ఆసియలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారినాటంకపరచినందున…*_ (అపొ.కా. 16:6)
దేవుడు ఆ రోజుల్లో అపొస్తలులను నడిపించిన తీరు చాలా ఆసక్తిదాయకంగా ఉంటుంది. ఈ నడిపింపు ఎక్కువ భాగం అడ్డగింపులతోనే నిండి ఉంది. చాలాసార్లు దారి తప్పుతూ వెళ్ళారు ఈ అపొస్తలులు. ఎడమవైపుకి తిరిగి బితూనియకు వెళ్తుంటే మళ్ళీ ఆపాడు. తరువాత కాలంలో పౌలు జీవితం మొత్తానికి గర్వించదగ్గ సేవను ఆ ప్రదేశాల్లో చేశాడు. కాని ఇప్పుడు మాత్రం పరిశుద్ధాత్మ ఆ తలుపుల్ని మూసి ఉంచాడు. సైతాను పదిలంగా కట్టుకొన్న ఆ దుర్భేద్యమైన కోట గోడల్ని కూల్చే సమయం ఇంకా రాలేదు. ఆ పని కోసం అపొల్లో వచ్చి చేరవలసి ఉంది. ఇప్పుడు పౌలు, బర్నబాల అవసరం మరొక చోట ఉంది. ఆసియాలో సువార్త చెప్పడం లాంటి బాధ్యతాయుతమైన పని కోసం వాళ్లకింకా శిక్షణ అవసరం.
నీవు వెళ్ళవలసిన దారి గురించి ఏమన్నా సందేహముంటే దాన్ని వెంటనే ప్రభువుకి అప్పగించు. వెళ్ళవలసిన ద్వారం తప్ప మిగతా తలుపులన్నింటినీ మూసెయ్యమని ఆయన్నడుగు.
“ఓ పరిశుద్ధాత్మ దేవా, దేవుని చిత్తం కాని దారుల్లో నా అడుగులు పడకుండా ఆ దారులన్నింటినీ మూసేసే బాధ్యత పూర్తిగా నీకే వదులుతున్నాను. నేను కుడి ప్రక్కకైనా ఎడమ ప్రక్కకైనా తిరిగితే నా వెనుకనుండి నీ స్వరం వినిపించు” అంటూ ప్రార్ధించాలి.
ఈ లోపల నువ్వు నడుస్తున్న దారిలోనే సాగిపో. నీకు అందిన పిలుపుకి లోబడే ఉండు. పౌలుకి పరిశుద్ధాత్మ దేవుడు మార్గాన్ని ఎలా బోధించాడో నీకు కూడా అదే విధంగా బోధించాలని ఎదురుచూస్తున్నారు.
అయితే ఆయన నిన్ను ఒక పని చెయ్యనియ్యకుండా ఏ మాత్రం అడ్డుపెట్టినా విధేయుడవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. నమ్మకం కలిగి ప్రార్ధన చేసిన తరువాత అడ్డంకులేవి కనిపించని పక్షంలో తేలిక హృదయంతో ముందడుగు వెయ్యి. కొన్ని సార్లు నీ ప్రార్ధనకి జవాబుగా ఒక తలుపు మూసుకుపోతే ఆశ్చర్యపోవద్దు. ఎడమకి కుడికి వెళ్ళే తలుపులు మూసుకుపోతే త్రోయ ప్రదేశానికి వెళ్ళే తలుపు తెరిచి ఉంటుంది. అక్కడ లూకా మీ కోసం ఎదురుచూస్తున్నాడు. దర్శనాలు మీకు కర్తవ్యాన్ని బోధిస్తాయి. అక్కడ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. స్నేహితులు మీ కోసం ఎదురుచూస్తున్నారు.
*నీ జీవితంలో విడదీయరాని చిక్కుందా?*
*ఛేదించలేని రహస్యపు దిక్కుందా?*
*నిజాలు వెలికి తీసే దేవుడున్నాడు*
*ఆయన చేతిలోనే ఆ తాళముంది*
*తండ్రిచేత మూయబడిన తలుపు నీ ముందుందా?*
*అది తెరుచుకోవాలని నీ అంతరంగం ఉవ్విళ్ళూరుతుందా?*
*ఆయనే ఆ తలుపు మూసినవాడు*
*అది తిరిగి తీసేవాడు ఆయనే*
*నెమ్మదిగల దేవునిపట్ల ఓర్పుగలిగి ఉండవద్దా?*
*సర్వజ్ఞాని ఆయనేననడానికి అభ్యంతరముందా?*
*నీ భవిష్యజ్జీవితం నిర్ణయించినవాడు*
*ఆయనే దాని తలుపుల్ని తెరిచేచాడు*
*ధన్యకరమైన తాళం చెవి*
*ఆయన దగ్గరుందని గుర్తిస్తే*
*కడకు నీకే అది లభిస్తుంది*
*ధన్యత అనేది ఆదరణ విశ్రాంతిగా మారుతుంది*.
---------------------------------------------------------------------
They were forbidden of the Holy Ghost to preach the Word in Asia*_ - (Acts - 16:6)
It is interesting to study the methods of His guidance as it was extended towards these early heralds of the Cross. It consisted largely in prohibitions, when they attempted to take another course than the right. When they would turn to the left, to Asia, He stayed them. When they sought to turn to the right, to Bithynia, again He stayed them. In after years Paul would do some of the greatest work of his life in that very region; but just now the door was closed against him by the Holy Spirit. The time was not yet ripe for the attack on these apparently impregnable bastions of the kingdom of Satan. Apollos must come there for pioneer work. Paul and Barnabas are needed yet more urgently elsewhere, and must receive further training before undertaking this responsible task.
Beloved, whenever you are doubtful as to your course, submit your judgment absolutely to the Spirit of God, and ask Him to shut against you every door but the right one. Say,
“Blessed Spirit, I cast on Thee the entire responsibility of closing against my steps any and every course which is not of God. Let me hear Thy voice behind me whenever I turn to the right hand or the left.”
In the meanwhile, continue along the path which you have been already treading. Abide in the calling in which you are called, unless you are clearly told to do something else. The Spirit of Jesus waits to be to you, O pilgrim, what He was to Paul. Only be careful to obey His least prohibition; and where, after believing prayer, there are no apparent hindrances, go forward with enlarged heart. Do not be surprised if the answer comes in closed doors. But when doors are shut right and left, an open road is sure to lead to Troas. There Luke awaits, and visions will point the way, where vast opportunities stand open, and faithful friends are waiting. —Paul, by Meyer
Is there some problem in your life to solve,
Some passage seeming full of mystery?
God knows, who brings the hidden things to light.
He keeps the key.
Is there some door closed by the Father’s hand
Which widely opened you had hoped to see?
Trust God and wait—for when He shuts the door
He keeps the key.
Is there some earnest prayer unanswered yet,
Or answered NOT as you had thought ’twould be?
God will make clear His purpose by-and-by.
He keeps the key.
Have patience with your God, your patient God,
All wise, all knowing, no long tarrier He,
And of the door of all thy future life
He keeps the key.
Unfailing comfort, sweet and blessed rest,
To know of EVERY door He keeps the key.
That He at last when just HE sees ’tis best,
Will give it THEE.
—Anonymou
No comments:
Post a Comment