మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును (హెబ్రీ 12:11).
జర్మనీ దేశంలో ఓ కథ వాడుకలో ఉంది. ఒక రాజ వంశీయుడు తన భవనం గోడల మీద పెద్ద పెద్ద తీగెల్ని అమర్చాడట. స్వర తంతులమీద గాలి ఊదడం ద్వారా సంగీతాన్ని పుట్టించే వాయిద్యం ఒకటుంది. కాని ప్రకృతిలో వీచే గాలి సంగీతాన్ని వినిపించేలా ఆ తీగెల్ని వాయిద్యానికున్నట్టే అతడు అమర్చాడట. ఆ తంతుల మీదుగా పిల్లగాలి వీచేది గాని సంగీత ధ్వనులేవీ వినిపించేవి కావట.
ఒకరోజు పెద్ద గాలివాన వచ్చి అతి బలమైన గాలులు ఆ భవంతికేసి విసిరి కొడుతున్నాయి. ఆ ధనికుడు కిటికీ తలుపులు తెరిచి చెలరేగే ఆ తుఫాను వంక చూస్తున్నాడు. ఆ పెనుగాలికి అతడు అమర్చిన తీగెలనుండి బ్రహ్మాండమైన సంగీతం హోరుగాలి శబ్దాన్ని మించి వినిపిస్తూ ఉంది. వాటిలో సంగీతాన్ని పుట్టించాలంటే తుఫాను అవసరమైంది.
మనకు ఎందరో వ్యక్తుల జీవితాలు తెలుసు. వాళ్ళు క్షేమంగా, సౌఖ్యంగా జీవించినంత కాలం ఆ జీవితాల్లో నుంచి సంగీతం వినిపించ లేదు. అయితే తుఫానులు వాళ్ళను వేధించినప్పుడు తమలో నుంచి బలంగా వినిపిస్తున్న సంగీతనాదాలతో ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచారు.
కిటికీకేసి టపటపా
*కొడుతూ పడుతున్న వానజల్లు *
కారు మబ్బుల్లోంచి వదలక
కురిసేదెందుకో అర్థం కాలేదు
పువ్వులు పువ్వులు
వర్షం వెలిసాక విరిసే పువ్వులు
నేలంతా పరుచుకునే పువ్వులు
దేవుడు వివరించాడు వర్షం కురిసేదెందుకో
మనం శ్రమలను సరియైన పధ్ధతిలో ఎదుర్కోగలిగితే శ్రమల తరువాత వచ్చే దశను గురించి మనం నిశ్చింతగా దేవునిపై ఆధారపడవచ్చు. ఎవరూ బుద్ధి చెప్పకపోతే కొంతకాలం సంతోషంగానే ఉంటుంది. అయితే తరువాతి కాలంలో ఫలితాలెలా ఉంటాయి?
-----------------------------------------------------------------------------------------------------------------------------
Nevertheless afterward (Heb - 12:11)
There is a legend that tells of a German baron who, at his castle on the Rhine, stretched wires from tower to tower, that the winds might convert them into an Aeolian harp. And the soft breezes played about the castle, but no music was born.
But one night there arose a great tempest, and hill and castle were smitten by the fury of the mighty winds. The baron went to the threshold to look out upon the terror of the storm, and the Aeolian harp was filling the air with strains that rang out even above the clamor of the tempest. It needed the tempest to bring out the music!
And have we not known men whose lives have not given out any entrancing music in the day of a calm prosperity, but who, when the tempest drove against them have astonished their fellows by the power and strength of their music?
“Rain, rain
Beating against the pane!
How endlessly it pours
Out of doors
From the blackened sky
I wonder why!
“Flowers, flowers,
Upspringing after showers,
Blossoming fresh and fair,
Everywhere!
Ah, God has explained
Why it rained!”
You can always count on God to make the “afterward” of difficulties, if rightly overcome, a thousand times richer and fairer than the forward. “No chastening … seemeth joyous, nevertheless afterward …” What a yield!
No comments:
Post a Comment