యేసు – నీవు వెళ్ళుము; నీ కుమారుడు బ్రతికియున్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్లిపోయెను. (యోహాను 4:50)
ప్రార్ధన చేయునప్పుడు మీరు అడుగుచున్నవాటినెల్లను పొందియున్నామని నమ్ముడి.(మార్కు 11:24)
ఏదైనా విషయాన్ని ఖచ్చితంగా ప్రార్ధన చేయవలసి వచ్చినప్పుడు, దేవుని మీద నమ్మకం కుదిరే దాకా ప్రార్ధించాలి. జవాబు ఇచ్చినందుకు దేవునికి హృదపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పగలిగేంత వరకూ ప్రార్ధించాలి. జవాబు యింకా ప్రత్యక్షం కాకపోతే అది అవుతుందా లేదా అన్న అపనమ్మకం నీలో ఉన్నట్టుగా ప్రార్ధించకూడదు (ఇది జరిగేలా లేదు, జరిగేలా చెయ్యి ప్రభువా అన్ని ప్రార్ధించకూడదన్న మాట). అలాంటి ప్రార్ధన ఏమీ సహాయం చేయదు సరికదా, అడ్డుబండ అయి కూర్చుంటుంది. ఇలాంటి ప్రార్ధన నువ్వు చేసినప్పుడు నీకు ఉన్న కాస్తో కూస్తో విశ్వాసం కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. ఇలాంటి ప్రార్ధన చెయ్యాలి అనే ప్రేరేపణ ఖచ్చితంగా సైతాను నుండి వచ్చినదే. అవసరమైన విషయాన్ని మరోసారి దేవుని ఎదుట విజ్ఞప్తి చెయ్యడంలో తప్పులేదు. అయితే ఆ ప్రార్ధనలో విశ్వాసం ఉట్టిపడుతూ ఉండాలి. విశ్వాసం ఆవిరైపోయేలా ప్రార్ధించవద్దు. “జవాబు కోసం కనిపెడుతున్నాను. నీ మీద నమ్మకంతో ఉన్నాను. నీనుండి రాబోతున్న ఆ జవాబు కొరకు వందనాలు” అంటూ ప్రార్ధించాలి. జవాబు వస్తుందని తెలిసి దానికోసం స్తోత్రాలు చెల్లించడంకన్నా గట్టి విశ్వాసం వేరే లేదు. విశ్వాసాన్ని తుడిచిపెట్టే దీర్ఘ ప్రార్ధనలు దేవుని వాగ్దానాలను తృణీకరించడమే కాక మన హృదయాలలో ‘అవును’ అంటూ మెల్లగా వినిపించే ఆయన స్వరాన్ని కూడా నోక్కేస్తాయి.
ఇలాంటి ప్రార్ధనలు హృదయంలోని అల్లకల్లోలాన్ని తెలిజేస్తాయి. అల్లకల్లోలానికి కారణం జవాబు రాదన్న అపనమ్మకమే. “విశ్వాసులమైన మనము (విశ్వాసము ఉన్న మనము) ఆ విశ్రాంతిలో ప్రకాశించుచున్నాము.” (హెబ్రీ 4:3). విశ్వాసాన్ని ఇంకిపోజేసే ప్రార్ధన ఎలా వస్తుందంటే దేవుని వాగ్దానం గురించి పట్టించుకోకుండా మనం అడిగిన విషయం ఎంత అసాధ్యమైనదో అన్న దానిమీద మనసు లగ్నం చేసినప్పుడు వస్తుంది. అబ్రహాము “తన శరీరము మృతతుల్యమైనట్టు... (భావించెను గాని) అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహించ లేదు” (రోమా 4:19,20). విశ్వాసాన్ని వాడిపోయేలా చేసే ప్రార్ధనలు మనం చెయ్యకుండా ఉండేలా జాగ్రత్త పడదాం.
విశ్వాసం అన్నది ఒక ఆలోచన కాదు. ఒక దృశ్యం కాదు. ఒక వివేచన కాదు. దేవుని మాటను ఉన్నదున్నట్టుగా నమ్మడమే విశ్వాసం.
ఆందోళన ఎప్పుడు మొలకెత్తుతుందో విశ్వాసం అప్పుడే వాడిపోతుంది. నిజమైన విశ్వాసం పుట్టడమే ఆందోళనకి ముగింపు.
అన్నీ చక్కగా అమరుతూ ఉంటే నువ్వు విశ్వాసాన్ని ఎప్పుడూ నేర్చుకోలేవు. నిశ్శబ్దమైన వేళల్లో దేవుడు తన వాగ్దానాలను మనకిస్తాడు. గంభీరమైన కృపగల మాటలతో మనతో తన నిబంధనను స్థాపిస్తాడు. ఇక వెనక్కి తగ్గి ఆ మాటల్లో ఎంత వరకు మనకు నమ్మకం ఉన్నదో కనిపెడతాడు, ఆ తరువాత శోధకుడిని మన దగ్గరకి వచ్చేందుకు అనుమతిస్తాడు. మనకు సంభవించేవన్నీ దేవుని మాటలకు వ్యతిరేకంగా జరుగుతున్నట్టు కనిపిస్తాయి. ఈ సమయంలో విశ్వాసానికి పట్టాభిషేకం జరుగుతుంది. నమ్మకం గెలుస్తుంది.
ఇప్పుడైతే మనం చెలరేగే తుపానులో మన సాటివాళ్ళంతా భయంతో వణికిపోతున్న వేళ జయోత్సాహంతో కేక పెట్టాలి - “ దేవుడు చెప్పినట్టే చివరికి జరుగుతుంది. నేనాయన్ని నమ్ముతున్నాను!” అని.
దినకరుడు జీవించునంత కాలం
నక్షత్రాలు ప్రకాశించినంత కాలం
మరణంలోను మనుగడలోను విశ్వసించండి
ఆయన జ్ఞాన హస్తాలే మనల్ని నడిపిస్తాయి
చీకటి దారైనా దివ్య సంకల్పపు
దివ్వెలు వెలుగుతుంటాయి.
---------------------------------------------------------------------------------------------------------------------------
Jesus told him, “Go home; your son will live.” The man believed the word that Jesus spoke to him and set off for home. (John - 4:50 )
For this reason, I tell you, whatever you pray and ask for, believe that you have received it, and it will be yours.—Mark 11:24
When there is a matter that requires definite prayer, pray till you believe God, until with unfeigned lips you can thank Him for the answer. If the answer still tarries outwardly, do not pray for it in such a way that it is evident that you are not definitely believing in it. Such prayer in place of being a help will be a hindrance; and when you are finished praying, you will find that your faith has weakened or has entirely gone. The urgency that you felt to offer this kind of prayer is clearly from self and Satan. It may not be wrong to mention the matter in question to the Lord again if He is keeping you waiting, but be sure you do so in such a way that it implies faith. Do not pray yourself out of faith. You may tell Him that you are waiting and that you are still believing Him and therefore praise Him for the answer. There is nothing that so fully clinches faith as to be so sure of the answer that you can thank God for it. Prayers that pray us out of faith deny both God’s promise in His Word and also His whisper “Yes,” that He gave us in our hearts. Such prayers are but the expression of the unrest of one’s heart, and unrest implies unbelief about the answer to prayer. “For we which have believed do enter into rest” (Heb. 4:3). This prayer that prays ourselves out of faith frequently arises from centering our thoughts on the difficulty rather than on God’s promise. Abraham “considered not his own body,” “he staggered not at the promise of God” (Rom. 4:19, 20). May we watch and pray that we enter not into the temptation of praying ourselves out of faith. —C. H. P.
Faith is not a sense, nor sight, nor reason, but a taking God at His Word. —Evans
The beginning of anxiety is the end of faith, and the beginning of true faith is the end of anxiety. —George Mueller
You will never learn faith in comfortable surroundings. God gives us the promises in a quiet hour; God seals our covenants with great and gracious words, then He steps back and waits to see how much we believe; then He lets the tempter come, and the test seems to contradict all that He has spoken. It is then that faith wins its crown. That is the time to look up through the storm, and among the trembling, frightened seamen cry, “I believe God that it shall be even as it was told me.”
“Believe and trust; through stars and suns,
Through life and death, through soul and sense,
His wise, paternal purpose runs;
The darkness of His Providence
Is starlit with Divine intents.”
No comments:
Post a Comment