Saturday, January 22, 2022

He Has Overcome the World

 ఈ విషయాలేవీ నన్ను కదిలించవు (అపొ.కా. 20:24, స్వేచ్ఛానువాదం)

సమూయేలు గ్రంథంలో చదువుతాము - హెబ్రోనులో దావీదును అభిషేకించగానే ఫిలిష్తీయులంతా దావీదు మీద పడి దాడి చెయ్యడానికి వెదుక్కుంటూ వచ్చారు. ప్రభువు దగ్గరనుండి యోగ్యమైనది ఏదన్నా పొందామంటే వెంటనే సైతాను మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాడు.

మనం దేవుడి కోసం ఏదన్నా గొప్పకార్యం చేయడానికి పూనుకున్నప్పుడు శత్రువు ఆదిలోనే మనకి అడ్డుపడ్డాడనుకోండి అది మనకి రక్షణ సూచన. రెండింతలు ఆశీర్వాదాలు, శక్తి, విజయం మనవి అవుతాయన్నమాట. ఫిరంగి పేలినప్పుడు దాని గుండు ఇరుకు గొట్టంలోగుండా వెళ్ళవలసి రావడంచేత దాని వేగం రెట్టింపవుతుంది. విద్యుచ్ఛక్తి పుట్టేది కూడా ఇలానే కదా. పవర్ హవుస్ లో తిరిగే చక్రాల రాపిడి వల్లనే ఈ శక్తి పుడుతుంది. ఈ విధంగా మన ఆశీర్వాదాలకు దేవుడు సైతానును కూడా సాధనంగా వాడుకుంటాడు అని అర్థమవుతుంది.


వీరుడి జీవితం విరిపాన్పు కాదు

ముళ్ళతోట అతని బాట

మహనీయుల నివాసాలు చెరసాలలే

పెనుగాలులు తగిలేది నేరుగా తెరచాపకే


విజయానికి బాటలే కష్టాలు. లోయ దారిగుండా నడిచి వెళ్తే రాజబాట వస్తుంది గదా. గొప్ప విజయాలన్నిటి మీదా కష్టాల ముద్ర కనిపిస్తుంది. కఠినమైన మూసల్లోనే కిరీటాలను పోత పోసేది. దుఃఖపు గానుగలో నలగకుండా ఎవరికీ ఘనవిజయం రాదు. చింతాక్రాంతుడైన యేసు నుదిటి మీద కలతల చారలతో హెచ్చరించాడు “ఈ ప్రపంచంలో మీకెన్నో ఉపద్రవాలు వస్తాయి.” ఈ మాటలు అన్న వెంటనే ప్రశస్తమైన వాగ్దానం వచ్చింది. “అయితే భయపడకండి, నేను లోకాన్ని జయించాను.” ఈ అడుగు జాడలు ఎక్కడికి వెళ్ళినా కన్పిస్తాయి. సింహాసనానికి దారితీసే మెట్ల మీద రక్తపు చారికలు కనిపిస్తాయి. గాయపు మచ్చలకి బహుమానమే రాజదండం. మన చేతిలో ఓడిపోయిన మహా బలవంతుల దగ్గరనుంచి కిరీటాలను మనం లాక్కుంటాము. గొప్పతనానికి వెనుకనే ఆవేదన ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన రహస్యమే. 


సంస్కర్తలైనవాళ్ళను శ్రమలెప్పుడూ నీడల్లా వెంటాడాయి. పౌలు, లూథరు, నాక్స్, వెస్లీ తదితర విశ్వాస వీరుల కథలన్నీ ఇంతే. వాళ్ళు కీర్తివంతులు కావడానికి వాళ్ళు ఆపదల బాట మీదుగానే నడిచి వచ్చారు.


శాశ్వతంగా నిలిచిపోయిన పుస్తకాలన్నింటినీ వాటి రచయితలు తమ రక్తంతో రాసారు. “వీరంతా మహా శ్రమకాలం నుండి బయటికి వచ్చినవాళ్ళు.” గ్రీకుల్లో అసమానుడైన కవివర్యుడు ఎవరు? హోమర్, కాని ఆయన గ్రుడ్డివాడు. ‘యాత్రికుని ప్రయాణం' అనే కరిగిపోని కలను రచించిందెవరు? చీనాంబరాలు ధరించుకుని పట్టు పరుపుల మధ్య కూర్చున్న రాకుమారుడా? కాదు. ఆ కల వెలుగు బెడ్ ఫోర్డు జైలు చీకటి గోడలపై నీడలు పరిచింది. ఆ జైలు గదికి రాజు బన్యన్. ఆ దైవజ్ఞాని తనకి కనిపించిందంతా కాగితం మీద పెట్టాడు.


విజేత గొప్పవాడు, సరే. 

క్షతగాత్రుడై నెత్తురొల్కుతూ

కొన ఊపిరితో మూర్ఛితుడై

రణరంగంలో కడదాకా పోరాడుతూ

నేలకొరిగిన వీరుడు

అతనికంటే నిజంగా గొప్పవాడు

-----------------------------------------------------------------------------------------------------------------------------

None of these things move me - (Acts - 20:24)

     We read in the book of Samuel that the moment that David was crowned at Hebron, “All the Philistines came up to seek David.” And the moment we get anything from the Lord worth contending for, then the devil comes to seek us.

    When the enemy meets us at the threshold of any great work for God, let us accept it as “a token of salvation,” and claim double blessing, victory, and power. Power is developed by resistance. The cannon carries twice as far because the exploding power has to find its way through resistance. The way electricity is produced in the powerhouse yonder is by the sharp friction of the revolving wheels. And so we shall find someday that even Satan has been one of God’s agencies of blessing.  —Days of Heaven upon Earth

A hero is not fed on sweets,

Daily his own heart he eats;

Chambers of the great are jails,

And headwinds right for royal sails.

—Emerson

    Tribulation is the way to triumph. The valley-way opens into the highway. Tribulation’s imprint is on all great things. Crowns are cast in crucibles. Chains of character that wind about the feet of God are forged in earthly flames. No man is the greatest victor till he has trodden the winepress of woe. With seams of anguish deep in His brow, the “Man of Sorrows” said, “In the world, ye shall have tribulation”—but after this sob comes the psalm of promise, “Be of good cheer, I have overcome the world.” The footprints are traceable everywhere. Blood marks stain the steps that lead to thrones. Sears is the price of scepters. Our crowns will be wrested from the giants we conquer. Grief has always been a lot of greatness. It is an open secret.

“The mark of rank in nature.

Is the capacity for pain;

And the anguish of the singer

Makes the sweetest of the strain.”

    Tribulation has always marked the trail of the true reformer. It is the story of Paul, Luther, Savonarola, Knox, Wesley, and all the rest of the mighty army. They came through great tribulation to their place of power.

    Every great book has been written in the author’s blood. “These are they that have come out of great tribulation.” Who was the peerless poet of the Greeks? Homer. But that illustrious singer was blind. Who wrote the fadeless dream of “Pilgrim’s Progress”? A prince in royal purple upon a couch of ease? Nay! The trailing splendor of that vision gilded the dingy walls of old Bedford jail while John Bunyan, a princely prisoner, a glorious genius, made a faithful transcript of the scene.

Great is the facile conqueror;

Yet haply, he, who wounded sore,

Breathless, all covered o’er with blood and sweat,

Sinks fainting, but fighting evermore

Is greater yet.


No comments:

Post a Comment