Wednesday, December 1, 2021

Devil's Burden

 

కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచియున్నది (హెబ్రీ4:9). 


అన్ని దిక్కులయందు వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవా వారి శత్రువులనందరిని వారి చేతి కప్పగించి యుండెను (యెహోషువా 21:44).


ఆయన దీనులను రక్షణతో అలంకరించును (కీర్తన 149:4).


ప్రఖ్యాత క్రైస్తవ సేవకుడొకాయన తన తల్లి గురించి చెప్తుండేవారు. ఆవిడ చాలా కంగారు మనిషి. ఇలా కంగారు పడడం, ఆందోళన చెందడం పాపమని గంటలకొద్దీ చెప్పి ఆమెను ఒప్పించడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు. కాని ఆవిడ దిగుళ్ళు తీరలేదు. లేనిపోని బాధలు ఊహించుకుని దిగులుపడేది.


అయితే ఒకరోజు చిరునవ్వుతో ముఖం వెలిగిపోతూ కన్పించింది ఆమె. ఏం జరిగిందని అడిగాడతడు. రాత్రి తనకో కలొచ్చిందని చెప్పిందామె.


కలలో ఆమె ఓ రోడ్డు వెంట వెళ్తున్నది. ఆ దారి వెంటే చాలామంది భారంగా కాళ్ళీడ్చుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళంతా తమ వీపుల మీద నల్లటి బరువైన మూటలు పెట్టుకుని నడుస్తున్నారు. చూడడానికి అసహ్యంగా భయంకరంగా ఉన్న దయ్యాల్లాటి జీవులు వాళ్ళు మోసుకెళ్ళేందుకు ఆ మూటల్ని అక్కడ పారేస్తూ వెళ్తున్నాయి.


మిగతావాళ్ళలానే ఆమె కూడా ఆ అనవసరమైన బరువులు మోసుకుంటూ వెళ్తున్నదట. దయ్యాల బరువులకి కృంగిపోతూ కాసేపటికి తలెత్తి ఒక మనిషిని చూసిందట. అతని ముఖం దయతో వెలిగిపోతున్నది. అతను అటూ ఇటూ పరిగెడుతూ ఆ మనుషుల్ని ఏదో చెప్పి ఓదారుస్తున్నాడు.


చివరికి ఆమె దగ్గరికి కూడా వచ్చాడు. ఆయన తన రక్షకుడని ఆమె గ్రహించింది. తానెంత అలసిపోయానో ఆయనకి చెప్పింది. ఆయన అర్థం చేసుకున్నట్లుగా నవ్వి ఇలా అన్నాడు.


"ప్రియ కుమారీ, ఈ బరువులు నేనిచ్చినవి కావు. వీటి అవసరం నీకు లేదు. ఇవన్నీ దయ్యం ఇచ్చిన బరువులు. అవి నీ ప్రాణాలు తోడేస్తున్నాయి. వాటిని పడెయ్యి. వాటిని ముట్టుకోకు. అప్పుడు నీ దారి తేలికౌతుంది. రెక్కలు కట్టుకుని ఎగిరిపోయినంత తేలికగా ఉంటుంది.”


ఆమె చేతిని తాకాడాయన. వెంటనే ఆమెలో శాంతి సమాధానాలు చోటుచేసుకున్నాయి. ఆ బరువుల్ని నేలకి విసిరికొట్టి సంతోషంతో కృతజ్ఞతతో ఆయన పాదాల మీద పడబోతుండగా ఆమెకి మెలకువ వచ్చిందట. ఆవిడకున్న దిగుళ్ళన్నీ మటుమాయమయ్యాయి. ఆ రోజు నుంచి ఆమె జీవితాంతం, ఆ కుటుంబం అంతటిలోనూ ఆమె అందరికంటే సంతోషంగా ఉండేది.


రేయిలో సంగీతం నిండిపోతుంది

దినమంతా వేధించిన బాధలు

తోక ముడిచి పారిపోతాయి

-----------------------------------------------------------------------------------------------------------------------------

There remaineth, therefore, a rest to the people of God - (Heb 4:9)

The rest includes victory, ‘And the Lord gave them rest round about; ... the Lord delivered all their enemies into their hand’ - Josh 21:44

He will beautify the meek with victory - Ps 149:4

An eminent Christian worker tells of his mother who was a very anxious and troubled Christian. He would talk with her by the hour trying to convince her of the sinfulness of fretting, but to no avail. She was like the old lady who once said she had suffered so much, especially from the troubles that never came.

But one morning the mother came down to breakfast wreathed in smiles. He asked her what had happened, and she told him that in the night she had a dream.

She was walking along a highway with a great crowd of people who seemed so tired and burdened. They were nearly all carrying little black bundles, and she noticed that there were numerous repulsive looking beings which she thought were demons dropping these black bundles for the people to pick up and carry.

Like the rest, she too had her needless load, and was weighed down with the devil’s bundles. Looking up, after a while, she saw a Man with a bright and loving face, passing hither and thither through the crowd, and comforting the people.

At last He came near her, and she saw that it was her Saviour. She looked up and told Him how tired she was, and He smiled sadly and said:

“My dear child, I did not give you these loads; you have no need of them. They are the devil’s burdens and they are wearing out your life. Just drop them; refuse to touch them with one of your fingers and you will find the path easy and you will be as if borne on eagle’s wings.”

He touched her hand, and lo, peace and joy thrilled her frame and, flinging down her burden, she was about to throw herself at His feet in joyful thanksgiving, when suddenly she awoke and found that all her cares were gone. From that day to the close of her life she was the most cheerful and happy member of the household.


And the night shall be filled with music,  

And the cares that infest the day,  

Shall fold their tents like the Arabs,  

And as silently steal away. 

No comments:

Post a Comment