అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను (మత్తయి 14:13)
వాయిద్య సమ్మేళనం మధ్యలో కొద్ది క్షణాలు మౌనం ఆవరిస్తుంది. వెంటనే సంగీతం మళ్ళీ మొదలవుతుంటుంది. ఈ మౌనంలో సంగీతమేమీ వినిపించదు. మన జీవితపు సంగీత సమ్మేళనంలో ఇలాటి మౌనాలు వచ్చినప్పుడు మనం రాగం అయిపోయిందని భ్రమపడతాము. దేవుడు తానే ఒక్కొక్కసారి మనకిష్టం లేని విశ్రమాన్ని, అనారోగ్యాన్ని, మన అంచనాల వైఫల్యాన్ని, ప్రయత్నాల పరాజయాన్నీ మనకి కలిగించి సాగుతున్న రాగం ఆగిపోయేలా చేస్తాడు. మన స్వరం మూగవోయింది అని చిన్నబుచ్చుకుంటాం. మన సృష్టికర్త ఆనందానికై జరిగే సంగీత కచేరిలో మన గొంతు కలపడం లేదే అని నిరాశపడతాము. సంగీత విద్వాంసులు ఈ మౌనం ఎంతసేపు ఉండాలో ఎలా తెలుసుకుంటారు? జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తుంది. మౌనంలో కూడా వాళ్ళు తాళం వేసుకుంటూనే ఉంటారు. ఆ తాళం ప్రకారం ఖచ్చితమైన సమయానికి సంగీతం మళ్ళీ ఎత్తుకుంటారు.
మన జీవన రాగాలను కూడా దేవుడు తాళం వెయ్యకుండా ఆలపించడు. రాగం ఏమిటో తెలుసుకోవడం మన విధి. అది తెలిస్తే మౌనం ఎంతసేపు ఉంటుందో తెలుస్తుంది. ఈ మౌనాలు, సంగీతానికి అడ్డు రావు, తాళాన్ని అధిగమించవు, పాటలోని మాధుర్యాన్ని చెడగొట్టవు. మనం దేవుని వైపుకి చూస్తే దేపుడే మన రాగాలకు తాళం వేస్తూండడం చూస్తాము. ఆ తాళాన్ని అనుసరిస్తే మౌనం తరువాత వచ్చే స్వరాన్ని సరిగ్గా ఎత్తుకోగలుగుతాము. మౌనం వచ్చినప్పుడు సంగీతం ఆగిపోయిందని నిరుత్సాహపడితే వెనుకబడి పోతాము. మౌనంలో కూడా సంగీతం ఉందని మరచిపోవద్దు, జీవన రాగం ఆలపించడం చాలా కష్టమైన పని. దేవుడు మనకి ఎంతో ఓపికతో నేర్పిస్తున్నాడు. ఎంత కాలమైనా ఆ రాగాలను మనం నేర్చుకోవాలని ఎదురుచూస్తున్నాడు.
దైనందిన జీవితపు హడావుడిలోంచి
ప్రపంచ పోకడల పరుగు పందేలనుంచి
పరలోకపు నీడలోకి, పరిశుద్ధుని జాడలోకి
కాసింత సేపు ఇటు రమ్మని కబురందిందా?
బహుశా ఎడారి సీమల్లోకి
ఒంటరి తనలోకి, దేవుని సన్నిధిలోకి
ఈ ఏకాంతంలో నాతో గడపమంటున్న
ఆయన కోమల స్వరం వినడానికి పిలుపు అందిందా?
క్రీస్తు నడచిన ఇరుకు దారుల్లోకి
జీవజలం ప్రవహించే వాగుల్లోకి
దేవునితో కలిసి నడిచే ధన్యతలోకి
ఆయన ఇల్లు కనిపించే చేరువలోకి పిలుపు అందిందా?
నీడ కోసం, నైర్మల్యం కోసం
దేవా నీకు వందనాలు
నీ ప్రేమ చూపిన రహస్య బాటల కోసం
చీకటిలో మాకు నేర్పిన చిత్రమైన పాఠాల కోసం
దేవా నీకు వందనాలు
అన్నిటినీ అందంగా నిర్వహిస్తాడు
ఆయనతో ఉంటే మన భారం వహిస్తాడు
నీ సిలువనీడలో, ఏకాంతంలో
నను పిలిచినందుకు దేవా, ఇవే నా కృతజ్ఞతలు
-----------------------------------------------------------------------------------------------------------------------------
Into a desert place apart - (Matt - 14:13)
“There is no music in a rest, but there is the making of music in it.” In our whole life melody the music is broken off here and there by “rests,” and we foolishly think we have come to the end of the tune. God sends a time of forced leisure, sickness, disappointed plans, frustrated efforts, and makes a sudden pause in the choral hymn of our lives; and we lament that our voices must be silent, and our part missing in the music which ever goes up to the ear of the Creator. How does the musician read the “rest”? See him beat the time with unvarying count and catch up the next note true and steady as if no breaking place had come between.
Not without design does God write the music of our lives. Be it ours to learn the tune, and not be dismayed at the “rests.” They are not to be slurred over, not to be omitted, not to destroy the melody, not to change the keynote. If we look up, God Himself will beat the time for us. With the eye on Him, we shall strike the next note full and clear. If we sadly say to ourselves, “There is no music in a ‘rest,’” let us not forget “there is the making of music in it.” The making of music is often a slow and painful process in this life. How patiently God works to teach us! How long He waits for us to learn the lesson! —Ruskin
“Called aside—
From the glad working of thy busy life,
From the world’s ceaseless stir of care and strife,
Into the shade and stillness by thy Heavenly Guide
For a brief space thou hast been called aside.
“Called aside—
Perhaps into a desert garden dim;
And yet not alone, when thou hast been with Him,
And heard His voice in sweetest accents say:
‘Child, wilt thou not with Me this still hour stay?’
“Called aside—
In hidden paths with Christ thy Lord to tread,
Deeper to drink at the sweet Fountainhead,
Closer in fellowship with Him to roam,
Nearer, perchance, to feel thy Heavenly Home.
“Called aside—
Oh, knowledge deeper grows with Him alone;
In the secret of His deeper love is shown,
And learned in many an hour of dark distress
Some rare, sweet lesson of His tenderness.
“Called aside—
We thank thee for the stillness and the shade;
We thank Thee for the hidden paths Thy love hath made,
And, so that we have wept and watched with Thee,
We thank Thee for our dark Gethsemane.
“Called aside—
Oh, restful thought—He doeth all things well;
Oh, blessed sense, with Christ alone to dwell;
So in the shadow of Thy cross to hide,
We thank Thee, Lord, to have been called aside.”
No comments:
Post a Comment