Wednesday, January 12, 2022

Trained to Comfort

 

మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, - నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి (యెషయా 40:1)


నీ దగ్గరున్న ఓదార్పును పోగుచేసుకొని ఉండు. ఇది దేవుడు యెషయా ప్రవక్తకిచ్చిన ఆజ్ఞ. ఓదార్పు లేని హృదయాలతో ప్రపంచమంతా నిండిపోయింది. ఈ గొప్ప సేవకు నీవు సరిపోతావు. అయితే నీకు ముందు కొంత శిక్షణ అవసరం. అది సామాన్యమైన శిక్షణ కాదు. నువ్వు పూర్తిగా సుశిక్షితుడివి కావాలంటే ఈనాడు ప్రపంచంలో లెక్కలేనన్ని హృదయాల్లోంచి రక్తాన్నీ, కన్నీళ్ళనీ పిండుతున్న శ్రమలనే నువ్వు కూడా ముందుగా భరించాలి. దైవసంబంధమైన ఓదార్పును ముందుగా నువ్వు నీ హృదయంలోనే అనుభవపూర్వకంగా నేర్చుకోవాలి. నీవు గాయపడాలి. నీ పరమ వైద్యుడు నీ గాయాలకు కట్లు కడుతుంటే దాన్ని చూసి నువ్వు కూడా ఇతరుల గాయాలకి చికిత్స చెయ్యడం నేర్చుకోవాలి. నీకు ఒక ప్రత్యేకమైన దుర్గతి ఎందుకు పట్టిందోనని ఆశ్చర్యపడకు. కొన్నేళ్ళు ఆగు. అలాటి స్థితిలోనే ఉన్న కొందరు ఊరడింపు కోసం నీ దగ్గరకు వస్తారు. అప్పుడు నువ్వు వాళ్ళకి చెబుతావు – ‘నాకూ ఇలాటి పరిస్థితే వచ్చింది. ఓదార్పు కూడా దొరికింది’ అని. నువ్వీ మాటలు చెబుతూ, దేవుడు ఒకప్పుడు నీకు పూసిన ఔషధాన్ని వాళ్ళకి పూస్తూ, వాళ్ళ కళ్ళల్లోని ఆశల మెరుపుల్ని, నిష్క్రమిస్తూన్న నిరాశల చీకట్లని చూసినప్పుడు – అప్పుడు దేవుణ్ణి కొనియాడతావు. నీ జీవితంలో ఆయన నేర్పిన క్రమశిక్షణ కోసం, ఆయన అనుగ్రహించిన గొప్ప అనుభవాల కోసం కృతజ్ఞుడవై ఉంటావు. 


మనల్ని దేవుడు ఓదార్చేది మనల్ని ఓదార్చడానికే కాదు, మనల్ని ఓదార్చేవాళ్ళుగా చెయ్యడానికే. 


గులాబి రేకను 

చిదిమి వెయ్యాలట

అలా చేస్తేనే వచ్చేది 

పరిమళ తైలమట 


కోయిలని పట్టి

పంజరంలో పెట్టాలట 

అప్పుడే నిశ్శబ్దంలోంచి 

దాని పాట మోగుతుందట


ప్రేమ రక్తం ఒలకాలట 

స్నేహాశ్రువులు చిందాలట

అప్పుడే వాటికి ఈ లోకంలో సార్ధకత 


విలువైన వాటన్నిటి

కథలన్నీ ఇంతేనా 

వాటి బ్రతుకుల్లో 

సుఖం లేదా ఓ రవ్వంతైనా


అవును, నలిగిన రాత్రులు 

బంధించిన పంజరాలు 

నాటుకున్న  ముళ్ళు 

ఇవే మనకు దీవెనలు

-----------------------------------------------------------------------------------------------------------------------------

Comfort ye, comfort ye my people, saith your God - (Isa  - 40:1)

    Store up comfort. This was the prophet’s mission. The world is full of comfortless hearts, and ere thou art sufficient for this lofty ministry, thou must be trained. And thy training is costly in the extreme; for, to render it perfect, thou too must pass through the same afflictions as are wringing countless hearts of tears and blood. Thus thy own life becomes the hospital ward where thou art taught the Divine art of comfort. Thou art wounded, that in the binding up of thy wounds by the Great Physician, thou mayest learn how to render first aid to the wounded everywhere. Dost thou wonder why thou art passing through some special sorrow? Wait till ten years are passed, and thou wilt find many others afflicted as thou art. Thou wilt tell them how thou hast suffered and hast been comforted; then as the tale is unfolded, and the anodynes applied which once thy God wrapped around thee, in the eager look and the gleam of hope that shall chase the shadow of despair across the soul, thou shalt know why thou wast afflicted and bless God for the discipline that stored thy life with such a fund of experience and helpfulness.  —Selected

    God does not comfort us to make us comfortable but to make us comforters.  —Dr. Jowett


“They tell me I must bruise

The rose’s leaf,

Ere I can keep and use

Its fragrance is brief.


“They tell me I must break

The skylark’s heart,

Ere her cage song will make

The silence start.


“They tell me love must bleed,

And friendship weep,

Ere in my deepest need

I touch that deep.


“Must it be always so

With precious things?

Must they be bruised and go

With beaten wings?


“Ah, yes! by crushing days,

By caging nights, by scar

Of thorn and stony ways,

These blessings are!”

No comments:

Post a Comment