ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు (కీర్తనలు 65:8).
ఉదయం పెందలాడే లేచి కొండ మీదికి వెళ్ళి దేవుడు ఉదయాన్ని ఎలా తయారు చేస్తాడో పరిశీలించండి. దేవుడు సూర్యుణ్ణి పైకి నెడుతున్నాడా అనిపిస్తుంది. ఆ సమయంలో ఆకాశంలో బూడిద రంగు మెల్లిమెల్లిగా కరిగిపోతుంది. అన్ని రంగులూ కాస్త కాస్త అక్కడక్కడా ప్రత్యక్షమౌతాయి. అవన్నీ క్రమంగా మిళితమై ఒకే ధవళకాంతిగా మారే వేళకు సూర్యబింబం ప్రత్యక్షమౌతుంది. దినకరుడు ఠీవిగా బయలుదేరి తన కిరణాలను భూమిపై కురిపిస్తుంటే ఆ సంధ్యారుణిమలో ప్రకృతి దేవుని మహిమను వర్ణిస్తూ గొంతెత్తి పాడే పాటను వినండి.
సంజెకాంతుల కెంజాయలో
మంజుల స్వరమొకటి విన్నాను
“దినమంతా నీతో ఉన్నాను
సంతోషంగా ఉండు"
అనేది ఆ దేవుని స్వరం
ఉదయవేళ వ్యాపించే నిర్మలమైన కాంతి సత్యం గురించి నా హృదయం తహతహలాడేలా చేసింది. ఆ సత్యమే నన్ను ఉదయమంతా స్వచ్ఛంగా చేసే మహిమ కలది. అది ప్రకృతి ఆలపించే మధుర గీతికలో శ్రుతి కలపడానికి నాకు తోడ్పడుతుంది. ఉషోదయవేళ విసిరే గాలి నా నాసికారంధ్రాలలో జీవాన్ని ఊదిన దేవునిలో నేను నా ఆశలు నిలుపుకునేలా చేసింది. ఆయన తన ఊపిరితోను, తన మనసుతోను, తన ఆత్మతోను నన్ను నింపి ఆయన ఆలోచనలే నేను ఆలోచించేలా, ఆ జీవితాన్నే నేను జీవించగలిగేలా, అందులోనే నా బ్రతుకును నిలుపుకుని మహిమను పొందగలిగేలా, ప్రార్థించేలా చేసింది. దేవుడు ఇచ్చే ఉదయాలూ,
రాత్రిళ్ళూ లేకపోతే మానవమాత్రులం, మనమెలా బ్రతకగలం!
రాత్రికి పగటికీ మధ్య
వేగుచుక్క పొడిచిన వేళ
నీడల జాడలు నిశ్శబ్దంగా
కదిలిపోతున్న వేళ
ఈ దినం చెయ్యవలసినదేమిటని
నీ గదిలో ఏకాంతంగా
ముచ్చటగా యేసుతో ముచ్చటించు*
ఆయన చిత్తమేమిటని
నిన్ను నడిపిస్తాడు
పర్వతాలు వంచుతాడు
ఎడారులు పూలు పూస్తాయి
‘మారా ధార' మధురమౌతుంది
ఈ జీవన యాత్రంతా
తెలుసా జైత్రయాత్రని
ఉదయాన్నే ఆయన్ను ఆరాధిస్తే
నిజమే ఇది ప్రతి నిత్యం.
-----------------------------------------------------------------------------------------------------------------------------
Thou makest the outgoing of the morning and evening to rejoice (Ps - 65:8)
Get up early and go to the mountain and watch God make a morning. The dull gray will give way as God pushes the sun towards the horizon, and there will be tints and hues of every shade, that will blend into one perfect light as the full-orbed sun bursts into view. As the King of day moves forth majestically, flooding the earth and every lowly vale, listen to the music of heaven’s choir as it sings of the majesty of God and the glory of the morning.
In the holy hush of the early dawn
I hear a Voice
“I am with you all the day,
Rejoice! Rejoice!”
The clear, pure light of the morning made me long for the truth in my heart, which alone could make me pure and clear as the morning, tune me up to the concert-pitch of the nature around me. And the wind that blew from the sunrise made me hope in the God who had first breathed into my nostrils the breath of life; that He would at length so fill me with His breath, His mind, His Spirit, that I should think only His thoughts, and live His life, finding therein my own life, only glorified infinitely. What should we poor humans do without our God’s nights and mornings? —George MacDonald
“In the early morning hours,
’Twixt the night and day,
While from earth the darkness passes
Silently away;
“Then ’tis sweet to talk with Jesus
In thy chamber still
For the coming day and duties
Ask to know His will.
“Then He’ll lead the way before you,
Mountains laying low;
Making desert places blossom,
Sweet’ning Marah’s flow.
“Would you know this life of triumph,
Victory all the way?
Then put God in the beginning
Of each coming day.”
No comments:
Post a Comment