Tuesday, November 30, 2021

In God, Not Out of Trouble

 

నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెదకుచున్నావా? వెదకవద్దు; నేను సర్వశరీరుల మీదికి కీడు రప్పించుచున్నాను, అయితే నీవు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకిచ్చుచున్నాను (యిర్మీయా 45:5).


ఇది కష్ట సమయాల్లో ఊరటనిచ్చే వాగ్దానం. విపరీతమైన ఒత్తిడులకు లోనయ్యే సమయంలో ప్రాణాధారమైన వాగ్దానం. దోపుడు సొమ్ము దొరికినట్టుగా దొరికే ప్రాణం. కఠినంగా మారిపోతున్న ఈ రోజుల్లో, అంత్యదినాల్లో, శ్రమదినాల్లో ఈ వాగ్దానం మనకు ఆదరణ నిస్తుంది.


'దోపుడు సొమ్ము దొరికినట్టుగా' ప్రాణం దొరకడం అంటే ఏమిటి? అంటే నాశనకర్త కోరల్లోనుండి లాగేసుకున్న ప్రాణమన్న మాట. సింహం నోటిలో నుంచి దావీదు తన గొర్రెపిల్లను లాగేసుకున్నట్టన్న మాట. యుద్ధధ్వని బొత్తిగా ఆగిపోతుందని కాదు, గాని యుద్ధరంగంలో మనకు ఒక ఉన్నత స్థలం, తుఫానులో ఒక చిన్న సంరక్షణ, శత్రు దేశంలో ఒక కోట, అస్తమానమూ మనపై పీడనాలున్నా మన ప్రాణం మాత్రం నిలిచి ఉండడం జరుగుతుంది. పౌలు తన జీవితం మీద విరక్తి కలిగేటంతగా బాధలు పొందినా బాగుపడ్డాడు. ముల్లు ఇంకా ఉన్నప్పటికీ క్రీస్తు శక్తి అతనిలో ఉండి క్రీస్తు కృప అతనికి సరిపోయింది. 'దేవా, దోపుడు సొమ్ము దొరికినట్టుగా నా ప్రాణాన్ని ఇవ్వు. కష్ట సమయాల్లో నేను విజయవంతంగా నిలబడేలా సహాయం చెయ్యి’


ఆపదల నుండి విడుదల కోసం ప్రార్థిస్తుంటాము. ఇలా జరుగుతుందని నమ్ముతాం కూడా. కాని ఆపదలున్నప్పటికీ మనలను దేవుడు దేనికి ఉద్దేశించాడో అలా కావాలని ప్రార్థించం. ఆపదలు ఎంత కాలం నిలిచి ఉంటే అంత కాలం వాటి మధ్య మనం ఉంటూ దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడన్న నిశ్చయతను కలిగి ఉండాలి. నలభై పగళ్ళూ, రాత్రుళ్ళూ యేసుప్రభువు సైతానుతో అడవిలో ఉన్నాడు. ఇలాటి ప్రత్యేకమైన శోధన సమయంలో ఆయనకున్న మానవ ప్రవృత్తి ఆకలిదప్పుల మూలంగా ఇంకా నీరసమై పోయింది.


అగ్నిగుండం ఏడంతలు ఎక్కువ వేడితో మండింది. కాని హెబ్రీ యువకులు ముగ్గురు కొంతసేపు ఆ మంటల్లో ఉన్నారు. వారు బయటకు వచ్చి చూస్తే అగ్ని వాసన కూడా వారికి అంటలేదని గ్రహించాను. ఒక రాత్రి దానియేలు సింహాల మధ్య కూర్చున్నాడు. ఆ గుంటలో నుండి అతణ్ణి బయటకు తీసినప్పుడు అతని శరీరంపై ఏ గాయమూ లేదు. ఎందుకంటే తన దేవుని మీద అతడు నమ్మకముంచాడు. వీళ్ళంతా శత్రువుల మధ్యనే నివాసమున్నారు. అయినా వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నారు.

----------------------------------------------------------------------------------------------------------------------------

And seekest thou great things for thyself? Seek them not: for, behold, I will bring evil upon all flesh, saith the Lord: but thy life will I give unto thee for a prey in all places whither thou goest (



Jer - 45:5)

A promise given for hard places, and a promise of safety and life in the midst of tremendous pressure, a life “for a prey.” It may well adjust itself to our own times, which are growing harder as we near the end of the age, and the Tribulation times.

What is the meaning of “a life for a prey”? It means a life snatched out of the jaws of the destroyer, as David snatched the lamb from the lion. It means not removal from the noise of the battle and the presence of our foes; but it means a table in the midst of our enemies, a shelter from the storm, a fortress amid the foe, a life preserved in the face of continual pressure: Paul’s healing when pressed out of measure so that he despaired of life; Paul’s Divine help when the thorn remained, but the power of Christ rested upon him and the grace of Christ was sufficient. Lord, give me my life for a prey, and in the hardest places help me today to be victorious. —Days of Heaven upon Earth

We often pray to be delivered from calamities; we even trust that we shall be; but we do not pray to be made what we should be, in the very presence of the calamities; to live amid them, as long as they last, in the consciousness that we are, held and sheltered by the Lord, and can therefore remain in the midst of them, so long as they continue, without any hurt. For forty days and nights, the Saviour was kept in the presence of Satan in the wilderness, and that, under circumstances of special trial, His human nature being weakened by want of food and rest. The furnace was heated seven times more than it was wont to be heated, but the three Hebrew children were kept a season amid its flames as calm and composed in the presence of the tyrant’s last appliances of torture, as they were in the presence of himself before their time of deliverance came. And the livelong night did Daniel sit among the lions, and when he was taken up out of the den, “no manner of hurt was found upon him, because he believed in his God.” They dwelt in the presence of the enemy, because they dwelt in the presence of God.

No comments:

Post a Comment