Sunday, March 13, 2022

Deliverance in the Stormy Winds

మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి యెడమ ప్రక్కలను వారికి గోడవలె నుండెను. - (నిర్గమ 14:21,22). 

గడిచిన కాలంలో క్రూరుడైన ఫరోతో తన ప్రజల కోసం దేవుడెలా పోరాడేడో చూడండి. మహా బలమైన పెనుగాలులు ప్రజల విమోచనలో పాలుపంచుకున్నాయి. ఆ బ్రహ్మాండమైన దేవుని బల ప్రదర్శనలో, గర్విష్ఠులైన ఐగుప్తు ప్రజల అహంకారం మీద దేవుడు చివరగా ఒక చావు దెబ్బ తీశాడు. ఇశ్రాయేలు ప్రజలకి ఇలా సముద్రం ఒడ్డున తాము చిక్కుబడిపోవడం అటూ, ఇటూ తప్పించుకొనే ఆశ లేకుండా ఎత్తయిన పర్వతాలు, ఆ రాత్రంతా చెలరేగిన మహా బలమైన పెనుగాలులు, ఇదంతా విధి తమతో అతికౄరంగా ఆడే చెలగాటంగా అనిపించి ఉండవచ్చు. ఐగుప్తు నుండి విడిపించిన ఆ మొదటి విమోచన తమను మృత్యువు కోరలకి అప్పగించడానికే అనిపించి ఉండవచ్చు. ఆ భయోత్పాతాలమధ్య 'ఐగుప్త సైన్యం వచ్చేస్తున్నారు' అనే ఆక్రందనలు వినిపిస్తున్నాయి. 

శత్రువు ఉరిలో తాము చిక్కుకున్నామని వణికిపోయే వేళ ఆ గొప్ప విడుదల దొరికింది. పెనుగాలి ముందుకు దూకి, ఎగిసిపడే అలల్ని ప్రక్కకి నిలబెట్టింది. ఇశ్రాయేలు జనాంగం ముందుకి దాటిపోయారు. ఆ అగాధంలో దిగి నడిచిపోయారు. దేవుని వాత్సల్యం మూలంగా వాళ్ళ కోసం ఆ సముద్రపు లోతుల్లో వాళ్ళకి దారి ఏర్పడింది.

అటూ ఇటూ స్పటికంలాంటి గోడలు దేవుని సన్నిధి వెలుగులో తళతళలాడుతూ నిలిచాయి. ఆ నీటి గోడలకు పైగా పెనుగాలి వీస్తూనే ఉంది. ఆ రాత్రంతా ఆ గాలి అలా నీటిని నిలబెట్టే ఉంచింది. ఉదయమయ్యే వరకూ ఇశ్రాయేలీయులందరూ అవతలి ఒడ్డున కాలు మోపే వరకు ఆ పెనుగాలి తన పనిని విరమించుకోలేదు.

పెనుగాలి దేవుని పనిచేసిందంటూ దేవునికి స్తుతి గీతాలు పాడారు వారు. శత్రువనుకున్నాడు. “వాళ్ళని తరుముతాను. వాళ్ళని కలుసుకుంటాను. దోపుడు సొమ్ము దక్కించుకుంటాను”, అయితే నీవు నీ గాలిని విసిరికొట్టావు. సముద్రం వారిని కప్పింది. వారు మహా అగాధమైన నీళ్ళలో సీసంలాగా మునిగిపోయారు.

ఒక రోజున దేవుని దయవల్ల మనం కూడా స్పటిక సముద్రంపై నిలబడతాము. దేవుని వీణలు చేబూని దేవుని సేవకుడైన మోషే పాట పాడతాము. “పరిశుద్ధులకి రాజువైన దేవా, నీ మార్గాలు న్యాయమైనవి” అంటూ గొర్రెపిల్ల పాట పాడతాము. పెనుగాలులు మన విమోచనకి ఎలా తోడ్పడ్డాయో గుర్తుచేసుకుంటాము. 

ఈ విచారం నీకిప్పుడు అంతుబట్టకపోవచ్చు. కాని తరువాత నీకు తెలుస్తుంది. భయం, బాధలు నిండిన ఆ రాత్రిలో బెదిరించే శత్రువు ఎలా కొట్టుకుపోయాడో.

ఇప్పుడైతే జరిగిన నష్టాన్నే చూస్తున్నావు. కాని చెడుతనం నీకు సంకెళ్ళు వెయ్యబోతుండగా ఈ నష్టం ఎలా నిన్ను కాపాడిందో తరువాత చూస్తావు.

భయంకరంగా వీచే పెనుగాలుల్ని, ఉరిమే మేఘాలనూ చూసి ఇప్పుడు బెదిరిపోతున్నావు. కాని అవి నాశనపు సముద్రాన్ని రెండుపాయలుగా ఎలా చేసాయో, వాగ్దాన దేశానికి ఎలా దారి చూపాయో తరువాత చూస్తావు.

ఉదృతంగా గాలి వీచినా

ఈదరగాలి విసరికొట్టినా

నా మనసు మాత్రం

ప్రశాంతంగా పాటలు పాడుతుంది

తరంగాలపై వెళ్ళేది నా దేవుడేనని

ఏ ఉపద్రవము రానేరాదని

-----------------------------------------------------------------------------------------------------------------------------

The Lord brought an east wind upon the land all that day, and all that night; and when it was morning, the east wind brought the locusts...Then Pharaoh called for Moses and Aaron in haste...And the Lord turned a mighty strong west wind, which took away the locusts, and cast them into the Red sea; there remained not one locust in all the coasts of Egypt - (Exod - 14: 21, 22.)

See how in the olden times, when the Lord fought for Israel against the cruel Pharaoh, the stormy winds wrought out their deliverance; and yet again, in that grandest display of power—the last blow that God struck at the proud defiance of Egypt. A strange, almost cruel thing it must have seemed to Israel to be hemmed in by such a host of dangers—in front the wild sea defying them, on either hand the rocky heights cutting off all hope of escape, the night of hurricane gathering over them. It was as if that first deliverance had come only to hand them over to more certain death. Completing the terror there rang out the cry: “The Egyptians are upon us!”

When it seemed they were trapped for the foe, then came the glorious triumph. Forth swept the stormy wind and beat back the waves, and the hosts of Israel marched forward, down into the path of the great deep—a way arched over with God’s protecting love.

On either hand were the crystal walls glowing in the light of the glory of the Lord, and high above them swept the thunder of the storm. So on through all that night; and when, at the dawn of the next day, the last of Israel’s host set foot upon the other shore, the work of the stormy wind was done.

Then sang Israel unto the Lord the song of the “stormy wind fulfilling his word.”

“The enemy said, I will pursue, I will overtake, I will divide the spoil…Thou didst blow with thy wind, the sea covered them: they sank as lead in the mighty waters.”

One day, by God’s great mercy, we, too, shall stand upon the sea of glass, having the harps of God. Then we shall sing the song of Moses, the servant of God, and the song of the Lamb: “Just and true are thy ways, thou King of saints.” We shall know then how the stormy winds have wrought out our deliverance.

Now you see only the mystery of this great sorrow; then you shall see how the threatening enemy has swept away in the wild night of fear and grief.

Now you look only at the loss; then you shall see how it struck at the evil that had begun to rivet its fetters upon you.

Now you shrink from the howling winds and muttering thunders; then you shall see how they beat back the waters of destruction and opened up your way to the goodly land of promise. —Mark Guy Pearse

“Though winds are wild,  

And the gale unleashed,  

My trusting heart still sings:  

I know that they mean  

No harm to me,  

He rideth on their wings.”

No comments:

Post a Comment