైన స్వరం ఉందా? తుఫానుకి ముందుండే ప్రశాంతత కంటే, ఏదైనా అసాధారణమైన దృగ్విషయం జరగబోయే ముందు అలుముకునే నిశ్శబ్దం కంటే గంభీరమైనది మరొకటి ఉందా? నిశ్చలతలో ఉన్న శక్తి కంటే బలంగా హృదయాన్ని తాకే శక్తి ఏదైనా ఉందా?


తన శక్తినుండి తానే తప్పించుకుని అన్ని శబ్దాలనుండి విముక్తి పొందిన హృదయంలో ఊహలకు మించిన దేవుని శాంతి ఉంటుంది. శక్తికి మూలమైన ప్రసన్నత, నిశ్చయత ఉంటాయి. ఏదీ కదిలించలేని శాంతి ఉంటుంది. ఒక దివ్యమైన విశ్రాంతి ఉంటుంది. ప్రపంచం అలాటి విశ్రాంతిని ఇవ్వలేదు. తీసుకోనూ లేదు. ఆత్మ లోతుల్లో ఎక్కడో ఒక చిన్నగది ఉంది. అందులో దేవుడుంటాడు. మనం చెవుల్లో గింగురుమనే శబ్దాలన్నింటినీ వదిలించుకుని దానిలోకి ప్రవేశించగలిగితే ఆ మెల్లని స్వరాన్ని వినగలం.


అతివేగంగా తిరిగే చక్రంలో ఇరుసు దగ్గర ఒక అతి సూక్ష్మమైన బిందువు ఉంది. అక్కడ చలనమేమీ ఉండదు. అలాగే మన హడావుడి జీవితంలో మనం దేవునితో ఉండగలిగిన ఒక చిన్న ప్రదేశం ఉంది. అక్కడంతా ప్రశాంతత, నిశ్శబ్దం. దేవుణ్ణి తెలుసుకోవడానికి ఒకటే మార్గముంది. “మౌనంగా ఉండి” తెలుసుకోవాలి. “దేవుడు తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. లోకమంతయు ఆయన ఎదుట మౌనముగా ఉండును గాక."


“ప్రేమా స్వరూపియైన తండ్రీ, చాలాసార్లు మేము చీకటి రాత్రుళ్ళలో నడిచాము. చుక్కల వెలుగు, వెన్నెల మాకు సరిపడేది కాదు. చిమ్మచీకటి మరిక ఎన్నడూ తొలిగిపోదేమోనన్నంత చిక్కగా మా మీద పరుచుకుంది. ఆ చీకటిలో పగిలిన మా హృదయాలను బాగుచేసే స్వరమేదీ వినిపించేది కాదు. కనీసం ఉరుముల ధ్వని వినిపించినా సంతోషించేవాళ్ళమే. ఆ నిశ్శబ్దం మమ్మల్ని నరకయాతన పెట్టింది.


“కాని మధురధ్వనిగల వీణెల స్వరంకంటే మెల్లగా వినిపించే నీ తియ్యని స్వరమే మా గాయపడిన ఆత్మలకు హాయి గొల్పింది, మాతో మాట్లాడినది. 'నీ మెల్లని స్వరమే' మేము శ్రద్ధతో ఆలకిస్తే వినబడింది. మేము కన్నులెత్తి చూస్తే ప్రేమ కాంతిలో మెరుస్తున్న నీ వదనం కనిపించింది. నీ స్వరాన్ని విని, నీ ముఖాన్ని చూసినప్పుడు ఎండిన చెట్టుకు వర్షపు ధారలు జీవాన్నిచ్చినట్టుగా మా ఆత్మలు సేదదీరాయి.”

-----------------------------------------------------------------------------------------------------------------------------

Be still, and know that I am God (Ps - 46:10)

Is there any note of music in all the chorus as mighty as the emphatic pause? Is there any word in all the Psalter more eloquent than that one word, Selah (Pause)? Is there anything more thrilling and awful than the hush that comes before the bursting of the tempest and the strange quiet that seems to fall upon all nature before some preternatural phenomenon or convulsion? Is there anything that can touch our hearts as the power of stillness?

There is for the heart that will cease from itself, “the peace of God that passeth all understanding,” a “quietness and confidence” which is the source of all strength, a sweet peace “which nothing can offend,” a deep rest which the world can neither give nor take away. There is in the deepest center of the soul a chamber of peace where God dwells, and where, if we will only enter in and hush every other sound, we can hear His still, small voice.

There is in the swiftest wheel that revolves upon its axis a place in the very center, where there is no movement at all; and so in the busiest life there may be a place where we dwell alone with God, in eternal stillness, There is only one way to know God. “Be still, and know.” “God is in his holy temple; let all the earth keep silence before him.” —Selected

“All-loving Father, sometimes we have walked under starless skies that dripped darkness like drenching rain. We despaired of starshine or moonlight or sunrise. The sullen blackness gloomed above us as if it would last forever. And out of the dark there spoke no soothing voice to mend our broken hearts. We would gladly have welcomed some wild thunder peal to break the torturing stillness of that over-brooding night.

“But Thy winsome whisper of eternal love spoke more sweetly to our bruised and bleeding souls than any winds that breathe across Aeolian harps. It was Thy ’still small voice’ that spoke to us. We were listening and we heard. We looked and saw Thy face radiant with the light of love. And when we heard Thy voice and saw Thy face, new life came back to us as life comes back to withered blooms that drink the summer rain.”


No comments:

Post a Comment