Friday, February 11, 2022

Strong Composure

ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనకుడి - (రోమా 12:19)

కొన్ని కొన్ని సందర్భాలలో లేచి ఏదో ఒకటి చెయ్యడం కంటే చేతులు ముడుచుకుని కూర్చోవడమే కష్టంగా ఉంటుంది. తొణకకుండా ఉండగలగడం గొప్ప శక్తిగలవాళ్ళకి చెందిన లక్షణం. అతి నీచమైన, అన్యాయమైన నేరారోపణలకు యేసు ప్రభువు మౌనం ద్వారానే జవాబిచ్చాడు. దానిని చూసినవాళ్ళు, న్యాయాధికారులు కూడా నిర్ఘాంతపోయారు. ఆయన పొందినంత నికృష్టమైన అవమానం, హింసాత్మకమైన దండన, అవహేళన మరెవరైనా పొంది ఉంటే ఎంత పిరికివాడికైనా రోషం వచ్చి చిందులేస్తాడు. ప్రభువైతే మౌనంగా మాట తూలకుండా నిర్లిప్తత వహించాడు. నీలాపనిందలపాలైన వాళ్ళకి, ఏ తప్పు చెయ్యకపోయినా నిందలు పొందిన వాళ్ళకి అర్ధమవుతుంది, దేవుని ఎదుట మౌనంగా ఉండిపోగలగడానికి ఎంత అసామాన్యమైన శక్తి అవసరమో.

మనుషులు నిన్నపార్థం చేసుకోవచ్చు

నిందించే నెపం వెదకవచ్చు

అభియోగం మోపవచ్చు

తొణకక బెణకక మౌనం వహించు

క్రీస్తే న్యాయాధికారి! వాళ్ళు కాదు

భయం వదలి వీ మౌనబలం చూపించు 

పరిశుద్ధుడైన పౌలు అన్నాడు కదా, 'ఇవేవీ నన్ను కదిలించలేవు.' అని. 

'ఇవేవీ నన్ను గాయపరచవు' అనలేదు. గాయపరచడం వేరు, కదిలించడం వేరు. పౌలుది చాలా సున్నితమైన హృదయం. పౌలు విలపించినంతగా మరి యే అపొస్తలుడు విలపించినట్లు కనబడడు. యేసు ప్రభువు కన్నీళ్ళు కార్చాడు. లోకంలో ఉన్న మగవాళ్ళందరిలోకీ ధీరత్వం గలవాడు ప్రభువు. అందుకనే 'ఇవేవీ నన్ను గాయపరచవు' అనడం లేదు పౌలు. గాయమవుతుంది గాని తాను నమ్మినదానినుండి కదలి వేరైపోకూడదని పౌలు దృఢనిశ్చయం. మన అభిప్రాయాలు కావు పౌలుకున్న అభిప్రాయాలు. సుఖవంతమైన జీవితం గురించి అతడు అర్రులు చాచలేదు. ఇహలోకం గురించి ఆశలేమీ లేవు. క్రీస్తుకి నమ్మకమైన సేవకుడుగా ఉండాలన్నదే అతని ఏకైక ఆశయం. దేవుని పనే పౌలుకి దొరికే జీతం. దేవుని చిరునవ్వే స్వర్గం.

-----------------------------------------------------------------------------------------------------------------------------

Dearly beloved, avenge not yourselves - (Rom - 12:19)

     There are seasons when to still demand immeasurably higher strength than to act. Composure is often the highest result of power. To the vilest and most deadly charges, Jesus responded with deep, unbroken silence, such as excited the wonder of the judge and the spectators. To the grossest insults, the most violent ill-treatment and mockery that might well bring indignation into the feeblest heart, He responded with voiceless complacent calmness. Those who are unjustly accused, and causelessly ill-treated know what tremendous strength is necessary to keep silent to God.

“Men may misjudge thy aim,

Think they have cause to blame,

Say, thou art wrong;

Keep on thy quiet way,

Christ is the Judge, not they,

Fear not, be strong.”

    St. Paul said, “None of these things move me.”

    He did not say, none of these things hurt me. It is one thing to be hurt, and quite another to be moved. St. Paul had a very tender heart. We do not read of any apostle who cried as St. Paul did. It takes a strong man to cry. Jesus wept, and He was the manliest man that ever lived. So it does not say, none of these things hurt me. But the apostle had determined not to move from what he believed was right. He did not count as we are apt to count; he did not care for ease; he did not care for this mortal life. He cared for only one thing, and that was to be loyal to Christ, to have His smile. To St. Paul, more than to any other man, His work was waged, His smile was Heaven.  —Margaret Bottome

No comments:

Post a Comment