Saturday, February 12, 2022

Word Was GOD

 

🏮 నీ జీవితాన్ని కట్టాలని దేవుడు ఆశకలిగి ఉన్నారు 🏮 

🌐 ఇశ్రాయేలీయులు దేవుని మాటకు అవిధేయత చూపిస్తూ వస్తున్నారు ఎంతమంది ప్రవక్తల ద్వారా దేవుడు వారిని హెచ్చరిస్తున్నప్పటికీ కూడా వారు దేవుని మాటకు చెవి యొగ్గలేదు, దేవుని గద్ధింపును స్వీకరించలేదు అయితే దేవుడు కల్దీయుల చేతికి వారిని అప్పగించారు,  వారికి పరిశుద్ధస్థలముగానున్న మందిరములోనే వారి యౌవనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యౌవనులయందైనను, యువతులయందైనను, ముసలి వారియందైనను, నెరసిన వెండ్రుకలుగల వారియందైనను కనికరింపలేదు. దేవుడు వారినందరిని అతనిచేతి కప్పగించెను. దేవుని మందిరమును తగులబెట్టి, యెరూషలేము ప్రాకారమును పడగొట్టి, దానియొక్క నగరులన్నిటిని కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటిని బొత్తిగా పాడు చేసిరి. మరియు బబులోనురాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటిని, యెహోవా మందిరపు నిధులలోనిదేమి రాజు నిధులలోనిదేమి అధిపతుల నిధులలోనిదేమి, దొరకిన ద్రవ్యమంతయు బబులోనునకు తీసికొనిపోయెను. అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగులబెట్టి, యెరూషలేము ప్రాకారమును పడగొట్టి, దానియొక్క నగరులన్నిటిని కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటిని బొత్తిగా పాడు చేసిరి - 2దినవృ 36:17-20

🌐 అయితే ఆ దినములలో దేవుడు విడిచిపెట్టేసిన యెరూషలేమునకు ప్రాకారము లేదు, దానిని రక్షించువారు లేరు, దానిని కావాలి కాయు వారు లేరు, జనాలందరు కల్దీయుల దాసోహం అయ్యారు, కానీ యెరూషలేములోని ప్రజలు చెల్లాచెదురైపోయారు.... అయితే ఆ సమయములో దేవుడే వారియెడల ప్రేమ గలవారై కాల్చివేయబడిన, చెల్లాచెదురైన వారిని తిరిగి చెరలో నుండి రప్పిస్తానని, పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కడతానని దేవుడే వాగ్దానం చేసారు.  

🚨 పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగుచేసి దాని పోయిన చోట్లను బాగుచేసి, ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులనందరిని నా జనులు స్వతంత్రించుకొనునట్లు పూర్వపురీతిగా దానిని మరల కట్టుదును; ఈలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే - ఆమోసు 9:11,12

🚨 మరియు శ్రమనొందుచున్న నా జనులగు ఇశ్రాయేలీయులను నేను చెరలోనుండి రప్పింతును, పాడైన పట్టణములను మరల కట్టుకొని వారు కాపురముందురు, ద్రాక్షతోటలు నాటి వాటి రసమును త్రాగుదురు, వనములువేసి వాటి పండ్లను తిందురు. వారి దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికిచ్చిన దేశములోనుండి వారు ఇక పెరికివేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు - ఆమోసు 9:14,15

🌐 అయితే దేవుడు నిన్ను నన్ను తన మందిరములో ఒలీవ మొక్కలవలె నాటారు. అయితే నీవు నేను కూడా  బహుశా విగ్రహారాధనతో, వ్యభిచారముతో, శరీర క్రియలతో, లోకాచారములతో మన ఆధ్యాత్మిక గుడారమును పాడు చేసుకుని ఉండచ్చు, మన ఆధ్యాత్మిక గుడారము యెరూషలేమువలె ప్రాకారము లేనిదిగా కాల్చివేయబడి ఉండచ్చు. తిరిగి ఎలా బాగుపడాలో తెలియక, తిరిగి ఎలా దేవుని యొద్దకు రావాలో తెలియక, దేవుణ్ణి ఎదుర్కొనలేక నీవు సతమతం అవుతుండవచ్చు అయితే నేడు ప్రేమగల దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు "పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగుచేసి దాని పోయిన చోట్లను బాగుచేసి, నా జనులు స్వతంత్రించుకొనునట్లు పూర్వపురీతిగా దానిని మరల కట్టుదును" అని అలాగే "నీవు కట్టబడునట్లు నేనికమీదట నిన్ను కట్టింతును; నీవు మరల తంబురలను వాయింతువు, సంభ్రమపడువారి నాట్యములలో కలిసెదవు - యిర్మియా 31:4" 

🌐 దేవుడే నీ జీవితాన్ని కట్టాలని అనుకుంటున్నారు, దేవుడే నీ గుడారమును బాగుచెయ్యాలి అనుకుంటున్నారు కారణం ఏమిటంటే ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించారు అందుకే తన ఒక్కగానొక్క కుమారుణ్ణి సైతం మన నిమిత్తం సిలువకు అప్పగించారు కాబట్టి ఇంతగా ప్రేమిస్తున్న దేవుని యొద్దకు చేరి మన జీవితం వాక్యమనే బండపై స్థిరముగా కట్టబడునట్లు దేవుని యొద్దకు తిరిగి వద్దాము, దేవుని చెంతకు చేరుదాము. ఇట్టి కృప దేవుడు మన అందరికి అనుగ్రహించును గాక... ఆమేన్...

No comments:

Post a Comment