ప్రియమైన స్నేహితులారా, రాబోయే కాలంలో జరగబోయేదాన్ని గురించి ఆలోచిస్తే అంతా అగమ్యగోచరం. క్రొత్త సంవత్సరం మన ఎదుట ఉంది. దాన్ని స్వాధీనపర్చుకునేందుకు మనం బయలుదేరుతున్నాం. మనకేం ఎదురవనున్నదో ఎవరు చెప్పగలరు? మనకి కలుగబోయే క్రొత్త అనుభవాలు, జరుగనున్న మార్పులు, క్రొత్తగా తలెత్తనున్న అవసరాలు ఎవరూహించగలరు? కాని మన పరలోకపు తండ్రి ఇక్కడ మనకొక ఉత్సాహభరితమైన ఆనంద సందేశాన్ని అందిస్తున్నాడు. *“అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడు దాని మీద ఉండును”.* మన అవసరాలన్నీ దేవుడే తీరుస్తాడట. ఎప్పటికీ ఎండిపోని నీటి బుగ్గలు అయనలో ఉన్నాయి. ఆనకట్టలు లేని సెలయేళ్ళు, జలధారలు ఆయన దగ్గర నుండి ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ ప్రవాహానికి అంతం లేదు. ఈ ప్రవాహం ఎండకి, అనావృష్టికి ఎండిపోదు. ఈ ప్రవాహం దేవుని పట్టణాన్ని సస్యశ్యామలం చేస్తుంది.
మనం అడుగుపెట్టబోతున్న దేశం కొండలు, లోయలు ఉన్న దేశం. అంతా చదునుగానూ ఉండదు. అంతా పల్లంగానూ ఉండదు. జీవితం చదునుగా, ఎత్తు పల్లాలు లేకుండా ఉంటే అది నిస్సారం అవుతుంది. కొండలు ఉండాలి, లోయలు ఉండాలి. కొండలు వర్షధారల్ని పోగుచేసి లోయల్లోకి ప్రవహింప జేస్తాయి. మన జీవితాల్లోనూ ఇంతే. కొండలు ఎదురైనప్పుడే మనం కృపాసింహాసనం ఎదుట మోకాళ్ళూని ఆశీర్వాద వర్షధారల్ని పొందుతాము. కష్టాల పర్వతాలను చూసి దిగులు పడతాము, సణుగుకుంటాము. కాని ఈ పర్వతాలే మనపై వర్షాలు కురవడానికి కారణం.
అరణ్యంలో, చదును ప్రదేశంలో ఎంతమంది నశించిపోయారో! అదే కొండలు లోయలున్న ప్రాంతాల్లో వాళ్ళంతా ఉంటే బ్రతికి అభివృద్ధి పొందేవాళ్ళు కదా. మైదానాల్లో ఎముకలు కొరికేసే చలిగాలులు అడ్డూ అదుపు లేకుండా వీస్తూ చెట్లనూ చేమలనూ నేలమట్టం చేస్తుంటే ఎంతమంది నశించిపోయారో! కాని దృడమైన, తలవంచని, అజేయమైన కొండ ప్రదేశాల్లో, శత్రువుల నుండి రక్షణ కలిగించే కొండచరియల్లో ఉండేవారు క్షేమంగా ఉన్నారు. జీవితంలో మనకెదురయ్యే కష్టాలు దేవుడు మన యెదుట నిలువబెట్టే కొండల్లాంటివి. వీటి వల్లనే మన జీవితాలు సంపూర్ణం అయి దేవునికి దగ్గరగా మనం వెళ్ళగలుగుతున్నాము. మనకి ఎలాంటి భాధలు, వేదన, శ్రమలు ఎదురవుతాయో తెలియదు. *‘కేవలం నమ్మకం ఉంచు’.* ఈ హెచ్చరికను అనుసరించి అలా చేస్తే ఈ రోజు దేవుడు మన దగ్గరకి వచ్చి మన చెయ్యి పట్టుకొని ముందుకు నడిపిస్తాడు. ఇది మంచి సంవత్సరం. దీవెనకరమైన క్రొత్త సంవత్సరం.
*అగమ్యగోచరమైన దారులగుండా*
*అయన నిన్ను నడిపిస్తాడు*
*అడుగులు తడబడినా*
*అలసట పైబడినా పైపైకి పైపైకి*
*అంధకారం దారి మూసినా*
*గాలివానలు గోలచేసినా*
*మబ్బులు విడిపోతాయి*
*ముందుకు నడిపిస్తాడు*
*కాల కల్లోలాల ఊహాలోకాల్లో*
*అనుమానాల్లో భయాల్లో*
*అల్లిబిల్లిగా అల్లుకుపోయిన ముళ్ళ కంచెల్లో*
*చెయ్యిపట్టి నడిపిస్తాడు*
*మబ్బు కమ్మిన వేళల్లో*
*కష్టంలో నష్టంలో*
*తన చిత్తం నెరవేరుస్తాడు*
*తానే ముందుకు నడిపిస్తాడు*
----------------------------------------------------------------*Instead, the land you are crossing the Jordan to occupy is one of hills and valleys, a land that drinks in water from the rains, a land the Lord your God looks after. He is constantly attentive to it from the beginning to the end of the year.*_ (Deut - 11:11-12 )
Today dear friends, we stand upon the verge of the unknown. There lies before us the new year and we are going forth to possess it. Who can tell what we shall find? What new experiences, what changes shall come, what new needs shall arise? But here is the cheering, comforting, gladdening message from our Heavenly Father, “The Lord thy God careth for it.” “His eyes are upon it away to the ending of the year.”
All our supply is to come from the Lord. Here are springs that shall never dry; here are fountains and streams that shall never be cut off. Here, anxious one, is the gracious pledge of the Heavenly Father. If He be the Source of our mercies they can never fail us. No heat, no drought can parch that river, “the streams whereof make glad the city of God.”
The land is a land of hills and valleys. It is not all smooth nor all down hill. If life were all one dead level the dull sameness would oppress us; we want the hills and the valleys. The hills collect the rain for a hundred fruitful valleys. Ah, so it is with us! It is the hill difficulty that drives us to the throne of grace and brings down the shower of blessing; the hills, the bleak hills of life that we wonder at and perhaps grumble at, bring down the showers. How many have perished in the wilderness, buried under its golden sands, who would have lived and thriven in the hill-country; how many would have been killed by the frost, blighted with winds, swept desolate of tree and fruit but for the hill-stern, hard, rugged, so steep to climb. God’s hills are a gracious protection for His people against their foes!
We cannot tell what loss and sorrow and trial are doing. Trust only. The Father comes near to take our hand and lead us on our way today. It shall be a good, a blessed new year!
He leads us on by paths we did not know;
Upward He leads us, though our steps be slow,
Though oft we faint and falter on the way,
Though storms and darkness oft obscure the day;
Yet when the clouds are gone,
We know He leads us on.
He leads us on through all the unquiet years;
Past all our dreamland hopes, and doubts and fears,
He guides our steps, through all the tangled maze
Of losses, sorrows, and o’erclouded days;
We know His will is done;
And still He leads us on.
—N.L. Zinzendorf
No comments:
Post a Comment