Friday, December 31, 2021

Hitherto


యింతవరకు యెహోవా మనకు సహాయము చేసెను (1సమూ 7:12).

ఇంత వరకు అనే మాట గడిచిన కాలంలోకి చూపిస్తున్న చెయ్యి. ఇరవై ఏళ్ళు కానివ్వండి. డెబ్భై ఏళ్ళు కానివ్వండి. గడిచిన కాలమెంతైనా ఇంత వరకు దేవుడు మనకి సహాయం చేసాడు. కలిమిలోను, లేమిలోను, ఆరోగ్య అనారోగ్యాల్లో, ఇంటా బయటా, భూమి మీదా, నీళ్ళ మీదా, గౌరవంలో, అగౌరవంలో, కంగారులో, ఆనందంలో, శ్రమలో, విజయంలో, ప్రార్థనలో, శోధనలో - ఇంత వరకు దేవుడు మనకు సహాయము చేసెను.

చెట్లు వరసగా బారులు తీర్చి ఉంటే చూడడానికి ఇంపుగా ఉంటాయి. వాటి కొమ్మలు, కాండాలు, ఈ చివరినుండి ఆ చివరికి ఒకే ఆకారంలో ఒకదానివెంట ఒకటి ఉండడం కంటికింపుగా ఉంటుంది. అలాగే గడిచిన నీ సంవత్సరాల వరసల్ని ఒక్కసారి వెనుదిగిరి చూడు. కరుణాహరితం నింపుకున్న ఆకుల్ని, దేవుడు ప్రేమబలంతో స్థిరంగా నిలిపిన కాండాలనూ, సంతోషాల కొమ్మలనూ చూడు.

ఆ కొమ్మల్లో పాటలు పాడుతున్న పక్షులు కనిపించడం లేదా. అవును, ఎన్నెన్నో ఉన్నాయి. ఇంతవరకు నీ జీవితంలోనికి ప్రసరించిన కృపనుబట్టి అవి పాటలు పాడుతున్నాయి.

ఇంత వరకు అనే మాట ముందుకి కూడా చూపిస్తున్నది. కొంతదూరం నడిచిన తరువాత 'ఇంత వరకు' అని అతను రాసాడంటే గమ్యం ఇంకా చేరలేదన్నమాట. దాటాల్సిన దూరం ఇంకా ఉంది. శ్రమలూ, ఆనందాలు, శోధనలు, విజయాలు, ప్రార్థనలు, జవాబులు, కష్టాలు, శక్తి, పోరాటాలు, అస్వస్థతలు, ముదిరే వయసు, మరణం ఇలా ఇంకెన్నో ఉన్నాయి.

అంతేనా? లేదు. ఇంకా ఉంది. యేసు పోలిక లోనికి మేలుకొలుపు. సింహాసనాలు, వీణెలు, స్తుతిగీతాలు, కీర్తనలు, తెల్లని వస్త్రాలు, యేసు ముఖారవిందం, పరిశుద్ధుల సహవాసం, దేవుని మహిమ, నిత్యత్వపు సంపూర్ణత ఇవన్నీ ఉన్నాయి. ధైర్యం తెచ్చుకోండి, గొప్ప ఆత్మ విశ్వాసంతో మీ ఎబినేజరును నిలబెట్టండి.

ఇంత వరకు వెంటనున్న వాడు 

ఇక పైన జంటగా ఉంటాడు.


ఈ “ఇంత వరకు”ను పరలోకపు కాంతిలో చూసి అర్థం చేసుకుంటే ఎంత అద్భుతాశ్చర్యపూరితంగా ఉంటుంది!

ఆల్ప్ పర్వత శ్రేణుల్లోని గొల్లవాళ్ళకి ఓ మంచి అలవాటు ఉంది. ప్రతిరోజూ ఒకరికొకరు వీడ్కోలు గీతాలు పాడుకుంటారు. అక్కడి గాలి పరిశుభ్రంగా ఉండడంవల్ల వాళ్ళ పాటలు చాలా దూరం వినబడతాయి. కనుచీకటి కమ్ముతున్నప్పుడు మందలన్నింటినీ పోగుచేసి ఆ కొండదారులగుండా క్రిందికి నడిపిస్తూ వాళ్ళు పాడుకుంటారు. “ఇంతవరకు దేవుడు కాపాడాడు! ఆయన నామానికి స్తోత్రాలు!”

చివరగా ఎంతో మర్యాదతో ఒకరినొకరు స్నేహపూర్వకంగా వీడ్కోలు చెప్పుకుంటారు. "గుడ్ నైట్, గుడ్ నైట్” ఈ మాటలు ప్రతిధ్వనిస్తుంటే ప్రక్కనే పాట సాగుతూ ఉంటే ఆ సంగీతం హాయిగా తేలివస్తూ దూర తీరాల్లో మెల్లిగా లీనమైపోతుంది.

ఈ చీకటిలో మనం కూడా ఒకర్నొకరం పిలుచుకుందాం. యాత్రికుల గుంపును ఆహ్వానిస్తూ చీకటే పాటై ప్రోత్సాహమిస్తుంది. ఆ ప్రతిధ్వనులన్నీ ఏకమై హల్లెలూయలు ఉరుము శబ్దంలా మారుమ్రోగి దేవుని పచ్చల సింహాసనాన్ని చేరాలి. ఆపైన ఉదయమై నప్పుడు స్ఫటిక సముద్రపు అంచున మనముంటాము. విమోచన పొందిన వాళ్ళతో కలిసి “సింహాసనాససీనుడైన వానికి, గొర్రెపిల్లకూ మహిమ, ఘనత సదాకాలము కలుగును గాక” అంటూ ఉత్సాహగానం చేస్తాము.

యుగయుగాలకూ ఇదే నా పాట

యేసు చూపించాడు నాకు బాట

“మరి రెండవసారి వారు - ప్రభువును స్తుతించుడి అనిరి” (ప్రకటన 19:3).

-----------------------------------------------------------------------------------------------------------------------------

Hitherto hath the Lord helped us - (1 Sam - 7:12)

The word “hitherto” seems like a hand pointing in the direction of the past. Twenty years or seventy, and yet “hitherto hath the Lord helped us!” Through poverty, through wealth, through sickness, through health; at home, abroad, on the land, on the sea; in honor, in dishonor, in perplexity, in joy, in a trial, in triumph, in prayer, in temptation—“hitherto hath the Lord helped!”

We delight to look down a long avenue of trees. It is delightful to gaze from one end of the long vista, a sort of verdant temple, with its branching pillars and its arches of leaves. Even so look down the long aisles of your years, at the green boughs of mercy overhead, and the strong pillars of lovingkindness and faithfulness which bear up your joys.

Are there no birds in yonder branches singing? Surely, there must be many, and they all sing of mercy received “hitherto.”

But the word also points forward. For when a man gets up to a certain mark and writes “hitherto,” he is not yet at the end; there are still distances to be traversed. More trials, more joys; more temptations, more triumphs; more prayers, more answers; more toils, more strength; more fights, more victories; and then come sickness, old age, disease, death.

Is it over now? No! there is more yet—awakening in Jesus’ likeness, thrones, harps, songs, psalms, white raiment the face of Jesus, the society of saints, the glory of God, the fullness of eternity, the infinity of bliss. Oh, be of good courage, believer, and with grateful confidence raise thy “Ebenezer,” for,

“He who hath helped thee hitherto  

Will help thee all thy journey through.”  

When read in Heaven’s light, how glorious and marvelous a prospect will thy “hitherto” unfold to thy grateful eye. —C. H. Spurgeon

The Alpine shepherds have a beautiful custom of ending the day by singing to one another an evening farewell. The air is so crystalline that the song will carry long distances. As the dusk begins to fall, they gather their flocks and begin to lead them down the mountain paths, singing, “Hitherto hath the Lord helped us. Let us praise His name!”

And at last with a sweet courtesy, they sing to one another the friendly farewell: “Goodnight! Goodnight!” The words are taken up by the echoes, and from side to side the song goes reverberating sweetly and softly until the music dies away in the distance.

So let us call out to one another through the darkness, till the gloom becomes vocal with many voices, encouraging the pilgrim host. Let the echoes gather till a very storm of Hallelujahs breaks in thundering waves around the sapphire throne, and then as the morning breaks we shall find ourselves at the margin of the sea of glass, crying, with the redeemed host, “Blessing and honor and glory be unto him that sitteth on the throne and to the Lamb forever and ever!”

“This my song through endless ages,  

Jesus led me all the way.”

No comments:

Post a Comment