Wednesday, January 5, 2022

None to Help But God

 

సహాయము చేయుటకు నీకన్న ఎవరును లేరు. (2 దిన 14:11) 


దేవునిదే పూర్తి బాధ్యత అని ఆయనకు గుర్తు చెయ్యండి. నువ్వు తప్ప సహాయం చేసేవాళ్ళు మరెవరూ లేరు అని ఆయనకు చెప్పండి. వెయ్యి వేలమంది ఆయుధాలు ధరించిన సైనికులు, మూడువందల రథాలు ఆసా అనే రాజుకు ఎదురై నిలిచాయి. అంత గొప్ప సమూహం ఎదుట తనకై తాను నిలవడం అసాధ్యం. అతనికి సహాయంగా ఇతర సైన్యాలేవి రాలేదు. అందువల్ల అతనికున్న ఒకే ఒక నిరీక్షణ దేవుడే.  నీ జీవితంలో కష్టాలన్నీ ఒక్కపెట్టున కలిసికట్టుగా వచ్చి పడితే, చిన్న చిన్న ఇబ్బందుల్ని తొలగించుకోవడానికి ఇతరుల సహాయం తీసుకున్నట్టు ఇప్పుడు కుదరదు. సర్వశక్తిమంతుడైన ఆ పరమ స్నేహితుడే మనకి ఆ సమయంలో దిక్కు. 


నీకూ, నీ శత్రువుకూ మధ్య దేవుణ్ణి పెట్టు. ఆసా విశ్వాసం ఎలాంటిదంటే కూషు దేశపు రాజైన జెరహుకూ, తనకూ  మధ్యలో దేవుడే నిలబడినట్టుగా అతనికి అనిపించింది. ఇది యథార్ధమే. కూషీయులు “యెహోవా భయముచేతను, ఆయన సైన్యపు భయముచేతను పారిపోయారు” అని రాసి ఉంది. ఇశ్రాయేలువారి పక్షంగా పరలోకపు సైన్యాలు వాళ్ళ శత్రువుల మీద విరుచుకుపడి అంత గొప్ప సైన్యాన్ని ఊచకోత కోసారేమో అన్నట్టుగా ఉంది. ఇశ్రాయేలీయులు కేవలం వాళ్ళని తరిమి దోచుకోవడం మాత్రమే చేశారు. మన దేవుడు సైన్యములకధిపతి అయిన యెహోవా. ఊహించలేని రీతిగా ఏ సమయంలోనైనా తన ప్రజలను ఆదుకోవడానికి వస్తాడు. నీకు, నీకు వచ్చిన కష్టానికి మధ్యను ఆయన ఉన్నాడని నమ్ము. నిన్ను కంగారుపెట్టే ఆ  కష్టం గాలికి మేఘాలు కదిలిపోయినట్టు ఆయన ఎదుట నుండి పారిపోతుంది.


దేనికైనా ఆనుకునే ఆధారం కరువైతే 

కోటలు బద్దలై కూలిపోతే 

దేవుడున్నాడన్న ఆలంబన తప్ప 

మిగిలినదంతా అయోమయమైపోతే, 


నమ్మకం నిలబడే తరుణమిదే 

వీక్షించే బాట కన్నా విశ్వాసపు చూపు మిన్న 

కనుపించని పెనుచీకటిలో 

నమ్మకమే విశ్వాసపు  వేకువ వెలుగు 


అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు. కంటికి కనిపించేదానిని ప్రక్కకు నెట్టాడు. ప్రకృతి  ధర్మాలను ‘మీరు గొడవ చెయ్యకండి’ అంటూ ఆదేశించాడు. అనుమానాల హృదయాన్ని “నోర్మూయి, శోధన పిశాచి” అని గద్దించాడు. అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు.

-----------------------------------------------------------------------------------------------------------------------------

Lord, there is none beside thee to help. -  (2 Chr 14:11)

    Remind God of His entire responsibility. “There is none beside thee to help.” The odds against Asa were enormous. There were a million men in arms against him, besides three hundred chariots. It seemed impossible to hold his own against that vast multitude. There were no allies who would come to his help; his only hope, therefore, was in God. It may be that your difficulties have been allowed to come to so alarming a pitch that you may be compelled to renounce all creature aid, to which in lesser trials you have had recourse, and cast yourself back on your Almighty Friend.

    Put God between yourself and the foe. To Asa’s faith, Jehovah seemed to stand between the might of Zerah and himself, as one who had no strength. Nor was he mistaken. We are told that the Ethiopians were destroyed before the Lord and before His host, as though celestial combatants flung themselves against the foe in Israel’s behalf, and put the large host to rout so that Israel had only to follow up and gather the spoil. Our God is Jehovah of hosts, who can summon unexpected reinforcements at any moment to aid His people. Believe that He is there between you and your difficulty, and what baffles you will flee before Him, as clouds before the gale.  —F. B. Meyer

“When nothing whereon to lean remains,

When strongholds crumble to dust;


When nothing is sure but that God still reigns,

That is just the time to trust.


“’ Tis better to walk by faith than sight,

In this path of yours and mine;


And the pitch-black night, when there’s no outer light

Is the time for faith to shine.”


    Abraham believed God, and said to sight, “Stand back!” and to the laws of nature, “Hold your peace!” and to a misgiving heart, “Silence, thou lying tempter!” He believed God.  —Joseph Parker

No comments:

Post a Comment