యెహోవా సేవకుడైన మోషే మృతినొందిన తరువాత, యెహోవా నూను కుమారుడును, మోషే పరిచారకుడునైన యెహోషువకు ఈలాగు సెలవిచ్చెను- నా సేవకుడైన మోషే మృతినొందెను. కాబట్టి నీవు లేచి, నీవును ఈ జనులందరును ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయుల కిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి - (యెహోషువ 1:1,2).
విచారం నీ ఇంట్లోకి ప్రవేశించింది. నీ ఇంటిని శూన్యం చేసింది. నీకు అనిపించేదేమిటంటే -ఇక పోరాటం చాలించి ఆశల శిధిలాల మధ్య కూలబడిపోవాలని. ఇలా ఎంతమాత్రం చెయ్యవద్దు. నువ్వు ప్రస్తుతం యుద్ధరంగంలో ఉన్నావు. అత్యవసర పరిస్థితి నెలకొని ఉంది. ఒక్క క్షణం తడబడడమంటే ఒక పరిశుద్ధ కార్యాన్ని నిర్లక్ష్యం చెయ్యడమే. నీ నిరుత్సాహం వల్ల ఇతర జీవితాలకు ప్రమాదమేమో చూసుకో. నువ్వు చేతులు ముడుచుకుంటే పవిత్ర కార్యాలు కుంటుపడతాయి. నీ విచారంలో మునిగి ఉన్నచోటనే ఆగిపోకూడదు.
ఒక యుద్ధ సమయంలో ఒక జనరల్ తాను చూసిన ఓ హృదయవిదారకమైన సంగతి గురించి చెప్పాడు. ఆ జనరల్ గారి కుమారుడు ఆ సైన్యంలోనే లెఫ్టనెంటుగా ఉన్నాడు. దాడి జరుగుతోంది. తండ్రి ఆ దాడిని ముందుండి నడిపిస్తున్నాడు. యుద్ధరంగంలో ముందుకి వెళ్తుండగా హఠాత్తుగా ఆయన చూపు చచ్చి పడివున్న ఒక వ్యక్తిపై పడింది. ఆ శవం తన కొడుకేనని చిటికెలో అర్థమయ్యింది. తండ్రిగా ఆ శవం ప్రక్కన కూలబడి తన దుఃఖాన్ని తీర్చుకుందామని ప్రాణం లాగింది. కాని ఆ క్షణంలో తన కర్తవ్య నిర్వహణ ఆయన్ని ఆ దాడిలో ముందుకు సాగిపోవాలని వెన్ను తట్టింది. చనిపోయిన తన కుమారుణ్ణి ఒకసారి చప్పున ముద్దు పెట్టుకుని తన సైనికులతో ఆ దాడిలో ముందుకి కదిలాడు.
సమాధి ప్రక్కన కూర్చుని దయనీయంగా ఏడవడం వలన చేజారిన ప్రేమ సంపద తిరిగి రాదు. ఆలాటి దుఃఖం ద్వారా ఎలాటి దీవెనా రాదు. విచారం గాయపు మచ్చల్ని మిగిల్చిపోతుంది. చెరిగిపోని అక్షరాలతో బాధపడే గుండెల మీద రాస్తుంది. అంతులేని దుఃఖంలో నుండి మనం నిజంగా ఎన్నటికీ బయట పడలేము. అలాటి విచారాన్ని అనుభవించిన తరువాత మళ్ళీ ఎప్పటిలాగా ఉండడం కష్టం. అయితే విచారంలో కూడా మనసుని కడిగి సేదదీర్చే గుణమేదో ఉంది. దాన్ని సరైన విధంగా భరించగలిగితేనే దానిలోని ఈ సుగుణాన్ని మనం అనుభవించగలం. నిజంగా ఈ విచారాన్ని ఎప్పుడూ అనుభవించని వాళ్ళు, దాని మచ్చలు ఎక్కడా లేనివాళ్ళు దురదృష్టవంతులు. మనకున్న సంతోషం మన విచారాల మధ్యనుండి మేఘాల్లో నుండి ప్రకాశించే సూర్యుడిలాగా ప్రకాశించాలి. మన విధిని మనం నమ్మకంగా నెరవేర్చడం లోనే నిజమైన, ధన్యకరమైన ఆదరణ ఉంది. మన దుఃఖం గురించి తలపోసుకుంటూ కూర్చుంటే చీకటి చల్లగా మన అంతరంగంలోకి పాకి నిర్వీర్యుల్ని చేస్తుంది. కాని దిగులునుండి మనం ముఖం తప్పించి దేవుడు మనల్ని పిలిచిన పనులవైపు దృష్టి మళ్ళించినట్టయితే వెలుగు తిరిగి ఉదయిస్తుంది. శక్తి సమకూరుతుంది.
చిన్న చిన్న భయాల వల్ల
మనకోసమై మనం వ్యర్థంగా
అర్థంలేని కన్నీరు కురిపిస్తే
గొప్పగొప్ప లాభాలు పోతాయి
దక్కించుకోవాలని చేయి చాస్తే
వాటిని చిక్కించుకోలేము
విశ్వాసంతో చేతులు కట్టుకుని
వెనక్కి చూడకుండా సాగిపోతే
ఎదురు చూస్తోంది నీకోసం
సంతోష కాలము, అభిషేక తైలము
రాజుగా నిన్ను అభిషేకిస్తుంది
-----------------------------------------------------------------------------------------------------------------------------
Now it came to pass after the death of Moses, the servant of the Lord, that the Lord spake unto Joshua, the son of Nun, Moses' minister, saying, Moses, my servant is dead; now, therefore arise, go over this Jordan, thou and all these people - ( Josh -1:1-2)
Sorrow came to you yesterday and emptied your home. Your first impulse now is to give up and sit down in despair amid the wrecks of your hopes. But you dare not do it. You are in the line of battle, and the crisis is at hand. To falter a moment would be to imperil some holy interest. Other lives would be harmed by your pausing, holy interests would suffer, should your hands be folded. You must not linger even to indulge your grief.
A distinguished general related this pathetic incident to his own experience in the time of war. The general’s son was a lieutenant of battery. An assault was in progress. The father was leading his division in a charge; as he pressed on in the field, suddenly his eye was caught by the sight of a dead battery officer lying just before him. One glance showed him it was his own son. His fatherly impulse was to stop beside the loved form and give vent to his grief, but the duty of the moment demanded that he should press on in the charge; so, quickly snatching one hot kiss from the dead lips, he hastened away, leading his command in the assault.
Weeping inconsolably beside a grave can never give back love’s banished treasure, nor can any blessing come out of such sadness. Sorrow makes deep scars; it writes its record ineffaceably on the heart which suffers. We really never get over our great griefs; we are never altogether the same after we have passed through them as we were before. Yet there is a humanizing and fertilizing influence in sorrow which has been rightly accepted and cheerfully borne. Indeed, they are poor who have never suffered, and have none of the sorrow’s marks upon them. The joy set before us should shine upon our grief as the sun shines through the clouds, glorifying them. God has so ordered, that in pressing on in duty we shall find the truest, richest comfort for ourselves. Sitting down to brood over our sorrows, the darkness deepens about us and creeps into our hearts and our strength changes to weakness. But, if we turn away from the gloom, and take up the tasks and duties to which God calls us, the light will come again, and we shall grow stronger.
—J. R. Miller
Thou knowest that through our tears
Of hasty, selfish weeping
Comes surer sin, and for our petty fears
Of loss thou hast in keeping
A greater gain than all of which we dreamed;
Thou knowest that in grasping
The bright possessions which so precious seemed
We lose them; but if, clasping
Thy faithful hand, we tread with steadfast feet
The path of thy appointing,
There waits for us a treasury of sweet
Delight, royal anointing
With the oil of gladness and of strength.
—Helen Hunt Jackson
No comments:
Post a Comment